Pages

Monday, May 9, 2011

Any Way నాశన!

ఇంటర్వ్యూ జరిగినరోజు రాత్రి ప్రతీక్ కి నిద్రపట్టడం లేదు.. ఇంటర్యూ కోసం కంపనీ కి వెళ్లడం, అక్కడ అన్వేష్ ఎదురయ్యి  పాత రోజులు గుర్తు రావడం, అన్వేష్ కళ్లుతిరిగి పడిపోవడం వలన అదే రోజు హాస్పిటల్ కి వెళ్ళిరావడం ఆ తర్వాత తన
ఇంజనీరింగ్ రోజుల ఙ్ఞాపకాలతో నిద్రపట్టక టెర్రస్‌పై కూర్చున్నాడు. ఇక రాత్రంతా తన ఫ్రెండ్స్‌తో ఫోన్లలో కంపెనీలో అనలిస్ట్‌గా వారం రోజుల్లో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ ఇమెయిల్ లో ఉంది.


ప్రతీక్ రిపోర్ట్ చెయ్యాల్సింది, తన మూలంగా ఇంజనీరింగ్ లో సొరచాపకు వల వేసి నట్టు రాగింగ్ చేస్తూ అడ్డంగా ప్రిన్సిపాల్ కి దొరికిపోయిన అన్వేష్ కి. తమ డిపార్టుమెంటు కి అతనే మేనేజర్ కావడం తో భయం భయం తో పని చేయసాగాడు.

రెండు నెలల ముందు టీమ్ లో చేరిన హిమ బిందు అలియాస్ అల్లా ఆమెన్ బిందు ప్రతీక్ కి హెల్ప్ చేస్తుండగా ఓర్వలేని అన్వేష్, బిందు ని తన కేబిన్ కి పిలిచి అతనికి హెల్ప్ చేయొద్దని చెప్పి ప్రతీక్ కి మరింత వర్క్ ఇవ్వసాగాడు. ప్రతీక్ కి ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక, అంత వర్క్ ముందుకు కదలక పోవడంతో ప్రోగ్రెస్ కావడం లేదని అందరి ముందు తిట్టేసేవాడు అన్వేష్.

రెండు నెలలు గడిచాయి

ఉన్నట్టుండి ప్రతీక్ పెర్ఫార్మన్స్ లో మార్పు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది..ఏరోజు ఇచ్చిన పనిని ఆరోజే సహనంగా పూర్తి చేయడం తో ఆనంద పడాలో కోప్పడాలో తెలియని అన్వేష్, మరొక రెండు వారాలు చూసి ప్రతీక్ కి మరింత వర్క్ ని ఇవ్వసాగాడు. బిందు అంటే అన్వేష్ కి వల్లమాలిన అభిమానం; బిందు కి అన్వేష్ అంటే వల్ల దిక్కు మాలిన గౌరవం. బిందు వాళ్ళ ఇల్లు కూడా అన్వేష్ ఇంటికి దగ్గరగా ఉండటం తో జాయిన్ అయిన రెండు నెలల్లోనే బిందు వాళ్ళ అమ్మ నాన్నలకు బాగా చేరువయ్యాడు అన్వేష్.

ఇటువైపు ప్రతీక్ కి చిరిగి చేతబడి చేసేస్తున్నాడు అన్వేష్.  ఎంత మొరపెట్టుకున్నా వర్క్ ని తగ్గించక, ఇంకో అనలిస్ట్ ని కూడా recruit చేయించక ఇద్దరు చెయ్యాల్సిన పని ని ఒక్కరితో చేయిస్తున్న అన్వేష్ పై రోజురోజుకీ ప్రతీక్ కి కోపం పెరిగి పోతుంది.

ఆ తర్వాత రోజు అన్వేష్ తన ప్లేస్ కి వచ్చే టైం కి రెండు నిముషాల ముందు గబ గబా కేంటీన్ వైపు వెళ్ళిపోయాడు ప్రతీక్.
ప్రతీక్ క్యూబికల్ కి వచ్చిన అన్వేష్, ప్రతీక్ లేకపోవడం తో తన ప్లేస్ లో కూర్చొని వెయిట్ చేయసాగాడు. ఇంతలో ప్రతీక్ డెస్క్ లో ఉన్న ఫోన్ మోగింది.
అందరూ అన్వేష్ ని చూడసాగారు.. మరికొంత మంది గట్టిగా నవ్వడం మొదలు పెట్టడం తో అక్కడనుండి కోపం తో తన కాబిన్ వైపు నడిచాడు అన్వేష్. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండెకోత కోసినా చేసినావు ఊయల
అని ప్రతీక్ డెస్క్ లో ఫోన్ రింగ్ టోన్ రిపీట్ అవ్వడం తో అన్వేష్ కి గర్వ భంగం కలిగి అక్కడ నుండి జంప్.


తనెంతగానో ఇష్టపడిన బిందుకి, అన్వేష్ తన ప్రేమ సంగతి తెలియజేసే రోజు రానే వచ్చింది. బిందు మాత్రం, అన్వేష్ ప్రపోజల్‌ని కాదనలేక అవుననలేక ఆలోచించుకోడానికి తనకి కాస్త టైం కావాలని అడిగి అన్వేష్ కి బిందెడు నీళ్ళు తాగించేలా చేసింది. బిందు ఆలోచనలతోనే అన్వేష్ ప్రతీక్ డెస్క్ దగ్గరకు వచ్చి "వర్క్ ఇంకా బాగా చెయ్యాలి Always remember one thing Love Your Neighbor as Yourself. if you follow this the success will be yours" అని తన ప్రపోజల్ ని పక్కన పెట్టిన బిందు మీద కోపాన్ని ఇలా ఒక గంట సేపు క్లాస్ గా బిందు కి వినబడేలా ప్రతీక్ కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత రోజు నుండి ప్రతీక్ లేట్ గా రావడం మొదలు పెట్టాడు. ఇదే తీరు ఆ నెలంతా కొనసాగడం తో ప్రతీక్ ని అందరి ముందు నిలదీశాడు అన్వేష్. మేనేజ్ మెంట్ కూడా అక్కడే ఉండటం తో, "సరే మా ఇంటి దగ్గర ఒక రూమ్ ఉంది అక్కడ ఉండు ఆఫీస్ కూడా కాస్త దగ్గర పడుతుంది" అని చెప్పి ప్రతీక్ ని అక్కడకి షిఫ్ట్ చేయించాడు అన్వేష్. రెండు నెలలు గడిచాయి.. అంతా సెట్ అయ్యేసరికి అక్కడి నుండి "రెండు కిలోమీటర్ల దూరం లో నీకు వేరే రూమ్ చూసి పెట్టా" అని చెప్పి ప్రతీక్ ని వేరే రూమ్ కి షిఫ్ట్ చేయించాడు అన్వేష్.

అయితే ప్రతీక్ రూమ్ షిఫ్ట్ అయ్యాక టైం కి వస్తున్నాడు కానీ ముందు ఉన్నంత చురుకుగా పనిచేయడం లేదు..  ఏమయ్యిందో తెలియక అన్వేష్ ఇదే విషయం ఎన్నోసార్లు ప్రతీక్ ని అడిగినా nothing like that .I'm fine అని చెబుతూనే ఉన్నాడు ప్రతీక్.

అతని బాధకి కారణం అతని మీద రోజు రోజుకీ పెరుగుతున్న బర్డెన్ అని ఫీల్ అయ్యిన మిగతా  టీం మేట్స్ అందరూ, మేనేజర్ దగ్గరకు వెళ్ళి ప్రతీక్ కి వర్క్ తగ్గించమని చెప్పి చూసినా, అన్వేష్ మాత్రం "మిగతా పని మీరు చేస్తారా" అని వాళ్ళ నోళ్ళు మూయించేసాడు.

ఒకవైపు ప్రతీక్ మీద పగ తెర్చుకుంటున్న అన్వేష్, మరోవైపు బిందు ఎప్పుడెప్పుడు "యస్" చెబుతుందా అని ఎదురు చూస్తూ పొరపాటున "నో" చెబుతుందేమో అని భయపడుతున్నాడు కూడా. సరే, బిందుతో ఏదో ఒకటి తేల్చుకోవాలి అనుకుని  ఒకరోజు అడిగాడు అన్వేష్, "ఇంకా ఎంత టైం కావాలి నీకు, తొందరగా ఏదో ఒక డేట్ ఫిక్స్ చెయ్" అని. బిందు మాత్రం తడబడుతూ "ఇంకొంత టైం కావాలి" అని చెప్పడంతో అన్వేష్‌కి అసహనం మరింత పెరిగిపోయింది.

బిజినెస్స్ మీటింగ్ పని మీద అన్వేష్ ఒక వారం రోజుల పాటుకొరియా వెళ్లాల్సి వచ్చింది.

సరిగ్గా వారం రోజుల తరువాత తిరిగి వచ్చి చూస్తే, తన కేబిన్ లో నాలుగు కవర్లను చూసి నిశ్చేష్టుడై మళ్లీ రెండో సారి ఆఫీస్ లో కింద పడిపోయాడు అన్వేష్ .
మిగతా కొలీగ్స్ వచ్చి చూస్తే బిందు ప్రతీక్ ల రిజిగ్నేషన్ లెటర్స్ , ఒక invitation కార్డ్ ఇంకో లెటర్ లో

డియర్ అన్వేష్,
you are right
Love Your Neighbor as Yourself. the success will be yours ఇదే ఫాలో అవ్వకపోతే నాకు బిందు దొరికేది కాదు. నీ ఇంటిదగ్గర, అదే బిందు వాళ్ళ ఇంటి ఎదురుగా నాకు రూమ్ ఇప్పించినందుకు నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను.

విత్ లవ్,
బిందుప్రతీక్.
కొరియా లో హోటల్ లో ఉన్న అన్వేష్ ఈ ప్రేత ప్రతీక్ కల ని తలచుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకు జరగబోయే ప్రతీకారం ని ఆపడానికి ఆ తర్వాత రోజే మలేషియా వచ్చేసాడు. ఆ తర్వాత ప్రతీక్ తో ఇంతకు ముందు ఉన్నంత కర్కశంగా కాకుండా కాస్త ఫ్రెండ్లీ గా ఉండడం అలవరుచుకున్నాక అన్వేష్ ప్రతీక్ కొద్ది రోజులకి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.. అన్వేష్ బిందు మీద పెంచుకున్న ప్రేమ కారణంగా, ప్రతీక్ కి పని తగ్గడం తో పాటు ఇంక్రిమెంట్,బాస్ సప్పోర్ట్ లభించాయి.  బిందు ఏ సమయంలో ఏం చేస్తుందో, తనకి ఏ విషయాలు నచ్చుతాయి, ఎవరెవరితో క్లోజ్‌గా ఉంటుంది ఇట్లాంటి విషయాలను అన్వేష్ కి అందచేస్తూ informal informer గా తయారయ్యి   హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు.

ఇంతలో వేరే టీం లో ఉన్న వరుణ్ తో బిందు intercom ని ఇంటిని చేసేసి విచ్చలవిడిగా పిచ్చేక్కేంచేయడం తో ప్రతీక్ అన్వేష్ కి చెప్పాడు..

ప్రతీక్: ఫైర్ ఇంజిన్ నీ ఇంట్లో పెట్టుకుంటావో లేక ఆ వరుణ్ ని ఫైర్ చేస్తావో తేల్చుకో
అన్వేష్:ఎందుకు ఏం జరిగింది??
ప్రతీక్:నా ప్లేస్ లో ఒక రెండు రోజులు కూర్చో.. బిందు నీకు 4D సినిమా చూపించేయడానికి రడీ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.

రెండు రోజులు ఇదంతా గమనించిన అన్వేష్ ఫైర్ కాదు, వీళ్ళిద్దరినీ ఒకేసారి ఉద్యోగం లోనుంచి తీసేసినా ఒకర్ని తీసేసినా నా మీద డవుట్ వచ్చేస్తుంది.. వీళ్ళను ఇంకేదైనా చెయ్యాలి అని చెప్పి కాంటాక్ట్స్ లో మలేషియా ముఠా నెంబర్ తీసి కాల్ చేసాడు అన్వేష్.  "i will send the details by today work should be finished by next week!"అని చెప్పి ఇంటికేల్లిపోయాడు.ఆ వచ్చేవారం ఊహించినట్టు గానే బిందు వరుణ్ కనిపించడం మానేశారు. పోలీసులు వచ్చి అన్వేష్ ని కోర్ట్ కి ఈడ్చుకెల్లిపోయారు. ఊహించి ఊహించనట్టుగా ప్రతీక్ కూడా అన్వేష్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేసాడు.. అన్వేషే వాళ్లను  ఏదో ఒకటి చేసి ఉంటాడు, ముఠా అని తన కాంటాక్ట్ లో నేను కూడా చూసాను, ఇది ఖచ్చితంగా అన్వేష్ పనే అని చెప్పాడు.  తన కళ్లని తానే నమ్మలేక విస్తుపోయి చూస్తూ "Mutha అంటే Malaysia Ultra Telnet Hi-tech Association" అని ఎంత గట్టిగా గొంతు చించుకుని అరిచి చెప్పినా కూడా వినకుండా, జడ్జ్ పదేళ్ళ కఠోర కారాగార శిక్ష ని
విధించేసాడు.

వారం తర్వాత ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ కమ్ కల్లోలియా అయిన వరుణ్ వాళ్ళ అన్నయ్య తో బిందు పెళ్లి మలేసియా కాపిటల్ నుండి ఇండియా బిజినెస్ కాపిటల్ లో ఘనంగా జరిగింది.

సాక్షి సంతకాలు ప్రతీక్, వరుణ్ ముంబై రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టేసి పార్టీ చేసుకున్నారు.
ఇదంతా తెలుసుకున్న అన్వేష్ మాత్రం "పామని తెలిసీ పాలు పోసీ పెంచితినే" అని ప్రతీక్‌ని తలుచుకుంటూ కొత్త పాటకి బాణీ కట్టి మరీ పాడుకుంటూ జైల్లో కూర్చున్నాడు.


రాత్రి పూట సలాడ్ మాత్రమే తిని నిద్రపోయే బ్లాగాభిమానులకు ఈ కధ అంకితం.

19 comments:

మనసు పలికే said...

1st Comment..?? చదివేసి మళ్లీ వస్తా..:)

మనసు పలికే said...

హరే.. హమ్మయ్య. మొత్తానికి ఒక కథనైనా కంచికి పంపించావనమాట..;) అంటే, నిషా పరిచయం, పార్కులో పదనిసలు అలాగే ఉన్నాయి కదా..;);)
అయినా నేనొప్పుకోను.. ఎప్పుడూ అన్వేష్‌నే ఫూల్ చేస్తావేంటి పాపం..?
>>"ప్రేత ప్రతీక్ కల" హహ్హహ్హ.. సూపరు:)
కథ చదవడం మొదలు పెట్టినప్పటి నుండి, అన్వేష్‌ని బిందుని కానీ ప్రతీక్‌ని బిందుని కానీ కలుపుతావేమో అని చూస్తుంటే, మధ్యలో ఎవరెవర్నో తీస్కొచ్చేసావు. టోటల్లీ అనెక్స్పెక్టెడ్:)

ఇక ఆ టైటిల్ ఎందుకలా పెట్టావో క్లైమాక్స్ చూస్తే కానీ అర్థం అయ్యి చావలేదు.;) బాగుంది చాలా:)

వేణూరాం said...

హహహ.. స్టార్టింగ్ లో పెద్దగా అనిపించలేదుగానీ... "రెండు నెలలు గడిచాక" స్టోరీ ఊపందుకుంది. నాకు ఆ "ప్రేత ప్రతీక్ కల" బాగా నచ్చింది. సూపరంతే..
నాకు కొన్ని డౌట్లు..

కఠోర కారాగార శిక్ష... ?? కఠిన కారగార శిక్ష కి తేడా ఏమిటీ?? (కఠోర కారాగార శిక్ష కి కఠోర కూత కీ గల పోలికలు ఏమిటీ?)
క్లాస్మేట్స్ కమ్ కల్లోలియా లో.. కల్లోలియా అంటే ఏమిటి..?? సోదాహరణం గా వివరింపుము.
హిమ బిందు అలియాస్ అల్లా ఆమెన్ బిందు యొక్క పెళ్ళి ఏ చర్చ్ లో జరిగింది??
అన్వేష్ "కొరియా" ఎందుకు వెళ్ళాడూ????


ఇంతలో వేరే టీం లో ఉన్న వరుణ్ తో బిందు intercom ని ఇంటిని చేసేసి విచ్చలవిడిగా పిచ్చేక్కేంచేయడం తో ప్రతీక్ అన్వేష్ కి చెప్పాడు..
:నా ప్లేస్ లో ఒక రెండు రోజులు కూర్చో.. బిందు నీకు 4D సినిమా చూపించేయడానికి రడీ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ టైప్ లైన్స్ నీకు మాత్రమే సాద్యం అనుకుంటా.. ;)

ఇవి మాత్రం అరుపులు.. ;)

Sravya Vattikuti said...

హ హ బావుంది ! నాకెందుకో అనుమానం ఆ ప్రతీక్ మీరేనేమో అని డౌట్ :)
బొమ్మలు బావున్నాయి !

మురళి said...

:)))) nice

కావ్య said...

waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa .. raatri naa net disc avadam to nenu comments lo ekkadakoooooooo vellipoyaaaaaaaaa ...

papam anvesh ni eppudu vedhavani chestavaa :( ... nuvve prateek .. nee boss ki phone chesi chepta undu jagrattaga undamani ..
క్లాస్మేట్స్ కమ్ కల్లోలియా keka ..

last tag line poli keka .. donga moham donga moham :p ..

office ki vacchi malli telugulo inkaa pedda comment pedataaa :)

కావ్య said...

చిరిగి చేతబడి

బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండెకోత కోసినా చేసినావు ఊయల
ఇంకా ఎంత టైం కావాలి నీకు, తొందరగా ఏదో ఒక డేట్ ఫిక్స్ చెయ్ - ఇక్కడ డేట్ ఎందుకు ఫిక్స్ చెయ్యాలి .. అధ్యక్షా


ప్రేత ప్రతీక్ కల

విచ్చలవిడిగా పిచ్చేక్కేంచేయడం

మలేషియా ముఠా

క్లాస్మేట్స్ కమ్ కల్లోలియా

ఇలా కొత్త కొత్త పద ప్రయోగాలు చెయ్యడం నీకు నువ్వే సాటి .. ఈలలు కేకలు అరుపులు .. ఇంకా వగైరా వగైరా అన్ని వేసేస్కో :) .. అంతే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది .. పాపం అన్వేష .. ఇంకనైన వాడిని వదిలేయ్ ..

బులుసు సుబ్రహ్మణ్యం said...

నాకు డౌట్ లేదు. పిచ్చ పిచ్చ గా, విచ్చలవిడిగా నమ్ముతున్నాను మీరే ప్రతీక్ అని. కొన్ని కొన్ని పద ప్రయోగాలు మీకు మాత్రమే సాధ్యం. ఏవంటే పైన కామెంట్లు లో చెప్పారు కదా మిత్రులు.
Very well గా రైటారు.

హరే కృష్ణ said...

అపర్ణ, థాంక్స్!
అన్వేష్ పుట్టిన గ్రహ సమయం అలా ఉంది మరి తప్పు నాది కాదు :)
ఓపిగ్గా చదివి నీ సూచనలు అందించినందుకు బోలెడు థాంక్స్!

రాజ్ థాంక్స్ !
కఠోర అని ఎందుకు రాసానంటే అది malaysia కదా మనకి నచ్చిన శిక్షలను నచ్చిన పేర్లతో రాసేసుకోవడమే :)
Hey ringa ringa roses...
వంకర టింకర poses...
తింగర తింగర theorems కి పట్టెయ్ solutions....
ఎయ్ పోటా పోటీ cheatings...
చీటికి మాటికి fightings
ఇలా ఉంటే కిక్ ఉంటుంది కదా :)


ఎటాక్ ఎటాక్ ...
చేప కొంగ మీదికే
ఎటాక్ ఎటాక్ ....
జింక పులి మీదికే
ఎటాక్ ఎటాక్ ...
అలా అలా రాసేసా అన్నమాట :)
Thanks Again!

హరే కృష్ణ said...

మురళి గారు థాంక్ యూ :)

హరే కృష్ణ said...

బ్లాగు ప్రేక్షకులకు ప్రకటన
అనుమానం డౌట్ అని చెప్పి ప్రతీక్ ని నేనే అని తీర్మానించుకున్న బ్లాగు పుర ప్రజలందరికీ ఇవే నా తరపున వంద రెండొందనాలు
మీ అభిమానానికి ధన్యుడను :)
అభియోగానికి ఆద్యం పోసిన శ్రావ్య గారికి ప్రత్యేక ప్రతీక్ అభినందనలు!

thank you :)

హరే కృష్ణ said...

కావ్య,
అదేమిటో నేను ప్రతీక్ ని కాదు అని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు చివరకి నువ్వు కూడా
నీకు అసలు కిడ్నీ ఏ లేదు
తరువాత పార్ట్ కోసం వైటింగ్ వైటింగ్ అన్న ప్రజలు ఇప్పుడు ఒక్కరు కూడా కనిపించడం లేదు వాఆఆఆఆఆఆ..దానితో పోల్చుకుంటే అన్వేష్ జరిగిన అపకారం అపకారమే కాదు హా..!

సుబ్రహ్మణ్యం గారు,
>> పిచ్చ పిచ్చ గా, విచ్చలవిడిగా నమ్ముతున్నాను మీరే ప్రతీక్ అని
గురువు గారు ఇదేనా మీ శిష్యుడ్ని మీరు అర్ధం చేసుకున్నది ప్రతీక్ వేరే కాని రాసింది నేనే హ్మ్మ్ :(
మీరు చాలా మంచోరు తప్పు మీది కాదు..కానే కాదు.. కామెంట్ పెట్టేటప్పుడు మీ ముందున్న రెండు కామెంట్లు మీకు source code లా ప్రోగ్రాం చేయబడి ఇలా రాసేలా చేయించాయి
థాంక్స్ :)

కావ్య said...

అంటే ఆ అన్వేష్ ని ఇంకా వదలవన్నమాట .. పదేళ్ళు పోయాక .. కూడా చిత్ర హింసలకి గురి చేస్తావన్నమాట .. రాగింగ్ చెయ్యడం పాపమా నేరమా .. గోరమ .. ఎల్లె నీకు మనసే లేదు .. పాపం అన్వేష్ ..

ఇదిగో నాకు సపోర్ట్ గా అన్వేష్ కోసం ఎంత మంది హరే అదే ప్రత్యెక ప్రతీక్ బ్లాగు ముందర ధర్నా చేస్తున్నారు .. చేతులు కాళ్ళు ఎత్తండి ..

Anonymous said...

పోస్ట్ ఎలా ఉందో పైన చెప్పినవాళ్ళ మాటే ,కామెంట్స్ కూడా మీవి చాలా బాగున్నాయి>>>>వంకర టింకర పొసెస్...
తింగర తింగర థెఒరెంస్ కి పట్టెయ్ సొలుతిఒన్స్....
ఎయ్ పోటా పోటీ చేతింగ్స్...
చీటికి మాటికి ఫిఘ్తింగ్స్
ఇలా ఉంటే కిక్ ఉంటుంది కదా :)


ఎటాక్ ఎటాక్ ...
చేప కొంగ మీదికే
ఎటాక్ ఎటాక్ ....
జింక పులి మీదికే
ఎటాక్ ఎటాక్ ...
అలా అలా రాసేసా అన్నమాట :)>>>>>

సూపరంతే

ఇందు said...

ఇంత ఘోరం జరిగిందా?? ప్రతీక్ అసలు మనిషేనా? :P ఏదో పాపంలే అని అన్వేష్ చేరదీస్తే....కెవ్వ్వ్వ్ అని అరిపించేసాడుగా అన్వేష్ చేతా!! పాపం అన్వేష్.... :(((((((

హరే కృష్ణ said...

అనోనిమస్ గారు థాంక్ యూ థాంక్ యూ :)
మీపేరు కూడా రాస్తే చాలా బావుండేది
అయినా ఫర్వాలేదు ఏంటో మంది అజ్ఞాత అభిమానుల అభిమానం సంపాదించుకున్నాం అని పోస్ట్ లు రాసేస్తా :)
చాలా చాలా థాంక్స్ :)

ఇందు గారు
మీరెంత మంచోరు,చూసారా ఎవ్వరు చెప్పలేని పాయింట్ లు మీరు చెప్పారు శబాష్ శబాష్..
ప్రతీక్ అసలు మనిషేనా?
కాదు మనిషి కానే కాదు అతను ఒక దేవదూత లోక కళ్యాణార్ధం ఒక ఏంజెల్ కోసం భూలోకానికి వచ్చి బోంబే లో స్థిరపడ్డాడు
ఇలా అరాచక అన్వేష్ లాంటి వాళ్లకు పెళ్లి చేసి అలా అలా ట్రిప్ లు వేస్తాడన్నమాట
థాంక్స్ :)

శివరంజని said...

హమ్మయ్య ఇన్న్నాల్లకి ఒక కథనైనా పూర్తీ చేసారు .........చాలా వెరయిటీగా ఉంది స్టోరీ

హరే కృష్ణ said...

శివరంజని గారు నేను కధలు పూర్తిచేయకపోవడం వల్లనేమో అసలు నా బ్లాగ్ వైపు జనాలు రావడమే మానేశారు
నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు :)
keep visiting!

మధురవాణి said...

ఓర్నాయనో.. నాకు రేస్ సినిమా చూసినట్టుంది.. కథలో ఇన్ని ట్విస్టులు చూసి.. భలే రాసారే! :))