మరీన్ డ్రైవ్ లో మొన్న నేను నా మిత్రుడు నడచి వెళ్తుంటే కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక వాడు సడెన్ గా నా వైపు తిరిగి..
నీకొక విషయం చెప్పాలి అని సతాయిస్తూ చెప్పాలా వద్దా అని సంసయిస్తూ రూం కి వచ్చాక తన నోరు విప్పాడు!
మొన్న నా రిసర్చ్ మానేసి ఎందుకో నెట్వర్కింగ్ సైట్ లో సోధిస్తుంటే నా బ్లాగులో కామెంట్లు పెట్టే అమ్మాయి ప్రొఫైల్ పేజ్ కనిపించింది రా
నేను:అయితే ?
వాడు:కాకపొతే డిస్ప్లే చిత్రములో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు
ఇంతకీ వారిద్దరిలో ఆ అమ్మాయి ఎవరో తెలియక నాకు తలనొప్పి పెరిగిపోతోంది అని బుర్ర గోక్కొని నన్ను అడిగాడు "నీకేమైనా ఐడియా ఉందా" ?
వెంటనే నా వాలెట్ లో ఉన్న ఐడియా సిమ్ తీసి వాడి చేతిలో పెట్టాను పండగ చేస్కో అని.
వాడు:ఇంత సీరియస్ గా నేను మధనపడుతుంటే నువ్వు కామిడీస్ చేస్తున్నావ్ అందుకే నేను నీతో ఏం మాట్లాడను
నేను: అరే భూస్కే, వారిద్దరిలో ఎవరు అందంగా కనిపిస్తే వారే ఆ ప్రొఫైల్ పేజ్ కి ఓనర్ అని 20th సెంచరీ ఫాక్స్ నిజాన్ని చెప్పి వాడి కడుపు మంట ని చల్లార్చి లాపీ లో ఉన్న ఫైర్ ఫాక్స్ ని మూసాక
బయటకు వెళ్లి భోజనం చేసేసి వచ్చి మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేశా
ఒక మనిషి ఎందుకు హర్ట్ అవుతాడో ఎవ్వరూ చెప్పలేరు
చివరకి ఏ కామెంట్ ఎవరికి ఎలా గుచ్చుకుంటుందో గుచ్చుకున్నోడికే తప్ప గిచ్చినోడికి ఆబాధ తెలియదని బల్గేరియా బడి పాఠం లో రాసి ఉందని బ్లాగర్లకు తెలియదు
ఈ విషయం నేను తెలుసుకొనే లోపే
ప్లస్సుల్లో బ్లాగుల్లో భయంకరమైన బ్రేకు పర్వం మొదలయ్యింది
Knock out రౌండ్ లో ఆడుతున్నట్టు ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతున్నారు దీని పైన నీ స్పందన ఏమిటి అని మరుసటి రోజు మిత్రుడు ఫోన్లో అడిగాడు
బ్లాగు బ్రేక్స్ అనగానే
అరే ఏమిటండీ ఎందుకులెండి అని
నేను బ్లాగుముఖంగా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏమిటంటే
బ్రేక్ అంటే ఏమిటి రీ-ఎంట్రీ అంటే ఏమిటి బ్రేక్ ఇవ్వాలంటే ఇన్ని పోస్టులు వేయాలి
రీ ఎంట్రీ అంటే ఇన్నిరోజులు ఆగాలి అని ఒక పుస్తకం రాసి దాన్ని అచ్చు వేసి
బ్రేక్ ఇవ్వడానికి ఈ లక్షణాలు ఉండాలి రీ ఎంట్రీ కోసం ఇలా సిద్ధమవ్వాలి అని ఉండాలి
బ్లాగు ప్రపంచం లో ఈ మధ్యనే merry break అనే పదం తెగ వినిపిస్తోంది!
నిత్యం సన్నిహితో బ్రేకు:
కర్తవ్యో ఫాస్టో పోస్ట:
బ్లాగు ఎప్పుడూ దగ్గరే ఉంటుంది
దూరం చేసుకోకూడదు అంటే ఎప్పుడూ పోస్టుతూనే ఉండాలి!
అని నేను ముగించే ముందు బ్రేక్ ఇస్తున్న వాళ్ళందరికీ నేను కూడా ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దామని అనుకుంటున్నాను
ఈ బ్రేక్ పర్వాన్ని పురస్కరించుకొని నా తరపున మీరు ఈ ఫెడల్ స్వీకరించండి.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ కొత్త సంవత్సరంలో అయినా మీకు ప్రొద్దున్న పాలు,పేపర్ వగైరా టైమ్ కి తీసుకురావాలని కోరుకుంటున్నా
ఈ కొత్త సంవత్సరానికి మీ resolutions ఏమిటి అనే డాష్ డాష్ ప్రశ్నలకు ఇదే నా సమాధానం
1024x768
11 comments:
మీ పోస్ట్లకు తిరుగులేదు.. ఎంత నవ్విస్తారండీ!! అసలు ఫెడల్ ఇచ్చే అలోచన ఎలా వచ్చిందో..కెవ్వ్..
అలానే ఈరోజుకి బ్రేక్ తీస్కుని కొత్త సంవత్సరంలో మళ్ళీ వచ్చేయ్ :)
>>ఈ కొత్త సంవత్సరానికి మీ resolutions ఏమిటి అనే డాష్ డాష్ ప్రశ్నలకు ఇదే నా సమాధానం
1024x768
kevvvvvvvvvvvvvvvvvvvvvvv సెల్లు లో కూడా ఇదే రెసొల్యూషనా !
:) బాగుందండి
నిత్యం సన్నిహితో బ్రేకు:
కర్తవ్యో ఫాస్టో పోస్ట:
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ బావుంది పోస్ట్ అదరహో నీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆండీ
:))
ఫెడల్ గిఫ్ట్ ఏందయ్యా.... అందులోనూ ఒక్కటే ఇస్తే ఏలాగా?
ఇంతకీ ఎవరా ఫ్రెండ్సూ?? ఐ వాంట్ ధైర్ నేమ్స్... ;)
Happy NEw yearrr
ఆళ్ళు బ్రేకిచ్చీ నువ్ ఫెడలిస్తే సరిపోద్దా... సైకిలెవరిస్తారు... పలుపు కోసం గేదెని కొనుక్కున్నట్టు ఇపుడు మేం ఫెడల్ కోసం సైకిల్ కొనుక్కోవాలా లేకా ఉల్లిపాయలకో పీచు మిఠాయికో పాత సామాన్ల వాడికి ఏస్కోవాలా :-))
:))))
అంత ఆప్యాయంగా ఫెడలిస్తుంటే మీరు ఉల్లిపాయలకో పీచు మిఠాయికో పాత సామాన్ల వాడికో వేసేస్తారా వేణూగారూ.. :)
last line highlight :)
last line highlight :)
Post a Comment