Pages

Tuesday, November 15, 2011

కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్..

డెఫినిషన్ =పనేంటి,నీకెంత..నాకెంత.


ఒక బ్లాగర్...
పోస్ట్ రాసే ముందు
అబ్బా ఎలా మొదలు పెట్టాలి..అయినా వేటగాడు వెధవైతే సింహం 70MM లో కొమరం పులి సినిమా చూపించిందంట..
చదివేవాడు ఉంటే మనం రాసేది ఏదైతే ఏంటి..
ఆఫీస్ లో పని చేసే ప్రజలంతా మేనేజర్ మీద ఉన్న మొత్తం కోపాన్ని  పోస్ట్ లో చూపిస్తే, పోస్ట్ default గా డూపర్ సూపర్ అవుతుంది అనే గుడ్డి నమ్మకం తో మూగ బాషలను వేల పేజీల కొద్దీ రాసేయడానికి రడీ అయ్యి 

వెంటనే చించి చించి అలోచించి అదే కోపాన్ని రాతలలో చూపించి పడుకొనే ముందు పోస్ట్ వేసాక
బిక్షగాడికి బిర్యానీ దొరకక బావురుమన్నట్టు పెందలాడే లేచి ఖాళీ డేష్ బోర్డ్ చూసుకొని దొంగ మొహాలు.. దొంగమొహాలు..
కళా పోషణ లేని కబోదులు అని తిట్టుకొని నిద్రపోవడానికి ప్రయత్నించి  భంగపడి దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ  పగులు వేగం (బ్రేక్ ఫాస్ట్) చేసాక..
మనసులో మరెన్నో ఆలోచనలు

ఎంత(మోసం+దగా+కుట్ర), ఎన్ని కామెంట్లు రాసాను వీళ్ళ బ్లాగుల్లో...దీనికి తోడు దెయ్యాలు తిరిగే టైం లో సైతం
బజ్జులో బకరాలా ఎన్ని లైకులు కొట్టాను..కామెంట్లు పెడుతున్నాము కదా అని రెండు రోజులకొక పోస్ట్ రాసి పడేస్తే ఎన్నని లైకులు కొట్టము.. ఎన్ని కామెంట్లని పెట్టము I'm asking you.
వీళ్ళ బ్లాగుల్లో కామెంట్లు కూలిపోను, వీళ్ళు పోస్ట్ లు రాసేటప్పుడు సేవ్ అవ్వకుండా సర్వర్ ఆగిపోను.. అని వీధి కొళాయిల తిట్లు తిట్టేసి..
డైలీ బ్లాగర్ల కు  వీక్లీ బ్లాగర్  లోకువ అని ఊరికే అనలేదు.
ఎంత చాంతాడంత బ్లాగు పోస్ట్ కి అన్ని గాలి కామెంట్లు అని రెండు సామెతలు నెమరు వేసి

ఎక్సెల్ ఓపెన్ చేసి
వారాంతపు బ్లాగ్ రెస్పాన్స్ రిపోర్ట్ ని ఎంటర్ చేసి  రాసిన కామెంట్లు, వచ్చిన కామెంట్లు,బజ్జు లో లైక్ కొట్టి కామెంట్లు పెట్టని వాళ్ళ లిస్ట్ తయారుచేసుకొని
ఫైనల్ గా  కాస్ట్ బెనిఫిట్ షీట్ ని ఉగాది పంచాంగం లో  అవమానం,రాజ పూజ్యం,బాలయ్య శ్రీ రామరాజ్యం లాంటివన్నీ దీర్ఘంగా పరిశీలించి..

లబో దిబో మంటూ గుండెలు బాదేసి గుండీలు కొరికేసి ఆ  మరుసటి రోజు, కొంత మంది డైలీ బ్లాగర్ల వల్ల మన పోస్ట్ కిందకు తొక్కబడి మనం తొక్కలే అని అనుకొని  రాత్రి నిద్రపోవడంతో  ఆ  పోస్ట్ చరిత్ర ముగుస్తుంది

ఇన్ని జరుగుతున్నా కేవలం ఫాలోవెర్ అనే అభిమానం తో కనీసం వాళ్ళకి బ్లాగు కూడా లేకపోయినా బజ్జు లో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ నస భరించలేక తెలుగు లో రాయలేకపోయినా కూడా రోజుకి వందలాది లైకులు కామెంట్లు పెడుతూ sportive గా ఎంజాయ్ చేస్తూ తిరిగి ఏమీ ఆశించని వ్యక్తులలో ఒక మంచి ఉదాహరణ 
మా బజ్జు మిత్రుడు,సహృదయుడు అయిన సంతోష్ కి హృదయపూర్వక జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ Cost Benefit Analysis of Birthday Cherish (CBABC ) చాప్టర్ ని ముగిస్తున్నాం.

సంతోష్,ఇలానే బజ్జుల్లో బ్లాగుల్లో తిరుగుతూ ఈ కింది మెసేజ్ ని వచ్చే సంవత్సరానికి కూడా మళ్ళీ Yes బటన్ కొట్టి జయప్రదం చేయాల్సింది గా కోరుతున్నాము ;)

23 comments:

Anonymous said...

:)

Anonymous said...

image matram superr.....palindrome kuda :))))

కృష్ణప్రియ said...

:) నిజమే!
బ్రేక్ ఫాస్ట్ తెనుగీకరణ బాగుంది.

మధురవాణి said...

హహ్హహ్హా... LOL ..... :))))))))))

<<డైలీ బ్లాగర్ల కు వీక్లీ బ్లాగర్ లోకువ అని ఊరికే అనలేదు
ఎంత చాంతాడంత బ్లాగు పోస్ట్ కి అన్ని గాలి కామెంట్లు

బ్లాగు సామెతలు టూ మచ్ గా అసలు...


<< అవమానం,రాజ పూజ్యం,బాలయ్య శ్రీ రామరాజ్యం
:))))))

మా తమ్ముడు సంతోష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..
Happy Happy Birthday.. Santhosh! :)

మనసు పలికే said...

ముందుగా సంతోష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు:):) నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

హరే, నీ క్రియేటివిటీ రోజు రోజుకీ పెరిగిపోతుంది.
>>వేటగాడు వెధవైతే సింహం 70ంం లో కొమరం పులి సినిమా చూపించిందంట
>>డైలీ బ్లాగర్ల కు వీక్లీ బ్లాగర్ లోకువ అని ఊరికే అనలేదు
సూపరు :))) అయినా ఎక్కడి నుండి ఎక్కడికి లింకు పెట్టావు బాబూ:)

ఫోటాన్ said...

>>>>>అవమానం,రాజ పూజ్యం,బాలయ్య శ్రీ రామరాజ్యం<<<<

కేవ్వ్వ్వవ్వ్వ్వ్ .... హ హ హ... :))))
సూపర్ పంచ్ లు యాండీ..


జన్మదిన శుభాకాంక్షలు సంతోష్... :)

జ్యోతిర్మయి said...

:):):)

రసజ్ఞ said...

హహహ చాలా బాగుందండీ! వీళ్ళ బ్లాగుల్లో కామెంట్లు కూలిపోను, వీళ్ళు పోస్ట్ లు రాసేటప్పుడు సేవ్ అవ్వకుండా సర్వర్ ఆగిపోను.. అని వీధి కొళాయిల తిట్లు తిట్టేసి.. డైలీ బ్లాగర్ల కు వీక్లీ బ్లాగర్ లోకువ అని ఊరికే అనలేదు. ఎంత చాంతాడంత బ్లాగు పోస్ట్ కి అన్ని గాలి కామెంట్లు అని హహహ సూపరండి!

Anonymous said...

Happy birthday Santhosh
May you have a great year ahead.. God Bless You !! :) :)

వేణూ శ్రీకాంత్ said...

సంతోష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు :-)
హరే నీ క్రియేటివిటీ్తో పిచ్చెక్కించేస్తున్నావ్ :-))

సిరిసిరిమువ్వ said...

సంతోష్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

టపా టపాకి భలే వైవిధ్యం చూపిస్తారు మీరు..భలే పంచ్ లు విసిరారుగా!

రాజ్ కుమార్ said...

వేటగాడు వెధవైతే సింహం 70MM లో కొమరం పులి సినిమా చూపించిందంట..>>>

rachcha baaboi.. idi maatram :D

అవమానం,రాజ పూజ్యం,బాలయ్య శ్రీ రామరాజ్యం>>>

sametalu arpulu.. ;)


happy b'day santhosssshhhh!

బులుసు సుబ్రహ్మణ్యం said...

సంతోష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

>>>వీళ్ళ బ్లాగుల్లో కామెంట్లు కూలిపోను, వీళ్ళు పోస్ట్ లు రాసేటప్పుడు సేవ్ అవ్వకుండా సర్వర్ ఆగిపోను.. అని వీధి కొళాయిల తిట్లు తిట్టేసి.. డైలీ బ్లాగర్ల కు వీక్లీ బ్లాగర్ లోకువ అని ఊరికే అనలేదు. ఎంత చాంతాడంత బ్లాగు పోస్ట్ కి అన్ని గాలి కామెంట్లు అని రెండు సామెతలు నెమరు వేసి....
బాలయ్య శ్రీ రామరాజ్యం .....
నిజమే, మీ క్రియేటివిటీ ఎక్కిడికో వెళ్లిపోతుంటే మేమిక్కడే ఉన్నాం.
లైవ్లీ టపా. సూపర్ డూపర్.

..nagarjuna.. said...

రాజ్ కామెంట్‌ను కాపీ పేస్ట్.... :)

పుట్టినరోజు శుభాకాంక్షలు సంతోష్, పేరుకు తగ్గట్టే నీ జీవితమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.

సాధారణ పౌరుడు said...

in telugu i read as "Cast" so i thought something spicy. But you wrote for Cost ;-)

Anonymous said...

ee comment mee kosam.. mee post kosam kadu. andukani, please don't post it.
chinna spelling mistake..చించి చించి అలోచించి
akkada aa vundali kadaa :P correct cheyandi.

ఇందు said...

బ్లాగ్ తమ్ముడు సంతోష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు :)

సంతోష్ నువ్విలాగే బోలెడు పుట్టినరోజులు చేసుకోవాలని...... ఎప్పుడూ నీ పేరులో ఉన్న సంతోషమే నీ జీవితంలోను ఉండాలని కోరుకుంటున్న :)

ఆండీ చాల బాగుంది....నీ విషెస్,మధు విషెస్ నాకు చాల నచ్చాయి :)

హరే కృష్ణ said...

బిట్టు :)))
థాంక్యూ :)


కృష్ణ ప్రియ గారు :))
థాంక్స్!

మధుర బోలెడు థాంక్యూలు :)

అపర్ణ :))))))))
థాంక్యూ వెరీ మచ్ :)

ఫోటాన్ గారు మీకోసం రిప్లై ఇద్దమనుకుంటే పాత పోస్ట్ కి కార్తీక్ రిప్లై ఇస్తాడని ఇవ్వలేదు
నా బ్లాగు కి స్వాగతం నచ్చినందుకు బోలెడు థాంక్యూలు :)

జ్యోతిర్మయి గారు :)))
థాంక్యూ థాంక్యూ :)
అప్పుడప్పుడు కామెంట్లు :)

రసజ్ఞ గారు చాలా థాంక్సండీ :)

anonymous గారు థాంక్యూ ఫర్ ది రెస్పాన్స్ :)

వేణూ గారు థాంక్యూ :))

వరూధిని గారు చాలా థాంక్స్ :)
ప్రయత్నిస్తాను మరిన్ని రాయడానికి :)

రాజ్ కుమార్ :))))))
థాంక్యూ థాంక్యూ :)

నాగార్జున :))

సాధారణ పౌరుడు థాంక్స్ :)

హరే కృష్ణ said...

ఇందు, థాంక్యూ :)

శశి కళ said...

andy....iam present sir

నేస్తం said...

అయ్యో ఈ పోస్ట్ లేట్గా చూసాను..సంతోష్ కి కాస్త ఆలశయంగా శుభాకాంక్షలు..నీ పోస్ట్కి ఎప్పటిలాగానే చిరునవ్వులు

kiran said...

:))..happy birthday santhoshhh :)

vikky said...

baqagundi :)