వారం లో అయిదు రోజులు రాత్రనక పగలనక ఆఫీస్ లో కుమ్మించుకొని వీకెండ్ మీద గంపెడు ఆశలతో శుక్రవారం రాత్రే మల్టీ ప్లెక్స్ లో అడుగుపెడితే
The Hobbit: An Unexpected Journey సినిమాకి పీటర్ జాక్సన్ బ్రాండ్ మీద కాన్ఫిడెన్స్ తో క్రెడిట్ కార్డ్ తో స్వై'పే'సాక 3D గ్లాసెస్ తీసుకొని సీట్లో కూర్చున్నా
సినిమాటోగ్రఫీ అబ్బుర పరిచినా LOTR లో వాడిన మొత్తం అవే సెట్స్ మరియు లోకేషన్స్ ఆల్మోస్ట్ అవే కావడం తో తెరపై చూసిన ఫేవరేట్ హీరోయిన్ ని డైరెక్ట్ గా చూసినట్టు అనిపిస్తుంది.
3D ఫీల్ మాత్రం చాలా బాగుంది.
సినిమాని అంత సేపు ఎందుకు సాగతీసాడో అర్ధం కాలేదు visual గా ప్రతీ సీన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ లో శ్రద్ధ తీసుకోలేదనిపించింది
చాలా చోట్ల చూసిందే చూసినట్టు అనిపించినా LOTR లా ఉంటుంది అని అంచనాలు పెట్టుకొని వెళితే సినిమా ఖచ్చితంగా నిరాశ పరుస్తుంది.
రాత్రి సినిమా చూసేసి మూడింటికి రూమ్ కి వచ్చి ఆరుగంటలు తిరగ కుండానే మళ్ళీ సినిమా చూడడానికి అదే మల్తీప్లెక్స్ జంప్ వేసి
మా అభిమాన నటి,అందాల తార, అభినయన కేక,చీరకే అందాన్ని తెచ్చి ప్రేక్షక హృదయాలను ఉతికి ఆరేసిన సమంతా సినిమాకి వెళ్ళిపోయాం
యూత్ ఫుల్ సినిమా హౌస్ ఫుల్ అయితే ఎంత సందడిగా ఉంటుందో అంతే రచ్చలమైన వాతావరణం ఆవహించింది..
సమంతా ఇంట్రో సీన్ ఒక స్టేజ్ పై గ్రూప్ సాంగ్ పెర్ఫార్మ్ చేయడం
నేను కేకలేద్దామని సినిమాకి వస్తే మిగతా వాళ్ళు నా ముందే నాకంటే ముందే
కేకలు సినిమా అంతా వినిపించాయంటే సమంతా ఎంత బాగా చేసిందో అర్ధం చేసుకోవచ్చు
నిత్య వరుణ్ తప్ప నాని సమంతా సినిమాలో కనిపించలేదు పెర్ఫార్మెన్స్ దర్సకత్వం అంతే బావున్నాయి
దర్శకుడు ప్రేక్షకుడి కోసం ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అని అనుకున్నాడేమో మరి ఇక్కడ మాత్రం ఆ సీన్స్ ని అరుపులు కామెంట్లతో కామెడీ చేసి పడేసాం
మచ్చుకి మూడు సీన్లు
ప్రొద్దున్న పెళ్లి పెట్టుకొని రాత్రి నాని తండ్రి నాని కి జరిగే సంభాషణలో
తండ్రి:రాధిక కి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు.నువ్వు చేస్తున్నది తప్పు అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావ్? దీనికి పరిష్కారం ఏంటి
ఫ్రంట్ సీట్లో కూర్చున్నోడు గట్టిగా :రాధిక ని నేను చూసుకుంటాను నిత్య ని నువ్వు చేసుకో
సినిమా అయిపోయే పదినిమిషాల ముందు నాని సమంతా చేసే చుంబనో ఛెండాలుడో చీల్చుడు ని చూడలేక
నేను:పట్టపగలు పాచినోరు తో ఈ పాచి పరాకాష్ట అవసరమా మీకు
మూడో సీన్
నాని:అసలెందుకొచ్చావ్
మా కొలీగ్: సమంతా వాడి ని బతిమిలాడేదేంటి,అసలు ఈ ఏడుపు ఏంటి నీకు నేనున్నా పదా!
ఈ సినిమా చూసాక జండూ బామ్ కాదు కానీ సమంతా మీద బోలెడు జాలేసింది!
మనం తెలుగు వెర్షనే చూసాము
తమిళ్ లో జీవా తో కూడా ఇవే సీన్లు చేసిందే రిపీట్ చేసి పాపం ఆ స్కిన్ ప్రోబ్లం సమంతా కి ఎందుకొచ్చిందో ఈ సినిమా చూసాక కానీ నాకు అర్ధం కాలేదు
గౌతం మీనన్ దే తప్పంతా అనిపించింది.
ఎస్టాబ్లిష్ అవని హీరో నాగచైతన్యతోనే సమంతాతో అంత చేయించాడంటే
నాని తో ఎస్టాబ్లిష్ అయిన సక్సెస్ ఫార్ములా తో సమంతా తో తన పర్స్పెక్టివ్ లో పండగ చేయించడం లో తప్పులేదు అనిపించి ఉండదు.
సినిమా బాటమ్ లైన్:
న స్మూచో న సమంతా గౌతమ్ వాసుదేవ మీననః
10 comments:
న స్మూచో న సమంతా గౌతమ్ వాసుదేవ మీననః !!!
Kevvvvu....Keka !!
హాబిట్ జర్నీ లో నిద్రపోయా ఒక అరగంట :P
సమంతా ని మీ గురువు గారికి రెఫెర్ చెయ్, ఇంకా బాగా అందంగా చూపిస్తాడు :))
యాజ్ యూజువల్ , పోస్ట్ గురించి చెప్పాల్సిన పని లేదు :)
No thanks photon. Till now we all have some good memories about Samanta darling. Now you dont spoil it with fruits on her belly. just imagine. Naaa...does not work out. ;)
BTW HK, Did you put zandubalm before or after the second movie? Sure naani became an enemy over night for you?
శ్రీరామ్ గారు :))
థాంక్యూ వెరీ మచ్ :)
కెవ్వ్ హర్షా
అవును అక్కరలేని డైలాగులతో చాలా టైం వేస్ట్ చేసాడు
పోనీ కదా ముందుకు కదిలిందా అంటే అదీ లేదు
మూడు గంటలు థియేటర్లో చూడడం కష్టమే
గురూజీ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా పెడితే కాస్త ఇబ్బంది కరమే ఆ పనస పండగ చేస్తే మనకు రక్త కన్నీరే :)
చూడాలి ఈ సారి ఏసుక్రీస్తు మీద సినిమా తీస్తున్నాడని టాక్
సమంతా క్రిస్టియన్ అమ్మాయిగా బాగా సెట్ అవుతుంది కేరళా లోనే షూటింగ్ :)
చాతకం గారు,
మీరు చెప్పినదానితో అంగీకరిస్తున్నా
కెవ్వ్ మనం అన్నిటికి సిద్ధపడే ఉండాలి
ఏదో ఒక రోజు ఆ ప్రవహించే ఫ్రూట్ సలాడ్ కి సమంతా అయినా exception కాదు
updating the పోస్ట్ :)
థాంక్యూ వెరీ మచ్ :)
".. సమంతా మీద బోలెడు జాలేసింది!"
సేమ్ పించ్ !
ఇంకా హిందీలో కూడా షూటింగ్ నడుస్తోందిట కదా... పాపం సమంతా !!
హాబిట్ చూద్దామనుకున్నాను.. ఇంక డ్రాప్..
పోస్ట్ మాత్రం అరుపులు.. :D
తృష్ణ గారు హిందీ లో కూడా తీస్తున్నారా కెవ్వ్
పాపం సమంతా
గౌతం మీనన్ మరో ఎస్.జే.సూర్య లా తయారవ్వక పొతే అదే చాలు :)
Thanks!
కార్తీక్ థాంక్యూ :))
హాబిట్ సంక్రాంతి కి టీవీ లో వేసినా ఆశ్చర్యపోనక్కరలేదు అలా ఉంది సినిమా
Post a Comment