Pages

Thursday, September 30, 2010

పార్క్ లో పదనిసలు



బాల్య ప్రేమల చట్టానికి విరుద్ధంగా రాసిన పోస్ట్ అని డిమాండ్ చేసేవాళ్ళకి గమనిక 
ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు

ప్రదేశం:విజయవాడ
హైస్కూల్ రోడ్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న నిలోఫర్,నాగరాజు బ్లాగ్ లు గట్రా చదవకుండా బుద్ధిగా కాలేజ్ కి వెళ్తున్న రోజులవి.ప్రిన్సిపాల్ సడెన్గా మారడంతో ఇంకో ప్రిన్సిపల్ వైద్యనాధ్ వచ్చాడు.

వచ్చీ  రావడంతోనే వీక్లీ టెస్ట్ లలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధుల వీపులు పగలగోట్టేవాడు వైద్యనాధ్ .ఎప్పుడూ టాప్ 5 లో ఉండే నిలోఫర్&నాగరాజు బాటమ్ 5 లో రావడం తో ఇంటికెళ్ళి పేరెంట్స్ ని తీసుకురమ్మని ఆజ్ఞ వేసాడు. క్లాసులో మిగిలిన స్టూడెంట్స్ అంతా vogue magazine ని ముందుంచుకొని వండర్ వరల్డ్ చదివే వింతజీవులను చూసినట్టు  ఇద్దరినీ చూడడం తో ఇద్దరి కోపం బాలయ్య సినిమా స్థాయికి చేరుకుంది

నిలోఫర్:రాజు,నువ్వు మీపేరెంట్స్ ని తీసుకోస్తావా
నాగరాజు: తాంబూలాలు మార్చుకోవడానికా, నాకు సిగ్గేస్తోంది
నిలోఫర్:ఎహే, ఇప్పుడేం చేద్దాం
నాగరాజు:సరే!..రిసెప్షన్ లో కాసేపు కూర్చుందాం వేరే క్లాస్ కి అటెండ్ అవ్వొచ్చు

రిసెప్షన్ లో న్యూస్ పేపర్ చదువుతూ పేజీలు తిరగేస్తున్నారు.తిరగేస్తూ తిరగేస్తూ రాఘవయ్య పార్క్ పునఃప్రారంభం అనే న్యూస్ దగ్గర వచ్చేసరికి ఆగారిద్దరూ ఒకరి మొహల్లోకి ఇంకొకరు చూసుకున్నారు

నిలోఫర్: నేను రాను,వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి
నారా:వెళ్ళాలంటే కావలసింది డబ్బు,ధైర్యం కాదు
నిలోఫర్:మరి నీ దగ్గర ఉన్నాయా డబ్బులు
నారా:మొదటి రోజు ఎంట్రీ fee ఫ్రీ

నిను ఆ దరిని నను ఈ దరిని రాఘవయ్య కలిపాడు ఇద్దరినీ అని పాడుకుంటూ చేరుకున్నారు
entrance దగ్గర తొక్కిసలాట జరుగబడుతోంది అని తెలుసుకోవడానికి ఎంతోసమయం పట్టలేదు ఇద్దరికీ

కష్టపడి ముందుకు సా..గి ఒక చోట ఆగారు  

విజయవాడ వేస్ట్ మేనేజ్ మెంట్ దయవల్ల చెత్త మరియు దుర్గంధం తో కలకలలాడుతుంది ఆ అపరిసరం అంతా
చెట్టుకింద కూర్చుందామనుకుంటే అక్కడ చెట్టు కాదు కదా కనీసం మొక్క కూడా ఖాళీ లేకుండా జనంతో కట కట లాడుతోంది. అలా నిల్చొని బెనిఫిట్ షోకి చివరి నిమిషం లో నిల్చొని చూసే టికెట్ దొరికిన ప్రేక్షకుడిలా కూర్చొని 
పట్టలేని సంతోషం తో సేద తీరుతూ ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుతున్నారు.

ఇంతలో పెద్ద శబ్దం మరో రెండు క్షణాలు ఆగాక  దానికంటే ఇంకా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు
పరుగులకించుకున్నారు,మళ్ళీ తొక్కిసలాట మొదలయ్యింది ఈ సారి బయటకి పారిపోవడానికి

గేట్ దగ్గర కాసేపటికి  ఇంకా వత్తిడి పెరుగుతోంది ఊపిరి ఆడనంత పనిఅవుతున్న సమయం లో  పెద్దగా  ఢం ఢం అని శబ్దాలు ఈ సారి వినిపించాయి

జనాలు అరుపులు మొదలెట్టారు

కాసేపయ్యాక  తెలిసింది ఏమిటంటే మొదటి రోజు కావడంతో బూజు పట్టిన  స్పీకర్లు స్పెషల్ attraction గా పెట్టడం తో అపరిచితుడు లో రండక రండక పాట ఢం ఢం అని వినిపించాయి
నాగరాజు,నీలోఫర్ వెధవలైపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు
 సరిగ్గా ఆ  సమయం లోనే speaker సరిగ్గా పనిచేయడం మొదలు పెట్టింది అనుకుంటా
బ్యాక్ గ్రౌండ్ లో
ఏలా ఏలా ఏలా.. ఏలా ఏలమ్మా..ఏలా ఏలా ఏలా ఏలా..ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓలా ఓలమ్మా..
అని ప్లే అవుతోంది :)

టైటిల్ కి justification
పార్క్ లో మొదట పాట ప్లే చేసిన పాట బోయ్స్ లో  సారిగమే..పదనిసే..  పిచ్చెక్కించేసే...
thats what we say




తర్వాతి భాగం.. త్వరలో..

55 comments:

రాజ్ కుమార్ said...

ఇద్దరి కోపం బాలయ్య సినిమా స్థాయికి చేరుకుంది
ha ha.... racha racha...:)
inta chinnadi raasaremi krishna garu?
tondara ga 2nd part raaseyyandi mari.. waiting ikkada..

మనసు పలికే said...

హహ్హహ్హా. హరే.. బ్లాగు బాగు.:)
>>ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు
కేక..:)
స్పెషల్ స్పీకర్స్ అట్రాక్షన్ సూ..పర్..:)
మరి ఆ తర్వాత భాగం ఎప్పుడు..??:(

శివరంజని said...

>>ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు<<

హహ్హహ్హా.. హరే కృష్ణ గారు చాలా బాగా రాసారు మరి తరువాయి భాగం ఎప్పుడు ?

kiran said...

hahaha...creativity...mottam vadestuunaru.. :)...bagundi...kani chala chinnadi aipoindi..waitng for next part..

హరే కృష్ణ said...

వేణూరాం :))
గంట లో నేను ఇంతకు మించి రాయలేను
కాస్త ఖాళీ అయినప్పుడు ఫినిష్ చేసేస్తా :)
Thank you :)


అపర్ణ,
తరువాయి భాగం ఒక వారం పట్టొచ్చు :)
థాంక్స్ :)

హరే కృష్ణ said...

శివరంజని పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ :)
ఇప్పుడు బంగారం అని ఎవరిని పిలవాలి ? :)



కిరణ్,
మీ అభిమానానికి ధన్యవాదాలు
తార గారు పెద్ద పోస్ట్ అయితే చదవలేకపోతున్నారు అని చెబుతున్నారు
మరీ చిన్నగా రాసాను :(
ఆఖరి పార్ట్ కాస్త పెద్ద పోస్ట్ రాస్తాను :)

పరిమళం said...

:) :)

మురళి said...

:-)

శివరంజని said...

హరే కృష్ణ గారు ఎవరు బంగారం అనే అలోచనే వద్దు ...అపర్ణ , నేను ఇద్దరం బంగారాలే ..

మనసు పలికే said...

రంజని, ఇలా ఎవరు బంగారం అన్న ప్రశ్న లేవనెత్తి మనిద్దరం ఆ పదవి/బిరుదు కోసం కొట్టుకుంటూనో/తిట్టుకుంటూనో ఉంటే చూడాలని ఉన్నట్లుంది కృష్ణకి.. కానీ ఆ చాన్స్ లేదన్న విషయం అర్థం కావడం లేదు పాపం..;) అంతేనా కృష్ణ..? :D :D
మొన్నెప్పుడో అన్నారు కూడా బంగారం బంగారం తిట్టుకుంటే కామెంట్లు రాలతాయని..

శివరంజని said...

అపర్ణ నువ్వు చెప్పింది 100% కరెక్ట్.... మనిద్దరం కొట్టుకోవడం / తిట్టుకోవడమా????? .nevvvvvvvvvvvver

నీహారిక said...

మీరు మా విజయవాడ వాస్తవ్యులేనా, మరి చెప్పరేం??? మేము కృష్ణలంకలో ఉండేవాళ్ళం.

మీకు కన్ఫ్యూజన్ ఎందుకు గానీ రంజని బంగారం, అపర్ణ బంగారం అని అడ్జస్ట్ అయిపోండి.

చిన్నవాళ్ళయినా వాళ్ళే నయం సామరస్యంగా ఉంటున్నారు. పెద్దలే ఒకరినొకరు మాటలతో పొడుచుకుంటున్నారు. మధ్యలో పుల్లలు వేయకండి బాబూ పుణ్యం ఉంటుంది.

Anonymous said...

మీరనట్టు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఆండీ
వాళ్ళు కావాలనే సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ముచ్చటేస్తుంది
మీరు కూడా సరదాగా తీసుకోండి..:)))

నేస్తం said...

క్రిష్ణ భాగాలు రాసేయడమే గాని ముగించవా..?? అప్పుడెప్పుడో సగం రాసి వదిలేసావు ఒక ప్రేమ కధ ... సరే ముందు దీని సంగతి చూడండి సార్

రాజ్ కుమార్ said...

గంట లోనే ఇంత రాసేసావంటే... పూటకి నాటిక రాసేస్తావేమో...?? అద్భుతం.. సుమీ

హరే కృష్ణ said...

పరిమళం గారు :-)

మురళి గారు :) :)

హరే కృష్ణ said...

శివరంజని నేను కూడా అదే అన్నాను మీరిద్దరూ బంగారమే అని..అయితే మీ ఇద్దరిలో 22 carrots 24 బీట్ roots ఎవరో తేల్చుకొని కామెంట్ పెట్టండి..!

హరే కృష్ణ said...

>>>ఆ పదవి/బిరుదు కోసం కొట్టుకుంటూనో/తిట్టుకుంటూనో ఉంటే చూడాలని ఉన్నట్లుంది కృష్ణకి

అపర్ణ,
నువ్వు మూడు లక్షలు ఇవ్వకుండా మోసం చేసినా కూడా నిన్ను నోరారా మార్పు శిఖామణి అని పిలిచాను.. ఒక్కసారి కూడా కాదు రెండు సార్లు..
తొ.తో.బ్లా.స వాళ్ళతో ఇలా చేతులు కలిపి గ్రీన్స్ కి గోంగూర కి చేస్తున్న ద్రోహాన్ని ఖండిస్తున్నాం

హరే కృష్ణ said...

>>>అపర్ణ నువ్వు చెప్పింది 100% కరెక్ట్.... మనిద్దరం కొట్టుకోవడం / తిట్టుకోవడమా????? .nevvvvvvvvvvvver


అపర్ణ చూసావా నెవెర్(never) అని చెప్పకుండా నీవెవెర్ అని అంటున్నారు రంజని గారు
ద్రోహపు ఫలక్ నామా కే ద్రోహమా..బ్లాగ్ రివెర్స్ అని డైలోగ్ కొట్టాల్సిన సమయం అవసరముంది మేలుకో..
రంజనీ హట్ జావో అని బిగ్గరగా అరువు మేమంతా నీ వెనుకే ఉన్నాం

Anonymous said...

ఎందయ్య ఈ గొడవ ఆ బంగారం ఏదో నాకివ్వండి సుబ్బరంగా.. నేను మా హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకులో వేసుకుంటాను..

Anonymous said...

చిన్నవాళ్ళయినా వాళ్ళే నయం సామరస్యంగా ఉంటున్నారు. పెద్దలే ఒకరినొకరు మాటలతో పొడుచుకుంటున్నారు. మధ్యలో పుల్లలు వేయకండి బాబూ పుణ్యం ఉంటుంది.
____________________


చిన్న చిన్న బొప్పిలాయ, బ్లాగుల్లో బ్లాగాట ఆడుకుంటున్నారు మరి. పెద్దలు వచ్చి ఎందయ్య సదువుకోకుండా అల్లరి అని పుల్లలు బెట్టి నాలుగు పీకి, జబ్బ పట్టి లాక్కుపోతుండారు..

హరే కృష్ణ said...

నిహారికా గారు మీది కృష్ణ లంకనా
great
ఇప్పుడు ఆ ఏరియా అంతా చెత్తకట్టుకు పోయింది..అసలేం బాలేదు
హమ్మయ్య మన విజయవాడ బ్లాగు సంఘం ఏమన్నా ఉందా?మూడు లక్షలు అర్జెంట్ గా కావాలి!.. అక్కడ ట్రెజరర్ పోస్ట్ ఇప్పించండి ఫెదరర్ క్లాస్ చూపించుకుంటాము :)


anonymous గారు మీరెవరో కాని నా మనసులో మాట సరిగ్గా చెప్పారు
ఆ smiley లు పెట్టిన పెద్ద చేస్తికి నా ధన్యవాదాలు

హరే కృష్ణ said...

నేస్తం గారు
అక్కయ్య అడగడం అభిమాన తమ్ములు కాదనడమూ నా..హెంత మాట హెంత మాట!
నేను రెండో పార్ట్ రాస్తాను.. లేకపోతే జాజిపూలు hardcore ఫ్యాన్ వేణూరాం తో రాయించైనా పోస్ట్ చేయిస్తా :)
కామెంటినందుకు :) :)



రాజ్ కుమార్
నెక్స్ట్ పోస్ట్ రాయాల్సింది నువ్వే ఎన్ని గంటలు రాస్తావో రాయు నేనూ చూస్తా :)

హరే కృష్ణ said...

ఎకౌంటు నెంబర్ చెప్పండి తార గారు :)

హరే కృష్ణ said...

>>మీరనట్టు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఆండీ
వాళ్ళు కావాలనే సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ముచ్చటేస్తుంది
మీరు కూడా సరదాగా తీసుకోండి..:)))

మీరెవరో కాని నా మనసులో మాట సరిగ్గా చెప్పారు :)

ఆ smiley లు పెట్టిన మీ బంగారు చేతులకి నా ధన్యవాదాలు, ఈ సందర్భంగా మీ బంగారు గాజులు నాకు ఇచ్చేయండి :)

Anonymous said...

బంగారమ్ కుడా ఆన్ లైన్లొ వేస్తారా? కుదరదు అట్టా, నేనే వచ్చిపట్టకుపోతా...

నేను said...

@Krishna,
Tara ni nammoddu, HDFC ni assalu nammoddu. Aa bangaaremedo naakivvu, Nenaite anna misore camera to paatu jagratta gaa Swiss bank lo daachipedataa.

..nagarjuna.. said...

అసలు కంటే కొసరు ముద్దు అంటే ఇదేనేమో..... ;)

మనసు పలికే said...

అయ్.. అసలేంటిది..? ఏం జరుగుతుందిక్కడ..? ఇక్కడ రెండు మేలిమి బంగారాలుండగా, అలా బంగారాన్ని మీరు మీరే పంచేసుకుంటారా..? ఏది ఏమైనా సరే ఆ బంగారం నాకు శివకు మాత్రమే చెందాలి అంతే.. హహ్హహ్హా..

కృష్ణ.. ఇక్కడ క్యారెట్స్ బీట్ రూట్స్ ఎవ్వరూ లేరు. ఇద్దరం మేలిమి బంగారాలే..
>>నిన్ను నోరారా మార్పు శిఖామణి అని పిలిచాను.. ఒక్కసారి కూడా కాదు రెండు సార్లు..
ఒప్పుకుంటున్నాను..:))
>>బ్లాగ్ రివెర్స్ అని డైలోగ్ కొట్టాల్సిన సమయం అవసరముంది మేలుకో
నువ్వు నిద్ర పోతున్న సింహాన్ని లేపుతున్నావు.



>>ఎందయ్య ఈ గొడవ ఆ బంగారం ఏదో నాకివ్వండి సుబ్బరంగా.. నేను మా హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకులో వేసుకుంటాను..
తార గారు.. మీరు కేకో.. కేక..

..nagarjuna.. said...

score board అస్సలు ముందుకు కదల్టం లేదు జనాలేమయ్యారేటి!! పంపకాలు జరిగిపోయినాయా...!?

హరే కృష్ణ said...

బద్రి హహ్హ కేక :D

నాగార్జున దీనినే వ్యూహాత్మక మౌనం అని అంటారు :)
బంగారం వెయ్యడానికి hdfc బాంక్ కి వెళ్ళింది
డబ్బులు వచ్చేవరకు నో గొడవ :)

హరే కృష్ణ said...

మనసు పలికే గారికి బంగారు వందనం
ఇద్దరూ వచ్చ్చి దండయాత్ర చేయండి
ఇలా ఎన్ని సంవత్సరాలు onesided batting చేసి century చేస్తారు
యాభై కామెంట్లు చూసి చాలా రోజులయ్యింది
ఇద్దరికీ ముందుగానే థాంక్స్ :)

మనసు పలికే said...

నాగార్జున హహ్హహ్హా. మనం డిసైడ్ అవ్వాలే కానీ సెంచరీ చెయ్యడం ఎంత సేపు చెప్పు. అసలే వ.బ్లా.స. సభ్యులం..:)

మనసు పలికే said...

కృష్ణ..
>>వ్యూహాత్మక మౌనం ఆ..?? :))
మీ బంగారు వందనాలకి నా బంగారు అభివందనాలు.:)

మనసు పలికే said...

>>బంగారం వెయ్యడానికి hdfc బాంక్ కి వెళ్ళింది
ఇక్కడ బంగారం అర్థమేమి కృష్ణ..??
బంగారం=అపర్ణ ..?
బంగారం=శివ ..?
బంగారం=బంగారం ..?

Raghuram said...

:) :)

Raghuram said...

హరే కృష్ణ గారు ,

మీకు చాలా thanks అండి, మీ బ్లాగు వల్ల నేను చాలా మందివి మంచి మంచి బ్లాగులు చదవగలిగాను.

రఘురాం.

హరే కృష్ణ said...

మనసు పలికే గారు ఎకౌంటు లో పడిన డబ్బులు బట్టి మీకు సెలవిస్తాము బంగారం అంటే ఏంటో..

అప్పటివరకు రంజని నే బంగారం
నువ్వు మార్పు శిఖామణివి..ఇందులో ఏ మార్పు లేదు :)

హరే కృష్ణ said...

రఘురాం గారు..చాలా సంతోషం ఆండీ
మీరు మరిన్ని బ్లాగులు చదివి వాళ్ళ బ్లాగుల్లో కామెంట్లు కూడా పెట్టి ఇంకా ఆనందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను!

పనిలో పని గా మీరు కూడా బ్లాగు రాయడం మొదలెట్టేయండి
భయమైతే..ఫోటో బ్లాగ్ తో మొదలెట్టండి నెమ్మదిగా అలవాటైపోతుంది
All is well!

మనసు పలికే said...

కృష్ణ.. నాకు "మార్పు శిఖామణి" అని బిరుదిచ్చినాయన ఎక్కడికో వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం వదిలేలా లేవు..:))
ఇక బంగారం సంగతి అంటావా..! నేస్తం అక్క పెట్టిన పేరు కదా అది..;) సో.. నో ఛేంజ్.. అయినా రంజని కూడా డిక్లేర్ చేసేసిందిగా ఇద్దరమూ బంగారాలే అని.. హహ్హహ్హా...

రాజ్ కుమార్ said...

ఎహే..అసలు బంగారం నేను కదా..? మీరంతా ఉత్తుత్తి బంగారాలు.. :) :)

మనసు పలికే said...

వేణురాం గారు.. మీరు మేల్ బంగారం..:)
మేమిద్దరం ఫీమేల్ బంగారాలు.. హహ్హహ్హా

రాజ్ కుమార్ said...

Itey meeranta uttutti female bangaralu..:)

మధురవాణి said...

భలే నవ్వించారు!:) :) కానీ, అర్ధాంతరంగా ఆపేసినట్టు ఉంది. తొందరగా పూర్తి చేయండి. నేస్తం గారన్నట్టు నిషా పరిచయం ఇంకా పూర్తి చేయలేదుగా! ;)

హరే కృష్ణ said...

అపర్ణ,
మేలిమి బంగారం నుండి మేల్ అని వచ్చింది అని ఆధారాలు చెబుతున్నాయి :)
కూరిమి నుండి కూర వచ్చిందా అని నన్ను అడగొద్దు ప్లీజ్ :)

వేణూరాం :D :D

హరే కృష్ణ said...

మధురవాణి గారు,తప్పకుండా :)
ఈ వారాంతంకి రాద్దామని అనుకుంటున్నా
thankyou :)

మా నిషాకి కామన్ వెల్త్ గేమ్స్ సెలవుల సందర్భంగా excursion లో ఉన్నారు ప్రస్తుతం october 14th తర్వాత రిలీజ్ :)
thanks for updating

శివరంజని said...

49

శివరంజని said...

50 వ కామెంట్ నాదే ..కంగ్రాట్స్

మనసు పలికే said...

కృష్ణ.. అభినందనలు 50 కామెంట్లు పూర్తి చేసుకున్నందుకు..:)
శివ.. నీకు కూడా అభినందనలు..:)

మనసు పలికే said...

When is continuation post Krishna..:))

మనసు పలికే said...

కృష్ణ.. కంటిన్యుయేషన్ ఏది బాబూ..!! ఎన్ని రోజులు వెయిట్ చెయ్యాలి, నీ పదనిసల కోసం ఇంకా నిషా కోసం..?

హరే కృష్ణ said...

శివరంజని,అపర్ణ ఇద్దరికీ థాంకులు :)

Ravi Gadepalli said...

characters perlu bavunnayira

Ravi Gadepalli said...

characters perlu bavunnayira

హరే కృష్ణ said...

రవి చాలా థాంక్స్.. దీనికి రెండో పార్ట్ కోసం వాడికి ఒకటే ఫోన్స్ చేస్తున్నా తర్వాత ఏమైంది అని :)