Pages

Monday, May 25, 2009

చర్య-దినచర్య

పొద్దున మనము లేవాలి - పళ్ళను బాగా తోమాలి
చక్కగా స్నానం చెయ్యాలి - ఉతికిన బట్టలు కట్టాలి
తలను నున్నగా దువ్వాలి - మోమున తిలకం దిద్దాలి
దేవుని పూజను చేయాలి - గ్లాసెడు పాలు తాగాలి
అమ్మకు నాన్నకు ఇద్దరికీ - కాళ్ళకు దన్నం పెట్టాలి
బడిలో చక్కగా చదవాలి - కలిసి మెలసి ఉండాలి
అందరు భేషని పొగడాలి

దీనికి రీమిక్స్ ఇలా జరిగింది నా జీవితం లోపొద్దున్న పన్నెండింటికి లేవాలి ..(ముందు లేచిన వాడిని తర్వాత రోజు నిద్ర పోనివ్వకూడదు) -పళ్ళను తోమాలంటే మధ్యాహ్నం రావాలి
చక్కగ స్నానం చెయ్యాలి (అంటే ఆరోజు కాలేజీ వుండాలి) - బట్టలు ఉతికే హాస్టల్ వాషింగ్ మెషిన్ తో ప్రయోగాలు చెయ్యాలి
ప్రతి వారం తలను దువ్వే మంచి దువ్వెనలు కొనడానికి సరోజినీనగర్ వెళ్ళాలి-తిలకానికి హోలీ నాడు మోమున రంగుల్లో ముంచాలి(వేరే వాళ్ళవి)
శ్రీ రామనవమి రావాలి-రామకృష్ణా పురం వెళ్ళాలి అక్కడ పూజ చెయ్యాలి(ప్రసాదము అద్బుతం అక్కడ) - మెస్ లో వున్న రెండు గ్లాసుల టీ తాగాలి..( టి.వి రూంలో)
అమ్మ కు నాన్నకు వారానికి 2 సార్లు ఫోన్ చెయ్యాలి - ఇంటికి వస్తా అని చెప్పాలి

చకచకా క్లాసు కి వెళ్ళాలి (8 కి క్లాసు అంటే 7.50 కి లేస్తే అలానే వెళ్ళాలి..) - గురువు ని అటెండెన్స్ అడగాలి
కాంపస్ లో ప్రతిరోజూ అమ్మాయలని చూడాలి- సాయంత్రం అంతా కలసి మెలిసి డిస్కస్ చేయాలి
బర్త్ డే కి బూట్లు వెయ్యాలి - కుక్కని కొట్టినట్టు అజయ్ కాంత్ ని కొట్టాలి
అందరు కేకని పొగడాలి

28 comments:

పరిమళం said...

హ ..హ్హ ...
ఇంతకూ ఈ కార్తిక్ ఎవరండీ పాపం !

హరే కృష్ణ . said...

@పరిమళం
:)
అది ఒక కల్పితమైన ఒక క్యారక్టర్..ఎవరిని ఉద్దేశించింది కాదు :)

Prabhakar said...

ఒరేయ్, రాత్రి 2 గంటలవరకు క్రికెట్ ఆడేవాళ్ళం మర్చిపోయావా?... గూగుల్ సెర్చ్(searching for special terminalogy) దినచర్య ను కూడా మర్చి పోయినట్టున్నావు

హరే కృష్ణ . said...

@Prabhakar
మర్చిపోలేదు ...పైన వున్న rhymes కి సెట్ అయ్యేలా అంతవరకే రాసాను ..నైట్ చేసేదాన్ని రాత్రి చర్య అని అనుకున్నా..అయినా రాత్రుళ్ళు హాస్టల్ అంతా లాన్ లో సెర్చ్చేసేవాళ్ళం కదా

Karthika said...

hehehe :).

Karthika said...

karthik ane namee dorikindaa neeku?

హరే కృష్ణ . said...

sorry adi ala flow lo vachina peru inka follow ayipothunna ..maa campus lo chala istamaina peru

"వెన్నెల" said...

అబ్బో నిజంగా కేకేకేకేకేకేకేకేకేకేకేకేకేకే..........క

హరే కృష్ణ . said...

@"వెన్నెల"
మీ కేక కు నా కృతఙ్ఞతలు..మొదటిసారి కామెంట్ రాసినందుకు థాంక్స్ ..

vikky said...

"dabbulu avasaramu aithe ne amma ki naanna ki phone cheyali ," ani raasi unte inka bagundedi

vikky said...

aatmanandaaniki fan following perigipothundi, kummeyi...........

vikky said...

comments ki word verification pettavu, daanini teeseyochu kada, ibbandi ga undi :p

హరే కృష్ణ . said...

హ హ హ్హ ..చాలా థాంక్స్ విక్రమ్..stipend వచ్చేది కదా అందుకే వాడలేదు..కాని 2nd year లో ఆంధ్ర భవన్ ఎఫ్ఫెక్ట్ ఇండియా గేటు దగ్గర enjoyment పెరిగాక అడగక తప్పలేదు..

హరే కృష్ణ . said...

@Vikky
వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తున్నా
కుమ్మేస్తా...థాంక్స్ :)

హరే కృష్ణ . said...

@Vikky
dabbulu avasaramu aithe ne amma ki naanna ki phone cheyali ," ani raasi unte inka bagundedi

నిజంగా కేక వుండేది.. మిస్ అయ్యాను ఇకమీద ఎడిట్ చేసేటప్పుడు మరొక్కసారి ఆలోచిస్తా ..చాలా మంచి suggestion..థాంక్స్ విక్రమ్

sravan said...

konni vandala blagulu chadivamu..
kaani nee blagu legend ...

హరే కృష్ణ . said...

@Sravan
antha mee abhimanam
congrats neeku

hanu said...

hey nice chala baga rastunnavu

Prabhakar said...

హరే కృష్ణ వచ్చాడు, ఒక కుర్చీ లో కూర్చో పెట్టారు, ఒక దండ వేసారు , కొన్ని వందల దండలు వేసారు అభిమానులు హరే కృష్ణ కి

Anonymous said...

mI rachanaa Saili baagunnadaMDI!
itara raashTraalalOni telugu vaari jIvana Saili guriMchi pariSiliMchE avakaaSaM unnadi,kaabaTTi
alaaMTI avagaahanalanu kUDA mI kalaM chitristuMdani aaSistunnaanu!

హరే కృష్ణ . said...

@Hanumanth
thanks..mee lantha andamga varninchaleka poyina maa campus gurundi raastunna

హరే కృష్ణ . said...

@Prabhakar
nuvvu naa raaboye post la title content anni raasestunnav oka manchi friend ga idi neeku tagadu:)

హరే కృష్ణ . said...

@Konamanini
thank you :)

Shashank said...
This comment has been removed by the author.
Shashank said...

హరేకృష్ణ 1 ఆ? క్లోన్లు కూడా ఉన్నారా బాబు? ఒక్కడిని తట్టుకోవడమే కష్టం గా ఉంది. నువ్వు చెప్పిన దినచర్యలో ఇంకొంచం మార్పు తో మా ఎం.ఎస్ డేస్ గడిచాయి. ఇంజినీరింగ్ లో ఇంట్లోనే ఉండేవాడ్ని సో అంత లేదు. ఎదో కాలేజీ కి వెళ్ళీ అటు నుండీ అటే శిల్పా వైన్స్ దర్శించడం అంటే అది వేరే మాట.

బాగుంది నీ బ్లాగు. ఇంతకి పాముని సింగల్ ఫింగర్ తో పట్టుకున్నావా లేదా?

హరే కృష్ణ . said...

చాలా థాంక్స్ శశాంక్.. పాము ని మేము ఫింగర్ తో పట్టుకొనే లోపే అది మాకు హ్యాండ్ ఇచ్చింది :)

Aditya Maddula said...

whoaa,, missed reading the post.. best of hare krishna so far..

హరే కృష్ణ . said...

@Aditya
Thanks Adi..neeku nachindi nenu happy :)