Pages

Wednesday, June 22, 2011

రెట్రో రుమాంటిక్

చిన్నతనం నుండి ఇంటిదగ్గరే పెరిగి నూట యాభై కిలోమీటర్ల దగ్గర లో ఉన్న సిటీ లో మంచి సీట్ వచ్చినా ఇంటిని వదిలి వెళ్ళాలి అన్న ఒకే ఒక ఉద్దేశ్యం తో తమ ఊర్లోనే ఇంజనీరింగ్ చదివి తమ ఊరే లోకంగా పెరిగిన అంతరిక్ష్ ఉద్యోగం కోసం బోంబే వెళ్ళక తప్పలేదు..కాలేజ్ లో హిందీ క్లబ్ లో చురుగ్గా ఉండడం చేత బాష వల్ల ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నప్పటికీ.. ఇంటి దగ్గర ఉండడం లేదు అనే బాధ.. అమ్మా,నాన్నలను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎక్కువై జాబ్ లో చేరిన కొద్ది రోజులకే అంతరిక్ష్ కి ప్రశాంతత కరువయింది

.ఇంటికి తరచుగా వెళ్ళి వస్తున్నా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆవహించి The city Never sleeps లో నిద్ర కరువై రోజు రోజుకి frustration పెరిగిపోతోంది

చాలా మంది స్నేహితులు బంధువులు ఉన్నా కూడా ఎవరి బిజీ జీవితాల్లో వాళ్ళు తల మునకలై ఉండటంతో బోంబే అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అందరూ ఉన్నారు మరేం ఫర్వాలేదు అని ఎంతో ఊహించుకున్న అంతరిక్ష్ కి నిజంగానే మొదటి ఆరు నెలలు అంతరిక్షం కనిపించింది..

అదే వారం రేస్ సినిమా టీవీ లో టెలికాస్ట్ చేసాడు..అంతరిక్ష్ కి తన రేస్ మొదలయ్యిందని తెలుసుకోవడానికి ఎన్నోరోజులు పట్టలేదు

ఎప్పటి లానే లోకల్ ఎక్కి కూర్చోడానికి చోటు లేక కాస్త వెనుక నిల్చొని linkin park వింటూ వింటూ తల ముందుకి వెనుకకి ఆడిస్తూ తనని తానే మరచిపోయి వెనుక ఉన్న అమ్మాయి తల ని అసంకల్పితంగా ఢీకొని తనకి సారీ చెప్పాక ఐపాడ్ తీసేసి పేపర్ చదవడం మొదలెట్టాక

తను మాత్రం తన ఫ్రెండ్ తో ఐ లవ్ అతిఫ్..what a beauty this song has been అని pehli najar mein పాట ని తన ఫ్రెండ్ తో పాటు గట్టిగా హమ్ చేయడం మొదలెట్టాక..తన ఫ్రెండ్ you know my all time favorite will be kya mujhe pyaar hai అంతరిక్ష్ గట్టిగా $#!^@ అని అరిచాక...


అమ్మాయి:hello, what you have been said to me
అంతరిక్ష్: $#!^@
అమ్మాయి:mind your words
అంతరిక్ష్ వెంటనే తన మొబైల్ లో నెట్ ఓపెన్ చేసి ఇక్కడ మరియు ఇది కూడా వీక్షింప చేసాక

ఓహ్ $#!^@ అని వాళ్ళిద్దరూ కూడా కోరస్ పాడి గట్టిగా నవ్వేసారు .. ఒక రెండు నెలలు అదే ట్రైన్ ఒకే టైం లో ఒకే ప్లేస్ లో అవే సన్నని స్మైలీలతో సాగుతున్న జీవితం లో

అంతరిక్ష్ బర్త్డే కి రుమా మరియు తన ఫ్రెండ్ కి ట్రైన్ లో స్వీట్ ఆఫర్ చేయడం తో ..హే పార్టీ మరి అని అడిగాక సాయింత్రం ముగ్గురూ కాఫీ డే కి వెళ్ళి తమ స్నేహ ప్రయాణం ఒక కాఫీ టేస్ట్ లాంటి అనుభూతిని మొదటి సారిగా పొంది ఒక చిన్న get together చేసుకొని ఈ లైఫ్ కి కాస్త అలవాటయ్యాక అంతరిక్ష్ రుమా పరిచయం లో అంతరిక్ష్ చాలా హ్యాపీ గా ఉన్నాడు.


santacruz నుండి అంధేరీ ఇద్దరూ ఒకే లోకల్ లో కలసి వెళ్ళడం నుండి ఒకే కంపార్ట్మెంట్ లో పక్క ప్రక్కన కూర్చునే అంత సన్నిహిత్వం ఏర్పడింది ఇద్దరికీ

ఎప్పటిలానే తన క్యూబికల్ లో కూర్చొని ఈవినింగ్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి చూస్తే తన కోసం రుమా వైట్ చేస్తోంది..

ఈరోజు తొందరగా వచ్చేస్తా అని చెప్పావ్ కదా పొద్దున్న ..lets go and have some fun అని చెప్పి తమ కామన్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు .. పన్నెండు తర్వాత మెరైన్ డ్రైవ్ లో తనతో గడిపిన ఆ క్షణాలు అంతరిక్ష్ ఆనందానికి అవధులు లేకుండా చేసాయినెల కు రెండు సార్లు ఇంటికి వెళ్ళే అంతరిక్ష్ ఇప్పుడు రెండు నెలలకి ఒకసారి కూడా వెళ్ళడం లేదు

రెండేళ్ళు గడిచాయి గడిచాక రుమా కి చర్చి గేట్ ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోయింది ..తమ పేరెంట్స్ కూడా బోంబే వచ్చేయడం తో ఫోన్స్ చేస్తూ ఉన్నా అంతరిక్ష్ , రుమా వీక్ ఎండ్స్ లో కూడా కలవడం కుదరడం లేదు..

ఒకరోజు ధైర్యం చేసి రుమా వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంతరిక్ష్

కాలింగ్ బెల్ కొట్టగానే తన యాభై లలో ఉన్న క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోన్న వ్యక్తి తలుపు తీసాడు
ఎవరు మీరు ఏం కావాలి
నేను రుమా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను
రండి హాల్ లో కూర్చోండి
నేను రెండు మూడు సార్లు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేసారు నా వాయిస్ గుర్తు పట్టలేదా లాంటి ప్రశ్న లన్నీ అడిగి మంచి నీళ్ళు తాగుతున్నాడు
అంతరిక్ష్ హాల్ లో బయటకు నవ్వుతూ మాట్లాడుతున్నా లోలోపల తను మాత్రం చాలా నెర్వస్ గా ఉన్నాడు

where is ruma?అని అడగడం తో
కాసేపయ్యాక రుమా వల్ల నాన్న తో అంతరిక్ష్ చెప్పేసాడు మీ అమ్మాయి అంటే నాకిష్టం అని
ఇంతలో అంతరిక్ష్ చెంప చెల్లు మంది
దీనర్ధం ఇంకా ఉంది :)

19 comments:

Sravya Vattikuti said...

అయ్యో చెంప దెబ్బ తిన్నారా పాపం :)
ఆ కామెంట్ బాక్స్ నోట్ ఏంటండి బాబు :)))))

Anonymous said...

>>>గత జన్మ లో మీరేదో పోస్ట్ కి కామెంట్ పెట్టకుండా మిగిలిన పాప ఫలితమే ఇది ముమ్మాటికీ<<<
హ్హహ్హహ

హరే కృష్ణ said...

శ్రావ్య గారు.... ఏటి నేనా (పాండు రంగ మహత్యం లో చిట్టి బాబు ఎక్స్ప్రెషన్లతో తో హరే )
మీ ఆప్యాయత కి నా కళ్ళు చెమర్చుతున్నాయి :))
మీరు కధలో లీనమయిపోయి అంతరిక్ష్ ని గారు,తిన్నారా పాపం అని పిలిచేస్తున్నారంటే, హ్మ్ :)))

నోట్ బాక్స్ అంటే ఏదో ఈ మధ్య బ్లాగ్ స్పందన కరువు వరదలై పారుతుంటే ...అందుకోసం తిమింగలం లా తయారయితేనే వార్ రూమ్ లో సేఫ్ :)))
థాంక్ యూ :)

Anonymous గారు హ హ్హ ..థాంక్స్ :)

ఇందు said...

హ్హహ్హహ్హా! నేను నవ్వింది మీ పోస్ట్ చదివి కాదు...ఆ కామెంట్ బాక్స్ మెసేజ్ చూసి!! :))))))))))

ఐతే రాజ్ గారికి జుట్టు ఊడిపోవడానికి కారణం మీ బ్లాగ్,అందులో పోస్టులు అన్నమాట ;) ఐతే మీ బ్లాగు చూసినవారందరికి తృష్ణగారి టపానే మందు :))
http://trishnaventa.blogspot.com/2011/06/powder.html

ఈ కథ ఏదో మామూలుగా ఉంది ఆండీగారూ...మీ మార్కు డైలాగ్స్ లేవేంటబ్బా? పార్ట్-2లో ఉండొచ్చేమో!! :) అయినా పేర్లేమీ దొరకనట్టూ ఈ 'అంతరిక్ష్' ఏంటండీ?? ఇది అసలు సుపరు కామెడీగా ఉంది :))

ఇందు said...

ఈ గూగుల్ రీడర్లు...బజ్జులు వచ్చాక ఇంకా మన బ్లాగ్స్ కి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ హరే! :) లైట్! అయినా బ్లాగ్ మన ఙ్గ్నాపకాల తోట కదా....ఆ తోటలో టపాలనే పూలు కామెంట్ల జల్లు కురిసినా కురవకపోయినా ఎప్పుడూ తాజాగానే ఉంటాయ్...చక్కని పరిమళాలు అందిస్తాయ్ :)

మనసు పలికే said...

హహ్హహ్హా.. నాది కూడా సేం ఇందు మాటే.. కామెంటు బాక్సు మెసేజ్ చూసి ఫుల్లుగా నవ్వుకున్నా..;)
హరే నెక్స్ట్ పార్ట్ పోస్ట్ చెయ్యి త్వరగా:))
ఈ టైటిల్ అర్థం ఏమిటి హరే ఇంతకీ..? :P:P

Anonymous said...

బాబు హరే నీ కామెంట్ బాక్స్ చూసి నవ్వుకుని అసలు స్టోరి ఏం చదివానో మర్చిపోయాను :)నువ్వు ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టకు నాకసలే జుట్టు తెగ ఊడుతుంది ఈ మధ్య
nestam

హరే కృష్ణ said...

ఇందు గారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ :))))))
>>అయినా పేర్లేమీ దొరకనట్టూ ఈ 'అంతరిక్ష్' ఏంటండీ
:))))))))
అవతార్ లాంటి ఊరిలో ఇంచుమించు అంతరిక్షం నుండి ఊడిపడ్డాడు అని ఇండైరేక్ట్ గా డైరెక్ట్ చేసాను అన్నమాట :)
మా ఫ్రెండ్ పేరు నిజంగా అంతరిక్ష్ నే :)

>>బ్లాగ్ మన జ్ఞాపకాల తోట కదా....ఆ తోటలో టపాలనే పూలు కామెంట్ల జల్లు కురిసినా కురవకపోయినా ఎప్పుడూ తాజాగానే ఉంటాయ్...చక్కని పరిమళాలు అందిస్తాయ్ :)
ఇందు గారు, ఆహా ఏం చెప్పారండీ
బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు..నాకు మీరు చెప్పిన ఈ వన్ లైనర్ వల్ల నా బ్లాగు కళ్ళు తెరుచుకున్నాయి
పాహిమాం పాహిమాం
ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు :)
లేట్ గా చెప్పినా నా బ్లాగు జన్మ ధన్యం చేసారు, స్క్రీన్ షాట్ తీసుకొని వాల్ పేపర్ గా పెట్టుకుంటాను..బోలెడు థాంక్స్!
ప్రస్తుతానికి తృష్ణ గారి పోస్ట్ మరియు మీ కామెంట్ ప్రింట్ అవుట్ తీసి పెట్టుకున్నా :))

హరే కృష్ణ said...

అపర్ణ హహ్హ..థాంక్ యూ థాంక్ యూ :)

ఎంతో మూడ్ బాలేదు నిన్న అసలు, ఏదో ఏదో రాసేస్తూ చూస్తే చివరికి మా అంతరిక్షుని కధ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

అంతరిక్ష అంతరాయానికి చింతిస్తున్నాం..వాడికి చెంప చెళ్ళుమని వారం కూడా కాలేదు స్టొరీ ముందు కి కదలాలంటే కనీసం మరో ఆరు నెలలైనా మినిముం వేచి యుండాలి :))))) థాంక్స్ !

హరే కృష్ణ said...

అక్కా, :))) థాంక్స్
నేనేం రాసానో నాకే అర్ధం కాలేదు..మళ్ళీ పడి పదిహేను రోజులు తర్వాతనే కొత్త పోస్ట్ వేసేది ఈ ట్రిప్ ఒకటి వచ్చి పడింది హ్మ్ :((((
జుట్టు నాకు కూడా ఊడిపోతోంది.. జుట్టు రాలకుండా తృష్ణ గారు తయారు చేసిన పౌడర్ నే ఇంక ఆశ్రయిస్తున్నా :)

వేణూరాం said...

గమనిక:పోస్ట్ చదివి బుర్ర గోక్కొని కేశాలు ఊడిన ఎడల మీ తల నొప్పి కి బ్లాగు ఓనర్ మరియు బ్లాగు మేనేజ్ మెంట్ బాధ్యత వహించదు
hihihi :)

ఇందు said...

ఈ కామెంటు చూసి..నేనిప్పుడే మునగచెట్టు ఎక్కి వచ్చా :)))))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఆహా కళ్ళు తెరిపించారు మాష్టారు. ఎవరి కామెంటు బాక్స్ లో ఖాళీ వదిలానో, ఈ జన్మలో నెత్తిమీద కేశాలు మిగల్లేదు.

ఇంతకీ అంతరిక్ష్ ని కొట్టింది ఎవరు? ఎందుకు కొట్టారు? మళ్ళీ బుల్లి తెరమీద ఎప్పుడు చూపిస్తారు.

హరే కృష్ణ said...

రాజ్ :)))
నీ తల బాధ కి కారణమేమో కానీ నీ జుట్టు ఊడిపోతేమాత్రం బాధ్యత కాదు అని మనవి చేసింగ్స్:)

థాంక్స్ :)


ఇందు, నేను చాలా తక్కువలో పొగిడాను, మీరు అన్నం తినడం మానేస్తే నేను తట్టుకోలేను మళ్ళీ ఇంత మంచి సలహాలు ఇచ్చేసే ఫ్రెండ్ కి ఇంకా మంచి ఐడియాలు రావు కదా తినకపోతే

హరే హృదయం :))

రెండో సారి మూడుసార్లు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

గురూజీ మీకు వచ్చే జన్మ లో జుట్టు బేషుగ్గా ఉంటుంది నాది గ్యారంటీ..అప్పుడు కూడా నేను మీ బ్లాగ్ లో మొదటి ఫాలోవేర్ గా ఉంటాను
కొట్టినది కొట్టించుకున్నది ఎవరైతేనేమి అంతా హరే మాయ :)

>>ఎందుకు కొట్టారు?
కొట్టుకోవడానికి కారణాలు ఉండాలి గానీ కొట్టించుకోవడానికి కారణాలా..నెవర్!
ధన్య వాదాలు :)

kiran said...

గట్టిగా దెబ్బ తగిలినట్లుంది...ointment రాసాక తీసుకురండి అంతరీక్ష్ ని మళ్లీ.. (j/k)
రెట్రో రుమాంటిక్ -- దీని భావమేమి..???

హరే కృష్ణ said...

కిరణ్ సారీ కామెంట్ లేట్ గా చూసుకున్నా
మనిషి కి తగిలిన దెబ్బ అయితే ఆయింట్మెంట్ తో మానిపోతుంది మనసు కి తగిలిన దెబ్బ కు కాలమే సమాధానం చెబుతుంది అని అంతరిక్ష్ అర్ధం చేసుకొనింగ్స్
థాంక్ యూ :)

రెట్రో రుమాంటిక్ -- దీని భావమేమి..???
రెట్రో సిటీ ముంబాయి లో రుమా అనే నా కధలో హీరొయిన్ యొక్క రొమాంటిక్ లవ్ స్టోరీ అని నా భావము :)
ఇంకా అర్ధం కాకపొతే జై హో మమత :))

మురళి said...

నాకు అర్ధమైన కథ : 'అంతరిక్ష్' అనే అబ్బాయి, 'రుమా' అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. రుమా ని వెతుక్కుంటూ అంతరిక్ష్ ఆమె ఇంటికి వెళ్ళాడు. రుమా వాళ్ళింట్లో దోమలు ఎక్కువ. అంతరిక్ష్ చెంప మీద ఒక దోమ వాలితే, రుమా తండ్రి దోమ వంక క్రూరంగా చూసి, ఒక్క దెబ్బతో దానిని హతమార్చాడు..
ఒకవేళ తప్పైతే చెప్పండి.. రేపు 'మమత' చూశాక వచ్చి మళ్ళీ చదువుతా..
అన్నట్టు వాక్యాలు మరీ పెద్దవిగా ఉన్నాయండీ.. కావాలనే అలా రాస్తే ఓకే..

హరే కృష్ణ said...

:))))))))))
మురళి గారు సారీ మీ కామెంట్ ఆలస్యంగా చూసుకున్నాను
ఎలా అయితేనేం మీరు దేవరహస్యం చెప్పేశారు :)
జరిగింది అదే :)
థాంక్ యూ :)