Pages

Wednesday, June 3, 2009

మాటుంగా లో ఒక మద్యాహ్నం

             వడా పావ్ లు విచ్చలవిడిగా తిని విసుగుచెందిన జీవితానికి వెరైటీ గా మన ఆంధ్రా ఫుడ్ కోసం గాలిస్తున్న రోజులవి , మా ట్రైన్ మేట్ ని అడిగి ఒకరోజు కలసి బయల్దేరాం మాటుంగా..

              
ఇలా మా హార్రిబుల్ లైన్ అయిన హార్బర్ లైన్ నుండి సెంట్రల్ లైన్ లోనికి మారడానికి కుర్ల అనే ప్లేస్ కి వచ్చాక , కుర్ల స్టేషన్ క్రౌడ్ గూర్చి చెప్పాలంటే పూర్వం ఇక్కడ క్రూర మృగాలు నివసించేవి అనుకుంటా మనం ట్రైన్ మధ్యలోనే వుంటాం కుర్ల స్టేషన్ రాగానే with in seconds లో ప్లాట్ ఫారం బయటకు నెట్టేస్తారు జనాలు b,c సెంటర్ సినిమాల్లో 1st day టికెట్స్ కొనడం ప్రాయం అని నా అభిప్రాయం


            
మాటుంగా
స్టేషన్ కి వెళ్ళేసరికి 1.30 అయ్యింది, స్టేషన్ దగ్గర నుండి తెలుగు అక్షరాలు కనిపించేసరికి చాలా ఆనందం వేసింది తీరా దగ్గరికి వెళ్ళాక తెల్సింది అది కన్నడ అని ..సరే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కన్నడ బాషని కన్నడ బాషలో నాకు తెలిసిన ఒకే ఒక్క పదం ಬ್ರೂನ್ ಲೇಬಲ್ , లైట్ అని అలా లోపలి వెళ్ళేసరికి అదేంటి ఇప్పుడు కుర్ల స్టేషన్ కి నడిచి ఎలా వెళ్ళాం ఇంత తొందరగా అని అనుమానం కలిగింది             
అసలే ఆదివారం అక్కడ క్రౌడ్ చూస్తుంటే మేము మా టోకెన్ తీసుకోగానే 1.30 hr తర్వాత రండి అని చెప్పాడు సరే 90 min అంటే ఏమైనా ఇంగ్లీష్ మూవీ చూసి వచ్చేయొచ్చు కదా అని బయటకు వెళ్తే అప్పుడు నిజం తెల్సింది మాటుంగా అనేది
ముంబై లో   తమిళ సామ్రాజ్యం అంతా కలసి ఒక ఏరియా ని కబ్జా చేసి దాంట్లో వుంటున్నారనిపించింది ఎక్కడ చూసినా తమిళ్ సంతక రేకులే ( సైన్ బోర్డ్స్ ), సరే సౌత్ సినిమాలు ఆడే ఒక ధియేటర్ కూడా ఉండడం తో (అరోరా సినిమా ) సరే అక్కడిదాకా వెళ్దాం అని అనుకున్నాం ..ఇంతలో బుక్ షాప్స్ కనిపించాయి సరే దొరికింది కదా అని ఒక బుక్ అడిగా వాడిని 150 అన్నాడు మంచిగా కవర్ లో ప్యాక్ చేసాడు ప్రింట్ కూడా సూపర్ బంపర్ 50 డేస్ లాగా వుంది ..సరే ఎంత ఇస్తావ్ అన్నాడు వెంటనే తడుముకోకుండా 50 అన్నా నేను , సరే తీసుకో అని ఇచ్చేసాడు ..ఢిల్లీ నేర్పిన పాఠాలు ఇప్పుడు పనికొచ్చాయి అని సంతోషంగా తీసుకున్నా


               
అలా 20 min నడిచాక మాకు ఘుమ ఘుమలాడే మైసూర్ టీ పౌడర్ వాసన , వాసన అంటే గుర్తొచ్చేది నాకు టీవీ రూం లో సోనీ మాక్స్ లో కనిపించే అతుల్ వాసన్ గాడు వాడిని టీవీ లో చూడగానే అందరూ తుల వాసన తుల వాసన అని వెంటనే అరిచేసే వాళ్ళం అలా కాఫీ ఫ్లేవర్ ని ఫ్రీగా five min ఎంజాయ్ చేసి ముందుకు సాగాం


                 
మరో 10 నిముషాలు నడిచాక అరోరా
ధియేటర్ కనిపించింది అక్కడ విచ్చలవిడి విరాట్ విశాల్ శ్రియ ఆడుతున్న సినిమా పేరు తమిళ్ లో రాసి వుంది పిస్తా అని తర్వాత తెల్సింది ఇంకా farhan akthar తెలుగు డాన్ ఆడుతున్నాయి నాకు సినిమా తెలుగులో చూడటం ఇష్టం లేదు అది రీమేక్ అయ్యేసరికి సరే అనుష్క కోసం వెళ్దామా అని అలోచిన్చేస్తుండగా బ్లాక్ 100- 80, 100 rupees 80 సర్,కార్తిక్ పక్కన సీట్ సర్ అని తెలుగు లో అరుపులు వినిపిస్తున్నాయ్ ఎవడ్రా పిచ్చ ... అనుకునేసరికి నా పేరు ఎవరో పిలిచిన ఫీలింగ్ చూస్తే block లో టికెట్స్ అమ్ముతున్న కార్తిక్ గాడు


నేను :మామా , నువ్వేంటి ఇక్కడ
కార్తిక్ :ఏం చేస్తాం recession
నేను :అలాగా ,100 టికెట్ 80 కి ఎందుకు అమ్ముతున్నావ్
కార్తిక్ :recession అని జనాలు కుడా రావడం లేదు
నేను :మరి థియేటర్ వాళ్ళకి తెలియదా విషయం
కార్తిక్ : థియేటర్ కి నేనే సుమన్ ని
నేను :????

అక్కడనుండి అలా జంప్ అయ్యి తినడానికి వెళ్ళాం

అక్కడ నా లోని నిద్రపోతున్న టెస్ట్ బ్యాట్స్ మన్ నిద్రలేచి ఆంద్ర భవన్ లో బర్త్డే పార్టీ లకి బెంబే లేత్తించిన బెస్ట్ బ్యాట్స్ మన్ ను గుర్తుకు తెప్పించిన రోజులు గుర్తుకు తెచ్చుకొని ఇండియా పైన అతి దారుణంగా 5 రోజులు డిక్లేర్ చెయ్యకుండా ఆడిన శ్రీలంక వాళ్ళలాగా మారథాన్ ఇన్నింగ్స్ ఆడేసా.. బెల్ట్ కనిపెట్టిన వాడిని మనసారా తిట్టి ముగించా నా మధ్యాహ్న భోజన పధకం

30 comments:

Ravi Gadepalli said...

Books eppatnunchi chaduvutunnavura....intaki e book konnavu....
Kurla deggirlone sachin gaadi illu....ee sari velte kaluvu....
Nee test batting gurinchi raayamani kabees adiginattunnadu....nenu kooda wait chestunna innallu.....eppudu rastaava ani....

హరే కృష్ణ . said...

@Ravi
Robin Sharma pustakalu chadivi naasanam avvadaniki already 2 chadivanu vadivi..
monk who sold ferrari
who will cry when you die
ippudu Mega Living konnanu..avnu bandra kurla complex lo sachin home..watchman kanikaristhe kalustanu

Aditya Maddula said...

@హరే కృష్ణ :(for above comment) watchman kanikarinchadu.. kaaranam.. ala kanikariste sachin illu chinna size tirupati temple la tayaravuddemo.

@ హరే కృష్ణ ; (for the post)

You rock as always, writing lo improvement baaga telustondi. keep it up!!

హరే కృష్ణ . said...

@Aditya
ha ha ha..correct ga cheppav..thank you again..keeputhaanu :)

కొత్త పాళీ said...

బహుబాగు.
మీకు సంతత సుఖభోజన ప్రాప్తిరస్తు.
మాకు ఇలాంటి నవ్వుల మాటల విందులు ప్రాప్తిరస్తు.

హరే కృష్ణ . said...

కొత్తపాళీ గారు ..ధన్యవాదములు
:) :)

vikky said...

sriya - anushka la nu marachi test batting chesaavu ante nuvvu andhra bhavan ni entha miss avuthunnavo telusthundi

vikky said...

mee karthik gaadi ki peli cheseyi tvaraga, vaadi intiki velli vaalla aavida cheti vanta thintoo undu :)

Shashank said...

కొబ్బరి తో కూడిన కన్నడ వంటలు తిన్నావా? బాగుంది నీ టపా. నా లాప్ టాప్ వచ్చాకా వస్తా మళ్ళా.. అప్పటి వరకు ఇంకోటి రాయాకు. ;-)

హరే కృష్ణ . said...

@Vikky..
విక్రమ్,,థాంక్స్ ...అనుష్కనా అన్నమా అని అడిగితే మిట్ట మధ్యాహ్నం అవ్వడం తో భోజనానికే వోటు వేసా :)

హరే కృష్ణ . said...

@Vikky
అలా అయితే కార్తిక్ కుటుంబానికి మిగిలేవి అరిటాకులే :)

హరే కృష్ణ . said...

@Shashank
శశాంక్..చాలా థాంక్స్...ఇన్ని కష్టాల్లో కూడా చదివి నీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు ..నీ లాప్ టాప్ లో నా తరువాతి పోస్ట్ చదవాలి అని నాఅభిలాష

మురళి said...

"అనుష్కనా అన్నమా అని అడిగితే మిట్ట మధ్యాహ్నం అవ్వడం తో భోజనానికే వోటు వేసా :)"
అద్భుతం.. నేను టపా చదివి కామెంట్ రాద్దామనుకుంటూ మిగిలిన కామెంట్స్ చదివానండి.. ఇక్కడ ఆగి ఓ ఐదు నిమిషాలు నవ్వాను.. మీ టపా చాలా బాగుంది. రాబిన్ శర్మ పుస్తకాలు చదువుతున్నంత సేపూ చాలా బాగుంటాయి.. నాకు ఫిల్లింగ్ స్టేషన్ కి వెళ్ళినప్పుడల్లా 'మాంక్..' గుర్తొస్తాడు..

...Padmarpita... said...

బాగుంది మీ టపా...సరికొత్త శైలిలో...

హరే కృష్ణ . said...

మురళి గారు
అంతా మీ అభిమానం,నచ్చినందుకు థాంక్స్..నా ఫేవరెట్ బుక్ కూడా "మాంక్" నే . ఇది కాకుండా ఆల్ కెమిస్ట్ కూడా నాకు నచ్చుతుంది

హరే కృష్ణ . said...

పద్మార్పిత గారు
నెనర్లు.. శైలి మార్చాలని సెన్సార్ చెయ్యాల్సి వస్తోంది ..థాంక్స్

ఉష said...

వడా, పావ్ ముచ్చ్ట మాత్రం తెలిసిన ఒకరు వెరైటీకని ఊతప్పం మీద కుర్ కురే జల్లుకుని ఆ పైన స్వీట్ అంద్ సౌర్ సాస్ పొఓసుకుని తినటం గుర్తుకు తెచ్చింది. నా శెనగకారం బాగుందని తీసుకున్న బ్రిటీష్ కలీగ్ అరటి పండుకి డిప్ గా వాడుకోవటం కూడా గుర్తుకొచ్చింది.

ఉష said...

neat ప్రొద్దున్న లేవగానే మాటలు వెదుక్కుని వ్యాఖ్య వ్రాయలనిపించింత మంచి టపా. బహుశా అందరిలోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైందేమో.సమయం లేక comments చదవలేదు. పూర్తిగా చదవలేమోనని ముందుగా first impression పైన వ్రాసాను. బాగా వృఆసారు.

హరే కృష్ణ . said...

ఉష గారు
నా బ్లాగ్ లో మొదటి సారి కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు హ.హ్హ.. బ్రిటిష్ వాళ్ళు ఏది చేసిన వెరైటీ నే..
థాంక్స్ :)

ఉష said...

ఆన్యాయం, just check http://harekrishna1.blogspot.com/2009/05/blog-post_20.html అదృష్టవశాత్తు మనకి కాస్త జ్ఞాపక శక్తి అధికం పైగా సమయానికి గుర్తుకీ వస్తాయి. ఆట పట్టించటానికే కానీకించపరచటం కాదు సుమీ! :)

హరే కృష్ణ . said...

ఉష గారు,
హ హ్హ.. మీరు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..నేను అది మరువం
నా పోస్ట్ లో అఫీషియల్ గా మొదటి సారి కామెంట్ చేసారు అని రాసా :)

ఉష said...

smart! ok, I agree to concede. Needless to say, but I do read your posts but i either have not much to comment or run out of bandwidth. :)

హరే కృష్ణ . said...

:) :)

perfect imperfectionist said...

Kiran.. ee blog dwara nuvvu andistunna vinodam chala amulyamainadi...nee observation chala nachindi...
alage blogs lo random topics kakunda..oka serial la entries modalu pedite baguntundani naa abhiprayam..
alage mana delhi days sweet memories gurtuku testunnannduku chala santosham ga vundi...

హరే కృష్ణ . said...

@Chandu
chaala chaala thanks chandu..tappakundaa serialla modalupedatha time vundatam ledu office lo anduke random ga raayalsi vastondi

happy days ni ila raayadm naaku chala santhosham ga vundi :)

AMU said...

thanks kiran..maa sahayam neekeppudu vuntundi...script lo kani..characterisation lo kani..endulo ayina sare..nenu ravi neeku full ga cooperate chestam..emantaru gadepalli varu??

హరే కృష్ణ . said...

మీరు వున్నారు అన్న ధైర్యం తోనే బ్లాగ్ ను స్టార్ట్ చేశా..థాంక్స్ చందు ..ఆమాత్రం హింట్ ఇస్తే చాలు :)

శ్రుతి said...

తెలుగు ఫుడ్ కోసమై వలలో పడెనే అని.... కదా! పాపం మీరు అక్కడెక్కడొ ఖంగు తిన్నారు, కాని మన రాజధాని లోనే మాకిలాంటి...

ఎదేమైనా మంచి విషయం.. కర్ర విరగకుండా చెప్పారు.

హరే కృష్ణ . said...

@శ్రుతి
కొంచెం ఆలస్యం గా చూసాను మీ కామెంట్
ధన్యవాదాలు

తృష్ణ said...

నేను బ్లాగు మొదలెట్టిన కొత్తలో ఈ పోస్టు చూసి వ్యాఖ్య రాసానండీ.మళ్ళీ ఫాలో చేయలేదు.ఇప్పుడు చూస్తే మీ కామెంటు ఫారంలొ అది కనిపించలేదు.బహుశా అది సరిగ్గా పొస్ట్ చేసి ఉండను అని ఇప్పుడు అర్ధమయ్యింది:) .ఉన్నది రెండేళ్ళే అయినా ఆ సిటీలో నాకు దొరికిన మధురస్మృతుల వల్ల నాకు ముంబై అంటే ఎంతో ఇష్టం.