Pages

Tuesday, June 14, 2011

సంధ్యమ్మా స్వీట్ పెడతా...



మే 20 ,2008
రూమ్ నెంబర్ 513
హాస్టల్ 12
5th floor
ఐ.ఐ.టి బోంబే

ప్రొద్దున్న 7 .50 కి దున్న లా ఒక ఓండ్ర పెట్టి ఆ తర్వాత పెద్దగా ఆవులించి..ఆపైన లిఫ్ట్ పనిచేయకపోవడం తో పరిగెత్తుకుంటూ బేస్ మెంట్ కి చేరుకొని బేగ్ లో ఉన్న మౌత్ ఫ్రెష్ నర్ తీసి ఎనిమిదింటికి జరగాల్సిన క్లాస్ కోసం సైకిల్ మీద స్టార్ అయ్యాడు మిలింద్.



మిలింద్ క్లాస్ లో చేరుకొనే సరికి ప్రొఫ్ క్లాస్ స్టార్ట్ చేసేసాడు...సెంటర్ బెంచ్ లో ఉన్న నేహ ప్రక్కన కూర్చొని క్లాస్ వింటూ తన చేతిలో ఒక సెంటర్ ఫ్రెష్ పెట్టాడు..


క్లాస్ అయిపోయాక
నేహ:ఏంటి లేట్ అయ్యింది ..
మిలింద్: ఏం లేదు, ఎప్పటిలానే టైం కి లేచి సైకిల్ తీశాను టైర్ లో గాలి లేదు... పంక్చర్ అనుకుంటా..అసలే భూమి కి భారం గా తయారవుతున్నావ్ అని మీ హాస్టల్ లో ఇద్దరు అమ్మాయిలు అన్నారు తెలుసా ?

నేహ:నీ లవర్ భూమి తో తిరిగితే నువ్వు ఆకాశానికి భారం అవుతావా చెప్పు ? ఐ క్వొచ్చన్..తూ గైడ్ కమ్ బాంక్
మిలింద్: విక్రమ్ నా? VGS ఆ ?
నేహ: ఎక్కువ చేస్తే నేను చాచి ఒకటి ఇచ్చెదన్
మిలింద్: అయినా సంధ్య నా ఫ్రెండ్ మాత్రమే కదా ...అంటే.. యూ మీన్ ?
నేహ:నేను ప్రశ్న వేసాక నాకే ప్రతి ప్రశ్న వేస్తే నీ పాలిట గొంతు పచ్చలారని నీ ప్రత్తి పంట లాంటి జీవితం లో చీడపురుగునవుతా అని ఒక బాల డైలాగ్ కొట్టి అక్కడ నుండి నిష్క్రమించాక



హాస్టల్ లో వార్డెన్ నిన్ను పిలుస్తున్నాడు అని మిలింద్ ఫ్రెండ్ నుండి ఫోన్ రావడం తో వెళ్ళిన మిలింద్..వార్డెన్ ముందు కూర్చున్న వివేక్ ని చూసి వీడు నా మీద కంప్లైంట్ చేసాడా ఇటువంటి బహుముఖ ఎక్స్ప్రెషన్లతో అనంతమైన ఆలోచనలతో వార్డెన్ ముందు నిలుచున్నాడు.


వార్డెన్: కూర్చో మిలింద్..నా గురించి నీకు తెలుసు కదా
నేను పేరుకి మాత్రమే వార్డెన్ ని.. తేడా వస్తే నా upgraded వెర్షన్ War Don 2.0 ని చూసి దానితో ఆడుకునే శక్తి మీకెవ్వరికీ లేదు.
మిలింద్:వైరస్ లతో రిలీజ్ చేస్తారా
వార్డెన్: ఉహు
వివేక్:అలా అయితే నువ్వే ఆడుకో,లాన్ లో బోల్డు గేమ్ లు ఉన్నాయ్..షూమేకర్ అంటే చెప్పులు తయారు చేసే బాటా కంపనీ వాడి తమ్ముడనుకొనే మొహం వేసుకొని.. ముందు విషయం చెప్పు

వార్డెన్: నేను ఈ హాస్టల్ కి వార్డెన్ ని ఆ విషయం మర్చిపోయి మీ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించొద్దు.
మిలింద్:ఏయ్.. వార్ డానూ...డ్రాగన్ మొహం వేసుకొని..రాడన్ టెలీ ఫిలిం లా నీ నస ఆపరా బాబూ..మా కంప్యూటర్ బ్రెయిన్ లకు పట్టిన ట్రోజన్ లా దాపురించావు.


వార్డెన్:come to the point ..i want to know what had happened yesterday night
మిలింద్:nope,whats up ?..i think మీ ఇంట్లో స్టీల్ సామాన్లు అరిగి పోయుంటాయ్.. హాస్టల్ మెస్ లో ప్లేట్లు,కంచాలు స్పూన్ల మీద నీ దండయాత్ర మొదలెట్టి ఉంటావ్ అంతే కదా..am i right ?
వార్డెన్: స్టాప్
మిలింద్: సూపర్ టైమింగ్,ట్రాఫిక్ పోలీస్ కి సరిగ్గా సరిపోతావ్..
వార్డెన్: ఆపరా..
మిలింద్: ఏంటి కారా ?
వార్డెన్: కాదు సైకిల్
మిలింద్: క్యో



నిన్న రాత్రి పన్నెండింటికి ఏం చేసావ్ అని అడిగేది నిన్నే... సమాధానం చెప్పవేం ?నిన్న రాత్రి ఏం చేసావ్... నీ కంటి కి మా ఇద్దరం ఎలా కనిపిస్తున్నాం...
మిలింద్:dumb and dumber

(కాసేపు రూమ్ లో నిశ్శబ్దం )

సినిమా చూసాను.


వార్డెన్ కి కోపం కట్టలు తెంచుకొని ఖరీదైన బాణం బట్టలను చించలేక పెప్సోడెంట్ పళ్ళను కొరుకుతూ కంట్రోల్ చేసుకొని
నిన్న రాత్రి ఈ వివేక్ నీ సైకిల్ టైర్ లో గాలి తీసేసాడు అని నీకు చెప్దామనుకుంటే నువ్వు వాడి ఎదురుగా నా గాలి తీసేస్తావా.. అని కయ్ కయ్ అంటూ గయ్య్ మన్నాడు



వార్డెన్ రూమ్ నుండి బయటకు వచ్చాక వివేక్ ని నిలదీసాడు మిలింద్ నీ వల్ల ఈ రోజు ఫస్ట్ లెక్చర్ మిస్ అయ్యేవాడిని తెలుసా..ఎందుకు చేసావ్ చెప్పు

ముందు రోజు నీ ముందు టైర్ ని తీసేసి పాడయిపోయిన వేరే టైర్ వేసిన ప్రతీక్ ని మాత్రం అనకుండా నన్ను నానా పటేకర్ మాటలు వల్ల నేను హర్ట్ అయ్యాను ..

వివేక్:నువ్వు కాస్త మీ క్లాస్ అమ్మాయిలతో తిరగడం తగ్గించుకో..కాస్త పైకోస్తావ్..చీమ కుడితే చర్మానికి గమాక్సిన్ పూసుకొనే తెలివితేటలు నా దగ్గర ఉపయోగించ్చొద్దు.

మిలింద్:నన్ను తిట్టినప్పుడు నన్ను కేవలం నన్ను మాత్రమే తిట్టాలి నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చావో నీ సైకిల్ లో గాలి ఉండదు

వివేక్: అందుకే చెప్పాను ఆ బ్లాంక్ బుర్ర బాలికలతో తిరగడం మానుకోరా అని .. నాకు సైకిలే లేదు..ఫో..నీ చిన్న మెదడు ని చిన్ని కృష్ణ తినెయ్యా..

మిలింద్: $%^$^$*%*@(*^%..నువ్వే పోరా.. నీ థీసిస్ ని రోడీస్ రఘురామ్ రివ్యూ చెయ్యా.



సరే నీ పని నే తర్వాత చెబుతా టైం పన్నెండు కావస్తోంది ప్రొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కూడా ఏం తినలేదు.. నేహా ప్రతి రోజూ ఏదో ఒకటి తీసుకోచ్చేది వాళ్ళ హాస్టల్ నుండి.. ఒక్కోసారి అదేంటో నాకంటే నేహంటేనే ఇష్టం అనిపిస్తూ ఉంటుంది

సడెన్ గా ఈ వార్డెన్ నుండి కాల్ వచ్చేసరికి ఈరోజు ఆ భాగ్యం కూడా లేదు అని నిట్టూరుస్తూ మెస్ కి వెళ్ళాడు మిలింద్.

*****************************************************************************************************
నేహా ఫోన్ చేసి.. ఆ రోజు రాత్రి డిన్నర్ కి మిలింద్ తో పాటు మరి కొంత మంది ఫ్రెండ్స్ ని invite చేసాక అక్కడే ముభావంగా కూర్చొన్న సంధ్యా భూమీ aka సంధ్య ని చూసి

మిలింద్: బ్లాగులో కొత్త ఫాలోవర్లు చేరడం లేదన్నంత లెవెల్ లో అంత దీనంగా మొహం పెట్టావ్.. ఏమైంది ?
సంధ్య:మా నాన్న నా పెళ్లి చూపులు మొదలెట్టేసాడు మిలింద్..నాకేం చెయ్యాలో తెలియడం లేదు

మిలింద్:మరి,నువ్వు ఎవర్నైనా ఇష్ట పడ్డావా ?
సంధ్య:హా..మన క్లాస్ లో సెకండ్ టాపర్ ని..

మిలింద్: మరి తనకి చెప్పేయొచ్చు కదా నీ ప్రేమ విషయం
సంధ్య: వాడి కి క్రిస్టల్ క్లారిటీ లేదు అదే నా బాధ

అని చెప్పి తిని రూమ్ కి వచ్చి నిద్రపోయి ఆ మరుసటి రోజు ఉదయం సెకండ్ టాపర్ నేనే కదా అని మిలింద్ కి బల్బ్ వెలిగింది


అద్దం లో...
ఛీ ఛీ పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా..ఆ ఎల్లోరా ఎనిమిదో వింత కాకుండా పోయి నా లాంటి వాళ్లకు సరైన ప్రోత్సాహం లేక నా బుర్ర మందగించి వెనుకబడిపోయింది.. అని తనలో తననే తిట్టుకుంటూ సంధ్య ని కలవడానికి లైబ్రరీ దగ్గర నేస్కాఫేకి వెళ్ళాడు .

nescafe బయట
మిలింద్: ఐ లవ్ యూ.. సంధ్యా!
సంధ్య: నీ మేధాశక్తి ని మహా సిమెంట్ లో కప్పెట్ట
అది సరే కానీ నువ్వు నేహ ని లవ్ చేస్తున్నావ్ కదా..ఇప్పుడు ఎలా

అది అంతే సంధ్య..నీ మీద ఉన్నది నా నిజమైన ప్రేమ..అది నువ్వు నమ్మాలి
తను ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం ఒక గొప్ప అదృష్టం అని ఓ ఎమోషీ కామోషీ డైలాగ్ చెప్పాక
సంధ్య మురిసి పోతూ ముస్యో నవ్విన్గ్స్

మిలింద్:నువ్వు లేకుండా నేను బతకలేను..ఇది నిజం
సంధ్య:మరి నేహా కి ... నువ్వు దక్కకపోతే తను ఎలా బతుకుతుంది
మిలింద్:పిచ్చి సంధ్య..ఇది కూడా తెలీదా.. ఆక్సిజన్ తో



సంధ్య: నేను కన్విన్స్ కావడం లేదు..ఎందుకంటే జష్టిఫికేషన్ సరిపోలేదు ..

మిలింద్ బొమ్మరిల్లు సినిమా చూసి చాలా కాలం అయిపోయింది..ఇప్పుడు ఏం చెప్పాలా అని చించి తాను మాత్రమే తీయగలిగే దిమ్మ దొర్లు సినిమా క్లైమాక్స్ మొదలు పెట్టాడు

చూడు సంధ్యా

నేహా పోహా లాంటిది.. చూడ్డానికి తెల్లగా ఉంటుంది... అది పంచదార తో తింటేనే బావుంటుంది

గొడ్డు కారం తిని పెరిగిన శరీరం ఇది..పంచదార ని మిక్స్ చేసుకొని తినడం నా వల్ల కాదు తనకి సరిపడా ఏ పుల్లా రెడ్డో వచ్చి తన జీవితాన్ని స్వగృహా ఫుడ్స్ లా పరిపూర్ణం చేస్తాడు అని చెప్పేయడం తో కధ కంచికి చేరుకొని మనం కామెంట్ బాక్స్ దగ్గరకు చేరుకోవడమైనది.

39 comments:

Ravitheja said...

పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా..ఆ ఎల్లోరా ఎనిమిదో వింత కాకుండా పోయి నా లాంటి వాళ్లకు సరైన ప్రోత్సాహం లేక నా బుర్ర మందగించి వెనుకబడిపోయింది


------------------
కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక ...........

తృష్ణ said...

"బ్లాగులో కొత్త ఫాలోవర్లు చేరడం లేదన్నంత లెవెల్ లో అంత దీనంగా మొహం పెట్టావ్.."

"పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా.."

"నీ మేధాశక్తి ని మహా సిమెంట్ లో కప్పెట్ట.."

"తనకి సరిపడా ఏ పుల్లా రెడ్డో వచ్చి తన జీవితాన్ని స్వగృహా ఫుడ్స్ లా పరిపూర్ణం చేస్తాడు .."



కేక ......!!
hilarious :))

రాజ్ కుమార్ said...

వేక్:నువ్వు కాస్త మీ క్లాస్ అమ్మాయిలతో తిరగడం తగ్గించుకో..కాస్త పైకోస్తావ్..చీమ కుడితే చర్మానికి గమాక్సిన్ పూసుకొనే తెలివితేటలు నా దగ్గర ఉపయోగించ్చొద్దు.

మిలింద్:నన్ను తిట్టినప్పుడు నన్ను కేవలం నన్ను మాత్రమే తిట్టాలి నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చావో నీ సైకిల్ లో గాలి ఉండదు

వివేక్: అందుకే చెప్పాను ఆ బ్లాంక్ బుర్ర బాలికలతో తిరగడం మానుకోరా అని .. నాకు సైకిలే లేదు..ఫో..నీ చిన్న మెదడు ని చిన్ని కృష్ణ తినెయ్యా..

మిలింద్: $%^$^$*%*@(*^%..నువ్వే పోరా.. నీ థీసిస్ ని రోడీస్ రఘురామ్ రివ్యూ చెయ్యా.....

ఈ డైలాగ్స్ బాగున్నాయ్... పైన తృష్ణగారు రాసినవి కూడా

వేణూశ్రీకాంత్ said...

:-))) హ హ హ బాగుంది...

నేస్తం said...

>>>>>కధ కంచికి చేరుకొని మనం కామెంట్ బాక్స్ దగ్గరకు చేరుకోవడమైనది.

:))))))))

హరే కృష్ణ said...

రవి తేజ గారు
రాయడం మొదలెట్టాక రివ్యూ కూడా చేసుకోకుండా పోస్ట్ చేసేసి మీ కామెంట్ చూసి మీ బజ్ లో రీ షేర్ చేసాక బోల్డు హాపీస్ :)
థాంక్ యూ..keep visiting :)

హరే కృష్ణ said...

తృష్ణ గారు థాంక్ యూ :)
నచ్చినవి కోట్ చేసినందుకు మరో సారి ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

రాజ్ :)))
థాంక్ యూ థాంక్ యూ :)

వేణూ శ్రీకాంత్ గారు..నచ్చినందుకు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

అక్కా..అందరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు పోస్ట్ లు చదివి disclaimer పెట్టాల్సి తప్పనిసరి అయింది :)
బొత్తిగా జనాలకు కామెంట్ సెన్స్ లేకుండా తయారయిపోతోంది..అయ్యో ఇంత కష్ట పడి రాస్తున్నారే పాపం ..ఒక్క స్మైలీ పెట్టేసి వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అయినా లైట్ :))
థాంక్ యూ :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

నేను కామెంటు బాక్స్ కి చేరుకున్నాను కానీ కధ కంచికి చేరిందా అని డౌట్.
నీ మేధా శక్తి ని మహా సిమెంట్ లో కప్పెట్టా... ఇది ఈ టపా కి హై లైట్.

కెవ్వు కేక .

శివరంజని said...

హరే కృష్ణ గారు భలే రాసారు .అస్సలు నాకు టైటిల్ చూడగానే నవ్వొచ్చింది సంధ్య పేరు విని ....ఇందాకనుండి నవ్వి నవ్వి ఇప్పుడు కామెంట్ బాక్స్ దగ్గరకు చేరుకోవడమైనది.:)

హరే కృష్ణ said...

గురూజీ..సంధ్య వాళ్ళ డాడీ అదే మా మిలింద్ వాళ్ళ మామ గారికి అయిదేళ్ళ క్రితం కంచి కి ట్రాన్స్ఫర్ అయ్యింది..ఈ పార్ట్ హిట్ అయితే సీక్వెల్ తీద్దామని ఒక చిన్న దురాశ తో అక్కడతో ఆపేసా :))
దురాశ కి పొతే సినీ నటుడు రాజ శేఖర్ 'జీవిత' మ్ వలే రచ్చ రాకాసిలా తయారవుతుందని తెలుసుకున్నాను చివరికి హ్మ్మ్ :))
మహారాష్ట్ర అబ్బాయి,ఆంధ్రా అమ్మాయి ఇప్పుడు బోంబే iit లో pH.D చేయింగ్స్ :)
ధన్యోస్మి గురూజీ :) కధ మొత్తం చెప్పేసా ఇంకా రెండో పార్ట్ కూడా రాయనవసరం లేదు :)
బోలెడు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

శివ రంజని గారు..మా ఆస్థాన హీరొయిన్ సంధ్య పేరు గురించి ఎవ్వరో ఒక్కరు ప్రస్తావించినా ఈ పోస్ట్ కి పూర్తి న్యాయం చేకూరినట్టే :)))
భలే పట్టేశారు..సంధ్య అభిమానుల సంఘం జిందాబాద్ :)
మీ నవ్వులకి చాలా థాంక్స్ :)

Naresh said...

సూపర్..

>>పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా..
ఇది నా గురించే అన్నట్టుంది. :)

ఇందు said...

ఆండీ...సారీ ప్రతీక్...మీరు మరీను! ఆ డైలాగ్స్ ఏంటండి!! ఆ మా చిన్నికృష్ణని కూడా లాగేసారు!! ఇంకా ఆ లాస్ట్లైన్స్ ఐతే కేక!! :))))

నాకు నచ్చిన లైన్స్! :

>>చీమ కుడితే చర్మానికి గమాక్సిన్ పూసుకొనే తెలివితేటలు నా దగ్గర ఉపయోగించ్చొద్దు.

>>బ్లాంక్ బుర్ర బాలికలతో తిరగడం మానుకోరా అని .. నాకు సైకిలే లేదు..ఫో..నీ చిన్న మెదడు ని చిన్ని కృష్ణ తినెయ్యా..

>>నీ థీసిస్ ని రోడీస్ రఘురామ్ రివ్యూ చెయ్యా.

>>బ్లాగులో కొత్త ఫాలోవర్లు చేరడం లేదన్నంత లెవెల్ లో అంత దీనంగా మొహం పెట్టావ్.. ఏమైంది ?

>>ఛీ ఛీ పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా..ఆ ఎల్లోరా ఎనిమిదో వింత కాకుండా పోయి నా లాంటి వాళ్లకు సరైన ప్రోత్సాహం లేక నా బుర్ర మందగించి వెనుకబడిపోయింది.

>>దిమ్మ దొర్లు సినిమా క్లైమాక్స్ మొదలు పెట్టాడు


హ్హహ్హహ్హా!! మొత్తమీద సంధ్యమ్మ చేత స్వీట్ తినిపించేసారు :)))))

హరే కృష్ణ said...

జాబిల్లి గారు
ఆహా.. మీ పేరు భలే ఉందండీ ఆహ్లాదం గా
థాంక్ యూ :)

హరే కృష్ణ said...

నరేష్
హ హ్హ..ఈ మధ్య ఒక పరిశోధనలో తేలింది అదేదో బడి బాట వలే ప్రతి ఒక్కరూ రీడర్ బాట పడుతున్నారు
మనలో మనమాట రీడర్ అంటే గుర్తొచ్చింది The Reader..ఏం సినిమా అసలు అదీ..కేట్ విన్స్లెట్ కేకో కేక :)
IIT లో మన OAT లో చూడడం వల్లనే కేట్ కి ఆస్కార్ వచ్చింది అనుకుంటా :)
కామెంట్ కి బోలెడు థాంక్స్ :)

హరే కృష్ణ said...

ఇందు గారు :))))))
ప్రతీక్ ఒకరు.. అన్వేష్ ఒకరా అంటా ఆ హరే కృష్ణ సృష్టించిన కధలో భాగం మాత్రమే కదా :)

సంధ్యమ్మ వీక్ పాయింట్ పట్టేసి అలా అలా పడగోట్టేసి... కధ ని స్వీట్ మెమరీ చేసేసాం :)

మీ ప్రొఫైల్ పిక్ బావుంది కాలానికి అనుగుణంగా :)
పోస్ట్ అంతా నెమరు వేసేసినందుకు బోలెడు ధన్యవాదాలు :))

SJ said...

:)) nice...

హరే కృష్ణ said...

సాయి గారు ఆలస్యానికి కి క్షమించాలి. నచ్చినందుకు చాలా థాంక్స్ :)

మురళి said...

ఈమధ్య కాలంలో మీర్రాసిన వాటిలో బాగా నచ్చిందిది..

హరే కృష్ణ said...

మురళి గారు
happy to hear :)
చాలా థాంక్స్ :)

మధురవాణి said...

కెవ్వు కెవ్వు కెవ్వు.. బాబోయ్.. ఇంకా బోల్డన్ని కెవ్వులు..

బాగా నవ్వించినవన్నీ పైన అందరూ చెప్పేశారు.. ఇంకా ముగింపు చాలా నవ్వించింది... ఇంకొన్ని..

<< నేను పేరుకి మాత్రమే వార్డెన్ ని.. తేడా వస్తే నా upgraded వెర్షన్ War Don 2.0 ని చూసి దానితో ఆడుకునే శక్తి మీకెవ్వరికీ లేదు.

<< నన్ను తిట్టినప్పుడు నన్ను కేవలం నన్ను మాత్రమే తిట్టాలి నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చావో నీ సైకిల్ లో గాలి ఉండదు.

:D :D :D

kiran said...

>>>నేహా పోహా లాంటిది.. చూడ్డానికి తెల్లగా ఉంటుంది... అది పంచదార తో తింటేనే బావుంటుంది

పంచులు సూపరు...:)
nice one ..:)

హరే కృష్ణ said...

మధుర :)))
ఓపిగ్గా చదివి మీ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు :)

అసలు విషయం ఏంటంటే
ఈ మధ్య నా బ్లాగులో హీరో క్యారక్టేర్లకు బోలెడు అన్యాయం జరిగిపోతోంది అని గత వారం రాత్రి కలలో as usual భయంకరమైన బాలయ్య సినిమా కనిపించింది..వాటి కోసం విముక్తి కోసం నా బ్లాగు లో మొదటి సారిగా హీరో కి న్యాయం చేసి హీరొయిన్ కి అన్యాయం చేసేసాను :)
>>ఇంకా బోల్డన్ని కెవ్వులు..
అంతా మీ అభిమానం, థాంక్స్ ! :)

హరే కృష్ణ said...

కిరణ్ :)))
రెండో పార్ట్ లో రాద్దామనుకున్నా ఫ్లాష్ బాక్ లో అసలు ఏం జరిగిందంటే :)

పోహా అంటే నాకిష్టం..ఇష్టం కాదు... పోహా అంటే ప్రాణం :)

పాపం మన మిలింద్ కి కారం వేసుకొని వండుకొనే రిసిపీ తెలియదు ..వండుకుంటే బేషుగ్గా ఉంటుంది...ఆ ముందు రోజు రాత్రి అక్కడ inception జరిగింది :)
థాంక్ యూ :)

మనసు పలికే said...

అయ్యయ్యో.. ఈ టపాని ఇన్నాళ్లూ ఎలా మిస్ అయితిని..?:(
మేధా శక్తిని మహా సిమెంట్‌తో కప్పెట్టాలా..?? నీ తెలివి తేటల్ని/క్రియేటివిటీని అస్సలు నిద్రపోనీయకు హరే:))) నిజంగా భలే పంచులు రాసావులే. ముగింపు (ముగించను అంటున్నావుగా) సూపరు.... టోటల్‌గా టపా కెవ్వు:))))

హరే కృష్ణ said...

అపర్ణ లేట్ గా వచ్చినా చివరకు మాజిక్ ముప్పయ్ కామెంట్లు వచ్చేసాయి :)))
అంతా హరే మాయ :)
చాలా థాంక్స్ :)

prashanth said...

ohhhh hhooooo hhhhmmmm....mee sahana ashananiki entha bhyapadi goda nirmincharasalu...daaniko naa tarapuna e punadi raayi.......

prashanth said...

kevvv keka

prashanth said...

kekooo kekaaaaa.....

Anonymous said...

Hare Krishna,
hilarious post :))))
me posts lo nenu first chadivindi ide. but, comment cheyaledu.
ma campus chusi, adhi kuda "Sandhya" name chusi, andulonuu 2008 anagane... na super seniors emo enukunna :P
anni posts chadivaka ardam aindi meru IIT Delhi ani. but, meeru ma camous lo vunnatle raasaru..ah places..avi annI. meru ikkada vunnara??

-bittu

Anonymous said...

heights of creativity...
>>షూమేకర్ అంటే చెప్పులు తయారు చేసే బాటా కంపనీ వాడి తమ్ముడనుకొనే మొహం వేసుకొని..
>>నీ కంటి కి మా ఇద్దరం ఎలా కనిపిస్తున్నాం...
మిలింద్:dumb and dumber
>>చీమ కుడితే చర్మానికి గమాక్సిన్ పూసుకొనే తెలివితేటలు
>>ఛీ ఛీ పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా..ఆ ఎల్లోరా ఎనిమిదో వింత కాకుండా పోయి....
>>నీ మేధాశక్తి ని మహా సిమెంట్ లో కప్పెట్ట
>>తాను మాత్రమే తీయగలిగే దిమ్మ దొర్లు సినిమా క్లైమాక్స్ మొదలు పెట్టాడు
>>నేహా పోహా లాంటిది.. చూడ్డానికి తెల్లగా ఉంటుంది... అది పంచదార తో తింటేనే బావుంటుంది
--పోహా తెల్లగా వుంటుందా?? అయ్యబాబోయ్... ఏ ప్రాంతంలో అధ్యక్షా??
-bittu

హరే కృష్ణ said...

ప్రశాంత్ థాంక్యూ థాంక్యూ :)



బిట్టు :)))

థాంక్యూ వెరీ మచ్ :))
మీ సూపర్ సీనియర్స్ మీకు తెలుసా :)) తెలిస్తే యుద్ధాలు జరిగిపోయేవి :)
IIT Bombay అంటే నాకు చాలా ఇష్టం జాబ్ లో చేరడానికి వచ్చినప్పుడు కొన్ని కోర్సెస్ లో జాయిన్ అయ్యాం ఒక మూడు నెలలు :) అదీ సంగతి :)
పోకిరి సినిమా లో క్లైమాక్స్ లా
హాస్టల్ నెంబర్ H12
2008 batch
topper ఇన్ ది బాచ్
చూసావా చెప్పడానికే ఎంత గర్వపడుతున్ననో అని బాక్ గ్రౌండ్ లో థీం మ్యూజిక్ ప్లే చెయ్యండి :)
వివరాలకు కొత్తావకాయ తో కోకోకోలా పోస్ట్ చదవండి

>>పోహా తెల్లగా వుంటుందా?? అయ్యబాబోయ్... ఏ ప్రాంతంలో అధ్యక్షా??
మీ హాస్టల్ నుండి తాం తాం ఎక్కి మైన్ గెట్ దగ్గర దిగి రైట్ కి తిరిగి ఒక వందమీటర్లు నడిస్తే హిరానందాని డి-మార్ట్ లో 22 రూపాయల పేకెట్ ఉంటుంది ఆ ప్రాంతం లో
పగలే వెన్నెలా పోహా తెల్లగా ఉంటుంది :)
no offense just kidding :)
Thanks a lot for the response :)

హరే కృష్ణ said...

bittu
अरे यार प्ल्झ भेजो तो मी मैल को प्रोफाईल मी राख इन कॉन्ताक्ट्स मे नाहीतो फिरस्त तिमे का रेप्ली चेच्क करो :)))))))))))))

Anonymous said...

If I'm not wrong, nenu mimmalni chusanu :) :)

హరే కృష్ణ said...

హ హ్హ :)
మరాఠీ లో రాసాను తెలిసిన ఫ్రెండ్స్ ని అడిగి నాకు రిప్లై ఇవ్వండి :)
go to my profile :)

Sravya V said...

ఏమి జరుగుతుంది ఈ బ్లాగు లో నాకు ఎక్కడో చేపల వాసన వస్తుంది :)))

హరే కృష్ణ said...

స్వీట్ షాప్ లో చేపల వాసన అర్రర్రే రూమ్ స్ప్రే తీసుకొస్తున్నా :)
అయినా తిమింగాలాన్ని వదిలేసి ఏదో పరిగ మీద పడ్డట్టు ఏమిటిది :))))))))))))