Pages

Monday, October 1, 2012

ఫరాంజలి..
మణిరత్నం కి గీతాంజలి ఎలానో నువ్వంటే నాకంత..అంత కంటే చాలా చాలా ఎక్కువ

నిస్వార్ధ కార్యదీక్ష తో విశ్రాంతి లేకుండా అహర్నిశలు ధారబోసిన నిన్ను ఎలా మరచిపోగలను నిన్ను విడిచి ఉండాలంటే నాకు నరకమే

ఈ ఆరేళ్లలో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడ్డవు. మొదటి రెండేళ్ళు నీవు లేనిదే నేను లేను..
ఆ  తర్వాత కాల క్రమేనా ఆరేడు గంటలకు మించి నీతో గడపలేకపోయాను

నాకోసం నువ్వు శ్రమిస్తూనే ఉన్నావు.. నిరంతర శ్రమైక జీవితానికి నీదే ఒక ఉదాహరణ

ఇన్ని సంవత్సరాల నీ సావాసం లో నీ గురించి నేను రెండే మాటల్లో చెప్పగలను క్రియేటివ్, ఇన్స్పైర్
వీడుకోలే వేదికైనా
వీడలేనీ స్నేహమైనా
ఆనందమా..
.. ..వసంతమా.. .. ..
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్..

అని పాడదామన్నా
నీ పలుకు లేక నాకు సౌండ్ తీసేసావ్.

ఇన్ని మధుర స్వరాలను పలికించిన నువ్వు

day and night నాకోసం పని చేసిన నువ్వు finally call it a day చెప్పడం 

నేను తట్టుకోలేకపోతున్నాను.

నేను గేమ్స్
ఆడుతున్నానే కానీ నువ్వు లేకపోతే రూమంతా ఆ  ambiance ఉండదు

ఈ ఆరు సంవత్సరాలలో నీకు ఆరు సార్లు పరిశుభ్రత అంటే ఏంటో నేర్పించాను అయినా ఎందుకిలా చేసావ్! ఇదంతా అబద్ధమని చెప్పు

అరడజను సంవత్సరాలు గా తన సేవలందించి గత నెల ముప్పైవ తేదీన పని చేయడం మానేసిన నీకు ఇదే నా ఫరాంజలి, ఊఫరాంజలి! 

                            

 

16 comments:

Naresh said...

హా. హా.. ఊఫర్ గురించా నీ బాధంతా? :D
బాగుంది..

మధురవాణి said...

ఇంకా నయం.. ఈ పోస్టులో రాసిందంతా ఆ ఫోటోలో ఉన్నావిడ గురించేమో అని భయపడి చచ్చాను.. చివర్లో నా డౌట్ క్లియర్ చేసి బతికించావ్ నాయనా.. :D

ఫోటాన్ said...

RIP ఊఫరాంజలి! :)

వేణూశ్రీకాంత్ said...

మరే నేను కూడా మధురలాగే భయపడ్డా.. ఏమైంది హరేకి అని ;) ఊఫరాంజలి గురించా రెస్ట్ ఇన్ పీస్ :)

రాజేంద్ర తడవర్తి said...

ఎవరు రాసారు ఈ టపా.. నీ styleలో లేదే... :P

రాజ్ కుమార్ said...

జహాపనా......... తుసీ గ్రేట్ హో...
దండాలయ్యా.. ;)

జలతారువెన్నెల said...

ఏంటో ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఇలా జీవం లేని వస్తువుల మీద రాసేస్తున్నరే ... జీవమున్న మనుషుల మీద రాయాల్సొస్తే ఇంకేమీ మిగలవేమో! అలోచించండి.
:))

శిశిర said...

ఆరు సంవత్సరాలలో నీకు ఆరు సార్లు పరిశుభ్రత అంటే ఏంటో నేర్పించాను.

:)))

శిశిర said...

డెడికేషన్ తోనే కామెంట్ రాశాను అని గమనించగలరు. :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

అరాచకం. ఓహ్హోహ్హోహ్హో. (ఘట్టిగా నవ్వాను. నా ట్రేడ్ మార్క్ వదిలి)

హరే కృష్ణ said...

నరేష్
ఐ.ఐ.టీ లో స్పీకర్లు కదా కొంచెం స్పెషలే :))
థాంక్స్ :)

మధుర, ఈ పోస్ట్ రాయదానికంటే ఈ ఫరా ఖాన్ ఫోటో వెతకడానికే టైం ఎక్కువ పట్టింది :))
థాంక్యూ :)

హరే కృష్ణ said...

హర్ష :))

రాజేంద్ర :D ఎమోషనల్ సౌండ్స్ అప్పుడప్పుడూ బయటకోస్తున్నాయ్ :P
థాంక్యూ :)

హరే కృష్ణ said...


వేణు గారు హ హ్హ :))
థాంక్స్ :)

రాజ్ థాంక్యూ :))

హరే కృష్ణ said...


శిశిర గారు మరీ తక్కువ చెబితే బావుండదు కదా ఆరుసార్లు అని రాయబడింది :))
మీ డెడికేషన్ కి రెండు రోజులు తర్వాత బ్రేక్ ఇస్తున్నాం :)
థాంక్స్!


హరే కృష్ణ said...

వెన్నెల గారు హ హ్హ :))
ఈ ఊఫార్ కొంచెం స్పెషల్ అంతే
థాంక్యూ

హరే కృష్ణ said...

గురూజీ థాంక్యూ వెరీ మచ్ :))