Pages

Thursday, June 25, 2009

Happy B'day

జన్మదిన శుభాకాంక్షలు

బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య కు జన్మదిన శుభాకాంక్షలు
నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకొంటూ..
హ్యాపీ బర్త్ డే టు ఆదిత్య

Saturday, June 20, 2009

యూనిస్ ఖాన్


ఎందుకో వీడంటే అసలు ఇష్టం వుండదు..ఒక సగటు భారతీయుడు గా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ గా వీడంటేనే పరమ ఎలర్జీ..కాని ఒక విషయం లో చాలా ఇష్టం..మ్యాచ్ గెలిచినా కూడా now ది లూజింగ్ కెప్టెన్ అనగానే అక్రమ సంభంధం లేకుండా మ్యాచ్ గెలిచినా కూడా బహుమతి వేడుక దగ్గరకు చెంగు చెంగున పరుగేడతాడు.. అంత బాగా ఇంగ్లీష్ వుంటుంది..నేనయితే బాలయ్య కామెడీ సినిమా లను యూనిస్ ఖాన్ ఇంగ్లీష్ మాటలను మిస్ అవ్వడం ఒక పాపం గా భావిస్తా.. యూనిస్ కి ఇంకో ఇంగ్లీష్ బూతు కి బాగా దగ్గరపోలిక వుండడం వల్ల కంమేంటేటార్స్ తో సహా పాకిస్తాన్ ప్రజలకి కూడా అంత ఇష్టం వుండదు అనుకుంటా

కొంచెం క్లోజ్ గా అబ్జెర్వ్ చేస్తే ఒక టాం హాంక్స్ + ఒక మాట్ డామన్ = యూనిస్ ఖాన్

ఒక చిన్న కోరిక నాకు

రేపు T20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సూపర్ ఓవర్ దాకా వచ్చిన పర్వాలేదు కానీ గెలవకూడదు
తర్వాత యూనిస్ ఖాన్ గాడు ప్రెజెంటేషన్ సేర్మోనీ లో

లూజింగ్ కెప్టెన్ అనగానే..

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
అని గబగబా చెప్పేయాలి.. ఎంత బావుంటుందో

అప్పుడే నాకు మనస్సాంతి..



కనీసం "ఖానూ,యూనిస్ ఖానూ..నీవూ మావలె మనిషివని అంటే ఎలా నమ్మేది.. నీకు ఓటమి తప్పదని...
ఖానూ" అని చివర్లో అలెన్ విల్కిన్స్ ఎస్ పి బాలు లా గొంతు చించుకొని ఒక పాట పాడినా ok..

నా కోరిక తీరాలంటే రేపటి దాక ఆగాల్సిందే ! ఏం జరుగుతుందో ?



Tuesday, June 9, 2009

కిస్ పేర్లు


ఆగండాగండి..టైటిల్ చూసి ఇదేదో స్వాతి పుస్తకం లో ఒక పేజి గురుండి రాస్తున్నా అనుకుంటే మీరుపప్పులో ఆలేసినట్టే (అల్+వేసినట్టే =గుణసంధి)

పుట్టి పెరిగిన వాతావరణం కుటుంబ ఆర్ధిక పరిస్థితుల పైన ముద్దు పేర్లు ఆధారపడి వుంటాయి అని నా ఆభిప్రాయం..పల్లెల్లో అయితే తాత,అమ్మమ్మ పేర్ల తో పిలుస్తారు మరీ ఖతర్నాక్ డైరెక్టర్ నాన్నరాజశేఖర్ లాగా ఊర మాస్ లాంటి ఊర్లలో పెరిగితే నా లాగా ఏం చెయ్యలేం..

పెట్ నేమ్స్ అంటే కోడి పెట్టలు గుర్తొచ్చాయి అందుకే ఆ ఫోటో..



నాని,చిన్ని,బుజ్జి,కన్నా.. అనే పేర్లు సర్వసాధారణం గా వింటాము నా స్కూలింగ్ అంతా ప్రభుత్వ పాఠశాలలోనే..మాస్ కే మోహన్ బాబులా వుండేవారు జనాలంతా నాకు తెలిసి ఒక్కడికే మా స్కూల్ లో ముద్దుపేరు తో పిలిచేవాళ్ళు వాడి పేరు బుజ్జి అసలు పేరు ఈశ్వర్..వాడి ని అంతా ముద్దుపేరు తోనే పిలిచేవారు మాస్టార్ల తో సహా ..మా గుండెలు రగిలిపోయేవి ..ముద్దు పేరు కావాలని ఇంట్లో అడిగితే బెత్తం విరిగేది..సరే దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలని మాలో మేమే పెట్టేసుకున్నాం ముద్దుపేర్లు స్కూల్ ఫ్రెండ్స్ అంతా కలిసి.. కాని బాలకృష్ణ సినిమా లా క్లిక్ అవ్వలేదు ..


అవి 6 తరగతి .వి-1,.వి-2 లు చదువుతున్న రోజుల్లో రాజేష్ అని ఒకడు జాయిన్ అయ్యాడు వాడు చాలా చేసేవాడు..వాడు చేసే అతి ని భరించలేక మేమే పెట్టాల్సి వచ్చింది ఒక ముద్దు పేరు, ఒక ముహూర్తాన మా ఫ్రెండ్ రాజేష్ కి ఆకుబాబు అని నామకరణం చేసాడు అంతే అదే మొదలు అమ్మాయలు కూడా ఆరవ తరగతి అయ్యేసరికి కమ్యూనికేషన్ బావుండేది..అమ్మాయలు కూడా వాడిని ఆకుబాబు అకుబాబు అని అరిచేసరికి వాడు అవమానాన్ని భరించలేక హెడ్ మాస్టర్ దగ్గర కంప్లైంట్ చేసాడు..మా హెచ్.ఎం కూడా పంచ్ కోసం ప్రాణం ఇచే మనిషి అయ్యేసరికి ఆకుబాబా..సూపర్ కదా గా వుంది కదా అని తిరిగి వాడినే అడిగేసరికి అగమ్య గోచిరమ్ గా తయారయ్యింది వాడి పరిస్థితి,హెచ్.ఎం కి తెగనచ్చేసింది కాని బయటపడలేదు .అతను కూడా ఏమి అనకపోయేసరికి అలామా ఆకుబాబు కి ఆకుపచ్చ కన్నీరు చూపించాక వాడు వెళ్ళిపోవడం జరిగింది ఇది జరిగినాక

మా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా క్లాసుమేట్ అమ్మాయి వెనక ఒక అబ్బాయి వెంటపడే వాడు మా కాలేజ్ కూడా ఊరవతల ఉండడం తో మేము సైకిల్ మీదనే మా ప్రయాణం మేము క్లాస్ ని మిస్ అయ్యినా వాడు మాత్రం కాలేజ్ కి వచ్చేవాడు చాలా దూరం నుండి వాడి పట్టుదలని చూసి వాడికో పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాం చివరకు రక్తకోలా అని ఫిక్స్ అయ్యాం
రక్తకోలా.. ఒక మంచి ప్రేమికుడు.. అనే ఇమేజ్ కోసం ఎంతో ప్రయత్నించినా కాప్షన్ కి జస్టిఫై చేయలేక టైటిల్ కి తగ్గ ఇమేజ్ ని సంపాదించుకొన్నాడు ఆఖరకు


ఇక నా ముద్దు పేర్ల విషయానికి వస్తే

అదేంటో చిట్టి అనే పదం అంటేనే నాకు పడదు చిన్నప్పటి నుండి ..మా టీచర్ నన్ను తెగ కొట్టేది చిట్టి చిలకమ్మ పద్యం చెప్పేటప్పుడు ఎలాగంటే
చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా
తోటకి వెళ్ళావా
పండు తెచ్చావా
పద్యం చెప్పమంటే...

చిట్టి అని చెప్పులేదా
టీచరమ్మ చిదక్కోట్టిందా
క్లాసు కి వెళ్ళావా
దెబ్బలు తెచ్చావా ..
అని దెబ్బకు మందు రాసి నాకు ఏదైనా తినడానికి ఇచ్చేది మా అమ్మ స్కూల్ నుండి వచ్చాక..

చిట్టి అంటే అయిష్టానికి అలా నా పసి వయసులోనే బీజం నాటింది


Monday, June 8, 2009

ఎవరో రావాలి..

             శనివారం ఒక పోస్ట్ రాస్తుండగా  తరువాయి  భాగం వచ్చేవారం రాద్దాం అని room కి వెళ్ళా.. అయితే  సండే  నా పాలిట శాపం గా తయారయ్యింది పొద్దున్న ఆరింటికే లేచి ఇంటికి వెళడానికి  రిజర్వేషన్ కౌంటర్ కి వెళ్ళా,నా ముందు నిల్చొన్న  కేరళ వాడి కక్కుర్తి  కారణంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో టికెట్ దొరకలేదు తత్కాల్ అయ్యేసరికి 15 నిమషాలు కూడా నిలవలేదు..కేరళ వాడు 8 మంది పేర్లు రాసి 4 సీట్లు conform  అయ్యాక కూడా మిగతా   నలుగురికి  కాలేదు   అని కౌంటర్లో వున్నవాడిని విసిగు తెప్పించి అమూల్యమైన సమయాన్ని వృధా చేసాడు చివరికి కాన్సిల్ చేసి మాకు సినిమా చూపించాడు .. ..

           ఈ సంఘటనతో విసుగెత్తి రూం కి వచ్చా  సరే డోర్ తెరుద్దాం అని  కీ పెట్టకుండానే నేను కేక పెట్టా..చూసేసరికి బ్రౌన్ కలర్ పాము నేను ఒకడ్ని దాని ఎదురుగా ఉన్నా అని కూడా పట్టించుకోకుండా మమైత్ ఖాన్  లా  డాన్స్ చేస్తోంది నా ఎదురుగా ..మరీ మాట్రిక్స్ సినిమా అంత క్లోజ్ గా చూసేసరికి భయమేసి  మరుక్షణం  పరుగెత్తడం స్టార్ట్ చేశా ..గార్డ్ సాబ్ మేరా  ఘర్ మే సాప్ ఆయా..మారో ఉస్కో ..అనగానే  వాడు వణికిపోతూ ఆజ్ సండే హై..సండే కే దిన్ మే  మై సాప్ నహీ మారుంగా.. అన్నాడు..సరే వేరే గార్డు ని కూడా అడిగా చంపు రా దానిని అని వాడు కూడా నేను పాముల్ని చంపడం మానేసా లక్ష రూపాయిలు ఇచ్చినా కూడా   నేను చంప అన్నాడు.."నా అభిమతం కాదు అని చెప్పిన చిరు డైలాగ్ గుర్తొచ్చింది"..  ఛీ నా బతుకు అని  వెంటనే గార్డు దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకొని రూం కి వెళ్ళా ఇంతసేపు ఏమి వుంటుంది లే అనే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాక కూడా దాని  క్యాబరీ డాన్స్ ఆపలేదు ..ముందుగా రాయి అస్త్రాన్ని ప్రయోగించా వెంటనే  డాన్స్ ఆపి పక్కనే వున్నా పొదల్లో కి పరుగెత్తింది కర్ర తో కొట్టేసరికి పొడుగు ఎక్కువ అయ్యేసరికి మధలో తగిలింది దానికి దెబ్బ ..కదలడం కష్టం అయ్యేసరికి దాని తలను  వ్రక్కలు చేశా వెంటనే ..మా సొసైటీ బయట పారేద్దాం అని తీసుకు వెళ్తుండగా మార్నింగ్ వాక్ నుండి అప్పుడే వస్తున్న అంకుల్స్ చూసి దాని మీద డిస్కషన్  ఆది  నల్ల త్రాచా తెల్ల త్రాచా అని..ఒక ముసలాయన మాత్రం భయం తో వెంటనే  ఇంట్లోకి వెళ్ళాడు ..నేను మాత్రం మా సొసైటీ డస్ట్ బిన్ లో పడేద్దాం అనుకుంటుండగా biodegradable,recyclable అని రెండు కనిపించేసరికి గార్డు కి బుద్ధి చెప్పడానికి recyclable లో వేసా.. సాయంత్రం రూం కి వస్తుండగా గార్డు ఆప్యాయం గా పలకరించడం గమనించా.. షాక్ నుండి తేరుకోవడానికి ఆఫీసు కి దగ్గర్లో రూం తీసుకోవడానికి వేట మొదలెట్టా నిన్ననే...

  


frustration లో వుండేసరికి  పాముప్రాణాలు  తీయక  తప్పలేదు..నన్ను క్షమించు దేవుడా!!