Pages

Wednesday, November 2, 2011

సెరెలాక్ హోమ్స్ !

హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో చీర కట్టుకొని ఒక అమ్మాయి వాళ్ళ  ఫ్యామిలీ తో కలసి దేవాలయం నుండి అప్పుడే బయటకు వస్తోంది.

కార్ తీసుకురావడానికి కొద్ది దూరం లో ఉన్న పార్కింగ్ ఏరియా కి మన సంధ్య వెళ్తుండగా సడెన్ గా కొరడా తో కొట్టిన ఫీలింగ్..కెవ్వ్ కేర్ మంటూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి(నొప్పి పుట్టిందని కాదు డ్రెస్ కి బురద అంటుకుంది అని)
వెంటనే వెనక్కు చూస్తే ఎర్ర చీర కట్టుకున్న కధానాయకి కి ఒక బర్రె తోక కనిపించింది. రెండు సెన్సార్ డైలాగ్ లు బర్రె మీద వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మొరపెట్టుకోవడం తో
సంధ్య తండ్రి:పద ఆ  బర్రె యజమానిని నిలదీద్దాం..అని ఆ  బర్రె ని ఫాలో అవుతూ ఆవులు గేదెలను పరిశీలిస్తూ దగ్గరలో ఉన్న ఒక బర్రె హోమ్ లోపలి వెళ్ళి పశువుల బాంధవుడు అయిన పశుపతి తో

బర్రె బావుంది,ఎన్ని లీటర్లు ఇస్తుందేంటి
పశుపతి:అది మగ బర్రె బాబయ్యా..
 అవునా,అదేంటి మగ బర్రెలు స్లిమ్ గా ఉంటాయని మిల్కా సింగ్ అలా చెప్పాడు..నిజం చెప్పు ఒట్టు ?
విండోస్ మీడియా ప్లేయర్ లో టైపు చేసే విజయకాంత్ మీద ఒట్టు బాబయ్యా

సంధ్య:ఎహే మీ గోల ఆపండి..పశుపతి గారు..మీ బర్రె తన తోకతో నన్ను కొట్టింది తెల్సా ?
పశుపతి:అది చిన్నప్పటి నుండి అంతేనమ్మా నువ్వు అవేం పట్టించుకోకు..అసలే తండ్రి ఎవరో తెలియని బుజ్జి బర్రె, కాస్త గారాబం ఎక్కువ, అసలు దాని పేరే జల్సా జలజ  
ఈరోజు నేను వదిలేస్తే రేపు ఇంకొకరు నాకు జరిగిన ఈ కొరడావమానం వేరొకరి జరగడం నాకిష్టం లేదు
పశుపతి:ఇప్పుడు ఏం చేస్తావమ్మా మా బంగారు బర్రె ని, మా జలజ పాలిట జలగ లా తయారయ్యావ్

వెంటనే తన బేగ్ లో ఉన్న డబ్బా తీసింది..చూడడానికి పాల డబ్బా లా ఉంది
పశుపతి:ఇదేంటి ఫినాయిలా?...లేక గమాక్సినా ?
సంధ్య:చెంచాడు సెరెలాక్ గుప్పెడు నీళ్ళు మిక్స్ చేస్తే వచ్చిన జలజ లకిడి తింగరౌషదం అని చెప్పి  బాటిల్ లో ఉన్నదంతా కుడితి లో కలిపేసాక
కాసేపటకి భైరవ్య దీపం లో శాపగ్రస్తుడైన బాలకృష్ణ లా బెంబేలెత్తిపోయి బర్రె బుద్ధిమంతురాలుగా మారిపోవడంతో
పశుపతి:what's happening , it's a biracle (బర్రెల బాషలో miracle ) 
సంధ్య తండ్రి:my daughter works for oracle, ask any of the locals
పశుపతి:లోకుల్ కాకుల్...i don't care what you say, I only handles the business of బర్రెల్స్!

సంధ్య:What are you talking,ఇప్పుడు ఆ  పాలు పితుకు right now
వెంటనే పశుపతి చిన్న గిన్నె తీసుకొని పితకడం మొదలెట్టాక ఎలెక్ట్రిక్ బోర్డ్ వాడు సప్లయ్ చేస్తున్న మిల్క్ ప్రొడక్ట్స్ లా మెరిసిపోతున్నాయి
సంధ్య:సెరెలాక్ పవర్ చూసావా,ఆది సినిమా లో NTR కి కూడా మా పాలే తాగించాము గ్రాఫిక్స్ కి ఖర్చు ఎక్కువైపోతుందని ప్రొడ్యూసర్ గోల పెడుతుంటే తెలుసా
ఈ మెరుపు ఉన్నది చూడు, తాగిన వాళ్ళ  మెదడు లోకి డైరెక్ట్ గా వెళ్ళి అది మరింత చురుకుగా  పనిచేయడం మొదలెడుతుంది అది మాటర్ అని చెప్పి
అసలు సెర్లాక్ తిన్న ఏ జీవి అయినా ఎలా అలోచిస్తుందో తెలుసా నీకు
ఉహు చూసుకో అని రెండు పవర్ ఫుల్ డైలాగ్ లు కొట్టి కోడి రామకృష్ణ సాక్షిగా ఈ ఉదాహరణ చూపించి

                                                       మామూలు  కోడి vs సెరెలాక్ కోడి 


 తను కంపోస్ చేసిన పాట వినిపించింది

కిలిమంజారో..భళా ఇది సెర్లాక్ బేబీ రోయ్ పాలపొడి కి ఒక స్పూన్ పట్రారోయ్ రారోయ్ రారోయ్..ఆహా ఆహా
మొహొంజోదారో..ఇది బజ్జుల బుజ్జి రోయ్ నువ్వే బజ్జీలేసి పిచ్చిక్కెంచేయ్ రోయ్  యారోయ్ యారోయ్.. ఆహా ఆహా
చుట్టూ చూసి గుప్పెట పట్టి కిచెన్ లోని పళ్ళెం లోన పెట్టేయ్ 
అరచేతిలో అట్టే పెట్టి నోటిలో మొత్తం దులిపేయ్ ఆహా ఆహా ఆహా ఆహా..

పెదరాయిని లాగా వచ్చి  పిల్లల సెరలాక్ ను చోరీ చేసేయ్
సుగరు  బెల్లం అన్నీ కలిపి మిల్క్ షేక్ వల్లే తాగేయ్

హైదరాబాద్ లో సగం సెరెలాక్ నా దగ్గర ఉంది తెలుసా..
బోర్నవిటా అన్నావంటే బొజ్జ పిజ్జా అయిపోద్ది బుడుగా

పచ్చగడ్డో అంది మా పెరడు కోడి
గాలి వానో అంది ఓ దున్న జీవి  
ఒహ్హో ఒహ్హో అని కోరస్ ఎంచుకోండి
సెరెలాక్ తో జున్ను చేసి పోండి .జున్ను చేసి పోండి ....

28 comments:

Anonymous said...

first comment??!! :)

-bittu

Anonymous said...

హరే క్రిష్ణ,
హహ్హహ్హా....సూపర్ టపా మాష్టారు :)
>> "...it's a biracle"
టపా చదువుతూనే anticipate చేసానండి ఇది పడుతుందని... :)
>>చుట్టూ చూసి గుప్పెట పట్టి కిచెన్ లోని పళ్ళెం లోన పెట్టేయ్
స్వానుభవమా... :P భలే చెప్పారు :)
మొత్తానికి, బావుందండి... భలే నవ్వించారు
-bittu

మధురవాణి said...

వామ్మో... బాబూ హరే కృష్ణ.. అసలు నీకీ కాన్సెప్టులూ, అయిడియాలూ ఎలా వస్తున్నాయి అసలు...
<<విండోస్ మీడియా ప్లేయర్ లో టైపు చేసే విజయకాంత్ మీద ఒట్టు బాబయ్యా
:)))))))))))))))))

<< Biracle..
నవ్వలేక చచ్చాను బాబోయ్.. అసలిలాంటి పదాలు కనిపెట్టేంత చురుగ్గా నీ బ్రెయిన్ ఎలా తయారయ్యింది.. రోజూ ఏం తింటున్నావ్? :)

KFC cartoon..
LOL... :D

..nagarjuna.. said...

>>బోర్నవిటా అన్నావంటే బొజ్జ పిజ్జా అయిపోద్ది బుడుగా

sUuupar

KFC బొమ్మ వల్ల తెలిసిందేంటంటే KFC కోళ్లకు సెరెలాక్ పట్టించెదరనీ, అవి మాములు కోళ్లకంటే చిన్నవని వగైరా వగైరాల్లో నంజుకోడానికి నాటుకోళ్లే ఉత్తమని :)

Ennela said...

biracle...hahaha..looks like it is related to 'beer'
chinnappudu meer cerelak tinnaaraa!!!yee vijaykaanth yevarandee??? naaku chaalaa prasnalochchestunnaayi baaboy!! naakuu sirilakh velayyindi..mallee vastaa.
ennela

Anupama said...

mee creativity ki dandesi dandam pettali anipistondi :))


inka nundi dedication choopistanu ani matistunnanu.

Anonymous said...

నాదీ మధుర మాటే :))))


nestam akka

kallurisailabala said...

సెరెలాక్ పవర్ చూసావా,ఆది సినిమా లో NTR కి కూడా మా పాలే తాగించాము గ్రాఫిక్స్ కి ఖర్చు ఎక్కువైపోతుందని ప్రొడ్యూసర్ గోల పెడుతుంటే తెలుసా
ఈ మెరుపు ఉన్నది చూడు, తాగిన వాళ్ళ మెదడు లోకి డైరెక్ట్ గా వెళ్ళి అది మరింత చురుకుగా పనిచేయడం మొదలెడుతుంది అది మాటర్ అని చెప్పి
అసలు సెర్లాక్ తిన్న ఏ జీవి అయినా ఎలా అలోచిస్తుందో తెలుసా నీకు
చూసారా పవర్ అఫ్ సెరెలాక్
చాలా బావుంది.
పోస్టా, సెరేలాకా అని అడగకండి.

శశి కళ said...

:what's happening , it's a biracle (బర్రెల బాషలో miracle )
హయ్య...))))))))))యెమి పొస్టింగ్ నవ్వలెక
పొట్ట పట్టుకొని....))))))))))superrrrrrrr

MURALI said...

బాబోయ్ రచ్చ రచ్చ. అయినా మగ బర్రెకి పాలెలా వచ్చాయి?

హర్షవర్ధనం [HarshaVardhanaM] said...

బిరాకులస్ బోస్ట్... :)))))

నవ్వలేక సస్తున్నాం బాబు.... :)

చాతకం said...

హహహహ..సూపరు.

హమ్మో, ఒరాకిల్ కంపెనీలో పని చేసే వాళ్ళకి హెన్ని తెలివితేటలో! నేనూ అర్జెంటుగా చేరిపోవాలి ఆ కంపనీలో, సెరెలాక్ తినటానికయినా.
అయ్యో, ఎలెక్ట్రిక్ బోర్డ్ వాడు మిల్క్ ప్రొడక్ట్స్ సప్లయ్ చేస్తాడని నాకు తెలీదే? నాకు కూడా ఆ మిలమిల కావాలీ!
ఆ ఫాక్షన్ కోడి ఐడియా సూపరు. ఆ బొమ్మతో ఒక సైన్మా నే లాగించెయ్యచ్చు. ;)
సెరెలాక్ తిన్న బర్రెకి అలాంటి పాటలు వినిపిస్తే తొకతో కొరడా మళ్ళీ కొడుతుందని సంధ్య కి తెలియదనుకుంటా!
అన్నట్లు, మీకు తెలిసిన కోచింగ్ సెంటరేమయినా వుందా అలా విండోస్ మీడియా ప్లేయర్లో డాస్ టైప్ చెయ్యటం నేర్పించేది?

రాజ్ కుమార్ said...

kummEsaav...... ;)
koRaDaa debba kEkaa ;)
madhyalO kFC add rachchaa nuvve chesaavaa?

హరే కృష్ణ said...

బిట్టు :)))
థాంక్యూ :)
>>చుట్టూ చూసి గుప్పెట పట్టి కిచెన్ లోని పళ్ళెం లోన పెట్టేయ్
వారం లో అయిపోయేది డబ్బా ఆ రేంజ్ లో తినేసేవాళ్ళం :)
బోలెడు ధన్యవాద్ :)


మధుర :)))
థాంక్ యూ, థాంక్ యూ :)
>>అసలిలాంటి పదాలు కనిపెట్టేంత చురుగ్గా నీ బ్రెయిన్ ఎలా తయారయ్యింది.. రోజూ ఏం తింటున్నావ్? :)
ఇంకేం తింటాం సెరెలాకే :) కేరేజులు కేరేజులు :)))
సెరెలాక్ తింటే కుఇక్ బ్రెయిన్ మీ వెంటే అని ఊరికే అనలేదు :)
థాంక్స్ :)

హరే కృష్ణ said...

నాగార్జున
హ హ్హ :)) థాంక్స్! :)
కోళ్ళు తినే వారి పొట్టు తో టేస్ట్ కి సెరెలాక్ add చేస్తారేమో :)
వగైరా వగైరాల్లో నంజుకోడానికి నాటుకోళ్లే ఉత్తమని :) LOL
అపచారం సెరెలాకం :)

ఎన్నెల గారు థాంక్యూ :)
విజయకాంత్ ఎవరో తెలియదా
కవచకుండలాలు కలిగిన వ్యక్తి కర్ణుడు అయితే
బుల్లెట్ ప్రూఫ్ శరీరం కలిగిన ఒకే ఒక కాంతి విజయకాంత్
ఇచట ఓ మారు తిలకించుడు http://www.youtube.com/watch?v=1ir_7w79Uuw&feature=related
:))

హరే కృష్ణ said...

అనుపమ గారు మీ దండ కి బోలెడు దండాలు :)
keep visiting Thank you very much :))అక్కా, థాంక్యూ థాంక్యూ :)

హరే కృష్ణ said...

శైలా బాల గారు :))
పోస్టా, సెరేలాకా అని అడగకండి.:))))))))))))
థాంక్యూ :)


శశి కళ గారు
చాలా చాలా థాంక్స్ ! :))

హరే కృష్ణ said...

మురళీ గారు :))
తెల్లనివాన్నే పాలు కాదు నల్లనివన్నీ నీళ్ళు కాదు అని అన్నాడో మహా కవి
పశుపతి అబద్ధం చెప్పాడు కావాలనే జంతుప్రేమతో :)
థాంక్యూ :)

హర్ష :))
థాంక్యూ వెరీ మచ్ బచ్ బచ్ :))

హరే కృష్ణ said...

చాతకం గారు :)
>>అయ్యో, ఎలెక్ట్రిక్ బోర్డ్ వాడు మిల్క్ ప్రొడక్ట్స్ సప్లయ్ చేస్తాడని నాకు తెలీదే? నాకు కూడా ఆ మిలమిల కావాలీ!
హైడ్రో పవర్ generate చేసినప్పుడు కాల్షియం ఎక్కువ కలిపేస్తున్నాడు అనుకుంటా :)

>>సెరెలాక్ తిన్న బర్రెకి అలాంటి పాటలు వినిపిస్తే తొకతో కొరడా మళ్ళీ కొడుతుందని సంధ్య కి తెలియదనుకుంటా!
కెవ్వ్ కెవ్వ్ :))
>>మీకు తెలిసిన కోచింగ్ సెంటరేమయినా వుందా అలా విండోస్ మీడియా ప్లేయర్లో డాస్ టైప్ చెయ్యటం నేర్పించేది?
శ్రీ విజయకాంతా విండోస్ వండర్స్ అన్నాసాలై,సెరెలాక్ పాలై, చెన్నై లో సంప్రదించగలరు :)
నచ్చినందుకు బోలెడు థాంక్స్ :)


రాజ్ :))
థాంక్యూ థాంక్యూ :)

ఇందు said...

వామ్మో....వార్నాయనో...దేవుడో.....తమరికి ఇలాంటి అవిడియాలు ఎలా వస్తాయి స్వామీ?????
బిరాకిలా??? కెవ్వ్వ్వ్వ్!!! నీకు బర్రెల భాష కూడా తెలుసా ఆండీ ?? :) ఆ లాస్ట్లో కిలిమంజారో పాటైతే అసలు సుపరో సూపరు....నీ చేత రాయించల్సింది...ఆ పాట రాసినోడికంటే నువ్వు వందరెట్లు బెటర్ :) మొత్తానికి సూపర్,బంపర్...బిరాకులస్ బోస్ట్ ;)

..nagarjuna.. said...

>>బిరాకులస్ పోస్ట్

ఆహా ఏమి ప్రయోగం ఏమి ప్రయోగం !
క్రియేటివిటికి chain reaction తగిలినట్టుంది

Anonymous said...

IIT life గురించి బాగా తెలుసండి(స్వానుభవం :P) :)
కానీ వారం వుండేదా... చాలా గ్రేట్ మీరు. ఇక్కడ మేము ఏమయినా తీస్కొస్తే మహా అయితే రెండు రోజులు ఉంటుంది...అంతే ;)
-bittu

బులుసు సుబ్రహ్మణ్యం said...

నక్క తోక తొక్కితే అదృష్టం అని విన్నాను. బర్రె తోక తగిలితే బరైన్ బిరాక్యులస్ గా ఇంతగా పెరిగిపోతుందని ఇప్పుడు తెలుసుకున్నాను.

సూపర్ కేక రచ్చ. మీకు ఓ ఫది వీరతాళ్ళు.

హరే కృష్ణ said...

ఇందు :))
థాంక్యూ వెరీ మచ్ :)
>>నీకు బర్రెల భాష కూడా తెలుసా ఆండీ ?? :)
బేషుగ్గా తెలుసు ఇందూ, బజ్జులో ఇండియా టైమింగ్ లో పొద్దున్న పదింటికి ఆఫీస్ కి వెళ్ళి మేము బజ్జులో మాట్లాడేది అదే కదా రాత్రి అంటే దెయ్యాల కబుర్లు చెప్పుకొనే వరకు :))
థాంక్యూ థాంక్యూ థాంక్యూ :)

నాగార్జున , నేను కూడా హర్ష ఇందు కామెంట్లు చూసి గట్టిగా నవ్వేసా ఆఫీస్ లో :))
బిరాకులస్ :D
చైన్ reaction కెవ్వ్ :)))))))))))

హరే కృష్ణ said...

గురూజీ,బోలెడు ధన్యవాదాలు :))
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :))
Happy B'day!

హరే కృష్ణ said...

బిట్టు :))
ఏమేమి కర్నాటక మెస్ కేటరర్ లు ఉన్న మీ కేంపస్ తో ఫుడ్ కి కరువు పెట్టుకున్న మా IIT Delhi తో కంపారిజానా
ఎంత మాట ఎంత మాట
మెస్ లో మూడుపూటలు తిన్నట్టు చరిత్రలో లేదే
మీ కాంపస్ నాకు చాలా ఇష్టం, పొద్దున్నే మంచి ఫుడ్ తో మనకు నచ్చినంత బూస్ట్ వేసుకొని పాలు తాగొచ్చు
సెరెలాక్ అయితే సేఫ్ అని మా జాగ్రత లో మేము ఉండేవ్వాలమని నా అభిప్రాయం ధన్యవాద్ :)
జై నేస్కాఫే :) జై జై నేస్కాఫే :)

ఇందు said...

అంటే తమరితో బజ్జులో మాట్లాడినవారందరూ బర్రెలా???? బజ్జనులారా....రండీ ఈ ఏండీని ఖండఖండాలుగా ఖండించండి. :X

మనసు పలికే said...

బిరకిలా????
జూనియర్ యన్.టి.ఆర్ కి సెరిలాక్ పట్టించారా, గ్రాఫిక్స్ కి ఖర్చెక్కువ వస్తుందని??

ఇంత క్రియేటివిటీ ఎక్కడి నుండి వచ్చింది హరే నీకు?? సూపరు టపా:) కిళిమంజారో అయితే కెవ్వు కేక..