Pages

Wednesday, November 23, 2011

హెంతో.. హింసో... హ హ్హ హ్హ..రాత్రి తిన్న పిజ్జా అరగక అడ్డమైన బ్లాగులు చదివి మీడియా ప్లేయర్ ఆన్ చేసుకొని ఖర హర ప్రియ రాగం లో హమ్ చేసి చిన్నగా కునుకు తీస్తూ. limit as గురక tends to 120 dB తో ప్రపంచాన్ని  మర్చిపోయి పవళించాక

జామురాతిరి జాబిలమ్మ పాట తో జడుసుకుంటూ ఉలిక్కిపడి లేవడం, వెంటనే అలారం ఆపేసి మరో గంట ఆదమరిచి నిద్ర పోయి బ్రెడ్ అండ్ జామ్ తో బ్రేక్ ఫాస్ట్.. ఇంతకంటే కావాల్సింది ఇంకేంటి..yes

సరిగ్గా అప్పుడే గుణశేఖర్ కి అశ్వనీదత్.. తెలుగు ఇండస్ట్రీ కి చిన్ని కృష్ణ దొరికినట్టు మా సో కాల్డ్ సొసైటీ వాళ్ళకి తాగిన టీ అరగక పెందలాడే హైబ్రిడ్ పందుల్లా  హా హ్హా హహ్హా హహ్హా అని ఆహాకారాలు మొదలు పెట్టడం

అసలే రెండింటి వరకు డెడికేషన్ చూపించి నిద్రపోయే బుజ్జి బ్రహ్మీలకు పాచి మొహం తో పులిహోర దద్దోజనం కలిపి పెట్టేసేవారు..పొద్దున్న ఆరున్నర కే ఈ అంబానీ ఫేమిలీస్ అంతా అంబా అంబా అని ఓండ్ర పెట్టడం తో మాకు మిగిలింది చివరికి మామిడి తాండ్రే...

నేను చెప్పేది ఏమిటంటే
తెల్లవారు జామునే కిసాన్ జామ్ లా  తియ్యగా కొక్కొరోకో అని వినాల్సిన సుకుమారమైన చెవులతో..కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ అని ఆర్తనాదాలు మొదలు పెట్టి పరుగు తీస్తుంటే ఆ  బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా ?


    
డర్టీ పిక్చర్ సినిమా వల్ల ఇమ్రాన్ హష్మీ కి విద్యాబాలన్ నుండి సీరియస్ కాంపిటీషన్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెట్టి ఇదే విషయాన్ని తనని అడిగితే
form is temporary .... class is permanent.అని అన్నాడంట


నర నరాల్లో జీర్ణించుకుపోయిన ఈ ధనావేశ వైఖరి ని నా నోట్లో సెరెలాక్ కుక్కేస్తూ నెట్టుకోస్తుంటే..నెట్ కనెక్షన్ వాడు మా అజాగ్రత్తతో, పొగరు తో బిల్ కట్టలేదని కనెక్షన్ పీకి పారేసాడు..

అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట వీళ్ళ గోలతో వేగలేకపోతుంటే పక్క అపార్ట్మెంట్ లో ఉన్న చిన్న పిల్లల ఏడుపులు ఆటలు కింద ఫ్లాట్ లో సుప్రభాతాలు వెరసి మాకు పట్టపగలే భూతాల దీవి సినిమా కనిపించేది.

సినిమా ఫ్లాప్ అయితే  ప్రొడ్యూసర్లు దూకడానికి హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ అయినా ఉంది.. ముంబై లో మాకేంటి దిక్కు ఇక లాభం లేదు అనుకొని

తియ్యరా Android వెయ్యరా కర్చీఫ్ అని operation Android స్టార్ట్ చేసి వాళ్ళకి పోటీ గా మేమొక క్లబ్ inaugurate  చేసి ఇలా ప్రోమోస్ సొసైటీ క్లబ్ నోటీస్ బోర్డ్ లో అతికించి పడేసాం


దనపు అదృశ్య శక్తుల ఆరోగ్య వ్యాయామ్య Sala అని బయట బోర్డ్ కూడా పెట్టేశాం..ఎలానో పొదున్న అయిదింటికే భరించలేని గోలకు మన వంతుగా రాత్రి రెండు గంటలకు నిద్రపోయే ముందు ఇలా మా హాల్ లో పిచ్చగా క్రికెట్ ఆడేసి వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం.
Tuesday, November 15, 2011

కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్..

డెఫినిషన్ =పనేంటి,నీకెంత..నాకెంత.


ఒక బ్లాగర్...
పోస్ట్ రాసే ముందు
అబ్బా ఎలా మొదలు పెట్టాలి..అయినా వేటగాడు వెధవైతే సింహం 70MM లో కొమరం పులి సినిమా చూపించిందంట..
చదివేవాడు ఉంటే మనం రాసేది ఏదైతే ఏంటి..
ఆఫీస్ లో పని చేసే ప్రజలంతా మేనేజర్ మీద ఉన్న మొత్తం కోపాన్ని  పోస్ట్ లో చూపిస్తే, పోస్ట్ default గా డూపర్ సూపర్ అవుతుంది అనే గుడ్డి నమ్మకం తో మూగ బాషలను వేల పేజీల కొద్దీ రాసేయడానికి రడీ అయ్యి 

వెంటనే చించి చించి అలోచించి అదే కోపాన్ని రాతలలో చూపించి పడుకొనే ముందు పోస్ట్ వేసాక
బిక్షగాడికి బిర్యానీ దొరకక బావురుమన్నట్టు పెందలాడే లేచి ఖాళీ డేష్ బోర్డ్ చూసుకొని దొంగ మొహాలు.. దొంగమొహాలు..
కళా పోషణ లేని కబోదులు అని తిట్టుకొని నిద్రపోవడానికి ప్రయత్నించి  భంగపడి దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ  పగులు వేగం (బ్రేక్ ఫాస్ట్) చేసాక..
మనసులో మరెన్నో ఆలోచనలు

ఎంత(మోసం+దగా+కుట్ర), ఎన్ని కామెంట్లు రాసాను వీళ్ళ బ్లాగుల్లో...దీనికి తోడు దెయ్యాలు తిరిగే టైం లో సైతం
బజ్జులో బకరాలా ఎన్ని లైకులు కొట్టాను..కామెంట్లు పెడుతున్నాము కదా అని రెండు రోజులకొక పోస్ట్ రాసి పడేస్తే ఎన్నని లైకులు కొట్టము.. ఎన్ని కామెంట్లని పెట్టము I'm asking you.
వీళ్ళ బ్లాగుల్లో కామెంట్లు కూలిపోను, వీళ్ళు పోస్ట్ లు రాసేటప్పుడు సేవ్ అవ్వకుండా సర్వర్ ఆగిపోను.. అని వీధి కొళాయిల తిట్లు తిట్టేసి..
డైలీ బ్లాగర్ల కు  వీక్లీ బ్లాగర్  లోకువ అని ఊరికే అనలేదు.
ఎంత చాంతాడంత బ్లాగు పోస్ట్ కి అన్ని గాలి కామెంట్లు అని రెండు సామెతలు నెమరు వేసి

ఎక్సెల్ ఓపెన్ చేసి
వారాంతపు బ్లాగ్ రెస్పాన్స్ రిపోర్ట్ ని ఎంటర్ చేసి  రాసిన కామెంట్లు, వచ్చిన కామెంట్లు,బజ్జు లో లైక్ కొట్టి కామెంట్లు పెట్టని వాళ్ళ లిస్ట్ తయారుచేసుకొని
ఫైనల్ గా  కాస్ట్ బెనిఫిట్ షీట్ ని ఉగాది పంచాంగం లో  అవమానం,రాజ పూజ్యం,బాలయ్య శ్రీ రామరాజ్యం లాంటివన్నీ దీర్ఘంగా పరిశీలించి..

లబో దిబో మంటూ గుండెలు బాదేసి గుండీలు కొరికేసి ఆ  మరుసటి రోజు, కొంత మంది డైలీ బ్లాగర్ల వల్ల మన పోస్ట్ కిందకు తొక్కబడి మనం తొక్కలే అని అనుకొని  రాత్రి నిద్రపోవడంతో  ఆ  పోస్ట్ చరిత్ర ముగుస్తుంది

ఇన్ని జరుగుతున్నా కేవలం ఫాలోవెర్ అనే అభిమానం తో కనీసం వాళ్ళకి బ్లాగు కూడా లేకపోయినా బజ్జు లో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ నస భరించలేక తెలుగు లో రాయలేకపోయినా కూడా రోజుకి వందలాది లైకులు కామెంట్లు పెడుతూ sportive గా ఎంజాయ్ చేస్తూ తిరిగి ఏమీ ఆశించని వ్యక్తులలో ఒక మంచి ఉదాహరణ 
మా బజ్జు మిత్రుడు,సహృదయుడు అయిన సంతోష్ కి హృదయపూర్వక జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ Cost Benefit Analysis of Birthday Cherish (CBABC ) చాప్టర్ ని ముగిస్తున్నాం.

సంతోష్,ఇలానే బజ్జుల్లో బ్లాగుల్లో తిరుగుతూ ఈ కింది మెసేజ్ ని వచ్చే సంవత్సరానికి కూడా మళ్ళీ Yes బటన్ కొట్టి జయప్రదం చేయాల్సింది గా కోరుతున్నాము ;)

Saturday, November 12, 2011

మరో వికెట్...
ఎవరి పేరు వింటే బ్ర బ్లా స సభ్యులు కేరింతలు కొడతారో
ఎవరి పేరు చెబితే బ్లాగ్ లో టమోటా పులుసు,వంకాయ పప్పుతో కలసి  ఏరులై పారుతుందో
ఎవరి బ్లాగర్ ప్రొఫైల్ చూస్తే జిల్ జిల్ జిగా అని జజ్జనకలు చేస్తారో అతనేనండీ అతనే మా కార్తీక్.

నిన్నటి బ్లాగు బ్రహ్మచారులే చారు కాచుకోలేని  నేటి మహా కుటుంబరావులు అని మళ్ళీ నిరూపిస్తూ
బ్రహ్మ చారుల లోకం లో ఒకరు సంసార పెవిలియన్ బాట పట్టడం మా అసోసియేషన్ కి తీరని లోటు అని తెలియచేసుకుంటూ 

pic1.jpg


ఇదే బాట పడుతున్న మిగతా బ్రహ్మచారులకు ఈ పాట అంకితం చేస్తున్నాంసెలవు తీసుకొనే ముందు మీకొక విషయం చెప్పాలి.Yes, I have to tell it now..

butamit.jpg
Someone to SRK: hey Sharukh,Salman and Amir both have been arrested in England
SRK:what a great news, Now I'm the best.  అని అన్నాడంట..


అలానే ఇప్పుడు ఈ బ్ర.బ్లా.స సంఘానికి నేనే ప్రెసిడెంట్ ని :)

తక్షణం
తన పదవులను లాక్కొని స్వీకరించి, పదవీ దుర్వినియోగము చేయకుండా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని నేను ఇలా ప్రతిజ్ణ పూనుతున్నాను

  
బ్ర.బ్లా.స నా బ్లాగు భూమి..రెండో లైన్ నిజం కాదు ;)
నేను నా బ్లాగును ప్రేమిస్తున్నాను
ఈ బ్ర బ్లా స కోసం నేను నా బ్రహ్మచర్యాన్ని  సైతం త్యాగం చేయడానికి సిద్ధం గా ఉన్నాను :P
అని ప్రతిజ్ణ ని ముగిస్తూ మరొక్కసారి..

ప్రియ మిత్రమా,
మీరు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా వుండాలని ఆ దేవుణ్ణి సదా ప్రార్ధిస్తున్నాను.

  

 

డియర్ రీడర్స్, ఇది మీకోసం 

Wednesday, November 2, 2011

సెరెలాక్ హోమ్స్ !

హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో చీర కట్టుకొని ఒక అమ్మాయి వాళ్ళ  ఫ్యామిలీ తో కలసి దేవాలయం నుండి అప్పుడే బయటకు వస్తోంది.

కార్ తీసుకురావడానికి కొద్ది దూరం లో ఉన్న పార్కింగ్ ఏరియా కి మన సంధ్య వెళ్తుండగా సడెన్ గా కొరడా తో కొట్టిన ఫీలింగ్..కెవ్వ్ కేర్ మంటూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి(నొప్పి పుట్టిందని కాదు డ్రెస్ కి బురద అంటుకుంది అని)
వెంటనే వెనక్కు చూస్తే ఎర్ర చీర కట్టుకున్న కధానాయకి కి ఒక బర్రె తోక కనిపించింది. రెండు సెన్సార్ డైలాగ్ లు బర్రె మీద వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మొరపెట్టుకోవడం తో
సంధ్య తండ్రి:పద ఆ  బర్రె యజమానిని నిలదీద్దాం..అని ఆ  బర్రె ని ఫాలో అవుతూ ఆవులు గేదెలను పరిశీలిస్తూ దగ్గరలో ఉన్న ఒక బర్రె హోమ్ లోపలి వెళ్ళి పశువుల బాంధవుడు అయిన పశుపతి తో

బర్రె బావుంది,ఎన్ని లీటర్లు ఇస్తుందేంటి
పశుపతి:అది మగ బర్రె బాబయ్యా..
 అవునా,అదేంటి మగ బర్రెలు స్లిమ్ గా ఉంటాయని మిల్కా సింగ్ అలా చెప్పాడు..నిజం చెప్పు ఒట్టు ?
విండోస్ మీడియా ప్లేయర్ లో టైపు చేసే విజయకాంత్ మీద ఒట్టు బాబయ్యా

సంధ్య:ఎహే మీ గోల ఆపండి..పశుపతి గారు..మీ బర్రె తన తోకతో నన్ను కొట్టింది తెల్సా ?
పశుపతి:అది చిన్నప్పటి నుండి అంతేనమ్మా నువ్వు అవేం పట్టించుకోకు..అసలే తండ్రి ఎవరో తెలియని బుజ్జి బర్రె, కాస్త గారాబం ఎక్కువ, అసలు దాని పేరే జల్సా జలజ  
ఈరోజు నేను వదిలేస్తే రేపు ఇంకొకరు నాకు జరిగిన ఈ కొరడావమానం వేరొకరి జరగడం నాకిష్టం లేదు
పశుపతి:ఇప్పుడు ఏం చేస్తావమ్మా మా బంగారు బర్రె ని, మా జలజ పాలిట జలగ లా తయారయ్యావ్

వెంటనే తన బేగ్ లో ఉన్న డబ్బా తీసింది..చూడడానికి పాల డబ్బా లా ఉంది
పశుపతి:ఇదేంటి ఫినాయిలా?...లేక గమాక్సినా ?
సంధ్య:చెంచాడు సెరెలాక్ గుప్పెడు నీళ్ళు మిక్స్ చేస్తే వచ్చిన జలజ లకిడి తింగరౌషదం అని చెప్పి  బాటిల్ లో ఉన్నదంతా కుడితి లో కలిపేసాక
కాసేపటకి భైరవ్య దీపం లో శాపగ్రస్తుడైన బాలకృష్ణ లా బెంబేలెత్తిపోయి బర్రె బుద్ధిమంతురాలుగా మారిపోవడంతో
పశుపతి:what's happening , it's a biracle (బర్రెల బాషలో miracle ) 
సంధ్య తండ్రి:my daughter works for oracle, ask any of the locals
పశుపతి:లోకుల్ కాకుల్...i don't care what you say, I only handles the business of బర్రెల్స్!

సంధ్య:What are you talking,ఇప్పుడు ఆ  పాలు పితుకు right now
వెంటనే పశుపతి చిన్న గిన్నె తీసుకొని పితకడం మొదలెట్టాక ఎలెక్ట్రిక్ బోర్డ్ వాడు సప్లయ్ చేస్తున్న మిల్క్ ప్రొడక్ట్స్ లా మెరిసిపోతున్నాయి
సంధ్య:సెరెలాక్ పవర్ చూసావా,ఆది సినిమా లో NTR కి కూడా మా పాలే తాగించాము గ్రాఫిక్స్ కి ఖర్చు ఎక్కువైపోతుందని ప్రొడ్యూసర్ గోల పెడుతుంటే తెలుసా
ఈ మెరుపు ఉన్నది చూడు, తాగిన వాళ్ళ  మెదడు లోకి డైరెక్ట్ గా వెళ్ళి అది మరింత చురుకుగా  పనిచేయడం మొదలెడుతుంది అది మాటర్ అని చెప్పి
అసలు సెర్లాక్ తిన్న ఏ జీవి అయినా ఎలా అలోచిస్తుందో తెలుసా నీకు
ఉహు చూసుకో అని రెండు పవర్ ఫుల్ డైలాగ్ లు కొట్టి కోడి రామకృష్ణ సాక్షిగా ఈ ఉదాహరణ చూపించి

                                                       మామూలు  కోడి vs సెరెలాక్ కోడి 


 తను కంపోస్ చేసిన పాట వినిపించింది

కిలిమంజారో..భళా ఇది సెర్లాక్ బేబీ రోయ్ పాలపొడి కి ఒక స్పూన్ పట్రారోయ్ రారోయ్ రారోయ్..ఆహా ఆహా
మొహొంజోదారో..ఇది బజ్జుల బుజ్జి రోయ్ నువ్వే బజ్జీలేసి పిచ్చిక్కెంచేయ్ రోయ్  యారోయ్ యారోయ్.. ఆహా ఆహా
చుట్టూ చూసి గుప్పెట పట్టి కిచెన్ లోని పళ్ళెం లోన పెట్టేయ్ 
అరచేతిలో అట్టే పెట్టి నోటిలో మొత్తం దులిపేయ్ ఆహా ఆహా ఆహా ఆహా..

పెదరాయిని లాగా వచ్చి  పిల్లల సెరలాక్ ను చోరీ చేసేయ్
సుగరు  బెల్లం అన్నీ కలిపి మిల్క్ షేక్ వల్లే తాగేయ్

హైదరాబాద్ లో సగం సెరెలాక్ నా దగ్గర ఉంది తెలుసా..
బోర్నవిటా అన్నావంటే బొజ్జ పిజ్జా అయిపోద్ది బుడుగా

పచ్చగడ్డో అంది మా పెరడు కోడి
గాలి వానో అంది ఓ దున్న జీవి  
ఒహ్హో ఒహ్హో అని కోరస్ ఎంచుకోండి
సెరెలాక్ తో జున్ను చేసి పోండి .జున్ను చేసి పోండి ....