Pages

Friday, October 16, 2009

పో..పో ..


అది 1609 సంవత్సరం

ఒక గంభీరమైన గొంతుతో

టు టెన్ జా ట్వంటీ

త్రీ టెన్ జా థర్టీ అని చదువుతున్న షేర్ ఖాన్

భైరవా.. ఇప్పుడు నువ్వు చనిపోవచ్చు కాని నువ్వు ఎక్కాలు ఒప్పజెప్పడానికి మళ్ళీ పుడతావ్ రా ! (సమీర్ రెడ్డి పక్కన వుంటాడు సీన్ లో)

అని చెప్పి ఒక శ్రీ సీతారామా& కో. రాజమండ్రి. ఎక్కాల పుస్తకాన్ని చితి మీద పెట్టి నిప్పంటిస్తాడు షేర్ ఖాన్

వెంటనే టైటిల్ పడింది పోతేపోరా

ప్రస్తుతం 2009

హీరో హర్ష కష్టపడి గెలుచుకున్న పేకాట డబ్బులను మమైత్ ఖాన్ దొంగిలించుకుపోవడం తో సీన్ మొదలవుతుంది పేక యార్డ్(కేసినో ) లో ఒక సాంగ్ వేసుకుంటాడు

హీరోయిన్ బస్టాండ్ లో ఆటో కోసం ఎదురుచూస్తూ వుంటది (???)

తర్వాత యాజ్ ఇట్ ఈజ్

రాయఘడ్ (ఒరిస్సా బోర్డర్ లో వుంటుంది )లో వున్న ఘోరా దగ్గరకు హెలికాప్టర్ లో విలన్ వెళ్తాడు,నిన్న రాత్రి హీరోయిన్ ని చూస్తుంటే వెంటనే ఎవడో నన్ను చంపేస్తున్న ఫీలింగ్ వచ్చింది అని అంటాడు

అప్పుడు ఘోరా దాన్నే ఫుల్ స్టాప్ ప్రేరణ అంటాడు . అని చెప్పి ఫుల్ స్టాప్ ప్రేరణ ఇప్పటది కాదు ఎన్నో సంత్సరాలనుండి వుంది అని అంటాడు ఇదుగో మన రాయఘడ్ చరిత్ర అని ఒక పుస్తకాన్ని చూపిస్తాడు

ఇదుగో 400 సంవత్సరాల రాయఘడ్ చరిత్ర ఇదుగో ఇదే నీ మరదలు గులివింద అని తన ఫోటో చూపించి

తన కోసం పడిచచ్చిపోయే తన బావ వైన రాయఘడ్ సైనికాధ్యక్షుడు నువ్వు శని బీర్ జల్లావి

ఇదుగో నీ గులివింద ఎంతగానో ప్రేమించే వీరుడు శూరుడు అయిన ఎక్కాల భైరవ (సగం మొహం మాత్రమే వుంటుంది )

వాడూ నీలాగే తనను దక్కించుకోవడానికి జన్మ లో కూడా పుట్టాడు

విలన్ పళ్ళు కొరుకుతూ ఎక్కాల భైరవ

ఘోరా చెప్పు నా గులివింద ను ఎలా దక్కిన్చుకోనేది వాడు ఎలా ఉంటాడు వాడిని ఎలా గుర్తుపట్టడం వాడిని చంపేస్తా అనగానే వాడిని చంపడం అంత సులువు కాదురా అని ఘోరా చెప్తాడు

శని బీర్ కే ఎదురు నిలిచేవాడా హ్హ అని అనగానే

ఘోరా :నువ్వేమైనా రన్ బీర్ అనుకుంటున్నావా గులివింద ను ఎగరేసుకు పోవడానికి

శని బీర్ జల్లా:వాడెవడు మధ్యలో

ఘోరా: కింగ్ ఫిషర్ బీర్ కి స్పోన్సర్

సరే వాడిని ఎలా గుర్తుపట్టాలో చెప్పు

నేను చెప్పనవసరం లేదు మీ కలయికని మీ కంటే ముందే ప్రకృతి పసిగడుతుంది కాకులు కావ్ కావ్ అనకుండా కెవ్వు కెవ్వు అని అంటాయి

కోళ్ళు పందికోక్కో అని శబ్దాలు చేస్తాయి మేకలు కేక కేక అని ఆర్తనాదాలు చేస్తాయి కుక్కలు కుయ్యో మొర్రో అని భూమికి బొక్కలు పడేటట్టు బుర్రలు బాదేసుకుంటాయి

విలన్:అంతేనా ఇంకా ఏమైనా ఉంటాయా

ఘోరా:వాడు ఎదురైనప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఎక్కాలు చదివేస్తున్టావ్

విలన్ : ఎందుకు అలా

ఘోరా: లాజిక్ అడిగితే @@## మీద తంతా, టైం అప్ , గెట్ అవుట్ ఆప్ మై గుహ


హీరోయిన్ తో రెండు డ్యూయెట్ లు వేసుకొని పండగ చేసుకుంటున్న హీరో ఫ్రెండ్ తో టీ తాగడానికి హోటల్ కి వస్తాడు తర్వాత వెంటనే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది

అంతే ఒక సారి అలా కీరవాణి మ్యూజిక్ వుహించేసుకోండి బ్యాక్ గ్రౌండ్ లో

అప్పుడే హీరోయిన్ని హీరో గుర్తు పట్టేసిన వెంటనే గోల్కొండ లోకి కెమెరా షిఫ్ట్ అయ్యింది


కాటుబెల్లపు కొమ్మా కొమ్మా

పాములా చూడోద్దమ్మా


పచ్చిపూలా రెమ్మా రెమ్మా

నాలుకే గీయోద్దనకమ్మా

స్నానమే చేయ్యోద్దంటే.. గోళిలే ఆడోద్దంటే.. ఏమవుతానమ్మా..


గేద పైన చెయ్యేస్తే..కాలుతో తన్నిందే..అసలు పేడ నువ్వని పంపిందే..

నువ్వు రాకు నా వెంటాయే.. పేడ చుట్టూ పెంటంట..అంటుకుంటే వళ్ళంతా మంటేనంట..


మీ చెల్లి పైన చెయ్యేస్తే..తిట్టి నన్ను నెట్టిందే..మెరుపు తీగ నువ్వని పంపిందే..

నా చెల్లి వెంట నేనంట..నా వెంట నువ్వంట..నే మీ తమ్ముడితో తిరిగితే తప్పంటా..!!


పేడ ఎత్తేటందుకు పుట్టానే బొమ్మా

నువ్వు కాదంటే నే అవుతా దద్దమ్మా ..


అనే ఒక మాంచి రొమాంటిక్ సాంగ్ తర్వాత


హీరోయిన్ తండ్రి యుగళగీతాన్ని కళ్లారా చూసి పాట అయిపోయాక ఎందుకు ఆపేసారు అందుకే నీకు నా బిడ్డ ని ఇవ్వను అనేసరికి ఒక్కటి పీకుతాడు హీరో

తర్వాత 'మామూ'లే

హీరోయిన్ ని విలన్ హైదరాబాద్ నుండి ఒరిస్సా లో గల రాయఘడ్ కి తీసుకువేల్దామని లాగుకుపోతుండగా హీరోయిన్ మింగలేక కక్కలేక కుక్కల కోళ్ళ అరుపులు వింటూ కూర్చుంది హెలికాప్టర్ లో (విలన్ ఎక్కాలు చదువుతూ కోపం గా ఒక చూపు చూస్తాడు )

హీరో తన ప్రయత్నాలు తను చేసుకుంటూ వుంటాడు హీరోయిన్ ని ఆపడానికి అంతలోనే ఒరిస్సా కి కొంచెం దూరం లో వున్న శ్రీకాకుళం లో పడిపోవడం తో ఫ్లాష్ బ్యాక్ వెంటనే గుర్తొస్తుంది

ఇటుపక్క ఒక పేద్ద మంట అటుపక్క పెద్ద పెద్ద అరుపులతో నక్కల జంట

మళ్లీ స్టార్ట్ చేశాడ్రా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ..ఏం చేస్తాం అందుకే ఇంటర్వెల్...


మొత్తానికి వచ్చేసాం హాలీవుడ్ ప్రపంచం లోకి

రాయఘడ్ కదా కొంచెం ఏంటి బాగా వీక్ టెక్నాలజీ లో నార్నియా సినిమా లో వాహనం నుండి inspire అయ్యినట్టు, పందులతో మన హీరో బళ్ళు కట్టించుకుంటారు

వీరాధి వీరుడు రాయఘడ్ వీరుడు sata,westren digital ధృవ వంశ వీరుడు ఎక్కాల భైరవ

seagate వంశ వీరుడు మరియు రాయఘడ్ రాజ్య సైన్యాధ్యక్షుడు శని బీర్ జల్లా


ఎక్కాల భైరవ రాగానే గ్లాడియేటర్ స్టేజి లో వుండే ఆడియెన్స్ 400 సంవత్సరాల క్రితం అనే సంగతి మర్చిపోయి బ్రేక్ డాన్స్ లు మూన్ వాక్ లు తెగ చేస్తూంటారు, వెంటనే విలన్ బండి తియ్ రా అనగానే, ఉండన్నా పందులకి ఇంకా మేత కాలే.. రెడీ అవుతున్నాయి అంటాడు తన అనుచరుడు

యువరాణి గులివింద తండ్రి అయిన అరవింద (ns: పాత్రను ప్రముఖ నటుడు శరబత్ బాబు పోషించడమైనది) రాగానే ప్రజలు బ్రేక్ డాన్స్ లు ఆపేసి విజిల్స్ వేయడం మొదలెట్టాక


హీరోయిన్ ఆపిల్ కోసం విలన్ వచ్చి దాన్ని హీరో తినేసి తర్వాత హీరోయిన్ తిన్నాక విలన్ అవమానం తో తల ఎక్కడ పెట్టాలో తెలియక పరాక్రమం వుంటే ఇక్కడ కాదురా రేపు పందుల రేసింగ్ లో చూసుకుందాం అని ఒక చూపు చూసి వెళ్ళాక పట్టపగలే అష్ట గ్రహ కూటమి మొదలయ్యింది దాన్ని చూసి నిచ్చేస్టుడు అయిన రాజు అరవింద స్వాముల వారు ఇలా అంటున్నారు

రాజు:మహా మంత్రీ! ఆకాశం లో ఏందీ చుక్కలు నాకు సమజ్ కాలే దాని అర్ధం ఏంది?

మంత్రి: అవి చుక్కలు కాదు రాజా, మన రాజ్యానికి పడే బొక్కలు మహా రాజా

రాజు:ఓహ్ సింబాలిజామా

మంత్రి :అవును మహారాజా షేర్ ఖాన్ మన రాజ్యం మీద కు దండెత్తి వస్తున్నాడు

రాజు:ఎవరతను.. దలాల్ స్ట్రీట్ లో వుంటాడు వాడేనా!!

మంత్రి:మహారాజా వాడు కాదు మీ ఆవిడను ఎత్తుకుపోయిన డోర్ మాన్ కొడుకు

వాళ్ళ నాన్న లాగే షేర్ ఖాన్ కి పని లేదా దాదాపు దేశం అంతా అక్రమించేసాడు ఒరిస్సా లో మారుమూల ప్రాంతాలను కూడా వదలడా ఇక్కడేమి వున్నాయి అని

కొండలు జలపాతాలు తప్ప

సరే వాడు ఎలాగో వస్తున్నాడు కదా వాడిని ఎదిరించడమా.. మనకంత సీన్ లేదు ఈలోపు మన పందుల పోటీలు ప్రారంభించండి ఆనందిచెదము..
శని బీర్ జల్లా సభలో ఓపెన్ ఆడిటోరియం లో డయాస్ మీద వున్న మిత్రవింద వొళ్ళో వున్న ఎక్కాల పుస్తకాన్ని తీసే సరికి అందరి మొహాల్లోకి ఒక క్లోజ్ అప్

రాణి గారి ఎక్కాల పుస్తకాన్నే కాపాడలేని వాళ్ళం ఇక రాజ్యాన్ని ఏం కాపాడగలం'అనేసరికి సరే ఎవరితే గుర్రం కి వేలాడదీసిన పుస్తకాన్ని తీసుకొస్తారో వాళ్ళకే నా రాజ్యం తో పాటు నా కుమార్తె గులివింద (1+1) ..

కొంచెం బెన్ హర్
తర్వాత విలన్ కి రాజ్య బహిష్కరణ చేసిన వెంటనే..

షేర్ ఖాన్ solatire ఆడుకుంటూ తన అనుచరులతో దండెత్తి వస్తున్నాడు రాయఘడ్ మీదకు
యువరాణి గులివింద ను దోషం పోవడానికి ద్వీపం మీద కు తీసుకు వెళ్తే తను మాత్రం ఎక్కాలు చదువుతూ భైరవ బొమ్మ గీస్తుంది
దమ్ముంటే భూటాన్ ఫౌజ్ కి ఒప్పజేప్పరా నీ ఎక్కాలు అని తన దగ్గర వున్న ఎక్కాల పుస్తకాన్ని విసురుతాడు షేర్ఖాన్

ఇప్పుడు ముందు వినిపినించిన మొదటి సీన్ మనకు కనిపిస్తుంది సమీర్ రెడ్డి విజిల్స్ తో సహా
hero ఎక్కాలనీ ఒప్పజేప్పేసాక.. నాకు దక్కనది ఎవరికీ దక్క కూడదు అని బీర్ జల్లా మధ్య లో వున్న పేపర్ ను తీసి కిందకి పారేస్తాడు రాణి వెంటనే తను ఎంతగానో ఇష్టపడే పుస్తకం లో పేజీల కోసం హీరోయిన్ దూకేస్తే హీరోయిన్ కోసం హీరో దూకేస్తాడు

వెస్ట్రన్ డిజిటల్,sata హార్డ్ డిస్క్ వంశ స్తులతో solatire ఆడటం ప్రమాదకరం అని నువ్వు చెప్తే నమ్మలేదు ఇప్పుడు తెలిసొచ్చింది అని చితి కి నిప్పంటిస్తాడు షేర్ ఖాన్

సశేషం..


మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు..

గమనిక:ఇది కేవలం సరదా కోసం చేసిన ప్రయత్నమే అన్యదా భావించకండి.. చదివి, నవ్వొస్తే నవ్వుకోండి. లేకుంటే మర్చిపోండి.. ఎవరినీ నొప్పించే వ్యాఖ్యలు మాత్రం చేయకండి