Pages

Thursday, September 30, 2010

పార్క్ లో పదనిసలుబాల్య ప్రేమల చట్టానికి విరుద్ధంగా రాసిన పోస్ట్ అని డిమాండ్ చేసేవాళ్ళకి గమనిక 
ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు

ప్రదేశం:విజయవాడ
హైస్కూల్ రోడ్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న నిలోఫర్,నాగరాజు బ్లాగ్ లు గట్రా చదవకుండా బుద్ధిగా కాలేజ్ కి వెళ్తున్న రోజులవి.ప్రిన్సిపాల్ సడెన్గా మారడంతో ఇంకో ప్రిన్సిపల్ వైద్యనాధ్ వచ్చాడు.

వచ్చీ  రావడంతోనే వీక్లీ టెస్ట్ లలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధుల వీపులు పగలగోట్టేవాడు వైద్యనాధ్ .ఎప్పుడూ టాప్ 5 లో ఉండే నిలోఫర్&నాగరాజు బాటమ్ 5 లో రావడం తో ఇంటికెళ్ళి పేరెంట్స్ ని తీసుకురమ్మని ఆజ్ఞ వేసాడు. క్లాసులో మిగిలిన స్టూడెంట్స్ అంతా vogue magazine ని ముందుంచుకొని వండర్ వరల్డ్ చదివే వింతజీవులను చూసినట్టు  ఇద్దరినీ చూడడం తో ఇద్దరి కోపం బాలయ్య సినిమా స్థాయికి చేరుకుంది

నిలోఫర్:రాజు,నువ్వు మీపేరెంట్స్ ని తీసుకోస్తావా
నాగరాజు: తాంబూలాలు మార్చుకోవడానికా, నాకు సిగ్గేస్తోంది
నిలోఫర్:ఎహే, ఇప్పుడేం చేద్దాం
నాగరాజు:సరే!..రిసెప్షన్ లో కాసేపు కూర్చుందాం వేరే క్లాస్ కి అటెండ్ అవ్వొచ్చు

రిసెప్షన్ లో న్యూస్ పేపర్ చదువుతూ పేజీలు తిరగేస్తున్నారు.తిరగేస్తూ తిరగేస్తూ రాఘవయ్య పార్క్ పునఃప్రారంభం అనే న్యూస్ దగ్గర వచ్చేసరికి ఆగారిద్దరూ ఒకరి మొహల్లోకి ఇంకొకరు చూసుకున్నారు

నిలోఫర్: నేను రాను,వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి
నారా:వెళ్ళాలంటే కావలసింది డబ్బు,ధైర్యం కాదు
నిలోఫర్:మరి నీ దగ్గర ఉన్నాయా డబ్బులు
నారా:మొదటి రోజు ఎంట్రీ fee ఫ్రీ

నిను ఆ దరిని నను ఈ దరిని రాఘవయ్య కలిపాడు ఇద్దరినీ అని పాడుకుంటూ చేరుకున్నారు
entrance దగ్గర తొక్కిసలాట జరుగబడుతోంది అని తెలుసుకోవడానికి ఎంతోసమయం పట్టలేదు ఇద్దరికీ

కష్టపడి ముందుకు సా..గి ఒక చోట ఆగారు  

విజయవాడ వేస్ట్ మేనేజ్ మెంట్ దయవల్ల చెత్త మరియు దుర్గంధం తో కలకలలాడుతుంది ఆ అపరిసరం అంతా
చెట్టుకింద కూర్చుందామనుకుంటే అక్కడ చెట్టు కాదు కదా కనీసం మొక్క కూడా ఖాళీ లేకుండా జనంతో కట కట లాడుతోంది. అలా నిల్చొని బెనిఫిట్ షోకి చివరి నిమిషం లో నిల్చొని చూసే టికెట్ దొరికిన ప్రేక్షకుడిలా కూర్చొని 
పట్టలేని సంతోషం తో సేద తీరుతూ ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుతున్నారు.

ఇంతలో పెద్ద శబ్దం మరో రెండు క్షణాలు ఆగాక  దానికంటే ఇంకా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు
పరుగులకించుకున్నారు,మళ్ళీ తొక్కిసలాట మొదలయ్యింది ఈ సారి బయటకి పారిపోవడానికి

గేట్ దగ్గర కాసేపటికి  ఇంకా వత్తిడి పెరుగుతోంది ఊపిరి ఆడనంత పనిఅవుతున్న సమయం లో  పెద్దగా  ఢం ఢం అని శబ్దాలు ఈ సారి వినిపించాయి

జనాలు అరుపులు మొదలెట్టారు

కాసేపయ్యాక  తెలిసింది ఏమిటంటే మొదటి రోజు కావడంతో బూజు పట్టిన  స్పీకర్లు స్పెషల్ attraction గా పెట్టడం తో అపరిచితుడు లో రండక రండక పాట ఢం ఢం అని వినిపించాయి
నాగరాజు,నీలోఫర్ వెధవలైపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు
 సరిగ్గా ఆ  సమయం లోనే speaker సరిగ్గా పనిచేయడం మొదలు పెట్టింది అనుకుంటా
బ్యాక్ గ్రౌండ్ లో
ఏలా ఏలా ఏలా.. ఏలా ఏలమ్మా..ఏలా ఏలా ఏలా ఏలా..ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓలా ఓలమ్మా..
అని ప్లే అవుతోంది :)

టైటిల్ కి justification
పార్క్ లో మొదట పాట ప్లే చేసిన పాట బోయ్స్ లో  సారిగమే..పదనిసే..  పిచ్చెక్కించేసే...
thats what we say
తర్వాతి భాగం.. త్వరలో..

Sunday, September 19, 2010

జీవితవిక

బుద్ధి గడ్డి తిని ఈ మధ్య ఒక కవితా సమ్మేళనంకి హాజరయ్యాక నాకు కూడా తన్నుకొస్తున్నాయి...తవికాస్త్రాలు కాచుకోండి


విజయ్ మాల్యా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినప్పుడు ..

నేనొస్తున్నానని నువ్వు నమ్ము
నీ నమ్మకాన్ని నే చేయను వమ్ము
ఇంటికొచ్చినప్పుడు తీసుకొస్తా నీకొక రమ్ము
తీసుకురాకపోతే  నన్ను కుమ్ము
నన్నే కత్రినా,దీపికా ఆచూకి అడుగుతావా నీకెంత దమ్ము
తర్వాత ఫోన్ చేస్తా right now i'm ఇన్ జిమ్ము
----------------------------------------------
సురేష్ కల్మాడి షీలా దీక్షిత్ తో..

బతికేవాడిని కొట్టుకొంటూ డప్పులు 
ఈ గేమ్స్ దయతో తీరాయి అప్పులు
కామన్ వెల్త్  ని కాష్ చేసుకున్నాక అయ్యాను సెల్ఫ్ వెల్త్
ఇంత డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియక పాడవుతోంది హెల్త్

----------------------------------------------------------
 మొహమ్మద్ అమీర్,సల్మాన్ బట్,ఆసిఫ్ to Scotland yard

నేనొక అవినీతి ఖిలాడిని
ఈ సల్మానొక స్పాటు సూత్రధారిని
న్యూస్ఆఫ్ ది వరల్డ్ వాడు చేసాడు అందరి ముందు దోషిని

------------------------------------------------------------

ఇదంతా ఎందుకు రాస్తున్నా అంటే

ఆత్మానందానికి మీ రాక
వెలవెలబోయింది విజిటర్స్ లేక
మీ కామెంట్ తో పెట్టించారు కేక
బ్లాగ్ కి పూర్వ వైభవం వచ్చింది చక చకా
చంద్రముఖి మీద ఆన లక లకా!
హృదయపూర్వక ధన్యవాదములతో ఈ తవిక..
--------------------------------------------------

ఎవరక్కడ!! వహ్వా.. వహ్వా అని కామెంట్ పెట్టకుండా వెళ్ళిపోతుంది..!

Friday, September 10, 2010

బ్లాగు బ్రహ్మచారులారా ఏకంకండి!


బ్లాగులు మనిషికి సంతోషాన్ని ఇవ్వాలి  గానీ శాపాలను కాదు . జరిగిన నష్టానికి తోడు ఈ ఆచారాలన్నీ తనను మానసికంగా చిత్రవధకు గురిచేస్తాయని ఎవరికీ అనిపించదా? ప్రతి వ్యక్తికీ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని అతిక్రమించి ఇతరులు చొరబడే ప్రయత్నంచేస్తే అడ్డుకోవడం తప్పుకాదు. వారికి చేతనైతే సాంత్వన పలకాలి. అండగా నిలవాలి. కానీ ఉన్న ధైర్యాన్ని బలవంతంగా దోచుకునే ఈ దురాచారాలకు అడ్డుకట్ట వేయాలన్న బ్రహ్మచారుల  నిర్ణయం సరైనదే!
 ---------------------
బ్రహ్మచారులు  చాలా సెన్సిటివ్ . పైగా పని వత్తిడి , బ్రహ్మి బ్రహ్మి  అంటూ అనాదిగా ఉద్దేశపూర్వకంగా వివక్షా కామెంట్లకు పరిమితంచేసిన జాతికి ప్రతినిధి. చదువు, సంస్కారం నేర్చి... ఆర్థికంగా నిలబడి ఉన్నా ఇంకా బ్రహ్మచారి పైన అదే అణగదొక్కే ధోరణి. అంతులేని చాకిరి. ఇదీ నా మనసు, ఇదీ నా ఆలోచన అన్నా వినిపించుకునే వారే లేరు. తరతరాలుగా బ్రహ్మచారి ఆవేశాన్నీ, ఆక్రోశాన్ని పంచుకునే 'బ్లాగుడే' లేదు . తన వ్యక్తిత్వాన్ని సహించలేని, గుర్తించలేని సమాజంలో బ్రహ్మచారి ఏకాకి. కాదని తిరగబడితే 'తెగించారనే' అపవాదుతో సిద్ధంగా ఉండే సంఘంలో బ్రహ్మచారి  రెక్కలు తెగిన పక్షి.ఇన్ని విపత్కర పరిస్థితుల్లో జరగబోయే అకృత్యాన్ని అడ్డుకుని, ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన వారు చరిత్రను తిరగరాసేవారే!
  
బ్రహ్మి జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి పోరాడినవారే! అంధకారంలో బతుకుతున్న బ్లాగుని  మార్చడానికి తమ వంతు కృషి చేసినవారే! వారు బ్లాగు లోకాన్ని ఉద్ధరించలేకపోవచ్చు. కీ బోర్డు ని పట్టుకొని  రణరంగంలో దూకినట్లు లోకానికి వెల్లడి కాకపోవచ్చు. కానీ వారు బ్లాగు 'మార్పు'కు తమ పరిధిలో ప్రయత్నించినవారే! మరికొందరికి ఆ 'ధైర్యాన్ని' నూరిపోసినవారే!

బ్రహ్మచారి  కూడా మనిషేనని, తమకూ ఒక  మనసుంటుందని ఆలోచించక బ్రహ్మి కి బ్లాగ్ కు సంబంధించిన నిర్ణయాలు ఇతరులు తీసుకుని... వాటిని బలవంతంగా వారిపై రుద్దాలని చూస్తే ఈకాలం బ్రహ్మి  ఊరుకోడని బ్ర.బ్లా.స (3g గారి పేటెంట్)  నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మరెందరికో మార్గదర్శకమైంది. బ్రహ్మి  కథే ఇది.. కాదు, యథార్థ గాధ ఇది!
***
ఆఫీస్ లో deadlines తో మేనేజర్ టార్చర్ తో  బ్రహ్మచారుల మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎటూ పాలుపోని స్థితి. బాధ, దుఃఖం, ఆక్రోశం, వేదన... అన్నీ కలిసికట్టుగా బ్రహ్మచారులను ఊపిరాడకుండా చేశాయి. బ్రహ్మి లకు తనివితీరా ఏడవాలనిపిస్తుంది. కానీ కర్తవ్యం ముందు నిలవడంతో ఏడవడానికి కూడా టైం లేక తమ  కన్నీటిని వీకెండ్ కి postpone చేసుకున్నారు.

ఇన్ని సమస్యల వలయం లో కూరుకుపోయిన తర్వాత రూమ్ కి వచ్చి aggrigator ఓపెన్ చేసి బ్లాగు తెరిచిన బ్రహ్మిలకు  రెండు కామెంట్లు రాసాక వాటికి వచ్చ్సిన రిప్లై లు చూసి ఆశ్చర్య పోయారు. సైన్  అవుట్ చేసే లోపు ఆ  కామెంట్ల తీవ్ర తరాన్ని తట్టుకోలేక అతను మూర్చపోయాడు. తను కోమా లోనికి వెళ్ళాడు అది నిజమని అర్థంచేసుకోవడానికి బ్రహ్మి కు చాలా సమయం పట్టింది. చుట్టూ ఒక్కసారిగా శూన్యం. బ్లాగుల్లో అభిజాత్యం అదుపు తప్పుతోంది. అయినా శక్తిని కూడగట్టుకుని వెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నించడానికి కారణం అక్కడున్నది తనుమాత్రమే!  మాటల్లో చెప్పలేని కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా అర్థంకాలేదు .

ఇన్ని జరుగుతున్నా ఎవరూ బ్రహ్మిను సంప్రదించలేదు. కనీసం చెప్పలేదు. బ్రహ్మి ఆలోచించాడు. జరిగిన నష్టాన్ని పూడ్చబోయేది ఇంతగా తనను బాధపెట్టిన ఆ  పోస్ట్ రచయతలు కాదు. ఇకపై ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపేది వారు కాదు. ఆఫీస్ లో పనిని , పెండింగ్ ప్రాజెక్ట్ లను కొలిక్కి తెచ్చేదీ వారు కాదు.

తనకిప్పుడు కావలసింది ఆచారాల మాటున జరిగే 'తంతు' కాదు. తను కూడగట్టుకోవలసింది మనోధైర్యం. అదే తనను, తన పనిని ఒడ్డుకు చేర్చేది. తన బ్లాగ్ ప్రపంచాన్ని ఆఫీస్ ప్రపంచాన్ని అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోయిన బాధ్యతలను ఒడ్డుకు చేర్చేలా చేసేది. తననుండి ఆ 'బ్లాగ్ ధైర్యం' పారిపోకుండా... గుప్పిట్లో బంధించాలంటే ముందు ఈ 'అనాచారాలను' ఆపాలి. అందుకు తనే ఉపక్రమించాలి.ఆచారాలు మనిషికి ఓదార్పునివ్వాలి గానీ కుళ్లబొడవకూడదు. జరిగిన నష్టానికి తోడు ఈ ఆచారాలన్నీ తనను మానసికంగా చిత్రవధకు గురిచేస్తాయని ఎవరికీ అనిపించదా?
ఎన్నడూ తన మనసు తప్ప వేరే టీం మేట్స్  మనసును నొప్పించని, ఎలాంటి సాయానికైనా ముందుండే తన ఆఫీస్ వాడు ఇప్పుడూ తన వెనకుండి ముందుకు నడిపిస్తాడు అని అనుకున్నాక బ్రహ్మి కు మరింత ధైర్యం చేకూరింది.

తన నిర్ణయాన్ని ముందు తన ఆఫీస్  వారికి చెప్పాడు. అప్పటివరకూ ఈ తంతునెలా ఆపాలా అని బ్లాగ్ లో వారప్పటికే తల్లక్రిందులవుతున్నారు. మరోదారిలేక బ్రహ్మి పరిస్థితులకు తలవంచుతాడేమోనని  దిగులు చెందుతున్నారు. కానీ తను  నిర్ణయమిదీ అని తెలిశాక వారు నిశ్చింతగా ఊపిరిపీల్చుకున్నారు. నీ పీడా విరగడయ్యింది అని నృత్యాలు చేసారు భోజ్ పురి  పాటలు పాడారు . వెంటనే బ్రహ్మి ని అక్కడికి పిలిచారు. అతనొక పావుగంటసేపు "పెళ్ళి చేసుకో", "పప్పన్నం ఎప్పుడు?" "ఇంటివాడివైతే తెలుస్తుంది" లాంటి భావజాలన్ని ప్రదర్శించి తన సామూహిక అవమానం చేసారు. 

అప్పుడు బ్రహ్మి  ''ఇది నా వ్యక్తిగత విషయం. అందరూ వచ్చి గతి తార్కిక భౌతిక వాదం గురించి అర్హత లేని వాళ్ళు మాట్లాడడం నాకిష్టంలేదు. చేసిన అవమానాలన్నీ మీ అందరి సూటి పోటి మాటలతో చేయడం అంతకన్నా ఇష్టంలేదు. నేనే స్వయంగా బ్లాగ్ ఓపెన్ చేస్తాను. నాబ్లాగు కి సంబంధించినవి నా చేతులతో నేనే రాస్తాను. కామెంట్ moderation తీసే  ప్రసక్తేలేదు. అది నా యిష్టం. మీకు నన్ను చూడటం ఇష్టంలేకుంటే నాకొక aggrigator ఇవ్వండి. నేనక్కడ రాసుకుంటాను.  అని చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. ఆమాటల్లో ధ్వనించిన ఆత్మవిశ్వాసం, నాలుగు ముక్కల్లో కానొచ్చిన స్థిరత్వం ఇక మరెవ్వరినీ మాట్లాడనీయలేదు.
****************
మర్నాడు బ్రహ్మి బ్లాగ్ ఓపెన్ చేసాడు. ఈమెయిలు id ,పాస్వోర్డ్ , లేఖిని ఓపెన్ చేసి  పక్కనపెట్టాడు . లేతరంగు బాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే బ్లాగ్ ని ఫైరుఫాక్సు లో ఓపెన్ చేసాడు‌ బ్రహ్మి నిర్ణయాన్ని హర్షించినవారంతా తనకు తోడుగా పక్కనే కూర్చున్నారు. 

అటూఇటూ ఊగినవారు కూడా మరో ఆలోచన లేకుండా తన వద్దకొచ్చారు.పోస్ట్  పూర్తయిన పిమ్మట తన బ్లాగ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని తన సహా బ్లాగర్లతో  కామెంట్లు సమర్పింప చేసాక ఒక సారి నిట్టూర్చాడు. ఇదంతా చేసింది తాను బ్లాగ్ , టెంప్లేట్, ను  అలంకరించుకోవాలనే కోరికతో కాదు. తనను అలా చూడలేని తమ  సభ్యుల కోసం. తననలా హింసించి ఆనందించేవారిని అడ్డుకోవడంకోసం. ఇలా కూడగట్టుకున్న ధైర్యంతో తన బ్లాగుల  భవిష్యత్తును నిర్మించగలననే విశ్వాసం మనసుకు కలగడంకోసం!
ఇప్పుడు తమ  బ్లాగ్ పై  హెడర్  సూర్యబింబంలా వెలుగుతోంది. ఆ వెలుగు ధైర్యానికి మారుపేరులా ఉంది. ఆ వెలుగే తమను ముందుకు నడిపిస్తుంది.మరికొందరికి దారిచూపే ఇలాంటి ప్రయత్నాన్ని మనసున్నవారిగా మనమూ ప్రోత్సహిద్దాం. సంకుచిత మనసులతో కాక,బ్లాగువత్వంతో ఆలోచిద్దాం.

బ్లాగు బ్రహ్మచారులారా ఏకంకండి!

ఇ.ఉ.ఎంపీ

ఏం పీకుతున్నారు బయట కెళ్ళి + ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ = ఇంట్లో ఉండి ఏం పీకుతున్నారు ?


బ్రహ్మచారి బ్లాగర్లు జిందాబాద్!

బాచలర్ బ్లాగర్ల బిందాస్ ని తెలియచేయడానికి నాగ ప్రసాద్, కార్తీక్, తార మరియు హరే కృష్ణ ఆధ్వర్యం లో జరగబోతున్న మహా ధర్నా