బంతి like this
ఆఫీస్ లో వాళ్ళు సాండ్ విచ్ లు తింటూ ఈ ఉద్యోగులను కార్మికులుగా మారుస్తూ మమ్మల్ని సాండ్ విచ్ చేస్తారు..
అని తిట్టుకుంటూ సాయంత్రానికి ఎక్స్టెన్షన్ అర్ధ రాత్రి అవడానికి సస్పెన్షన్ అవుతోంది.
ఒక సౌత్ ముంబై గ్రామ సింహం బ్రౌన్ కలర్ లో పెద్ద తెల్ల చారలతో ముద్దుగా నడుస్తోంది
ఎవరో చేసిన పునుగులకు వేరెవరో బలి అయినట్టు
తెల్లగా ఉన్న ఏరియా మొత్తం ఎవరో వికో టర్మరిక్ ఓనర్ మహిమ వల్లనేమో పసుపుతో నిండిపోయింది.
నేను నా బేగ్ లో ఉన్న బాటిల్ తీసి మొహం మీద చల్లుకున్నా
జెట్ ఎయిర్ వేస్,ఇండిగో మరియు పచ్చ కామెర్లు లేవని డిసైడ్ అయ్యాక
ఆ పచ్చదనం పరిశుభ్రత కి బ్రేక్ ఇద్దామని గ్లూకోన్ డీ తీసి ఆ జీవానికి రుచిచూపించాక
మిగతా పచ్చదనాన్ని పూర్వ వైభవాన్ని తీసుకోచ్చేపనిలో చారల మీద కొంచెం వేసానుసింహం లా జూలు విదిల్చి పైన ఉన్న గ్లూకోన్ డీ భూమి మీద పడ్డాక భొంచేసింది. తిన్నాక తెలుగు ప్రోడ్యూసర్లను వదలని చిన్నికృష్ణ లా అది నా వెనుక స్లో మోషన్ లో పరిగెడుతోంది
నా ముందు ఒకమ్మాయి స్కర్ట్ వేసుకొని ఈవినింగ్ వాక్ కి అనుకుంటా వెళ్తోంది నేను నా స్లో మోషన్ ని మరికొంచం నెమ్మదించాను కుక్క ఫాస్ట్ మోషన్ అందుకొని నా షూ మీద ఉన్న గ్లూకోన్ డీ ని తన నాలుకతో నాకేసి పనిలో పనిగా పాద రక్షలను పాలిష్ చేసేసింది.ఇక నేను నా attention డైవెర్ట్ చేసి పరుగు పెంచాను
నేను ఆ అమ్మాయి వెనుకే పరిగెట్టడంతో తను నా ముందు పరిగెడుతోంది..
బాబోయ్ పోలీస్ చౌకీ ముందే ఉంది ఇప్పుడు ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే స్పీడ్ బ్రేక్ వాళ్ళు వేస్తారు అని
నిత్య నూతన గ్లూకోన్ డీ పేకెట్ ని నేను సైతం ఆ సునకానికి ధారబోసాను!!
ఇంతలో రోడ్ క్రాసింగ్ దగ్గర
వహా గాడీ జా రహీ హై పాస్ మత్ ఖడో అని వాళ్ళ పిల్లాడికి జాగ్రత్త చెబుతూ ఒక అమేజింగ్ అమ్మ అరుపు వినిపించింది..
పాసో పాస్ ఆస్ పాస్ ఓస్ ఓస్ బెమ్మీస్ దోస్ ఒంగోల్ ఓట్స్ అని నేను కసి ప్రేలాపన అందుకున్నానుఆస్ పాస్ ఆస్ పాస్ (కోరస్)
బాబోయ్,పాస్ అంటే గుర్తొచ్చింది
రైల్వే పాస్ రిన్యూ చేయించాలి అని సడెన్ గా గుర్తొచ్చింది.
వాలెట్ లో ఉన్న మంత్లీ పాస్ తీసి చూసాను
తేదీ సువర్ణాక్షరాలతో కాకుండా తడిసిపోయిన జలబిందువులతో ముగ్ధమై ముద్ద అయిపోయే స్టేజ్ లో ఉంది
అక్కడ ఒక జూమ్ ఇన్ చేస్తే
05-07-2012
కెవ్వ్!
మా రాజ్ పుట్టినరోజు
ఒక మనిషి తన జీవితకాలం లో ఎన్నో సినిమాలు చూస్తాడు,ఎంతో మంది హీరోయిన్లు మారతారు,ఎన్నో బ్లాగుల్లో కామెంట్లు పెడతారు.
కాలానికి అతీతం గా దు:ఖo వచ్చినప్పుడు నీ తోడు నిలిచేవాడే స్నేహితుడు అని బ్లాకాసవాణి బోంబే లో బ్రేవుమంది.
నువ్వు సంతోషంగా అయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం!
నీ అభిరుచులకు తగ్గట్టుగా కనెక్టింగ్ ఫ్లైట్ దొరికి గాల్లో తేలినట్టుందే సాంగ్ వేసుకోవాలని రిక్వెస్ట్ లాంటి డిమాండ్ చేస్తున్నాం :P
31 comments:
బాబోయ్ ఆ టైటిల్ ఏంటి సార్? ఇలియానా అని చూడగానే బులుసు గారే గుర్తొచ్చారు ద.హా. మీరు ఇంత కష్ట పడి పరుగెత్తింది రాజ్ కుమార్ (రాజ్ అంటే రాజ్ కుమార్ గారే కదా!!!) గారికి శుభాకాంక్షలు చెప్పడానికా?
హార్థిక జన్మదిన శుభాకాంక్షలు రాజ్ కుమార్ గారూ! మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
టైటిల్ కేకో కేక, అదిరిపోయింది.
లాస్ట్ పిక్ ఎక్కడ పట్టావు యాండీ.. :))
>>బ్లాకాసవాణి బోంబే లో బ్రేవుమంది<<
హ హ హ హ... పడి పడి నవ్విన్గ్స్ బాబూ... :))
రాజ్ కి జన్మదిన శుభాకాంక్షలు :))
రాజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.., may god bless you with peace and happiness.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.....
ముందా టికెట్ పట్టి పట్టి చూసీ అందులో ఏముందా? అని బుర్రగోక్కున్నా.. తర్వాత వెలిగిందీ... వెలుగుతూనే ఉంది నా ఫేస్...
కనెక్టింగ్ ఫ్లైట్ కేకః కానీ అలా ఇంజన్ లేని ఫ్లైట్ లని లాక్కెళుతున్నామో, మోసుకెళుతున్నామో తెలీని స్టేజ్ లో అవసరం అంటావా? హ్హిహిహిహి
థాంక్యూ సో మచ్ హరే.... ;) ;) ;)
రసజ్ఞ గారూ, ఫోటానూ.. ధన్యవాదాలు ః)
రాజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
అసలు ఆ టైటిల్ ఏంటి..నువ్వు వ్రాసిన పోస్టు ఏంటి? బాబోయ్!
ఎవరో చేసిన పునుగులకు వేరెవరో బలి అయినట్టు..హ.హ.హ.:).
Too good Andy!
రాజ్ కి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే..రాజ్.
హరే కృష్ణ .. ఇన్ని విషయాలని మిక్స్ చేసి.. గాల్లో తేలినట్లు అనిపించారు. చాలా బాగుంది.ఇలియానా స్కర్ట్ ఏమో కాని మీ స్టయిల్ కి వందనం.
ఇప్పుడే మిమ్మల్ని తలచుకున్నాను. శ్రీనివాస ధియేటర్ ని ఇప్పుడే మన బ్లాగర్ ఒకరు వీక్షించారు.వెంకట కృష్ణ వెనకకి వచ్చారు. హ్యాపీ టు అల్.
రాజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు.
కనెక్టింగ్ ఫ్లైట్ అతి త్వరలో దొరుకుతుందని ఆశిద్దాం.
ఆ టైటిల్ ఏమిటి నాయనా, పరిగెట్టుకు వచ్చాను ఆన్ ది డబల్. ఏ స్కూల్ లో చదివారు? నేను కూడా వెళ్ళి జేరుతాను.
రసజ్ఞ గారూ గమనిస్తున్నాను. గమనిస్తున్నాను...దహా.
correct way to wish raj, absolutely hilarious.
రెండు సార్లు చదివాను అబ్బాయ్.. ఈ మట్టి బుర్రకి అర్ధం అవ్వటానికి... కి కి కి...
ఏమైనా టపా కేక... రాజ్ కి త్వరలో connecting flight దొరకాలి అని కోరుకుంటూ.. happy happy birthday Raj.. may you live long
వృక్షో రక్షిత....... హహాహ్ అసలు పోస్టేంటో అర్థం కాలేదు టైటిల్ చూస్తే... స్కర్ట్ ఎంటో? ఇలియానా ఎంటో? నిత్యా ఎంటో? ఎంటో ఇది మనకు సంబంధించి కాదులే అనుకున్నా మొదటి సారి... చదువుతుంటే పాపం రెన్యువల్ తిప్పలు అనుకున్నా రెండో సారి.. హ డేట్ చూసిన తరువాత వెలిగింది స్కర్ట్, ఇలియాన, నిత్యా ల కలవరింపు మంత్రాలు.... ఇలా కూడా చెప్పొచ్చన్నమాట పుట్టినరోజు శుభాకాంక్షలు... రాజ్ గారు నిత్య పుట్టినరోజు శుభాకంక్షలు.. ;))
మువ్వ గారూ, వనజవనమాలి గారూ, గురువు గారూ, ఫణీంద్ర గారూ,రాజెంద్రా, రమణి గారూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
హ హ హ హ :):):) రాజ్ గారికి హృదయ పూర్వక జన్మదిన "సుభా" కాంక్షలండీ.
రసజ్ఞ గారు, జరిగేది జరగక మానదు అని మనం చెప్పుకొని
దేవుడు చేసిన మనుషులు అని ఫిక్స్ అయి ఇలియినా ని 70 MM స్క్రీన్ లో చూసేయడమే
థాంక్యూ!
హర్షా :))))
కింగ్ ఫిషర్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం లో భాగం గా దొరికిన ఫోటో అది :P
టైటిల్ పన్నెండు అవుతుంది అన్న హాడావుడి లో రాసేసా
థాంక్యూ :)
గిరీష్ గారు థాంక్స్!
రాజ్ hope you had a splendid day :)
సిరి సిరి మువ్వ గారు
పోస్ట్ రాసాక టైటిల్ అలా పెట్టేయాల్సి వచ్చింది
అల్లం పచ్చడి తో గుంట పునుగుల అభిమానులు వర్ధిల్లాలి!
థాంక్యూ :)
వనజవనమాలి గారు,
శుక్రవారం విజయవాడ కానూరు పోరంకి చాలు సినిమాలు చూస్తూ ఆదివారం రాత్రి హాస్టల్ కి చేరేవాళ్ళం
రేపు ఈగ సినిమా ఏ థియేటర్ కి ఇచ్చారు రిలీజ్ ?
గురూజీ
మీ సంతోషం కోసం ఆనందం కోసం ఆ టైటిల్ పెట్టాలనుకున్నా
రసజ్ఞ గారు మీరు పెట్టాల్సిన ద.హా పెట్టేసారు!
ధన్యవాదాలు :)
ఫణీంద్ర గారు థాంక్యూ వెరీ మచ్!
రాజేంద్ర :D
అందరి అభిలాష అదే
థాంక్స్ :)
రమణి గారు థాంక్యూ :))
ఎందుకు ఇంత ఆలశ్యం గా స్పందిస్తున్నానో అర్ధం అయ్యే ఉంటుంది మీకు...
ఈ పోస్ట్ చదవడం మొదలెట్టగానే మొదటి లైన్ చదవగానే హు , హు, ఇంతలేసి మాటలా అనుకుని, మూసేసాను.
మళ్ళి, అసలేమి రాసుంటారా అని మళ్ళి ఒక 5 గంటల తరువాత కోపం చల్లారి మళ్ళి చూసాను. రెండో లైన్ కూడా చదివాను. ఊహు.. అసలు చదవనే చదవను అని మూసేసి , మళ్ళి ఇంకో 5 గంటల తరువాత, పాపం తప్పులు మానవుల కాక, దేవతలు చేస్తారా అని ఆనిపించి క్షమించి చదివాను. ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు మొదటి సారి చదివినాప్పుడు. ఎదో "Amazing mom" అన్నది మాత్రం అర్ధం అయ్యింది..
మళ్ళీ అందరిని అర్ధం చేసుకునే మనసు నాది కాబట్టి మళ్ళీ చదివాను. సరే అసలు ఈసారి నా మేదస్సు కి పరీక్ష పెడదామని. సునకం, అమ్మాయి, పరుగు అర్ధం అయ్యినట్టే ఉండి అర్ధం కాలేదా అన్న సందిగ్దం.. ఇంతలో "పాస్" అన్న పదం మీద ఒక అద్బుతమైన మైన పాటను స్రుష్టించిన మీ ప్రతిభను గుర్తించి, మనసులో మెచ్చుకున్నా.. ఇంతలోనే, railway పాస్ అన్నారు... ఇనక్ బుర్ర 360 degrees తిరిగిపోయింది. కాఫీ, కాఫీ అని ఎవరో అరిచినట్లనిపిస్తే వెళ్ళి కాఫీ తాగి సరే మిగతా టపా కూడా చదువుదాము అనుకున్నాను. తెలుసు నా ప్రాణానికి హాని ఉంటుందని, కాని నాకు insurance ఉంది కదా అన్న ఒకే ఒక ధైర్యం తో చదవడం కొనసాగించాను. ఇంతలో స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పారు. పొన్లే పాపం, మంచి వారిలాగే ఉన్నారనుకుని మిమ్మల్ని , మీ టపా ని మెచ్చుకుంటున్నాను. Good Job! As usual the post is hilarious!
Happy Birthday to Raaj gaaru.
హప్ప్య్ భిర్థ్దయ్ తొ ఋఆజ్ గారు.
అసలా టైటిల్ ఏంటీ.. కనెక్టింగ్ ఫ్లైట్ ఫోటో ఏంటీ.. టూ మచ్.. :)))))))
Happy Birthday to Raj! :)
Happy birthday to Raj !!
Hare...eppudaina maa ramakrishna, durgamahal lo cinemalu chusava. kathi dts affects le.
"కాలానికి అతీతం గా దు:ఖo వచ్చినప్పుడు నీ తోడు నిలిచేవాడే స్నేహితుడు అని బ్లాకాసవాణి బోంబే లో బ్రేవుమంది."
:)))) ఇలాంటివి మీరే రాయగలరు!
టైటిల్ భలే ఉంది...
రాజ్, ఈ 5/7 తేదీ శతదినోత్సం జరుపుకోవాలని కోరుకుంటూ... పుట్టినరోజు శుభాకాంక్షలు :-)
పోస్ట్ అదుర్స్ అబ్బాయ్.. కనెక్టింగ్ ఫ్లైట్ కి నువ్విచ్చిన డెఫినిషిన్ కెవ్వు :)
రాజ్ కి ఓరోజు ఆలశ్యంగా బ్లాగ్ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు :)
జలతారు వెన్నెల గారు కెవ్వ్!!!
ప్రొద్దున్న మైల్ చూసి నా కామెంట్ బాక్స్ లో పోస్ట్ వేసిన మొదటి వ్యక్తి ఎవరు అని మీ కామెంట్ చదివి ఊపిరి పీల్చుకున్నాను
అప్పటివరకు మంచినీళ్ళు కూడా తాగలేదు.
>>తెలుసు నా ప్రాణానికి హాని ఉంటుందని, కాని నాకు insurance ఉంది కదా అన్న ఒకే ఒక ధైర్యం తో చదవడం కొనసాగించాను
ROFL
మీ అభిమానానికి ధన్యవాదాలు :)
మధుర :))
టైటిల్ లో టపా లో కనెక్షన్ ఉన్నట్టు గానే ఆ రెండు ఫ్లైట్లను కనెక్ట్ చేసాను :)
థాంక్యూ :P
వినీల గారు,
హా జానీ అను చిత్ర రాజాం చూసాక నాకు రెండింటి ఎఫెక్ట్ కి నాకు వారం రోజులు నిద్ర రాలేదండి
ఆ దుర్గా మహల్ లో శివరామరాజు అనే భయంకర చిత్రమును చూడడం జరిగింది
థాంక్యూ :)
నిషి గారు :D :D
థాంక్యూ :))
వేణు గారు థాంక్యూ వెరీ మచ్ :))
హ...హ...అండి
కెవ్వ్ కేక.
రాజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
raj, happy birthday to you..
Devdaaa emi ee raatals? maaku navvi navvi buggalu neppi puttings!! bombay lo akasavani brev mandaa????? gunturlo gongali purugu gurrumanaleduuuu :PPPPPP hahaha!!
Belated happy bday raj :)
Post a Comment