Pages

Saturday, March 2, 2013

The Attacks of 26/11




 

ఈ సినిమా చూస్తే ఒరిగేదేంటి ?
సినిమా చూడడం వలన ఫాంటసీ లను స్క్రీన్ మీద చూడడమే తప్ప. గ్రౌండ్ రియాలిటీ చూపించడం చాలా అరుదు.

  
ఒసామా బిన్ లాడెన్ ని ఎలా చంపారో జీరో డార్క్ థర్టీ అనే సినిమా గత నెల రిలీజ్ అవడం ఆస్కార్ కి నామినేట్ అన్నీ జరిగి వెళ్ళిపోయాయి.

9/11 తర్వాత  దానికంటే  ప్రపంచంలో భయంకరమైన దారుణాలు కళ్ళముందే జరుగుతున్నా అది మర్చిపోయేలోపే మళ్ళీ అమాయక ప్రజలు బలైపోతున్నారు.

Joint police commissioner అయిన నానా పటేకర్ Inquiry Commission కి 26/11 నాడు జరిగిన సంఘటనలు వివరిస్తుండడం తో సినిమా స్టార్ట్ అవుతుంది

                           

కాజువల్ గా ముంబై రోడ్లపై నడుస్తూ  AK-47 లు పట్టుకొని  అరవై గంటల పాటు సాగిన మారణ కాండ లో చనిపోయిన నూట అరవై మంది గాయపడిన వందల మంది మరెన్నో విషయాలను గుర్తుచేసుకుంటాడు.

తాజ్ మహల్ హొటల్ సెట్ as it is గా వేసిన ఆర్ట్ డైరెక్టర్,సినిమాటోగ్రఫీ తో పాటు సౌండ్ సినిమాకి ఎంత ముఖ్యమో వర్మ చెప్పకనే చెబుతాడు.

ముఖ్యంగా తాజ్ హోటల్ లో విదేశీయులను హోటల్ స్టాఫ్ అందరినీ చంపేసే దృశ్యం కిరాతకంగా ఉన్నా అక్కడ  చిన్న పిల్లలని చంపడం కూడా చూపిస్తాడా అని అనుమానం వచ్చింది.అక్కడ అది సౌండ్ ద్వారా మేనేజ్ చేయడం కాస్త రిలీఫ్.

తాగడానికి నీళ్ళు ఇచ్చిన గుడిసె లో ఉండే వ్యక్తి  ని కూడా కసబ్ చంపేయడం లాంటి సన్నివేశాలు ఇంకా బాధను కలిగిస్తాయి    

వర్మ ఈ సినిమాని అలా వదిలేయకుండా ఇన్ సైట్ లోనికి వెళ్లి ఉంటే ఇంకా బావుండేది అని ఎవరో అన్నారు
ఇన్సైట్ లోనికి వెళ్ళడానికి TRP చానల్ ఓనర్/రిపోర్టర్ కాదు కదా RGV
ఒక భారతీయుడుగా తను ఈ క్షుణ్ణంగా, చాలా రియలిస్టిక్ గా ఈ సినిమాను తీసిన రామూ అభినందనీయుడు.

లియోపోల్డ్ కేఫ్ లో జరిగిన అటాక్ తర్వాత మన పోలీసులు లాఠీ లు పట్టుకొని టెర్రరిస్ట్ లను పట్టుకోవడానికి రాళ్ళు విసిరే సన్నివేశం  మన సెక్యూరిటీ వ్యవస్థ ను,ప్రజలకు రక్షణ లేమి, మన ఇంటిలిజెన్స్ వైఫల్యాన్ని స్పష్టం గా తెలియచేసాడు.

రెండో సగం లో కసబ్ పైనే కేంద్రీకరించడం, కాల్పుల్ని తగ్గించడం
నానా పటేకర్ కసబ్ మధ్య సీన్స్ అన్నీ కుక్కకాటుకి చెప్పుదెబ్బలా బాగా తీయగలిగాడు

చివర్లో నానా పటేకర్ నీ అంత వయసున్న కొడుకు నాకు ఉన్నాడు అని చెప్పడం
బ్రెయిన్ వాష్ కి మతం యొక్క ఆత్మను కసబ్ కి చెప్పే సన్నివేశం చాలా బావుంది.

ముంబై లో ఈ సంఘటన జరిగినప్పుడు దగ్గరలోనే ఉన్న నేను ఎంత భయాందోలనలకు లోనయ్యానో ఈ సినిమా చూసినప్పుడు అదే భయం కలిగించేలా సినిమా మొత్తం తీసిన రామ్ గోపాల్ వర్మ కి హాట్స్ ఆఫ్!

Bottom Line:
When did the last time you witnessed after movie got ended and the whole Audience claps unconditionally
The Attacks of 26/11-It's not a film,Its the Truth.

8 comments:

వేణూశ్రీకాంత్ said...

Awesome hare thanks for the update.

శ్రీనివాస్ పప్పు said...

యెస్సో సేం విత్ యూ హరే (నేనూ నిన్ననే చూసేసా మేటినీ షో ఖార్‌ఘర్ ఇనాక్స్ లో)

Anonymous said...

When did the last time you witnessed after movie got ended and the whole Audience claps unconditionally

నాకు గుర్తుకు లేదు. బహుషా అంత గొప్పగా ఉన్నవి చూడక పోవడం కారణమనుకుంటా. ప్రజల ఎమోషన్లను అంత గొప్పగా ప్రభావితం చేయగల సినిమా బహుషా నేను చూసిన వటిలో లేదనుకుంటా.. !!

మీరు రాసింది చదివిన తరువాత, రాం గోపాల్ వర్మను ఖ్సమించేశాను. RGV ki Aag సినిమా తీసినందుకు, ఇంకా మరిన్ని సినిమాలతో, ట్విట్టరులో పిచ్చి రాతలతో జనాల్ని విసిగించిన విషయములో కూడా... :-D

హరే కృష్ణ said...

వేణూ గారు థాంక్స్ :))
ఎందుకో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి

శ్రీనివాస్ పప్పు గారు కెవ్వ్!
థాంక్స్ :)

హరే కృష్ణ said...


హహహ్హ శ్రీకాంత్ క్షమించలేనంత పెద్ద తప్పు చేసాడని ఫిక్స్ అయిపోయావా ;))
ఆర్ జీ వీ బ్లాగ్/ట్విట్టర్ లోనే ఎక్కువసేపు గడుపుతాడేమో అని నాకు కూడా అనుమానం వస్తుంది.
సౌండ్ తో పాటు RGV పిక్చర్ షేడ్ విత్ స్లో-మోషన్ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి.
Thankyou :)



శశి కళ said...

meeru mumbai kabatti ee cinima inkaa baaga nachchi untundi

karthik said...

>>The Attacks of 26/11-It's not a film,Its the Truth.

thats why i am afraid to watch this.. so painful but real :((

నవజీవన్ said...

వర్మ తీసిన ఈ సినిమా ఒక Documentary ని పోలి ఉంది. ఒక ఘటనను తెరకెక్కించడం లో వర్మ ఎప్పుడూ ఘనాపాటే. అయితే ఇంత హింస వలన ప్రయోజనం ఏమిటి? జనాలకు వెళ్తున్న సందేశం ఏమిటి? వర్మ తీసిన ఏ సినిమాలో కూడా Resolution ఇవ్వడు. కాని ఆలోచించడానికి ప్రేక్షకుడు ప్రయత్నిస్తాడు. ఈ సినిమా జనాలకు కనెక్ట్ అయినా కాకపోయినా వర్మ అనుకున్నది తీసేసాడు అంతే ...!