వివరంగా వెళ్ళే ముందు చెక్ చేసుకుందాం
తెలుగు సినిమా ప్రేక్షకుడి చెక్ లిస్టు
భయంకరమైన ఓపిక ✓
టన్నులకొద్దీ ఓర్పు ✓
అభేద్యమైన జగన్ ఓదార్పు ✓
ఫ్లాష్ బాక్ లుండే సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో కి ఉండేంత సహనం ✓
కరుణ,క్షమాగుణం,దయ లాంటి లక్షణాలు ఏవైనా (ఆప్షనల్) ✓
పడ్డ చోటే లేవడం,పోయిన చోటే వెతుక్కోవడం ఆలవాటు అనే వేటు పడ్డ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం అదే చేస్తున్నారు.
బాబుల కుట్రకు లొంగిపోయిన తెలుగు ప్రేక్షక రాజులు, రాజశేఖర్ సినిమాను సైతం వదలకుండా యుద్ధ ప్రాతిపదకన దీపికా పదుకునే ని చూసినంత ఆత్రం గా చూస్తున్నారు.
కంటెంట్ కి అతీతం గా పెద్ద పెద్ద పోస్టులు ఓపిగ్గా చదివి కామెంట్లు రాయడానికి మరోసారి వెతుక్కొని మళ్ళీ చదివే తెలుగు బ్లాగర్లు కొంతవరకు తట్టుకోగలరేమో కానీ
సామాన్య ప్రజల పరిస్థితి మన్యం అడవులే!
నరకానికి నాలుగు అడుగులు అంటే స్క్రీన్ ముందు కూర్చోబెట్టడమే అని నలభై కోట్లు బడ్జెట్ సాక్షిగా నమ్మిన స్టార్ హీరోలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
అధినాయకులు,మహారధి ల ఆగడాలు ఆగవా అని ప్రశ్నిస్తున్న ప్రేక్షకుడికి గుండె మీద చెయ్యి వేసుకొని గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే
బ్లాగు ఓపెన్ చేయడానికి గూగుల్ అకౌంట్ ఎంత అవసరమో యువరత్న అభిమానికి నవరత్న ఆయిల్ కూడా అంతే అవసరం.
ఎందుకొచ్చిన తలనొప్పి చూడడం మానేస్తే పోలా అని అనుకుంటే
తలనొప్పికోసం మహేష్ బాబే నివారణ చెబుతున్నప్పుడు మనమెందుకు వెనుకంజ వేయడం.
తెలుగు సినిమా హీరోలకి ఫ్లాపులు లేకపోడం మలయాళీ అమ్మాయి ఒంటి మీద బంగారం లేనంత మహాపాపం. మున్నప్పరం విక్టరీ వెంకటేష్ మీదొట్టు
మరి తెలుగు సినిమాలు వారవా,దీనిని మార్చేవారు లేరా అని అడిగితే
గుమ్మడి తో ఉమ్మడి కుటుంబ కదా చిత్రాల శకం ముగిసింది.
కొంగెర జగ్గయ్య లాంటి మహా మహుల కంచు కంఠాలు పోయి మంచు లాక్స్మీ ప్రసాన్స్ వచ్చాయి.
దాసరి నారాయణ రావు,బీ గోపాల్ లాంటి మహానుభావులు సినిమాలు ప్రస్తుతం తీయకపోవడం ప్రేక్షకులకు అనుకోని వరం అనిపించినా
అదే క్షణం లో ఆ ఆశను OAK ఓంకార్ లు సమూలంగా నిర్మూలించిన ఈ జీనియస్ చిన్ని కృష్ణలకు శివశంకర్ మాస్టర్ సాక్షిగా ఇవే మా ధనరాజ్ దండాలు.
సొల్యూషన్ చెప్పకుండా ఈ అంతా ఎందుకు అంటారా అక్కడికే వస్తున్నా వీలయితే మిర్చి చూద్దాం డూడ్, పోయేదేముంది మహా అయితే తలనొప్పి కి జండూబామ్ కొనుక్కుందాం!
ఇదే డైలాగ్ ప్రతీ సినిమాకి రిపీట్ అయితే బాగుండదని
సెంటిమెంట్,క్లైమాక్స్,కామెడీ నవరసాల్లోనూ ఈ రెండింటికీ పనికల్పించాలని ఘాట్టిగా ఫిక్స్ అయ్యా!
కాబట్టి కామ్రేడ్స్,టికెట్ కొనుక్కొని థియేటర్ లోనికి విజిల్ తో వెళ్లి
విజయమో లేక విజయకాంత్ సినిమానో మీరే తేల్చుకోండి!
24 comments:
wooooow.....
ఇంతకన్నా మంచి రివ్యూ ఎవరూ వ్రాయలేరేమోనని అనిపిస్తోంది.. Thanks మీకు జండూబాం కోనే పరిస్థితి రాకుండా ముందే చెప్పినందుకు..
టపా టైటిల్ చూసి వెంటనే చదవాలని ఫిక్స్ అయ్యి చదివేసా... ఆవేశపడ్డంత లేకపోయినా మీరెంచుకున్న కంటెంట్ చాలా బాగుంది. మీరు నిజమైన తెలుగు సినిమా ప్రేక్షకులు కారనిపిస్తొంది.. తెలుగు సినిమా చూడడానికి ఉన్నంత సహనం, ఓపిక, 'వైరాగ్యం' సినిమా గురించి వ్రాయడానికి లేవు, లేకపోతే చీల్చి చెండాడే అవకాశాన్ని ఇంత క్లుప్తంగా ముగిస్తారా...
హ హ.. ఆండీ చప్మేషావ్. బాబోయ్.. విజయో విజయకాంత్ సినిమానో నా... నవ్వి నవ్వి నా నోరు నొప్పెట్టేలా ఉంది.. సూపర్ పోస్టు.. :-)
బావుంది అనడం చాలా తక్కువేమో..
చాలా నవ్వించింది అచ్చం లీవ్ యువర్ కామెంట్ దగ్గరి మీ నోట్ లాగ..
ROFL :)))
తెలుగు సినిమాల గురించి బాగా రాశారు :)
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...
పోస్ట్ లోనే కాదు... కమెంట్ల లో కూడా రెండు విజిల్స్..
LOL. My rule is simple. Never ever watch any Telugu movie alone. Let someone believe that they picked this movie for you. ;).
:) :)
hahhahhhahaaa... :D
చిన్ని గారు థాంక్యూ :)
జనవరి నుండి చూస్తున్న దారుణాలు వాళ్ళ సినిమాలు వారే కాపీ కొట్టుకోవడం ఒకరైతే డైలీ సీరియల్ కాన్సెప్ట్ తో మల్టీ స్టార్ సినిమా అని చెప్పి రిలీజ్ చేయడం మరొకరు ఇదీ తెలుగు సినిమా పరిస్థితి అని చిరాకొచ్చి టపా కట్టా.స్టార్ హీరో అయినా అమృతాంజన్ కి అంబాసిడరే ఆ విషయం మర్చిపోకూడదు :) అరవం అనే ఒక గోల తప్పిస్తే తమిళ్ షార్ట్ ఫిల్మ్స్ వంద రెట్లు బెటర్ IMO
శర్మ గారు థాంక్యూ ఫర్ ది రెస్పాన్స్ :)
ఎంటర్టైనింగ్ మాట అటుంచితే మొనోటానస్ నస పెరిగిపోయింది
waste of time but the to pass time movies are just inevitable :)
థాంక్స్ :)
శ్రీకాంత్ థాంక్యూ వెరీ మచ్ :)
రీ షేర్ కి థాంక్స్ అగైన్ :)
గీతిక గారు థాంక్యూ వెరీ మచ్ :)
రెహ్మాన్ థాంక్స్ :)
హర్ష థాంక్స్ :))
మాలగారు థాంక్యూ :)
మీరు రాసిన టపా కూడా ఈ పోస్ట్ కి ఒక విధంగా ఇన్స్పిరేషన్ :)
రాజ్ హహ్హ :)) థాంక్యూ :)
చాతకం గారు,My roommate have enough obsession that we will have good time while watching movie but recently the movies were one step ahead when to comes to boring to the core
Audience should have more patience than a Test cricketer it seems :)
Thankyou for the words and response :)
క్రాంతి థాంక్స్ :)
ప్రియ గారు థాంక్యూ :)
ROFL :)
ROFL ... :)
kevvvvvvvvvvvvvvvvvvv
సాయికిరణ్ గారు Welcome to my blog and Thank you :)
నాగార్జున :D థాంక్యూ :))
Super super..superrrrr..
chaala late gaa chadivinattunnaanu ;)
హ్హి.. హ్హి.హ్హి.. చాలా బాగా రాశారు...చదువుతుంటె నవ్వు అపుకొలెకపొయాను...నిజంగా చాలా బాగా రాశారు తెలుగు వారి ఒపికను...
Post a Comment