Pages

Friday, July 17, 2009

8 pt sum1..part 2

క్షమించాలి ఈ sms బాష వాడినందుకు.. ముంబాయి లో వర్షాల కారణం గా రాయడం కుదరడం (కదలడం) లేదు

మొదటి మైనర్ రాసిన మరుసటి రోజే మార్క్స్ ఇచ్చేసారు ప్రొఫెసర్ లు అందరూ ఒక్క చారి గారు తప్ప...కంపేర్ చేసుకుంటే ఫర్వాలేదు అందరికి ఒకే రేంజ్ లో వచ్చాయి మార్క్స్ ..సెకండ్ మైనర్ వచ్చేస్తోంది చారి గారు మార్క్స్ ఇస్తే క్లాసు టాపర్ ఎవరో డిసైడ్ అయ్యిపోతుంది ...
బద్దకమేమో ఎప్పుడో తర్వాత ఇస్తారు లే అని మేము కూడా పట్టించుకోవడం మానేసాం
ఆశ్చర్యం అద్భుతం గా అన్నీ కలగలిపి నట్టు నాకే క్లాసు ఫస్ట్ వచ్చేసింది ఎటునుండి వచ్చింది అన్నది కాదు ఫస్ట్ వచ్చిందా లేదా అన్నట్టు చారి గారి సబ్జెక్టు లో
నాకు 17.5/20 పరదేశి కి 0.5/20 అప్పుడే ఇంగ్లీష్ మూవీస్ కి అలవాటు పడుతున్నాం కాబట్టి నేర్చుకున్న మాటలన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి
అప్పుడే చాలా మంది మార్క్స్ పెంచుకోడానికి చారి దగ్గరకు వెళ్లి సోప్ రాస్తున్నారు వాడు వేసుకున్న సల్వార్ కమీజ్ మీద సరే నేనూ వెళ్దామా అని అనుకుని ఒకసారి నా ఆన్సర్ షీట్లో ఉన్న రాజశేఖర్ సానుబూతులు చూసి ప్రయత్నం విరమించుకున్నా
అయితే నా ఆకలిమంటలు చల్లారలేదు చారి ని ఏదో ఒకటి చేసేయాలి అన్నంత కోపం వచ్చింది నాకైతే ..కాని అంత సీన్ లేదు(అప్పటికే కోర్సు డ్రాప్ చెయ్యడానికి టైం అయ్యి చాలా రోజులు అయ్యింది) అని తెలుసుకొని


కత్తి మీద కోపం కరణ్ జోహార్ మీద చూపించినట్టు
నేను చదివినా చదవకపోయినా కోర్సు తీసుకోమన్న మా సీనియర్ గుర్తు వచ్చాడు ..అయన రూం కి వెళ్లి, చూడండి చారి చేసిన చేట భారతం అని నా ఆన్సర్ పేపర్ చూపించా..అంత బాగా రాసాక నా పేపర్ చూసి మా సీనియర్ కూడా కాసేపు మాట్లాడలేదు .. ఆయన కూడా నా బూతులకు సానుభూతి చూపించి ఓదార్చడానికి తనకు మాటలు రాక కొన్ని హరికృష్ణ పాటలు వాడి భరతనాట్యం ఇంకా బ్రేక్ డ్యాన్సులు గట్రా తన పి.సి లో చూపించి ఆనందపరిచి నా అల్లకల్లోలమైన ఆక్రోశాన్నిఆర్పగలిగాడు కొంతమేరకు

పేపర్స్ ఇచ్చిన రోజు సచిన్ జైన్, అజయ్ యాదవ్ రాలేదు మరుసటి రోజు వాళ్ళవి వాళ్ళు చూసుకున్నారు చారి గారి రూం లో
అందమైన అమ్మాయిలకే మార్క్స్ అంత బాగా ఎలా వస్తాయో అనే అంతుచిక్కని ప్రశ్నకు చివరకు సమాధానం దొరికింది


హాస్టల్ లో బ్యాడ్మింటన్ కోర్ట్ లో రకరకాల డిస్కషన్స్ జరిగేవి ప్రతి రోజు సాయంత్రం
ముఖ్యంగా పరదేశి ఇంగ్లీష్ పలికే విధానం జర్మన్ ఫెంచ్ ఇటాలియన్ ని ఇంగ్లీష్ లో మిక్స్ చేసి మాట్లేడేది ఇలా స్వచమైన ఇంగ్లీష్ ని మాట్లాడితే వర్కౌట్ కాదు అని తెలిసి తెలియని తెంగ్లిష్ లో మాట్లాడి అలా తనకు తిక్క తెప్పించేవాళ్ళం
భారతి స్కూల్ అఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ క్లాసు లో గల పరదేశి గురుండి వాళ్ళు బాగా చెప్పేవారు
దానికోసం స్క్రిప్ట్ తయారుచేసుకుంటున్నా వచ్చే భాగం లో వివరిస్తాను

మార్క్స్ ప్రభావం ఎంతగా వుండేది అంటే ఒక వారం రోజులు నిద్ర లో లేచిన ఎప్పుడూ ఛీ నా బతుకు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకునేవాడిని hangover నుండి బయట పడడానికి లైబ్రరీ లో నైట్ స్టడీస్ మొదలెట్టా, మిగతాది మరో పోస్ట్ లో చెప్తా

అంతవరకు http://www.youtube.com/watch?v=d_Nt5mEZ2r0

Friday, July 3, 2009

8 Point Someone..part 1

ఢిల్లీ లో అప్పుడే అడుగుపెట్టిన ఆంధ్రులకి తెలిసి తెలియని హిందీ లో అయ్యా ** tea అని తెలుగు లో అనువదించితున్న కొత్తలో కాంపస్ ను చూసి కేకో కేక అనుకునే లోపే మా టైం టేబుల్ ని మేమే రిజిస్టర్ చేసుకోవాలి అనేసరికి ఒక మూడు రోజులు చించి చించి సరే ఓపెన్ electives మాత్రం ఒకే కోర్స్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాం కోర్స్ పేరు rural india planning and devolopment (RDL)
చారియర్ ఒక మంచి ప్రొఫెసర్.. ఫ్రమ్ కేరళ, గ్రేడు 7 కంటే తగ్గితే మాకొచ్చే మంత్లీ stipend కట్ సేనియర్లు కూడా గ్రేడ్స్ పరం గా మంచి కోర్స్ అని చెప్పడం తో ఆవేశం గా రిజిస్టర్ చేసేసాం, రిజిస్టర్ చేసాక తెలిసింది ఎంత మంచి కోర్సో అది బిటెక్ ఎంటెక్ msc ఎవరెవరో అంతా రిజిస్టర్ చేసేసరికి క్లాసు చాలా కలర్ ఫుల్ గా వుండేది ..విదేశీయులు అంటే ఒక పరదేశి కంత్రి ఫ్రం ఫెదెరర్ కంట్రీ నుండి వచ్చేది..ఈవెనింగ్ స్లాట్ కావడం తో అంతా కనీసం మొహాలు కడుక్కొని వచ్చేవారు..మేము కూడా కలర్ చూడాలో తెలియక చివరికి విదేశి వేసుకొనే డ్రెస్ లని చూస్తూ కుషీ గా కాలం గడిపేస్తున్నాం..ప్రొఫెసర్ కూడా మా concentration క్యాచ్ చేసి లెస్సన్ కుడా పరదేశిని చూస్తూ చెప్పేవాడు ఒక్కరికి చెప్తే అందరికి చెప్పినట్టే క్లాసు అనే డైలాగ్ మొదటి సారిగా తెలుసుకున్నారు మా చారి గారు

అప్పుడే సమ్మర్ ప్రభావం తగ్గింది అనుకుంటా పరదేశి perfume ఘాడత పెరిగింది మేము కూడా కొంచెం దూరంగా కూర్చొనే వాళ్ళం ఇలా కొన్ని రోజులు గడిచాక అప్పుడే దానికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది..ఎవరు తన ప్రక్క కూర్చోవడం లేదు అని క్లాసు కి లేట్ గా రావడం చేసేది మా చారి గారు కూడా "ఎవరో రావాలి.. " అని పాట పాడుకుంటూ తను వచ్చేదాకా క్లాసు చెప్పకుండా వెయిట్ చేసేవాడు ,తను వచ్చిన వెంటనే మా మధ్య కూర్చొనేది ఇదీ తంతు ఒక perfume మా concentration ని దారుణంగా దెబ్బతీసి క్లాసు కి రాకుండా కంప్యూటర్ సెంటర్ లో కూర్చొనేటట్టు చేసింది..ఇంతలో మొదలయ్యాయి మొదటి మైనర్..ఏమి చెప్పారో తెలీదు ఎందుకు ఎవరికి చెప్పారో తెలీదు సరిగ్గా exam కి 3 రోజుల ముందు 200 pages ppt ఇచ్చి ఇదే సిలబస్ అంటూ మాకు షాక్ ఇచ్చాడు ..మిగతా సబ్జక్ట్స్ కి ప్రయారిటీ ఇవ్వడం తో నాకు 3 hrs మిగిలింది నా ప్రిపరేషన్ కి చదువుతున్న సేపు చాలా ఊహిన్చుకున్నా రాసేద్దాం లే ఏదో ఒకటి అని మిగతా ఎగ్జామ్స్ బాగానే రాసా కదా అనే కాన్ఫిడెన్స్ తో ..

exam మొదలియ్యింది ఇంతలో మా అజయ్ యాదవ్ గాడు తెగ రాసేస్తున్నాడు 4 పేజీలు రాసేసాడు చాలా ఫాస్ట్ గా చారి గారు వాడికి మరో పేపర్ ఇచ్చారు..సర్ బుక్ లో ఇంకా 2 పేజీలు మిగిలి వున్నాయి తర్వాత తీసుకుంటా అడిషనల్ అన్నాడు..చారి గారు వెంటనే నేను నీకు ఇప్పుడు ఇస్తున్నది ప్రశ్నా పత్రం నాయనా అన్నారు ..


తరువాయి భాగం తొందర్లోనే..

అప్పటిదాకా http://www.youtube.com/watch?v=_S0xgzfPLK8