Pages

Saturday, March 2, 2013

The Attacks of 26/11
 

ఈ సినిమా చూస్తే ఒరిగేదేంటి ?
సినిమా చూడడం వలన ఫాంటసీ లను స్క్రీన్ మీద చూడడమే తప్ప. గ్రౌండ్ రియాలిటీ చూపించడం చాలా అరుదు.

  
ఒసామా బిన్ లాడెన్ ని ఎలా చంపారో జీరో డార్క్ థర్టీ అనే సినిమా గత నెల రిలీజ్ అవడం ఆస్కార్ కి నామినేట్ అన్నీ జరిగి వెళ్ళిపోయాయి.

9/11 తర్వాత  దానికంటే  ప్రపంచంలో భయంకరమైన దారుణాలు కళ్ళముందే జరుగుతున్నా అది మర్చిపోయేలోపే మళ్ళీ అమాయక ప్రజలు బలైపోతున్నారు.

Joint police commissioner అయిన నానా పటేకర్ Inquiry Commission కి 26/11 నాడు జరిగిన సంఘటనలు వివరిస్తుండడం తో సినిమా స్టార్ట్ అవుతుంది

                           

కాజువల్ గా ముంబై రోడ్లపై నడుస్తూ  AK-47 లు పట్టుకొని  అరవై గంటల పాటు సాగిన మారణ కాండ లో చనిపోయిన నూట అరవై మంది గాయపడిన వందల మంది మరెన్నో విషయాలను గుర్తుచేసుకుంటాడు.

తాజ్ మహల్ హొటల్ సెట్ as it is గా వేసిన ఆర్ట్ డైరెక్టర్,సినిమాటోగ్రఫీ తో పాటు సౌండ్ సినిమాకి ఎంత ముఖ్యమో వర్మ చెప్పకనే చెబుతాడు.

ముఖ్యంగా తాజ్ హోటల్ లో విదేశీయులను హోటల్ స్టాఫ్ అందరినీ చంపేసే దృశ్యం కిరాతకంగా ఉన్నా అక్కడ  చిన్న పిల్లలని చంపడం కూడా చూపిస్తాడా అని అనుమానం వచ్చింది.అక్కడ అది సౌండ్ ద్వారా మేనేజ్ చేయడం కాస్త రిలీఫ్.

తాగడానికి నీళ్ళు ఇచ్చిన గుడిసె లో ఉండే వ్యక్తి  ని కూడా కసబ్ చంపేయడం లాంటి సన్నివేశాలు ఇంకా బాధను కలిగిస్తాయి    

వర్మ ఈ సినిమాని అలా వదిలేయకుండా ఇన్ సైట్ లోనికి వెళ్లి ఉంటే ఇంకా బావుండేది అని ఎవరో అన్నారు
ఇన్సైట్ లోనికి వెళ్ళడానికి TRP చానల్ ఓనర్/రిపోర్టర్ కాదు కదా RGV
ఒక భారతీయుడుగా తను ఈ క్షుణ్ణంగా, చాలా రియలిస్టిక్ గా ఈ సినిమాను తీసిన రామూ అభినందనీయుడు.

లియోపోల్డ్ కేఫ్ లో జరిగిన అటాక్ తర్వాత మన పోలీసులు లాఠీ లు పట్టుకొని టెర్రరిస్ట్ లను పట్టుకోవడానికి రాళ్ళు విసిరే సన్నివేశం  మన సెక్యూరిటీ వ్యవస్థ ను,ప్రజలకు రక్షణ లేమి, మన ఇంటిలిజెన్స్ వైఫల్యాన్ని స్పష్టం గా తెలియచేసాడు.

రెండో సగం లో కసబ్ పైనే కేంద్రీకరించడం, కాల్పుల్ని తగ్గించడం
నానా పటేకర్ కసబ్ మధ్య సీన్స్ అన్నీ కుక్కకాటుకి చెప్పుదెబ్బలా బాగా తీయగలిగాడు

చివర్లో నానా పటేకర్ నీ అంత వయసున్న కొడుకు నాకు ఉన్నాడు అని చెప్పడం
బ్రెయిన్ వాష్ కి మతం యొక్క ఆత్మను కసబ్ కి చెప్పే సన్నివేశం చాలా బావుంది.

ముంబై లో ఈ సంఘటన జరిగినప్పుడు దగ్గరలోనే ఉన్న నేను ఎంత భయాందోలనలకు లోనయ్యానో ఈ సినిమా చూసినప్పుడు అదే భయం కలిగించేలా సినిమా మొత్తం తీసిన రామ్ గోపాల్ వర్మ కి హాట్స్ ఆఫ్!

Bottom Line:
When did the last time you witnessed after movie got ended and the whole Audience claps unconditionally
The Attacks of 26/11-It's not a film,Its the Truth.

Sunday, February 24, 2013

Kai Po Che!Adapted from Best Seller"3 Mistakes of my life"

చేతన్ భగత్ -తన రాతలతోనే కాకుండా చాలా విషయాల్లో వీడంటేనే చాలా చిరాకు
రాక్ ఆన్- సినిమా బావుంది కాకపొతే ఏదో వెలితి

 
కధ ముందే తెలిస్తే సినిమా చూసి ఇంకెందుకు
అందరూ కొత్తవాళ్ళే 
అభిషేక్ కపూర్ తన మీద ఏమీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే

తెలిసిన కధను మళ్ళీ మళ్ళీ స్క్రీన్ మీద చూడడం అవసరమా అసలు
హిట్ కొట్టిన  డైరెక్టర్ రెండో సినిమా అంటే కాపీ కి మరో పేరు అని వినిపిస్తున్న ఈ రోజుల్లో

ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో థియేటర్లో ఎంటర్ అయ్యాక
 

మొదటి షాట్ నుండి టైటిల్స్ వచ్చేవరకు సినిమాటోగ్రఫీ ఇదంతా గుజరాత్ లేక స్పెయిన్ లో ఏమైనా చేసారా అనే విధంగా ఉంది .

The film has its moments through out 

చిన్న చిన్న ఎమోషన్స్ ని అద్భుతంగా capture చేయగలిగాడు దర్శకుడు. దిల్ చాహ్తా హై,
రంగ్ దే బసంతి లో చూసినప్పుడు ఉండే freshness ఈ సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ చాలా చోట్ల ఉంది. 
 
మధ్యలో పవర్ కట్ అయ్యాక ఒక పది హేను నిమిషాలు రివైండ్ చేసి వేసాడు.
అంత గా లేదు. ఒకసారి చూడడమే బెటర్ అనిపించింది 

                                                                

సినిమా లో అందరూ బాగానే చేసారు అందరిలో సుశాంగ్ సింగ్ బాగా చేసాడు. 

              

హీరోయిన్
ని ఇంకొంచెం సేపు చూపిస్తే బావుండేది. 

communal riots మొదలయినప్పటి నుండి సినిమా లో ఫీల్ మిస్ అయ్యి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది.


ఇంట సెన్సిటివ్ విషయాలపై అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదనిపించింది.కాకపొతే దర్శకుడు మరో బాన్ అవ్వకుండా
తెలివిగా జాగ్రత్త పడ్డాడు

మధ్యలో గుజరాతీ లో వచ్చే డైలాగులు పంటి కింద రాయిలా
అనిపించినా
 
ఇన్ని కధలు/సినిమాల నుండి ఇన్స్పైర్ అయినప్పటికీ సబ్జెక్ట్ ని హాండిల్ చేయడం లో దర్శకుడు చాలా వరకు సఫలీకృతం అయ్యాడనే చెప్పాలి 

కాయ్ పోచే : మస్ట్ వాచే!

Monday, February 11, 2013

తెలుగు సినిమాను ఆస్వాదించడం ఎలా ?
వివరంగా వెళ్ళే ముందు చెక్ చేసుకుందాం 


తెలుగు సినిమా ప్రేక్షకుడి 
చెక్ లిస్టు   


భయంకరమైన  ఓపిక
టన్నులకొద్దీ  ఓర్పు 
అభేద్యమైన జగన్ ఓదార్పు

ఫ్లాష్ బాక్ లుండే సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో కి ఉండేంత సహనం
కరుణ,క్షమాగుణం,దయ లాంటి లక్షణాలు ఏవైనా (ఆప్షనల్)

 

పడ్డ చోటే లేవడం,పోయిన చోటే వెతుక్కోవడం ఆలవాటు అనే వేటు పడ్డ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం అదే చేస్తున్నారు.


బాబుల కుట్రకు లొంగిపోయిన తెలుగు ప్రేక్షక రాజులు, రాజశేఖర్ సినిమాను సైతం వదలకుండా యుద్ధ ప్రాతిపదకన దీపికా పదుకునే ని చూసినంత ఆత్రం గా చూస్తున్నారు.

కంటెంట్ కి అతీతం గా పెద్ద పెద్ద పోస్టులు ఓపిగ్గా చదివి కామెంట్లు రాయడానికి మరోసారి వెతుక్కొని మళ్ళీ చదివే తెలుగు బ్లాగర్లు కొంతవరకు తట్టుకోగలరేమో కానీ

సామాన్య ప్రజల పరిస్థితి మన్యం అడవులే!


నరకానికి నాలుగు అడుగులు అంటే
స్క్రీన్ ముందు కూర్చోబెట్టడమే అని నలభై కోట్లు బడ్జెట్ సాక్షిగా  నమ్మిన స్టార్ హీరోలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.

అధినాయకులు,మహారధి ల ఆగడాలు  ఆగవా అని ప్రశ్నిస్తున్న ప్రేక్షకుడికి గుండె మీద చెయ్యి వేసుకొని గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే

బ్లాగు ఓపెన్ చేయడానికి గూగుల్ అకౌంట్ ఎంత అవసరమో యువరత్న అభిమానికి నవరత్న ఆయిల్ కూడా అంతే అవసరం.
 

ఎందుకొచ్చిన తలనొప్పి చూడడం మానేస్తే పోలా అని అనుకుంటే
తలనొప్పికోసం మహేష్ బాబే నివారణ చెబుతున్నప్పుడు మనమెందుకు వెనుకంజ వేయడం.

తెలుగు సినిమా హీరోలకి ఫ్లాపులు లేకపోడం మలయాళీ అమ్మాయి ఒంటి మీద బంగారం లేనంత మహాపాపం. మున్నప్పరం విక్టరీ వెంకటేష్ మీదొట్టు 


మరి తెలుగు సినిమాలు వారవా,దీనిని  మార్చేవారు లేరా అని అడిగితే
గుమ్మడి తో ఉమ్మడి కుటుంబ కదా చిత్రాల శకం ముగిసింది. 
కొంగెర జగ్గయ్య లాంటి మహా మహుల కంచు కంఠాలు పోయి మంచు లాక్స్మీ ప్రసాన్స్  వచ్చాయి.


దాసరి నారాయణ రావు,బీ గోపాల్ లాంటి మహానుభావులు సినిమాలు ప్రస్తుతం తీయకపోవడం ప్రేక్షకులకు అనుకోని వరం అనిపించినా

అదే క్షణం లో ఆ ఆశను OAK ఓంకార్ లు సమూలంగా నిర్మూలించిన ఈ జీనియస్ చిన్ని కృష్ణలకు శివశంకర్ మాస్టర్ సాక్షిగా  ఇవే మా ధనరాజ్ దండాలు.


సొల్యూషన్ చెప్పకుండా
ఈ అంతా ఎందుకు అంటారా అక్కడికే వస్తున్నా వీలయితే మిర్చి చూద్దాం డూడ్, పోయేదేముంది మహా అయితే తలనొప్పి కి జండూబామ్ కొనుక్కుందాం!

ఇదే డైలాగ్ ప్రతీ సినిమాకి రిపీట్ అయితే బాగుండదని


సెంటిమెంట్,క్లైమాక్స్,కామెడీ నవరసాల్లోనూ ఈ రెండింటికీ పనికల్పించాలని ఘాట్టిగా ఫిక్స్ అయ్యా!


కాబట్టి కామ్రేడ్స్,టికెట్ కొనుక్కొని థియేటర్ లోనికి
విజిల్ తో వెళ్లి
విజయమో లేక విజయకాంత్ సినిమానో మీరే తేల్చుకోండి!Saturday, February 2, 2013

విశ్వరూపం

రిలీజ్ అవ్వడానికి ముందు ఇంత జరిగాక ఎలాగయితేనేం ఏమీ కత్తిరించకుండా ముంబై లో మొదటిసారి ప్రదర్శితం అవుతున్న హిందీ వెర్షన్ చూసే భాగ్యం దక్కింది.

కమర్షియల్ సినిమా కి ప్రయోగాత్మక సినిమాకి ఉండే తేడా edge of the కమల్ స్పర్శ వల్లనేమో స్పెషల్ గా అనిపించింది.

Body of Lies,నోలన్ సినిమాల్లో ఉండే కొద్ది పాటి ఎలెమెంట్స్ అక్కడక్కడ ఉన్నా Visual గా చాలా చోట్ల అద్భుతంగా ఉంది.

మొదట్లో ఆ డిటెక్టివ్ ని ఎందుకు పెట్టారో అంత ఫూలిష్ గా సినిమా మొదలయ్యింది ఏమిటి అని పదిహేను నిమిషాలు చూసిన తర్వాత ఆ డిటెక్టివ్ కధకు  ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది.

సినిమాటోగ్రఫీ John Verghese హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది Full credits to him.most importantly  ఆఫ్గాన్ లో జరిగే ఆల్ ఖైదా బాక్ డ్రాప్ లో సీన్స్ అన్నీ చాలా బాగా తీయగలిగాడు (direction+visually)

పేరుకే కమల్ హీరో అయినా రాహుల్ బోస్ సినిమా అంతా డామినేట్ చేయడం ఇంకా బావుంది.

సెకండ్ ఆఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ మినహాయిస్తే abrupt ending విశ్వరూపం-2 కోసం చేయకతప్పలేదనిపించింది.

కమల్ హాసన్ ప్రయత్నానికి మార్కులు వేయడం అటుంచితే
ఒక సినిమా కోసం తను పడే తపన,versatile గా ఈ సినిమా చూసొచ్చాక ఉండే ఫీల్ just Awesome!


Don't Miss It!                          

                                     
Monday, December 31, 2012

బ్లాగోపాఖ్యానం!మరీన్ డ్రైవ్ లో మొన్న నేను నా మిత్రుడు నడచి వెళ్తుంటే    కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక వాడు సడెన్ గా నా వైపు తిరిగి..


నీకొక విషయం చెప్పాలి అని సతాయిస్తూ చెప్పాలా వద్దా అని సంసయిస్తూ రూం కి వచ్చాక తన నోరు విప్పాడు!
 

మొన్న నా రిసర్చ్ మానేసి ఎందుకో నెట్వర్కింగ్ సైట్ లో సోధిస్తుంటే నా బ్లాగులో కామెంట్లు పెట్టే అమ్మాయి ప్రొఫైల్ పేజ్ కనిపించింది రా

నేను:అయితే ?

వాడు:కాకపొతే డిస్ప్లే చిత్రములో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు


ఇంతకీ వారిద్దరిలో ఆ అమ్మాయి ఎవరో తెలియక నాకు తలనొప్పి పెరిగిపోతోంది అని బుర్ర గోక్కొని నన్ను అడిగాడు "నీకేమైనా ఐడియా ఉందా" ?
వెంటనే నా వాలెట్ లో ఉన్న ఐడియా సిమ్ తీసి వాడి చేతిలో పెట్టాను పండగ చేస్కో అని.

వాడు:ఇంత  సీరియస్ గా నేను మధనపడుతుంటే నువ్వు కామిడీస్  చేస్తున్నావ్ అందుకే నేను నీతో ఏం మాట్లాడను 


నేను: అరే భూస్కే, వారిద్దరిలో ఎవరు అందంగా కనిపిస్తే వారే ఆ ప్రొఫైల్ పేజ్ కి ఓనర్ అని 20th సెంచరీ ఫాక్స్ నిజాన్ని చెప్పి వాడి కడుపు మంట ని చల్లార్చి లాపీ లో ఉన్న  ఫైర్ ఫాక్స్ ని మూసాక   


బయటకు వెళ్లి భోజనం చేసేసి వచ్చి మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేశా 


ఒక మనిషి ఎందుకు హర్ట్ అవుతాడో ఎవ్వరూ చెప్పలేరు

చివరకి ఏ కామెంట్ ఎవరికి ఎలా గుచ్చుకుంటుందో గుచ్చుకున్నోడికే తప్ప గిచ్చినోడికి ఆబాధ తెలియదని బల్గేరియా బడి పాఠం లో రాసి ఉందని బ్లాగర్లకు తెలియదు 

ఈ విషయం నేను తెలుసుకొనే లోపే
ప్లస్సుల్లో బ్లాగుల్లో భయంకరమైన బ్రేకు పర్వం మొదలయ్యింది 


Knock out  రౌండ్ లో ఆడుతున్నట్టు ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతున్నారు దీని పైన నీ స్పందన ఏమిటి అని మరుసటి రోజు మిత్రుడు ఫోన్లో అడిగాడు


బ్లాగు బ్రేక్స్ అనగానే

అరే ఏమిటండీ ఎందుకులెండి అని 
నేను బ్లాగుముఖంగా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏమిటంటే

బ్రేక్ అంటే ఏమిటి రీ-ఎంట్రీ అంటే ఏమిటి బ్రేక్ ఇవ్వాలంటే ఇన్ని పోస్టులు వేయాలి
రీ ఎంట్రీ అంటే ఇన్నిరోజులు ఆగాలి అని ఒక పుస్తకం రాసి దాన్ని అచ్చు వేసి
బ్రేక్ ఇవ్వడానికి ఈ లక్షణాలు ఉండాలి రీ ఎంట్రీ కోసం ఇలా సిద్ధమవ్వాలి అని ఉండాలి

బ్లాగు ప్రపంచం లో ఈ మధ్యనే merry break అనే పదం తెగ వినిపిస్తోంది!


నిత్యం సన్నిహితో బ్రేకు:
కర్తవ్యో ఫాస్టో పోస్ట:

బ్లాగు ఎప్పుడూ దగ్గరే ఉంటుంది
దూరం చేసుకోకూడదు అంటే ఎప్పుడూ పోస్టుతూనే ఉండాలి!

అని నేను ముగించే ముందు బ్రేక్ ఇస్తున్న వాళ్ళందరికీ నేను కూడా ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దామని అనుకుంటున్నాను 

ఈ బ్రేక్ పర్వాన్ని పురస్కరించుకొని నా తరపున మీరు ఈ ఫెడల్  స్వీకరించండి.


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ కొత్త సంవత్సరం
లో అయినా మీకు ప్రొద్దున్న పాలు,పేపర్ వగైరా టైమ్ కి తీసుకురావాలని కోరుకుంటున్నా    

ఈ కొత్త సంవత్సరానికి మీ resolutions ఏమిటి అనే డాష్ డాష్ ప్రశ్నలకు ఇదే నా సమాధానం
1024x768

Saturday, December 15, 2012

హాబిట్ జర్నీలో ఎటో జారిపోయింది పర్సు!వారం లో అయిదు రోజులు రాత్రనక పగలనక ఆఫీస్ లో కుమ్మించుకొని వీకెండ్ మీద గంపెడు ఆశలతో శుక్రవారం రాత్రే మల్టీ ప్లెక్స్ లో అడుగుపెడితే

The Hobbit: An Unexpected Journey సినిమాకి పీటర్ జాక్సన్ బ్రాండ్ మీద కాన్ఫిడెన్స్ తో
క్రెడిట్ కార్డ్ తో స్వై'పే'సాక 3D గ్లాసెస్ తీసుకొని సీట్లో కూర్చున్నా

సినిమాటోగ్రఫీ అబ్బుర పరిచినా LOTR లో వాడిన మొత్తం అవే సెట్స్ మరియు లోకేషన్స్ ఆల్మోస్ట్ అవే కావడం తో తెరపై చూసిన ఫేవరేట్ హీరోయిన్ ని డైరెక్ట్ గా చూసినట్టు అనిపిస్తుంది.

3D ఫీల్ మాత్రం చాలా బాగుంది.

సినిమాని అంత సేపు ఎందుకు సాగతీసాడో అర్ధం కాలేదు visual గా ప్రతీ సీన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ లో శ్రద్ధ తీసుకోలేదనిపించింది

చాలా చోట్ల చూసిందే చూసినట్టు అనిపించినా LOTR లా ఉంటుంది అని అంచనాలు పెట్టుకొని వెళితే సినిమా ఖచ్చితంగా నిరాశ పరుస్తుంది.

రాత్రి సినిమా చూసేసి మూడింటికి రూమ్ కి వచ్చి ఆరుగంటలు తిరగ కుండానే మళ్ళీ సినిమా చూడడానికి అదే మల్తీప్లెక్స్ జంప్ వేసి

మా అభిమాన నటి,అందాల తార, అభినయన కేక,చీరకే అందాన్ని తెచ్చి ప్రేక్షక హృదయాలను ఉతికి ఆరేసిన సమంతా సినిమాకి వెళ్ళిపోయాం

                                     


                                                

యూత్ ఫుల్ సినిమా హౌస్ ఫుల్ అయితే ఎంత సందడిగా  ఉంటుందో అంతే రచ్చలమైన వాతావరణం ఆవహించింది..

సమంతా ఇంట్రో సీన్ ఒక స్టేజ్ పై గ్రూప్ సాంగ్ పెర్ఫార్మ్ చేయడం
నేను కేకలేద్దామని సినిమాకి వస్తే మిగతా వాళ్ళు నా ముందే
నాకంటే ముందే నా సమంతా కోసం అరాచకపు అరుపులు మొదలెట్టారు

కేకలు సినిమా అంతా వినిపించాయంటే సమంతా ఎంత బాగా చేసిందో అర్ధం చేసుకోవచ్చు

నిత్య వరుణ్ తప్ప నాని సమంతా సినిమాలో కనిపించలేదు పెర్ఫార్మెన్స్ దర్సకత్వం అంతే బావున్నాయి

దర్శకుడు ప్రేక్షకుడి కోసం ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అని అనుకున్నాడేమో మరి ఇక్కడ మాత్రం ఆ సీన్స్ ని అరుపులు కామెంట్లతో కామెడీ చేసి పడేసాం


                                   మచ్చుకి మూడు సీన్లు

ప్రొద్దున్న పెళ్లి పెట్టుకొని రాత్రి నాని తండ్రి నాని కి జరిగే సంభాషణలో 

తండ్రి:రాధిక కి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు.నువ్వు చేస్తున్నది తప్పు అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావ్? దీనికి పరిష్కారం ఏంటి 
ఫ్రంట్ సీట్లో కూర్చున్నోడు గట్టిగా :రాధిక ని నేను చూసుకుంటాను నిత్య ని నువ్వు చేసుకో 


సినిమా అయిపోయే పదినిమిషాల ముందు నాని సమంతా చేసే చుంబనో ఛెండాలుడో చీల్చుడు ని చూడలేక
నేను:పట్టపగలు పాచినోరు తో ఈ పాచి పరాకాష్ట అవసరమా మీకు

మూడో సీన్
నాని:అసలెందుకొచ్చావ్ 
మా కొలీగ్: సమంతా వాడి ని  బతిమిలాడేదేంటి,అసలు ఈ ఏడుపు ఏంటి నీకు నేనున్నా పదా!   


ఈ సినిమా చూసాక జండూ బామ్ కాదు కానీ సమంతా మీద బోలెడు జాలేసింది!

మనం తెలుగు వెర్షనే చూసాము
తమిళ్ లో జీవా తో కూడా ఇవే సీన్లు చేసిందే రిపీట్ చేసి పాపం ఆ స్కిన్ ప్రోబ్లం సమంతా కి ఎందుకొచ్చిందో ఈ సినిమా చూసాక కానీ నాకు అర్ధం కాలేదు

గౌతం మీనన్ దే తప్పంతా అనిపించింది.
ఎస్టాబ్లిష్ అవని హీరో  నాగచైతన్యతోనే 
సమంతాతో అంత చేయించాడంటే

నాని తో ఎస్టాబ్లిష్ అయిన సక్సెస్ ఫార్ములా తో సమంతా తో
తన పర్స్పెక్టివ్ లో పండగ చేయించడం లో తప్పులేదు అనిపించి ఉండదు.    

సినిమా బాటమ్ లైన్:
న స్మూచో న సమంతా గౌతమ్ వాసుదేవ మీననః 


                         

Wednesday, November 28, 2012

నవ లబుక్యోఈ మధ్యనే  ఆఫీస్ నుండి రూమ్ కి  ట్రైన్ లో వెళ్తుంటే ఇనుప ఊచ చిన్నది  చొక్కాకి తగిలి హాండ్స్ దగ్గర చిరిగిపోయింది.

కొత్త చొక్కా కొనుక్కుందామని షో రూమ్ వైపు వెళ్ళాను
చలికాలం లో బట్టల షాపు వాడు వేసిన   AC కి నాకు చిరాకొచ్చి ఒక సూక్తి నా నోట్లో నుండి వచ్చింది
"చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో" అని
వెంటనే బుక్ స్టోర్ వైపు పరుగులు తీశానుఅలా ముంబై ఫేమస్ అయిన బుక్స్ దొరికే ఏరియా లోకి ప్రవేశించాను

                                  

న్యూ అరైవల్స్ చూపించు అని అడిగితే ఇష్టమొచ్చిన నవల్స్ అన్నీ చూపించాడు
ఇది బావుంటుంది సార్  ఇది చూడండి  సార్  థ్రిల్లర్,బెస్ట్ సెల్లర్ అని ప్రాసలతో పిచ్చెక్కించాక 
ఒక అరగంట గడిచాక నాకొద్దు నాకేమీ నచ్చలేదు అని చెప్పినా ఏంటి కొనకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ అరగంట నా శ్రమ వృధా అని తిరిగి గొడవ పెట్టుకున్నాడు

 నాకు ఇష్టంలేదు ఆల్రడీ చదివేసినవే ఉన్నాయి అని చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు
కొను  కొను అని మరో పది నిమిషాలు అరిచాడు

నా సహనం లిమిట్ క్రాస్ అయ్యి పిచ్చి పీక్స్ కి  shift అయిపోయింది

వీడెవడురా బాబు డిస్ట్రిబ్యూటర్ లు దొరకని ఢమరుకం ప్రొడ్యూసర్ లా నా వెంట పడుతున్నాడు ఏం చెయ్యనురా దేవుడా అని రెండు నిమషాలు ఆలోచించాను

అదే టైం  లో తెలుగు బ్లాగులు పోస్ట్ కి ఎవరో మహనీయుడు నా పాలిట  దేవుడు లా  కామెంట్ పెట్టారు.
తెలుగు బ్లాగులు ముంబై బ్లాగర్లు అని మెదడు లో  ఒక ఫ్లాష్ మెరిసింది,ఆ ఫ్లాష్ లైట్ నేరుగా 

వెను వెంటనే
నేను:I'm searching for the one which  my friend had recommended
షాప్ కీపర్:ఏంటా నవల్  ?
నేను: మా గూరూజీ  రాఘవేంద్ర రావు కొత్త హీరోయిన్ ది అంటే బాగుండదని
Wind rains of Moon Light (తెలుగు లొ తర్జుమా చేసుకొనుము)
షాప్ కీపర్:ఆథర్ ఎవరు
నేను:రాబిన్ శర్మ 

                                

షాప్ కీపర్:అది లేదండీ సారీ, వేరే ఏదైనా తీసుకోవచ్చుకదా
మళ్ళీ నేను ఆలోచనలో పడ్డా

కొద్ది క్షణాల్లో 
I need "The Guava tree in our backyard" అని అనేసరికి వాడు రెండు వరుస బాలయ్య సినిమాలు చూసిన ప్రేక్షకుడిలా నీరసించిపోయి లేదు సార్  అని జాలిగా అన్నాడు

వాడి మైండ్ బ్లాక్ అయిపోవడం తో
నాకు వచ్చేవారానికి ఈ రెండు పుస్తకాలు కావాలి
ఎందుకంటే  ఖచ్చితంగా ఈ నెలాఖరకు వాటిని చదివితే కాని నిద్ర పట్టదు 
అని చెప్పేసి  జంప్ అయిపోయాను అక్కడ నుండి రాఘవేంద్ర రావు కి మనసు లోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ!