Pages

Monday, December 31, 2012

బ్లాగోపాఖ్యానం!



మరీన్ డ్రైవ్ లో మొన్న నేను నా మిత్రుడు నడచి వెళ్తుంటే    కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక వాడు సడెన్ గా నా వైపు తిరిగి..


నీకొక విషయం చెప్పాలి అని సతాయిస్తూ చెప్పాలా వద్దా అని సంసయిస్తూ రూం కి వచ్చాక తన నోరు విప్పాడు!
 

మొన్న నా రిసర్చ్ మానేసి ఎందుకో నెట్వర్కింగ్ సైట్ లో సోధిస్తుంటే నా బ్లాగులో కామెంట్లు పెట్టే అమ్మాయి ప్రొఫైల్ పేజ్ కనిపించింది రా

నేను:అయితే ?

వాడు:కాకపొతే డిస్ప్లే చిత్రములో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు


ఇంతకీ వారిద్దరిలో ఆ అమ్మాయి ఎవరో తెలియక నాకు తలనొప్పి పెరిగిపోతోంది అని బుర్ర గోక్కొని నన్ను అడిగాడు "నీకేమైనా ఐడియా ఉందా" ?
వెంటనే నా వాలెట్ లో ఉన్న ఐడియా సిమ్ తీసి వాడి చేతిలో పెట్టాను పండగ చేస్కో అని.

వాడు:ఇంత  సీరియస్ గా నేను మధనపడుతుంటే నువ్వు కామిడీస్  చేస్తున్నావ్ అందుకే నేను నీతో ఏం మాట్లాడను 


నేను: అరే భూస్కే, వారిద్దరిలో ఎవరు అందంగా కనిపిస్తే వారే ఆ ప్రొఫైల్ పేజ్ కి ఓనర్ అని 20th సెంచరీ ఫాక్స్ నిజాన్ని చెప్పి వాడి కడుపు మంట ని చల్లార్చి లాపీ లో ఉన్న  ఫైర్ ఫాక్స్ ని మూసాక   


బయటకు వెళ్లి భోజనం చేసేసి వచ్చి మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేశా 


ఒక మనిషి ఎందుకు హర్ట్ అవుతాడో ఎవ్వరూ చెప్పలేరు

చివరకి ఏ కామెంట్ ఎవరికి ఎలా గుచ్చుకుంటుందో గుచ్చుకున్నోడికే తప్ప గిచ్చినోడికి ఆబాధ తెలియదని బల్గేరియా బడి పాఠం లో రాసి ఉందని బ్లాగర్లకు తెలియదు 

ఈ విషయం నేను తెలుసుకొనే లోపే
ప్లస్సుల్లో బ్లాగుల్లో భయంకరమైన బ్రేకు పర్వం మొదలయ్యింది 


Knock out  రౌండ్ లో ఆడుతున్నట్టు ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతున్నారు దీని పైన నీ స్పందన ఏమిటి అని మరుసటి రోజు మిత్రుడు ఫోన్లో అడిగాడు


బ్లాగు బ్రేక్స్ అనగానే

అరే ఏమిటండీ ఎందుకులెండి అని 
నేను బ్లాగుముఖంగా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏమిటంటే

బ్రేక్ అంటే ఏమిటి రీ-ఎంట్రీ అంటే ఏమిటి బ్రేక్ ఇవ్వాలంటే ఇన్ని పోస్టులు వేయాలి
రీ ఎంట్రీ అంటే ఇన్నిరోజులు ఆగాలి అని ఒక పుస్తకం రాసి దాన్ని అచ్చు వేసి
బ్రేక్ ఇవ్వడానికి ఈ లక్షణాలు ఉండాలి రీ ఎంట్రీ కోసం ఇలా సిద్ధమవ్వాలి అని ఉండాలి

బ్లాగు ప్రపంచం లో ఈ మధ్యనే merry break అనే పదం తెగ వినిపిస్తోంది!


నిత్యం సన్నిహితో బ్రేకు:
కర్తవ్యో ఫాస్టో పోస్ట:

బ్లాగు ఎప్పుడూ దగ్గరే ఉంటుంది
దూరం చేసుకోకూడదు అంటే ఎప్పుడూ పోస్టుతూనే ఉండాలి!

అని నేను ముగించే ముందు బ్రేక్ ఇస్తున్న వాళ్ళందరికీ నేను కూడా ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దామని అనుకుంటున్నాను 





ఈ బ్రేక్ పర్వాన్ని పురస్కరించుకొని నా తరపున మీరు ఈ ఫెడల్  స్వీకరించండి.


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ కొత్త సంవత్సరం
లో అయినా మీకు ప్రొద్దున్న పాలు,పేపర్ వగైరా టైమ్ కి తీసుకురావాలని కోరుకుంటున్నా    

ఈ కొత్త సంవత్సరానికి మీ resolutions ఏమిటి అనే డాష్ డాష్ ప్రశ్నలకు ఇదే నా సమాధానం
1024x768

Saturday, December 15, 2012

హాబిట్ జర్నీలో ఎటో జారిపోయింది పర్సు!







వారం లో అయిదు రోజులు రాత్రనక పగలనక ఆఫీస్ లో కుమ్మించుకొని వీకెండ్ మీద గంపెడు ఆశలతో శుక్రవారం రాత్రే మల్టీ ప్లెక్స్ లో అడుగుపెడితే

The Hobbit: An Unexpected Journey సినిమాకి పీటర్ జాక్సన్ బ్రాండ్ మీద కాన్ఫిడెన్స్ తో
క్రెడిట్ కార్డ్ తో స్వై'పే'సాక 3D గ్లాసెస్ తీసుకొని సీట్లో కూర్చున్నా

సినిమాటోగ్రఫీ అబ్బుర పరిచినా LOTR లో వాడిన మొత్తం అవే సెట్స్ మరియు లోకేషన్స్ ఆల్మోస్ట్ అవే కావడం తో తెరపై చూసిన ఫేవరేట్ హీరోయిన్ ని డైరెక్ట్ గా చూసినట్టు అనిపిస్తుంది.

3D ఫీల్ మాత్రం చాలా బాగుంది.

సినిమాని అంత సేపు ఎందుకు సాగతీసాడో అర్ధం కాలేదు visual గా ప్రతీ సీన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ లో శ్రద్ధ తీసుకోలేదనిపించింది

చాలా చోట్ల చూసిందే చూసినట్టు అనిపించినా LOTR లా ఉంటుంది అని అంచనాలు పెట్టుకొని వెళితే సినిమా ఖచ్చితంగా నిరాశ పరుస్తుంది.

రాత్రి సినిమా చూసేసి మూడింటికి రూమ్ కి వచ్చి ఆరుగంటలు తిరగ కుండానే మళ్ళీ సినిమా చూడడానికి అదే మల్తీప్లెక్స్ జంప్ వేసి

మా అభిమాన నటి,అందాల తార, అభినయన కేక,చీరకే అందాన్ని తెచ్చి ప్రేక్షక హృదయాలను ఉతికి ఆరేసిన సమంతా సినిమాకి వెళ్ళిపోయాం

                                     


                                                

యూత్ ఫుల్ సినిమా హౌస్ ఫుల్ అయితే ఎంత సందడిగా  ఉంటుందో అంతే రచ్చలమైన వాతావరణం ఆవహించింది..

సమంతా ఇంట్రో సీన్ ఒక స్టేజ్ పై గ్రూప్ సాంగ్ పెర్ఫార్మ్ చేయడం
నేను కేకలేద్దామని సినిమాకి వస్తే మిగతా వాళ్ళు నా ముందే
నాకంటే ముందే నా సమంతా కోసం అరాచకపు అరుపులు మొదలెట్టారు

కేకలు సినిమా అంతా వినిపించాయంటే సమంతా ఎంత బాగా చేసిందో అర్ధం చేసుకోవచ్చు

నిత్య వరుణ్ తప్ప నాని సమంతా సినిమాలో కనిపించలేదు పెర్ఫార్మెన్స్ దర్సకత్వం అంతే బావున్నాయి

దర్శకుడు ప్రేక్షకుడి కోసం ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అని అనుకున్నాడేమో మరి ఇక్కడ మాత్రం ఆ సీన్స్ ని అరుపులు కామెంట్లతో కామెడీ చేసి పడేసాం


                                   



మచ్చుకి మూడు సీన్లు

ప్రొద్దున్న పెళ్లి పెట్టుకొని రాత్రి నాని తండ్రి నాని కి జరిగే సంభాషణలో 

తండ్రి:రాధిక కి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు.నువ్వు చేస్తున్నది తప్పు అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావ్? దీనికి పరిష్కారం ఏంటి 
ఫ్రంట్ సీట్లో కూర్చున్నోడు గట్టిగా :రాధిక ని నేను చూసుకుంటాను నిత్య ని నువ్వు చేసుకో 


సినిమా అయిపోయే పదినిమిషాల ముందు నాని సమంతా చేసే చుంబనో ఛెండాలుడో చీల్చుడు ని చూడలేక
నేను:పట్టపగలు పాచినోరు తో ఈ పాచి పరాకాష్ట అవసరమా మీకు

మూడో సీన్
నాని:అసలెందుకొచ్చావ్ 
మా కొలీగ్: సమంతా వాడి ని  బతిమిలాడేదేంటి,అసలు ఈ ఏడుపు ఏంటి నీకు నేనున్నా పదా!   


ఈ సినిమా చూసాక జండూ బామ్ కాదు కానీ సమంతా మీద బోలెడు జాలేసింది!

మనం తెలుగు వెర్షనే చూసాము
తమిళ్ లో జీవా తో కూడా ఇవే సీన్లు చేసిందే రిపీట్ చేసి పాపం ఆ స్కిన్ ప్రోబ్లం సమంతా కి ఎందుకొచ్చిందో ఈ సినిమా చూసాక కానీ నాకు అర్ధం కాలేదు

గౌతం మీనన్ దే తప్పంతా అనిపించింది.
ఎస్టాబ్లిష్ అవని హీరో  నాగచైతన్యతోనే 
సమంతాతో అంత చేయించాడంటే

నాని తో ఎస్టాబ్లిష్ అయిన సక్సెస్ ఫార్ములా తో సమంతా తో
తన పర్స్పెక్టివ్ లో పండగ చేయించడం లో తప్పులేదు అనిపించి ఉండదు.    

సినిమా బాటమ్ లైన్:
న స్మూచో న సమంతా గౌతమ్ వాసుదేవ మీననః 


                         

Wednesday, November 28, 2012

నవ లబుక్యో



ఈ మధ్యనే  ఆఫీస్ నుండి రూమ్ కి  ట్రైన్ లో వెళ్తుంటే ఇనుప ఊచ చిన్నది  చొక్కాకి తగిలి హాండ్స్ దగ్గర చిరిగిపోయింది.

కొత్త చొక్కా కొనుక్కుందామని షో రూమ్ వైపు వెళ్ళాను
చలికాలం లో బట్టల షాపు వాడు వేసిన   AC కి నాకు చిరాకొచ్చి ఒక సూక్తి నా నోట్లో నుండి వచ్చింది
"చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో" అని
వెంటనే బుక్ స్టోర్ వైపు పరుగులు తీశాను



అలా ముంబై ఫేమస్ అయిన బుక్స్ దొరికే ఏరియా లోకి ప్రవేశించాను

                                  

న్యూ అరైవల్స్ చూపించు అని అడిగితే ఇష్టమొచ్చిన నవల్స్ అన్నీ చూపించాడు
ఇది బావుంటుంది సార్  ఇది చూడండి  సార్  థ్రిల్లర్,బెస్ట్ సెల్లర్ అని ప్రాసలతో పిచ్చెక్కించాక 
ఒక అరగంట గడిచాక నాకొద్దు నాకేమీ నచ్చలేదు అని చెప్పినా ఏంటి కొనకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ అరగంట నా శ్రమ వృధా అని తిరిగి గొడవ పెట్టుకున్నాడు

 నాకు ఇష్టంలేదు ఆల్రడీ చదివేసినవే ఉన్నాయి అని చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు
కొను  కొను అని మరో పది నిమిషాలు అరిచాడు

నా సహనం లిమిట్ క్రాస్ అయ్యి పిచ్చి పీక్స్ కి  shift అయిపోయింది

వీడెవడురా బాబు డిస్ట్రిబ్యూటర్ లు దొరకని ఢమరుకం ప్రొడ్యూసర్ లా నా వెంట పడుతున్నాడు ఏం చెయ్యనురా దేవుడా అని రెండు నిమషాలు ఆలోచించాను

అదే టైం  లో తెలుగు బ్లాగులు పోస్ట్ కి ఎవరో మహనీయుడు నా పాలిట  దేవుడు లా  కామెంట్ పెట్టారు.
తెలుగు బ్లాగులు ముంబై బ్లాగర్లు అని మెదడు లో  ఒక ఫ్లాష్ మెరిసింది,ఆ ఫ్లాష్ లైట్ నేరుగా 

వెను వెంటనే
నేను:I'm searching for the one which  my friend had recommended
షాప్ కీపర్:ఏంటా నవల్  ?
నేను: మా గూరూజీ  రాఘవేంద్ర రావు కొత్త హీరోయిన్ ది అంటే బాగుండదని
Wind rains of Moon Light (తెలుగు లొ తర్జుమా చేసుకొనుము)
షాప్ కీపర్:ఆథర్ ఎవరు
నేను:రాబిన్ శర్మ 

                                

షాప్ కీపర్:అది లేదండీ సారీ, వేరే ఏదైనా తీసుకోవచ్చుకదా
మళ్ళీ నేను ఆలోచనలో పడ్డా

కొద్ది క్షణాల్లో 
I need "The Guava tree in our backyard" అని అనేసరికి వాడు రెండు వరుస బాలయ్య సినిమాలు చూసిన ప్రేక్షకుడిలా నీరసించిపోయి లేదు సార్  అని జాలిగా అన్నాడు

వాడి మైండ్ బ్లాక్ అయిపోవడం తో
నాకు వచ్చేవారానికి ఈ రెండు పుస్తకాలు కావాలి
ఎందుకంటే  ఖచ్చితంగా ఈ నెలాఖరకు వాటిని చదివితే కాని నిద్ర పట్టదు 
అని చెప్పేసి  జంప్ అయిపోయాను అక్కడ నుండి రాఘవేంద్ర రావు కి మనసు లోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ! 

Monday, November 26, 2012

ఎటుపోతున్నాయి ఈ తెలుగు బ్లాగులు




Yes,I am

కొద్ది రోజుల క్రితం రోజా ప్రోగ్రాం చూడలేక ఈ టీవీ నుండి మాటీవీ కి చానల్ మార్చాను
ఎదో అవార్డ్ ఫంక్షన్ కొంచెం జూమ్ చేసి చూస్తే మా.టీ.వీ అవార్డ్స్ ఫంక్షన్ అట్టహాసం గా జరుగుతోంది
మహేష్,మోహన్,విష్ణువర్ధన్ తదితర బాబులందరూ ఆసీనులయ్యారు 
ఆ సీన్ తిలకిస్తుండగా వేదికపై

http://youtu.be/6RbH3z3PuEQ
ఇది జరిగింది
 ప్రోగ్రాం చూసినంత
సేపు జనాలు ఇంతలా నవ్వలేదు
వాళ్ళ నవ్వులు చూసి నాకు షాక్ కలిగింది

http://harekrishna1.blogspot.in/2012/02/blog-post_13.html

ఈ పోస్ట్ యొక్క సారాంశం రెండు ముక్కల్లో తేల్చేసి క్రెడిట్ వాడెవడో కొట్టేయడం ఎంతవరకూ సమంజసం నాకు మాత్రం ఏడుపు వచ్చింది నా టైముని కాదనుకొని బ్లాగుకి నా మేధాశక్తి ని  సాయశక్తులా బ్లాగు ప్రపంచానికి అంకితం చేస్తే  ఆ పాయింట్ ని మళ్ళీ సినీ ప్రముఖుల ముందు స్టేజ్ మీద ప్రదర్శించి వాడెవడో మార్కులు కొట్టేస్తాడా
ఈ విషయం తెలుసుకున్న
నా పక్కనే ఉన్న మా ఫ్రెండ్ కి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది
ఫ్రెండు:చెప్పు అలీ మీద కేస్ వేద్దామా,రాఘవేంద్ర రావు మీద కేసు వేద్దామా
నేను:వాళ్ళేం  చేసారు
వాడు:మా టీవీ ప్రోగ్రాం డైరెక్టర్ మీద కదా వెయ్యాల్సింది
నేను:అలోచించి చూడు విష్యం అర్ధం అవుతుంది
వాడు:నాకేం అర్ధం కావడం లేదు చెప్పు తప్పు ఎవరిదీ
నేను:రెండు రోజులాగాక నువ్వే చెప్పు

--------------------------------------
రెండ్రోజులు గడిచాక


భూమి పుట్టక ముందు నుండి బ్లాగులు రాస్తున్నావు  తమ తమ స్నేహితులకు బంధువులకు మాత్రమే పత్రికల్లో చోటు కల్పించే పెద్ద మనుషులు నీకొక చాట చూపించి బ్లాగు బస్సులో నిన్నొక మూలకు తోసేసి తోక్కేసారు వాళ్ళను నువ్వు వదలకూడదు.


నేను:అలా ఎందుకనుకుంటున్నావ్,నీ కంటికి నేను సోనూ సూద్ లా కనిపిస్తున్నానా వదల బొమ్మాలీ అని అనడానికి అయినా
కొంత మంది ఎంత అనుష్క రేంజ్ లో కటింగ్ ఇచ్చినా వారంతా నిజంగా హీరోయిన్స్ అనుకుంటున్నావా  

వాడు:లేకపోతే ఎక్కడలేని జాన్ జఫ్ఫా బ్లాగులకే పరిచయం రాసి IITians క్రియేటివిటీ ని కించపరిచి బొంతమీద పరిచినట్టే కదా

నేను:అవి అండర్ రేటెడ్ బ్లాగులు అవ్వచ్చు కదా

వాడు:అలా అని నీకు రావాల్సిన క్రెడిట్ రాకున్నా ఆరు నెలల క్రితం బ్లాగు స్టార్ట్ చేసిన బ్లాగ
ర్లు పత్రిక లో పుంఖాను పుంఖాలుగా కంటెంట్ లేకుండా పిచ్చేక్కిన్చేస్తే ఈ చర్య ను నువ్వేమంటావ్

అయినా నీకేంటి నాయనా ముంబై లో ఉంటావు ప్రకృతి  సౌందర్యాన్ని అస్వాదిస్తావు అనుష్కా మీ బాంద్రా అమ్మాయిల ముందు ఎందుకూ తీసిపోదు.
నేను: The awkward moment the content creator got fewer likes and appreciation than the one who copied

వాడు:అంటే
నేను:the person who copied from your answer sheet got more marks than you

వాడు: Enough of this $ hit that had happened ,c'mon lets play cricket
నేను: Pitch please




Tuesday, October 9, 2012

English Vinglish


ఈ సినిమాలో ఒక డైలాగ్ 
In India we don't do this open line maro in publics
కౌంటర్ లకు అలవాటైపోయిన జీవితం ఇది అమెరికారా జఫ్ఫా అని అనుకునే వాడిని
ఈ సినిమాలో అనలేకపోయాను
చాలా ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే కి ఇదొక ఉదాహరణ అనుకున్నా సినిమా చూసాక




Salman Khan:క్లాస్ లో కనిపించే
వారిలో నాకు బాగా నచ్చిన పాత్ర ఇతనిదే 
who live on the queens
first from lahore
second from pakistan
but no pakistan girl married taxi driver
pakistan girl only marry foreigner అని తన పరిచయం చేసుకున్న తీరు సింప్లీ సూపర్బ్!

అలాగే తన చైనీస్ క్లాస్ మేట్ yu Son తో సంభాషణ కూడా బావుంటుంది 
I Said i come to your parlour you give me free hair cut i teach you free urdu spicy noodle just like dragon
English class one  big family
Yu Son not sister not yellow Yu son pink we are best friends

ఆ  రోజు మాట్లాడే టాపిక్ కి తను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కూడా కెవ్వ్ కేక
My favorite movie is sex and city
it is a story of four sexy girls talking sex all the time walking on the city very pretty

అని సినిమాకి hilarious సీన్స్ పండడం లో ప్రధాన పాత్ర పోషించాడు
 



Mr.Ramamurthy aka   రామా భాయ్  పాత్ర కూడా ఫర్వాలేదు 

my deepest feeling to teach them a such a lesson
office people making me fun of my behind of my english

now i will show them what i can doఅని క్లాస్ లో చేరి తన అజెండా బయటపెడతాడు 

ఇక్కడ ట్యూషన్ లో మీకేం బాగా నచ్చింది అని ఒక్కొకరు చెబుతుండగా తన వంతు వచ్చేసరికి
America big place beautiful place
I am missing two things very very terribly
my idly and my mother
అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది
ఆ  తర్వాత రోజు శ్రీ దేవి తనకు ఇడ్లీ తెచ్చి ఇవ్వడం తో కన్నీళ్ళు పెట్టుకోవడం బావుంది


సినిమాకు మూల స్థంబం ఈ సినిమా ఎవరికోసమైతే నిర్మించబడిందో తను మాత్రం ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసింది




Shashi you are an Entrepreneur అన్నప్పుడు

తను రెస్టారెంట్ లో ఆర్డర్ కరెక్ట్ గా చేసినప్పుడుశ్రీదేవి తలెత్తుకొని ఆకాశం వైపు చూసుకుంటూ గర్వంగా వెళ్ళే సీన్,  speechless
టైం కి తగ్గట్టు గా ఇంగ్లీష్ వింగ్లిష్ టైటిల్ ట్రాక్ బాగా సెట్ చేసారు


May I
this marriage is a beautiful thing
it the special friendship of two people who are equal
life is a long journey
try to help each other to feel equal which is very nice

sometimes married couple don't even know how the other is feeling
so how will they help the other it means marriage is not finished
that is the time you have to help yourself
nobody can help better than you
if you do that you will return back feeling equal

your friendship will return back ur life will be beautiful
family can never be judgmental family will never put you down
never make you feel you small
family is the only one never laugh at your weaknesses
family is the only place where you always get love and respect

ఈ స్పీచ్ ని పాడుబడిన గ్రైండర్ ని స్టార్ట్ చేసినట్టు నెమ్మదిగా స్టార్ట్ చేసి హార్ట్ టచింగ్ గా రుబ్బేసి పిండేసింది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పిల్ల స్పీచ్ కి ఈ చిత్రం చివర్లో శ్రీదేవి స్పీచ్ కి వచ్చేవి కన్నీళ్ళు అయినా ఇది చాలా సహజంగా అనిపించింది

choice of words నుండి వాటిని మలచిన విధానం వరకు దర్శకురాలకు ఈ ఒక్క సీన్ కోసం  హాట్స్ ఆఫ్ చెప్పాలి.

                               

      
చివరగా ప్రియా ఆనంద్ కోసం సినిమా ని రెండోసారి కూడా చూడొచ్చు అన్నమాట అనేది  English Vinglish   పచ్చి గిచ్చినిజం :)
రెబెల్ లో బ్యాంకాక్ ను అంత చెండాలంగా చూసిన ఎఫెక్టేమో న్యూ యార్క్ చాలా అందంగా కనిపించింది ఈ సినిమాలో
 
 


Monday, October 8, 2012

ఇనగినగా ఒక థ్రిల్లర్ తనయి..








తను నవ్వితే....
తను మాట్లాడితే...
తను పలక రిస్తే...
తన చిరు మంద హాసం...
తను మూగబోతే....

సమాధానాలు

నక్కల ఊల నే నయమనుకుంటాం 
మూతి అష్ట వంకర్లు తిరుగుతుంది
చిలకలు ఉరేసుకుంటాయి
చీక్కుల వనవాసం
టీవీ చిత్ర పరిశ్రమలు సుభిక్షంగా ఉంటాయి

ఇన్ని అశేష ఆవలక్షణాలు కూడుకొని హింసించే మా అభిమాన నటుని పుత్రిక లక్ష్మీ ప్రసన్న కు జన్మదిన శుభాకాంక్షలు




విన్నపం:

ఈ రోజుల్లో
పరమ హింస  సినిమాలు లేక లారెన్స్ లాంటి దర్శకులు రెచ్చిపోతున్నారు
వాటికి కేరాఫ్ అడ్రెస్స్ మర్చిపోయిమరీ మనకు మంట పెడుతున్నారు 
మనం తగ్గొద్దు మీ నాన్న హీరో గా త్వరలోనే సినిమా తీయించి వాడికి బాబు మీ బాబే అని నిరూపించవమ్మా
హీరో మీ పెద్ద తమ్ముడు అయినా చిన్న తమ్ముడు అయినా
మీ పెదరాయుడు అండ తో నీ ప్రమోషన్ స్కిల్ల్స్ ను ప్రఖ్యాలన గావించి
ఆడియో లాంచ్ లో దర్శక రత్న చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకునికి అదే అదృష్టాన్ని

మళ్ళీ మళ్ళీ
కలగచేయాలని ఈ సందర్భం గా మనవి చేసుకుంటున్నాం

టీవీ సినిమాను శాసించవమ్మా  
నీ ట్రేడ్ మార్క్
హింసను పెంచువమ్మా 

Monday, October 1, 2012

ఫరాంజలి..




మణిరత్నం కి గీతాంజలి ఎలానో నువ్వంటే నాకంత..అంత కంటే చాలా చాలా ఎక్కువ

నిస్వార్ధ కార్యదీక్ష తో విశ్రాంతి లేకుండా అహర్నిశలు ధారబోసిన నిన్ను ఎలా మరచిపోగలను నిన్ను విడిచి ఉండాలంటే నాకు నరకమే

ఈ ఆరేళ్లలో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడ్డవు. మొదటి రెండేళ్ళు నీవు లేనిదే నేను లేను..
ఆ  తర్వాత కాల క్రమేనా ఆరేడు గంటలకు మించి నీతో గడపలేకపోయాను

నాకోసం నువ్వు శ్రమిస్తూనే ఉన్నావు.. నిరంతర శ్రమైక జీవితానికి నీదే ఒక ఉదాహరణ

ఇన్ని సంవత్సరాల నీ సావాసం లో నీ గురించి నేను రెండే మాటల్లో చెప్పగలను క్రియేటివ్, ఇన్స్పైర్
వీడుకోలే వేదికైనా
వీడలేనీ స్నేహమైనా
ఆనందమా..
.. ..వసంతమా.. .. ..
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్..

అని పాడదామన్నా
నీ పలుకు లేక నాకు సౌండ్ తీసేసావ్.

ఇన్ని మధుర స్వరాలను పలికించిన నువ్వు

day and night నాకోసం పని చేసిన నువ్వు finally call it a day చెప్పడం 

నేను తట్టుకోలేకపోతున్నాను.

నేను గేమ్స్
ఆడుతున్నానే కానీ నువ్వు లేకపోతే రూమంతా ఆ  ambiance ఉండదు

ఈ ఆరు సంవత్సరాలలో నీకు ఆరు సార్లు పరిశుభ్రత అంటే ఏంటో నేర్పించాను అయినా ఎందుకిలా చేసావ్! ఇదంతా అబద్ధమని చెప్పు

అరడజను సంవత్సరాలు గా తన సేవలందించి గత నెల ముప్పైవ తేదీన పని చేయడం మానేసిన నీకు ఇదే నా ఫరాంజలి, ఊఫరాంజలి! 

                          



  

 

Friday, September 14, 2012

లైఫ్ ఈజ్ బ్యూటిముప్పావ్!





శేఖర్ కమ్ముల
ఈ ఒక్క పేరు చాలు కంప్యూటర్ లో భద్రపరచుకొని ఫీల్ గుడ్ సినిమా కావలసినప్పుడల్లా చూడడానికి

కొత్తవాళ్ళు అయినా శేఖర్ చక్కగా చేయించుకున్నాడు
సినిమాటోగ్రఫీ సినిమా అంతా బావుంది.
మొదటి అరగంట చాలా అద్భుతంగా ఉంది ఫుల్ entertainment తో
తర్వాత అద్భుతం లెవెల్స్ కొంచెం కొంచెం గా కొద్దిగా తగ్గుతూ సినిమా చివరికి ఫీల్ గుడ్ గా ఉంది.

సురేష్ పెద్దరాజు గారి భూమి కోసం కధ ఛాయలు అక్కడక్కడా కనిపించాయి 
కనెక్టివిటీ కొంచెం తగ్గినా చివర్లో ఫుల్ ఎమోషన్ సీన్లతో నింపేశాడు దర్శకుడు
హ్యాపీ డేస్ ని మాతృదేవోభవ ని మిక్సీ లో వేసిన జ్యూస్ అని మీకు ఎవరైనా చెప్పినా
జ్యూస్ తీయగానే ఉంటుంది అది శేఖర్ కమ్ముల ఫాక్టరీ లో తయారయిన ప్రోడక్ట్ కదా అని చెప్పేయండి
పంచదార లాంటి ముగ్గురు హీరోయిన్ల వలనైతేనేం సినిమా బావుంది.
సినిమా అయితే నాకు నచ్చింది

                      






Monday, September 10, 2012

పల్లె వెలుగులో దిమ్మ చీకటి..!


నగరమంతా తిరిగి తిరిగి సుమారు నాలుగు మైళ్ళు  నడిచాక ముందు నీరసం వచ్చింది


దగ్గరలో ఉన్న హోటల్ లో రెండు వడ ఒక ప్లేట్ పూరీ అని తిన్నాక ఆకలి తగ్గలేదు ఇంక చేసేది లేక ప్లేట్ మీల్స్ తినేసి బస్సెక్కాను
ఓ గంట ప్రయానించాక కడుపు లో వికారం మొదలయ్యింది
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరో అరగంట పాటలు విన్నా.. వికారం పెరిగిందే కానీ తరగలేదు
పక్కన విండో ఉన్నా విపరీతమైనా గాలి వస్తున్నా కారం లో కుంకుడుకాయలా వెగటు వదలలేదు
అప్పుడే నా ముందు సీటు వెనుకభాగం చాలా ఆకర్షించింది
కండక్టర్ బస్సులో లైట్లు ఆపేసాడు 
బయట చిన్నగా వర్షం పడుతోంది గాలి గోల పెరిగింది

అర్జునా నాగార్జునా అని బస్సు కేచర్ లో పైంట్ ని బర బరా గీకాక ఔట్పుట్ వచ్చిన ఆనందం లో గట్టిగా తొడగొట్టాను
(
ఎవరక్కడ బస్సు గీకుడు ని అభినందించకుండా పోస్ట్ చదువుతున్నది !! ) 


ఈలోపు చిన్న సైజ్ ముళ్ళపంది లా 
నా భుజం మీద ఒకడు తలపెట్టి  నిద్రపోతున్నాడు వాడిని  తట్టి లేపాను.   

ఇదే కునకు వాడు తర్వాత కంటిన్యూ చేయడం మరో మూడు సార్లు నా భుజం మీద పడడం తో నాకు అసహనం T.రాజేందర్ లా పెరిగింది. 

ఉన్న నరకానికి తోడు ఇప్పుడు ఈ బాలయ్య బాబు సినిమా ఏంటి సామీ అని అనుకొని

వెంటనే నా galaxy కి పనికల్పించి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మార్క్ ఆంథోనీ కి బాబు లాంటి ఆర్టిస్ట్ పాడిన విండురైనులో ప్లే చేసాను 

ముందొక రెండు వెనుక్కొక రెండు సీట్లలో ఉన్న ఇరవై మంది నా పక్కన ఉన్న మరో నలుగులు ఉల్లిక్కిపడి బెంబేలెత్తారు
అలా వికారానికి ఉపకారం సహ ప్రయాణీకులకు హాహాకారం తో నా ప్రయాణమును ముగించితిని

నీతి : ఒక RTC బస్సు ప్రయాణం మీతో పాటు మీ పక్క,వెనుక వాళ్ళ 
ఓహో హో ఓహో.. ఓహో ఓహో ఒహ్హో హో అని వినపడేలా చేస్తుంది  

Thursday, August 30, 2012

అర్ధాంతపు ఆర్తాత్రం..









అవి నేను వైజాగ్ లో జిగ్ జాగ్ గా చదువుకుంటూ ఆదివారం జిల్ జిల్ జిగా అనుకుంటూ సాయంత్రం బీచ్ తర్వాత సినిమా చూసొచ్చి హాస్టల్ కి రిటర్న్ అవుతున్న రోజులు...

అప్పుడే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కి మేము కూడా
చిత్రాలయ థియేటర్ లో అడుగుపెట్టాక

వారానికోసారి వీక్లీ
టెస్ట్ రాసినా రాయకపోయినా ఈ సినిమాకి మాత్రం తప్పని సరిగా వెళ్ళేవాళ్ళం నేనూ మా ఫ్రెండ్ ప్రతీక్..
అంతగా నచ్చడానికి ఏముంది ఈ సినిమా లో
                
                        

వెంకటేష్ పెర్ఫార్మన్స్
త్రివిక్రమ్ డైలాగులు,పంచులు,టవల్స్,బ్లేంకెట్స్ మరెన్నో   
విజయ భాస్కర్ దర్సకత్వం
సునీల్ బ్రహ్మానందం కామిడీ
ఎయ్య్ ఇవి ఎవర్ గ్రీన్ అలానే ఉంటాయి 
అదే హీరోయిన్ మా బీ.ఏ తో కానీ ఒకసినిమా కానీ చేసిందంటే మా టీవీ లా మామిడికాయ లా ఉన్న అమ్మాయి కాస్త గుమ్మడికాయ లా తయారవుతుంది.


ఆలోచించని ఆశాభంగం ఆశాషైనీ అని ఆ సినిమా ని లెక్కలేనన్ని సార్లు చూసే లోపు  

ఆర్తీ అగర్వాల్ రెండో సినిమా
నువ్వు లేక నేను లేను రిలీజ్ అయ్యింది.

అబ్బో అబ్బో అబ్బో సినిమా కేక హీరోయిన్ వల్లనే హిట్ అయింది అని మా ఫ్రెండ్స్ శనివారం రాత్రి దొంగ మొహాలు వెళ్ళి చూసేసి వచ్చింది కాకుండా  పడుకున్న మా చెవుల్లో జంబో సైజ్ జోరీగల్లా అరుస్తూనే ఉన్నారు
నేను ప్రతీక్ గాడు ఇద్దరం డిసైడ్ అయిపోయాం

విజయమో ఆర్తీ ని 70MM లో చూడడమో అని ఆ  రోజు టెస్ట్ తొందరగా  మేము ఆదివారం మద్యాహ్నం థియేటర్ దగ్గరకు వెళ్ళాం..

ఏమిటిది మంతెన సోదరులు విశాఖ పట్నం ఎప్పుడు వచ్చారు ఇంత జనం ఉన్నారు ఈ ప్రదేశం లో అని నేనొకరిని అడిగాను
వాడు నావైపు ఒక విచిత్రమయిన మోహన్ బాబు కూతురి ఎక్స్ప్రెషన్ పెట్టి ఫస్ట్ షో టికెట్స్ అయిపోయి చాలా సేపు అయింది 
వీళ్ళంతా సెకండ్ షో కి లైన్ కట్టిన ప్రజలు అని ఆర్తి కబురు ఆర్టిస్టిక్ గా చెప్పాడు

నేనూ,ప్రతీక్ వెళ్ళిపోదామని అనుకొని
మరొక్కసారి ట్రై చేయు బ్లాక్ లో అని వాడికి డబ్బులిచ్చి లోపలి పంపించి నేను థియేటర్ బయట చేసేది లేక చేయగలిగినా చేయలేక అగర్వాలీ లాలీ అనుకుంటూ అలా పోస్టర్లు చూస్తూ కూర్చున్నా

వాడో నలబై అయిదు నిమిషాలు తర్వాత వాడు బయటకు వచ్చాడు

నేను:కాయా,పండా
ప్రతీక్:కాటు
నేను:అంటే ?
ప్రతీక్:నా జేబు కత్తిరించేసారు హరే..నాకున్నవి రెండే పేంట్లు అని బాలకృష్ణ స్థాయి లో ఏడుపు మొదలెట్టాడు.
నేను:వార్నీ రెండు కాకపొతే మూడు ఉంటాయా.. నెల రోజుల్లో నాలుగు సార్లు నువ్వు ఆర్తీ అగర్వాల్ కోసం పెట్టిన ఖర్చు కి ఒక మంచి డ్రెస్ వస్తుంది

పోయిన జేబు ఒక టైలర్ దయవల్ల రాక మానదు,నువ్వు నా దగ్గర తీసుకున్న పైసలు నేను రాబందులా రాబట్టక మానను ఇదే సృష్టి ధర్మం అని చెప్పేసి థియేటర్లో అతికించిన పోస్టర్స్ అన్నీ ఇద్దరం చూసుకుంటూ వచ్చేవారం వస్తున్నాం వస్తున్నాం గెట్ రడీ మేకప్ తక్కువ వేసుకో ఇంకా
ఆ  తరుణ్ తంబూర్ గాడితో ఎక్కువ తిరగకు హమారా ఆర్తీ అనుకొంటూ ఒక చోట ఇద్దరం ఆగాము

గోడ మీద ఒక పోస్టర్ ఆ  పక్కనే ఇంకో పోస్టర్ కేవలం ఆర్తి అగర్వాల్ మరియు టైటిల్ మాత్రమే ఉన్నాయి రెండు పోస్టర్స్ లో..దానర్ధం పోస్టర్ ఒకటే గోడ వేరు అని
అబ్బా! పోస్టర్ అంటే ఇది..హీరోయిన్ అంటే కూడా ఇదే అని చాలా శ్రద్ధగా ఆ  పోస్టర్స్  ని పీకేసి రోల్ లా చుట్టేసి ఎలాగైతేనేం హాస్టల్ కి తీసుకోచ్చేసాం

                               
    

దుప్పటి లేక దిండు లేదు అన్నట్టు ఆర్తీ పోస్టర్ లేక నిద్ర లేదు లా
మేము ఆర్తీ పోస్టర్ రోల్
దిండు కింద వేసుకొని నిద్రపోయేవాళ్ళం
ఈ లోపు మా వార్డెన్ కి ఏ పోయేకాలం వచ్చిందో మరి వాడి రౌండ్స్ ఎక్కువయ్యాయి
వాడి రౌండ్స్ కి బుల్లెట్ దెబ్బలు మా హృదయాన్ని,మా ప్రిన్సిపాల్ దెబ్బలు చెంప ని ఒకే క్షణం లో తాకాయి

ప్రిన్సిపాల్:పరీక్షల కి గడువు మూడు నెలలు కూడా లేవు మీరేంటి ఈ తిరుగుళ్ళు ఈ వింత చేష్టలు అని ఒక రేంజ్ లో తిట్టేసాడు

వార్డెన్ ఆ  రెండు పోస్టర్లు మా ముందే నలిపేసి మా గుండెలను ముక్కలు ముక్కలు చేసి వీటిని డస్ట్ బిన్ లో పారేస్తున్నా అని బయటకు వెళ్తున్న వార్డెన్ ని మా ప్రిన్సిపాల్  కేకేసాడు 
ప్రిన్సిపాల్:నా  రూమ్ లో ఉన్న డస్ట్ బిన్ లో పడేయ్
వార్డెన్:బెడ్ షీట్ సైజ్ పోస్టర్స్ డస్ట్ బిన్ లో పట్టేంత ప్లేస్,వీటిని రోజంతా మీరు చూసే వయసు మీకు లేవు అని చెప్పేసి వార్డెన్ బయటకు నడిచాడు

మాకొక మరో చిన్న క్లాస్ ప్రిన్సిపాల్ తీసుకున్నాక మేము అవమాన భారం తో రూమ్ లోనికి వచ్చి ఏం చేయాలో అర్ధం కాక

ఆ  మూడు నెలలు శ్రద్ధ గా చదువుకొని పరీక్షలు రాసేసాం
ఆ  తర్వాత కౌన్సలింగ్ అయ్యాక చెంగు చెంగు అంటూ ఇద్దరం విజయవాడ లో వేరు వేరు కాలేజీల్లో చేరిపోయాం

వీకెండ్ వచ్చింది
హాస్టల్ లో ఈ రాగింగ్ అరాచకాలను భరించలేక సీనియర్స్ కి ఎవరికీ కనిపించకుండా పెందలాడే వాడి రూమ్ కి వెళ్ళాను
వాడు బ్రష్ చేయడానికి వాష్ రూమ్ కి వెళ్ళాడు

నేను బెడ్ మీద కూర్చున్నా,
అదేదో విక్రమార్క సింహాసనం మీద కూర్చున్నట్టు నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయ్
ఫిట్స్ ఏమో అని నా రూమ్ కీస్ చేతులో పెట్టుకున్నా వణుకు ఇంకా తగ్గలేదు

బెడ్ మీద నుండి లేచాను..లేచాక నార్మల్ గానే ఉన్నాను
రూమంతా చూసాను కంప్యూటర్ కాదు కదా కీ బోర్డు కూడా లేదు బెడ్ మీద
దొంగ మొహం గాడు బెడ్ లో కరెంట్ షాక్ కొట్టడానికి ఏమైనా వైర్ తగిలించాడా అని బెడ్ ని కిందా పైనా బయటా లోపలా సుదీర్ఘంగా పరిశీలించాక



మా ప్రతీక్ దుప్పటి కింద
బెడ్ షీట్ వాడి బొంతకి ప్రొటెక్షన్ గా కుట్టేసి ఉంది
ఆ  కుట్లు కొరికేసి చూస్తే
నాకు తెలిసిన నిజం ఏంటంటే
ఆ  బెడ్ షీట్ లో వార్డెన్ బొంత
బొంత కి బెడ్ షీట్ కి మధ్యలో sandwitch అయిన రెండు ఆర్తి అగర్వాల్ పోస్టర్స్.
బ్రతుకు జీవుడా ఆర్తి దాహుడా అని హుడా పార్క్ కి వెళ్ళిపోయాను!

Saturday, July 7, 2012

ఒరేయ్ అంబానీ,నా అయిదొందలు నాకిచ్చేయ్!



                  
                               


శుక్రవారం
ఆఫీస్ లో సిస్టం ఆన్ చేసి outlook లో inbox insight చూస్తే
థూ! ^$^&%&%*&%

వాడు పొతే వీడు,
వీడు పొతే వాడు వాడుపోతే ఇంకొకడు అని ఆఫీస్ లో పని చెబితే
హ్మ్మ్! ఏం చేస్తాం,
వాళ్ళు చెప్పింది అంతా చేస్తాం.

సాయంత్రం అవుతోంది
పిచ్చి పీక్ కి వెళ్ళిపోయింది
ఎలాగైతేనేం పని ముగించేసి బాస్ కి మైల్ పెట్టాక
మా వాడు
చాకిరీ చేయించుకున్నాక నాతో ఇలానే చెప్పాడు





ఈలోపు రివ్యూ లు పొంగి పొర్లుతున్నాయి కామెంట్లకి లైకుల ప్రవాహం లో సేదతీరకుండా తీరాన్ని కొడుతున్నాయ్!

సరే ఓపెన్ చెయ్ వెబ్ సైట్..
టికట్ బుక్ చెయ్ ఆన్ సైట్.


తెలుగు ప్రేక్షకులు అని చెప్పి
Robert Downey Jr.  వేసిన Iron Man డ్రెస్ ఎర్ర ఈగ కి వేసేస్తారా
షెర్లాక్ హోమ్స్ ని ఏలూరు లాకులు గా తెనుగీకరించినా నాకెందుకో నచ్చలేదు హై..

ఏలూరు లాకులు విజయవాడ లో ఉన్నా మాకు అనవసరం  

లేకపోతే మా గురూజీ ఊరుని విచ్చలవిడిగా వాడేసుకుంటారా..
హన్నా!
రసజ్ఞ
గారు ఈ ఘోరం చూసారా,హా చూసారా ?
మీకు కావాలంటే సమంతాని తరవాత చూపిస్తాను ముందొక ద.హా కొట్టండి!



సినిమా చూసొచ్చి మా ఫ్రెండ్ మహానంద హేల
తన చెప్పుడు మాటలు విని సినిమా చూసాక నేను చెప్పు తీసుకోకుండా తాగిన కోలా


అయ్యా,_____య్యా నీ జీవ ప్రేమ ని జూలో కప్పెట్ట
ఎంత ఈగ ని జూమ్ చేస్తే మాత్రం అంత బాగా నచ్చిందా 
నీకు అయిదు సార్లే ఏడుపు వచ్చింది
నాకు సినిమా చూసినప్పుడు చూసాక కూడా ఏడుపే ఏ ఏ...

నాని ఒక్కసారి కూడా టచ్ చేయడు హీరోయిన్ని
మొత్తం కెమిస్ట్రీ ఫిజిక్స్ అంతా విలన్ మరియు హీరోయిన్ మధ్యే జరుగుతాయి..

మనకు మాత్రం హైడ్రాలిక్స్ అవసరం అవుతాయి

ప్రయోగం బాగుంది అభినందించాలి visual ట్రీట్,బ్రిటానియా బోర్బాన్ etc..etc..నాకు మాటలు రావడం లేదు

త్రివిక్రమ్ రావయ్యా తొందరగా రా
నీ డైలాగులు మాకు చాలు
నీ సినిమా లేక మేము పడుతున్నాం ఆపసోపాలు
ఈ దీక్షా తాప్సీ కాలం లో కూడా నీకేల కోపతాపాలు
రణబీర్ పెప్సీ తీసుకొని నీ ఫ్లేవర్ లో ఇవ్వు చాలు 

                      


కాదంటావా..
రాఘవేంద్రా,రావయ్యా ఒక ఫ్రూట్ సలాడ్ ఇచ్చి పోవయ్యా!

 

బాటమ్ లైన్:బాటమ్ లో లైన్ ఉండదు టాప్ లో ట్రైన్ ఉండదు.
నేనూ బుక్ మై షో లో టికెట్ తీశాను మరోసారి అడ్డంగా బుక్ అయ్యాను

Wednesday, July 4, 2012

స్కర్టో రక్షిత ఇలియానా నిత్యః




ఈ మేనేజర్లు ఉన్నారే జర ఖాళీ ఉంచకుండా జలగల్లా జంబలకిడిపంబ చేస్తారు
బంతి like this

ఆఫీస్ లో వాళ్ళు సాండ్ విచ్ లు తింటూ ఈ ఉద్యోగులను కార్మికులుగా మారుస్తూ మమ్మల్ని సాండ్ విచ్ చేస్తారు..
అని తిట్టుకుంటూ సాయంత్రానికి ఎక్స్టెన్షన్ అర్ధ రాత్రి అవడానికి సస్పెన్షన్ అవుతోంది.



                           


ఒక సౌత్ ముంబై గ్రామ సింహం బ్రౌన్ కలర్ లో పెద్ద తెల్ల చారలతో ముద్దుగా నడుస్తోంది
ఎవరో చేసిన పునుగులకు వేరెవరో బలి అయినట్టు
తెల్లగా ఉన్న ఏరియా మొత్తం ఎవరో వికో టర్మరిక్ ఓనర్ మహిమ వల్లనేమో పసుపుతో నిండిపోయింది.
నేను నా బేగ్ లో ఉన్న బాటిల్ తీసి మొహం మీద చల్లుకున్నా 
జెట్ ఎయిర్ వేస్,
ఇండిగో మరియు పచ్చ కామెర్లు లేవని డిసైడ్ అయ్యాక
ఆ  పచ్చదనం పరిశుభ్రత కి బ్రేక్ ఇద్దామని గ్లూకోన్ డీ తీసి
ఆ జీవానికి రుచిచూపించాక

మిగతా పచ్చదనాన్ని పూర్వ వైభవాన్ని తీసుకోచ్చేపనిలో చారల మీద కొంచెం వేసాను
సింహం లా జూలు విదిల్చి పైన ఉన్న గ్లూకోన్ డీ భూమి మీద పడ్డాక భొంచేసింది. తిన్నాక తెలుగు ప్రోడ్యూసర్లను వదలని చిన్నికృష్ణ లా అది నా వెనుక స్లో మోషన్ లో పరిగెడుతోంది


                  


నా ముందు ఒకమ్మాయి స్కర్ట్ వేసుకొని ఈవినింగ్ వాక్ కి అనుకుంటా వెళ్తోంది
నేను నా స్లో మోషన్ ని మరికొంచం నెమ్మదించాను  కుక్క ఫాస్ట్ మోషన్ అందుకొని నా షూ మీద ఉన్న గ్లూకోన్ డీ ని తన నాలుకతో నాకేసి పనిలో పనిగా పాద రక్షలను పాలిష్ చేసేసింది.ఇక నేను నా attention డైవెర్ట్ చేసి పరుగు పెంచాను  
నేను ఆ అమ్మాయి వెనుకే పరిగెట్టడంతో తను నా ముందు పరిగెడుతోంది..
బాబోయ్ పోలీస్ చౌకీ ముందే ఉంది ఇప్పుడు ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే స్పీడ్ బ్రేక్ వాళ్ళు వేస్తారు అని
నిత్య నూతన గ్లూకోన్ డీ పేకెట్ ని నేను సైతం ఆ సునకానికి ధారబోసాను!!

ఇంతలో రోడ్ క్రాసింగ్ దగ్గర
వహా గాడీ జా రహీ హై పాస్ మత్ ఖడో అని వాళ్ళ పిల్లాడికి జాగ్రత్త చెబుతూ ఒక అమేజింగ్ అమ్మ అరుపు వినిపించింది..
పాసో పాస్ ఆస్ పాస్
ఓస్ ఓస్ బెమ్మీస్ దోస్ ఒంగోల్ ఓట్స్  అని నేను కసి ప్రేలాపన అందుకున్నానుఆస్ పాస్ ఆస్ పాస్ (కోరస్) 
బాబోయ్,పాస్ అంటే గుర్తొచ్చింది
రైల్వే పాస్ రిన్యూ చేయించాలి అని సడెన్ గా గుర్తొచ్చింది.

వాలెట్ లో ఉన్న
మంత్లీ పాస్ తీసి చూసాను
తేదీ సువర్ణాక్షరాలతో కాకుండా తడిసిపోయిన జల
బిందువులతో ముగ్ధమై ముద్ద అయిపోయే స్టేజ్ లో ఉంది
అక్కడ ఒక జూమ్ ఇన్ చేస్తే


                  



05-07-2012

కెవ్వ్!


మా రాజ్ పుట్టినరోజు






ఒక మనిషి తన జీవితకాలం లో ఎన్నో సినిమాలు చూస్తాడు,
ఎంతో మంది హీరోయిన్లు మారతారు,ఎన్నో బ్లాగుల్లో కామెంట్లు పెడతారు.
కాలానికి అతీతం గా
దు:ఖo వచ్చినప్పుడు నీ తోడు నిలిచేవాడే స్నేహితుడు అని బ్లాకాసవాణి బోంబే లో బ్రేవుమంది.

నువ్వు సంతోషంగా అయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం!


                  



నీ అభిరుచులకు తగ్గట్టుగా కనెక్టింగ్ ఫ్లైట్ దొరికి గాల్లో తేలినట్టుందే సాంగ్ వేసుకోవాలని రిక్వెస్ట్ లాంటి డిమాండ్ చేస్తున్నాం :P



  
 

  

Sunday, June 17, 2012

ఫెరారీ కి సవారీ..







$%$&$9
సినిమా అంటే ఏంటి అసలు ?

శర్మాన్ జోషీ
తనకు తండ్రి గా బోమన్ ఇరానీ 
తన కొడుకు గా చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ ఈ సినిమాలో నటించారు

అసలు దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడు
తన అబ్బాయిని స్కూల్ లో దించడానికి వెళ్తూ  
ట్రాఫిక్ పోలీస్ లేని ఒక జంక్షన్ లో పొరపాటున క్రాస్ అవుతాడు హీరో
అది వాళ్ళ నాన్నకు పిల్లాడు Kayo (మాస్టర్.రిత్విక్)  చెబుతాడు.


దగ్గరలో ఉన్న ట్రాఫిక్ యూనిట్ దగ్గరకు వెళ్ళి మరీ ఫైన్ కడతాడు హీరో !
ఇదేం నిజాయితీ రా బాబూ అని అనుకుంటుండగా
ఇరవై నిముషాలు అయ్యాక
సినిమా అవుట్ లైన్ అర్ధం అయ్యింది..

హీరో వాళ్ళ అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు.
వాడికి క్రికెటే లోకం
శర్మాన్ జోషీ కి వాళ్ళ అబ్బాయే లోకం.
చూసినోడు  పిచ్చిమాలోకం ?  

(నేను జండూ బామ్ లేక పోలో తింటూ నన్ను నేను తిట్టుకోడం మొదలెట్టాను)

లార్డ్స్ లో ఆడే అరుదైన అవకాశం హీరో కొడుకు కి వస్తుంది.
దానికి కనీసం లక్షా యాభై వేలు అవసరం అవుతాయి
శర్మాన్ జోషీ RTO ఆఫీస్ లో హెడ్ క్లెర్క్ గా సామాన్య జీతం తో సాధారణ జీవితం గడుపుతుంటాడు.

ఈ లోపు ఒక రాజకీయ నాయకుడు కొడుకు తన పెళ్ళికి ఫెరారీ షో పీస్ గా కావాలని వెడ్డింగ్ ప్లానర్ ని పట్టుపడతాడు.
ఫెరారీ అద్దెకు దొరికినా ఎంత డబ్బు ఇవ్వడానికైనా సిద్ధం గా ఉంటాడు..


ఆ  వెడ్డింగ్ ప్లానర్ RTO ఆఫీస్ కి వచ్చి ముంబై లో ఎన్ని ఫెరారీ లు ఉన్నాయో కనుక్కుంటుంది
శర్మాన్ జోషీ ఫెరారీ స్పెసిఫికేషన్స్ డిటైల్స్ అన్నీ చెబుతాడు..
ప్రస్తుతానికి సచిన్ టెండూల్కర్ దగ్గరే ముంబై లో ఉంది అని చెబుతాడు

(నేను:పిచ్చ నా %^$$*&,సౌత్ ముంబై లో ఎల్లో,బ్లాక్,రెడ్ కలర్లో
ఉన్న ఫెరారీ లు ఉన్న మూడు అడ్రస్ లు నాకే తెలుసు
RTO ఆఫీస్ లో ఉండి కూడా ముంబై లో ఎన్ని ఫెరారీ లు ఉన్నాయో తెలియదా..ఉఫ్ఫ్ఫ్ అని నాకు చిరాకోచ్చేసింది)

హీరో తండ్రి బోమన్ ఇరానీ,
ఇతను youngest బెస్ట్ రంజీ క్రికెటర్..
తన బెస్ట్ ఫ్రెండ్ మరియు ప్రస్తుత క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ చేసిన మోసానికి బలయ్యి క్రికెట్ మీద ద్వేషం పెంచుకుంటాడు
కనీసం ఇంట్లో క్రికెట్ పెట్టమని మనమడు అడిగినా అవతలకు ఫో అంటాడు..



ఆ వెడ్డింగ్ ప్లానర్ శర్మాన్ జోషీ తో చెబుతుంది
ఎలాగోలా సచిన్ ని కన్విన్స్ చేసి నాలుగు గంటల్లో మళ్ళీ బండి తీసుకోచేస్తా అని సచిన్ ఇంటికి వెళ్తాడు హీరో
కొన్ని అనివార్య పరిస్థితుల్లో హీరో ని కార్ క్లీన్ చేసేవాడు అనుకొని ఫెరారీ కీస్ తన చేతికి వచ్చేస్తాయి

ఏదైతేనేం ఫెరారీ తీసుకోచేస్తాడు
కాసేపయ్యాక వెడ్డింగ్  ప్లానర్ 1 .5 లక్ష తనకి ఇచేస్తాడు
కారు లో డబ్బులు పెట్టి సచిన్ ఇంటికి తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు.

పోలీస్ లు అందరూ వచ్చేయడం తో ఎలాగోలా బయటకి వచ్చేస్తాడు
లోపల ఉన్న డబ్బు మాత్రం తీసుకు రావడం కుదరదు.

(నేను:డబ్బులు తీసుకోచ్చేస్తే గంటలో సినిమా అయిపోద్ది..ఇంక ప్రేక్షకుడికి మిగిలేదేంటి మిగతా డబ్బులకి న్యాయం చేయడానికి పాప్ కార్న్ మల్టిప్లెక్స్ వాడు ఫ్రీ గా స్పాన్సర్ చేస్తాడా)  


ఏదైతేనేం
తండ్రి కి కొడుకు మీద ఉన్న టాలెంట్ ని నిరూపించడానికి
ఆ  రాత్రి వాళ్ళ కాంపౌండ్ లో క్రికెట్ ఆడిస్తాడు
బోమన్ ఇరానీ బౌలింగ్ చేస్తాడు.
రంజీ లో తను మేటి స్పిన్నర్

అప్పుడు బోమన్ ఇరానీ కి కూడా తన మనమడు మీద బోలెడు నమ్మకం కలుగుతుంది.
వెంటనే తనని మోసం చేసిన ఆ  మాజీ ఫ్రెండ్ కమ్ బోర్డ్ ప్రసిడెంట్ పరేష్ రావల్ ని 38 ఏళ్ల తర్వాత కలుస్తాడు..

నా మనమడు ఇలా క్రికెట్ ఆడతాడు
నువ్వు సెలెక్ట్ చెయ్యాల్సిన పని లేదు వాడే అవుతాడు ఒక ఫ్రెండ్ గా నాకు 1.5 లక్ష ఇవ్వగలవా అని
పరేష్ రావాల్ ఫోన్ వచ్చింది అని అక్కడ నుండి జంప్ అయ్యాక

మళ్ళీ కష్టాలు పడి ఎలాగైతేనేం శర్మాన్ జోషీ ఆ ట్రాఫిక్ బండి ఎక్కించిన ఫెరారీ లో ఉన్న డబ్బు తీసుకుంటాడు

పిల్లాడి సెలెక్షన్ అయిపోతుంది డబ్బు కూడా వచ్చేస్తుంది
పొలిటీషియన్ కొడుకు ఈ సారి బలవంతంగా ఫెరారీ ని మళ్ళీ దొంగలిస్తాడు
అక్కడ జరిగిన గొడవలో
బోమన్ ఇరానీ గేట్ తగులుకొని తీవ్ర గాయం తో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు

పిల్లాడి ఆచూకి తప్పిపోతుంది..! 

కాసేపటికి హీరో
పొలిటీషియన్ కొడుకు ని బెదిరిస్తాడు పిల్లాడిని ఎక్కడ దాచావ్ అని గన్ తీసి పక్కన షూట్ చేస్తాడు

సముద్రం వైపు వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోడానికి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసరికి
మీడియా అంతా
శర్మాన్ జోషీ ముందు కెమెరాలు పెట్టి మీ పిల్లడు ఆత్మ హత్య చేసుకున్నాడా ? మీకేమనిపిస్తోంది అని చిరాకు తెప్పిస్తారు

క్లైమాక్స్

పరేష్ రావల్,బోమన్ ఇరానీ వీల్లిదరూ కెవ్వ్ కేక అని అందరికీ తెలుసు  శర్మాన్ జోషీ is an underrated actor అని మాత్రం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంగీరించాల్సిన విషయం.

తనకు తన బిడ్డ మీద ఉన్న ప్రేమను హృద్యంగా చెప్పాక.. తన డబ్బులు వెడ్డింగ్ ప్లానర్ కి ఇచ్చేస్తాడు.ఇంతలో తప్పి పోయాడనుకున్న Kayo వాళ్ళ కోచ్ తో పాటు పెళ్లి లొకేషన్ కి వచ్చి అప్పుడు అయిదు నిముషాలు పిల్లాడు డైలాగ్స్ చెబుతాడు...తండ్రి కి కాన్ఫిడెన్స్ ఇస్తాడు


 
మీడియా దయవల్ల పబ్లిసిటీ వస్తుంది దగ్గర ఉన్న సొసైటీ వాళ్ళు అంతా పిల్లాడికి కావాల్సిన డబ్బులు ఆ  మరుసటి రోజు ప్రొద్దున్న
శర్మాన్ జోషీ చేతిలో పెడతారు
పిల్లాడు లార్డ్స్ లో సిక్స్ లు ఫోర్లు చితక్కోట్టేయడం తో సినిమా ఒక లైన్ కాకుండా ముగుస్తుంది


ఆ  లైన్
Thank you Sachin,for inspiring many of Kayos
Including My Son Agni



ఈ సినిమాకి నాకు బాగా నచ్చింది
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్

fathers day నాడు ఈ సినిమా చూడడం కాకుండా తండ్రి/బిడ్డ మీద ఉన్న ప్రేమ ని చూపించడం లో సఫలమయ్యాడు దర్శకుడు.
 


క్లైమాక్స్ చూసాక    





(నా కళ్ళల్లో నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి..వార్నీ ఏంటి ఇది రాతి హృదయానికి కన్నీళ్ళా
ఔర ఔరా..నాగవల్లి వెంకటేష్ అఘోరా..అని కళ్ళు తుడుచుకోవడానికి కర్చీఫ్ తీశాను ప్రక్కన అసలే అమ్మాయి కూర్చుంది
సిగ్గులేకుండా ఈ ఏడుపు ఏంటి అని నేను తుడుచుకొని తను కూడా ఏడిస్తే తుడుద్దామని కర్చీఫ్ ని నా మెడ ను రెండో వైపు తిప్పాను ఒకేసారి ..ఆ అమ్మాయి రాజశేఖర్ సిస్టర్ క్యారెక్టర్ లా భోరున బిందెలు బిందెలు కన్నీళ్ళు కార్చేస్తోంది..బాబోయ్ నా దగ్గర డోర్ మేట్,కాని టర్కీ టవల్ కాని లేదు అని ఇంకోవైపు తిరిగాను సామూహిక కన్నీళ్ళ సభలా అందరూ ఏడుస్తున్నారు)

గుండె రాతిదైనా కన్నీళ్ళు కామనే కదా అని గుండె మీద చెయ్యి వేసుకొని నోట్లో మిగిలిన పోలో వేసుకున్నాను.