Pages

Wednesday, April 27, 2011

The Prestige

Every magic trick consists
of three parts, or acts.

The first part is called "the pledge."

The magician shows you
something ordinary.

A deck of cards, a bird or a man.

He shows you this object

Perhaps he asks you to inspect it,

to see that it is indeed real
unaltered, normal.
But, of course, it probably isn't.

The second act is called "the turn"

The magician takes
the ordinary something

and makes it do
something extraordinary

Now you're looking for the
secret, but you won't find it

because, of course,
you're not really looking.

You don't really want to know.

You want to be... fooled

But you wouldn't clap yet,

because making something
disappear isn't enough.
You have to bring it back.


That's why every magic trick
has a third act.

The hardest part.

The part we call..

"The Prestige."

Angier అనే మెజీషియన్ ని వాటర్ టాంక్ లో చంపినట్టుగా Borden పట్టుబడటం తో కధ మొదలవుతుంది
కోర్ట్ లో బోర్డెన్ కు ఉరిశిక్ష ని విధించమని తీర్పిస్తారు
తన కూతురు భవిషత్తు గురించి ఆలోచిస్తూ జైలు లో రోజులు గడుపుతున్న Borden దగ్గరకు ఒక రోజు Owens అనే వ్యక్తి వచ్చి, తమ బాస్ Lord Caldlow కి బోర్డెన్ మేజిక్ సీక్రెట్స్ కి చెబితే,బోర్డెన్ చనిపోయాక తన కూతురు భవిష్యత్తు ని చూసుకుంటా అని హామీ ఇస్తాడు.. అంతే కాక, LordCaldlow అసిస్టెంట్ అయిన Mr .Owens జైలు లో ఉన్న బోర్డెన్ కి అతని శత్రువు అయిన Angier dairy ని అందచేస్తాడు.

**************************************************************************************************************

Robert Angier, Alfred Borden ఇద్దరు యువకులుగా ఉన్నప్పుడు Cutter (Michael Caine) దగ్గర మెజీషియన్స్ గా తమ కెరీర్ ని మొదలు పెడతారు.
Angier భార్య కూడా Borden మరియు cutter తో కలసి మేజిక్ షో లో perform చేస్తూ ఉంటుంది. ఒకసారి ట్రిక్ లో భాగంగా బోర్డెన్ తన చేతులు కట్టినప్పుడు knot సరిగ్గా కుదరక నీళ్ళలో మునిగి స్టేజ్ మీద అందరూ చూస్తుండగా చనిపోతుంది Angier భార్య. Traditional knot కాకుండా Borden వేరే విధంగా చేతులు కట్టడం వల్లనే తన భార్య చనిపోయిందని Angier నిర్ధారించుకొని, Borden పై ద్వేషం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ వేరు వేరుగా ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెడతారు.

గతాన్ని మర్చిపోలేని Angier తన భార్య చావుకు కారణం అయిన Bordenని, ఒక ప్రదర్శన మధ్యలో ఉండగా వెళ్లి షూట్ చేస్తాడు. కానీ అది కాస్త మిస్ ఫైర్ అయ్యి Borden చేతి వేలుకు మాత్రమే గాయమవుతుంది. విషయం తెలుసుకున్న Borden కోపంతో Angier బర్డ్ కేజ్ illusion ని ఫెయిల్ చేసి Angier reputation ని దారుణంగా దెబ్బ తీస్తాడు.


బోర్డెన్ ఎంతో మంది ప్రజలను తన ట్రిక్ "The Transported Man" తో ఆకర్షిస్తాడు. ఇది చూసి తట్టుకోలేని Angier తన లాగ కనపడే ఒక డబుల్ (రూట్) ని తీసుకొచ్చి బోర్డెన్ ట్రిక్ ని దొంగలించి "The New Transpoted Man " గా పెర్ఫార్మ్ చేస్తాడు. అయితే బోర్డెన్ కి Angier డబుల్ వాడుతున్నాడు అనే విషయం తెలిసిపోతుంది.
ఈ విషయం తెలుసుకున్న Angier తన దగ్గర పని చేస్తున్న Ms.Olivia (Scarlett Johansson ) ని గూఢచారి గా వెళ్ళమని చెప్పి బోర్డెన్ దగ్గరకు పంపిస్తాడు.


దీనికి విరుద్ధం గా,ఊహించని విధంగా Olivia బోర్డెన్ తో ప్రేమలో పడి, Angier సీక్రెట్స్ అన్నీ బోర్డెన్ కి చెప్పేస్తుంది.

Angier సీక్రెట్స్ తెలుసుకున్న బోర్డెన్, Angier ఇచ్చే ఒక ప్రదర్శనలో అతను మాయం అయ్యేటప్పుడు స్టేజ్ కింద వేసిన mattress ని తీసేసి అతని ఎడమకాలును విరగ్గోట్టేలా చేసి "The New Transpoted Man "ట్రిక్ ని అందరి ముందు
అపహాస్యం చేస్తాడు. కాలి గాయంతోనే ఒలివియా ఇంటికి వెళ్లి "నువ్వు తనతో ఒక్కటైపోయావ్..నా ట్రిక్ చెప్పి నా కాళ్ళు విరగడానికి నువ్వే కారణం అయ్యావ్" అని తనని నిలదీస్తాడు Angier. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతుల్లో బోర్డెన్ డైరీని పెట్టిన ఒలివియా పై మళ్లీ కాస్త నమ్మకం కలుగుతుంది Angier కి. cipher తో మొదలైన ఆ డైరీ ఏమీ అర్థం కాదు Angier కి. మొత్తం నోట్స్ ని కాపీ చేసేసుకొని పొద్దున్న కల్లా ఇచ్చేయాలి అని అన్న ఒలివియా తో, "ఆ హ్యాండ్ రైటింగ్ నాకు అర్ధం కావడం లేదు, నేను తిరిగి మళ్ళీ ఇవ్వలేను" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు Angier ఆ డైరీ తో సహా.

బోర్డెన్ illusion ట్రిక్ కోసం, Angier Cutter తో కలసి బోర్డెన్ ఇంజనీర్ అయిన Fallon ని కిడ్నాప్ చేసి బతికుండగానే ఒక coffin లో బంధిస్తాడు. Fallon ని తిరిగి ఇవ్వాలంటే తన ట్రిక్ కి solution చెప్పమని బోర్డెన్ ని అడుగుతాడు Angier


దానికి జవాబుగా Tesla అని ఒక నోట్ పై రాసి ఇస్తాడు బోర్డెన్. Angier టెస్లా కోసం Colorodo springs కి వెళ్తూ ఈ సినిమా మొదట్లో ఇలా చెబుతాడు.

A search for answers.

Even if Colorado
is the end of my journey,

it'll take much longer to unravel

the rest of Borden's secrets
See, the cipher in his notebook is

unlocked by a single word,

but it will still take months
to translate his writing

And to know his mind

Well, my passion is equal to the task


Colorodo Springs Angier Tesla అసిస్టెంట్ Alley ని కలుస్తాడు.
Angier :- I've come to see Tesla.
Alley :- Why?
He made a machine
for a colleague of mine some time ago.

అని చెప్పి బోర్డెన్ కి మీరు చేయించిన మెషిన్ నాకు కూడా కావాలి అని అంటాడు
Angier :Can you get me a meeting with him?
Alley :Impossible, I'm afraid.
Angier :I've brought a lot of money.
Alley :I'm sorry, Mr. Angier.
I simply can't help.
Angier :I'll be staying at the hotel, indefinitely.

ఒక రోజు Tesla Angier ని పిలిచి తనకి కూడా ఒక మెషిన్ ని తయారుచేస్తా అని చెప్పి చాలా డబ్బు తీసుకొని research చేస్తూ ఉంటాడు. రోజుల తరబడి మెషిన్ కోసం ఎదురు చూస్తూ బోర్డెన్ డైరీ ని హోటల్ లో కొంచెం కొంచెం చదువుతూ తన హేండ్ రైటింగ్ ని అర్ధం చేసుకుంటూ తన ట్రిక్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కొన్ని రోజులకి డైరీలో ఒకచోట, ఒలివియా నిజంగా బోర్డెన్‌కి ప్రపోజ్ చేసినట్టు రాసి ఉండడంతో anxiety ఆపుకోలేక చివరి పేజ్ కి వెళ్లి చదువుతాడు.


to you, Angier.

Yes, Angier, she gave you
this notebook at my request.

And yes, "Tesla" is merely
the key to my dairy, not to my trick.

You really think I'd part
with my secret so easily after so much?

Goodbye, Angier.

May you find solace
for your forward ambition
back in your American home.
అని ఉంటుంది.


వెంటనే ల్యాబ్ కి వెళ్లి తన కోపాన్ని Tesla పై చూపిస్తాడు. Tesla ఒక teleportation machine ని చూపించి ఆ మెషిన్ లోనికి వెళ్తే డబుల్/డూప్లికేట్ మరింత దూరం లో ప్రత్యక్షం అవుతాడు. ఇది మొదట గా ఒక hat తర్వాత ఒక cat మీద ప్రయోగం చేసి చూపిస్తాడు.

తర్వాత రోజు టెస్లా లేబొరటరీ ని ఎడిసన్ మనుషులు కాల్చేస్తారు..ఇంత డబ్బు వృధాగా ఖర్చయిపోయింది టెస్లా ఏమీ ఇవ్వలేదు అని భాదతో హోటల్ కి తిరిగి వచ్చిన Angier కి ఒక మెషిన్ టెస్లా మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి హోటల్ యజమాని అందచేస్తాడు. అయితే టెస్లా దీన్ని ఎక్కువ రోజులు వాడద్దు నీ అవసరం అయిపోయాక ఆ మెషిన్ ను destroy చెయ్యమని ఒక నోట్ లో రాసి చెబుతాడు.


Angier కోలోరోడో నుండి లండన్ వచ్చేసి tesla మెషిన్ తో "The Real Transported Man " ట్రిక్ ని ప్రవేశపెట్టి ఒక అధ్బుతాన్ని సృష్టిస్తాడు. మెషీన్ లో ఎంటర్ అయ్యి కాసేపయ్యాక బాల్కనీ లో ప్రత్యక్షమయ్యే Angier ట్రిక్ కి వచ్చిన అద్బుతమైన స్పందన ని చూసి బోర్డెన్ కి ఇంకా కోపం పెరిగిపోతుంది. అంత అద్భుతమైన రహస్యమేంటో కనుక్కోవడానికి ఒకరోజు Angier చేస్తున్న ప్రదర్శన కి వెళ్తాడు బోర్డెన్.


ప్రదర్శన ఇచ్చే ముందు ఎప్పటిలానే Angier ఈ మెషిన్ ని కావాలంటే audience ని చెక్ చేసుకోమని చెప్పాక మారు వేషం లో ఉన్న బోర్డెన్ స్టేజ్ మీద కు వెళ్ళి, బేస్ మెంట్ లో ఉన్న apparatus సెక్షన్ లో పూర్తిగా నీళ్ళతో ఉండిన టాంక్ ను వెళ్ళి పరశీలిస్తుండగా హఠాత్తుగా Angier వచ్చి ఆ ట్యాంక్ లో పడతాడు. పడిన వెంటనే ఆటోమాటిక్ గా లాక్ అయిపోతుంది హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఆ టాంక్ లో ప్రాణాలు విడుస్తాడు Angier. Angier ని బోర్డెనే హత్య చేశాడు అన్న ఆరోపణలతో అతడికి ఉరిశిక్ష పడుతుంది.


ఇంతకు ముందే బోర్డెన్ ఒలివియా ల మధ్య సంబంధం పీక్ కి చేరడం తో ఆ మానిసిక క్షోభ ను తట్టుకోలేక బోర్డెన్ లోయల్ గా తనతో ఉండకపోవడం తో బోర్డెన్ భార్య ఉరి వేసుకొని చనిపోతుంది. ఒంటరి అయిన బోర్డెన్ కూతురు భవిష్యత్తు ఏమవుతుందో తెలియక జైలు లో ఉరి వేసే రోజు దగ్గర పడుతుండడం తో తన secrets ని *Lord Caldlow కి *చెప్పి కనీసం తన కూతురికి మంచి జీవితం ఇవ్వాలని, ఆ తర్వాత రోజు Caldlow ని కలవడానికిసిద్ధపడతాడు.

బోర్డెన్ Caldlow ని కలసి "The Transported Man" ట్రిక్ తో సహా అన్ని secrets ఉన్న పేపర్స్ Caldlow కి ఇస్తాడు. అయితే అనూహ్యంగా Caldlow చిన్నగా నవ్వి ఆ పేపర్స్ ని బోర్డెన్ ముందే చించేస్తాడు. అప్పుడు చూపిస్తాడు Caldlow మరెవరో కాదు Angier నే అని. చెయ్యని నేరానికి శిక్ష ని అనుభవిస్తూ బోర్డెన్ Angier ని ఎంత వేడుకున్నా Angier కనీసం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

లాజిక్:టెస్లా ఇచ్చిన మెషిన్ వల్ల ప్రతి షో perform చేసాక ఒక డూప్లికేట్ రిలీజ్ అవుతాడు. డూప్లికేట్ ప్రతి రోజూ స్టేజ్ కింద ఉన్న నీళ్ళ టాంక్ లో పడి చనిపోగా, ఒరిజినల్ కొంత దూరం లో ప్రత్యక్షం అవుతాడు. ప్రతిరోజూ Angier షో అయ్యాక చనిపోయిన డూప్లికేట్ ని సిటీ కి దూరం లో ఉన్న warehouse లో దాచిపెట్టి వంద ప్రదర్సనలు అయ్యాక మెషిన్ తో పాటు ఈ వంద dead body లను పెట్టి తగలబెడదామన్నది Angier ప్లాన్.


Lard Caldlow ఆ మెషిన్ ని తీసుకున్నాడు అని Cutter కి caldlow అసిస్టెంట్ చెప్పడంతో Cutter Caldlow ఇంటికి వెళ్లి అక్కడ Angier ని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చనిపోయావనుకొని నేను అనవసరంగా సాక్ష్యం చెప్పాను నీ తరపున నేను ఇక్కడికి వచ్చింది కూడా Caldlow ని ఆ మెషిన్ ఉపయోగించొద్దు అని చెప్పడానికి అని చెప్పి,

Cutter :I came here to beg Lord Caldlow to let me destroy that machine. I am not going to beg you for anything.
Angier :You don't have to. I'm gonna make sure it is never used again.
Cutter:where do you want me to deliver it?
Angier :My theater. It belongs with the prestige materials.


బోర్డెన్ కి ఉరిశిక్ష వేసే రోజు వస్తుంది..ప్రజల దృష్టి లో చనిపోయిన Angier ఆ రోజు తన warehouse కి వస్తాడు. Angier గురువైన Cutter, నిజం తెలుసుకొని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిన కొద్ది సేపటికి బోర్డెన్ వచ్చి Angier ని షూట్ చేస్తాడు.


బోర్డెన్,అతని దగ్గర పని చేస్తున్న ఇంజనీర్ Fallon ఇద్దరూ identitical ట్విన్స్ అని అసలు విషయం చెబుతాడు. ఒలివియా తో కలసి ఉంటుంది నేను కాదు ఫల్లోన్, తన కోసం Fallon జీవితాన్ని త్యాగం చేసి జైలు కి వెళ్ళాడని నిజం చెప్పి, Angier ని చంపేయడం తో కధ ముగుస్తుంది.


సినిమా అయిపోయాక వెంటనే Cutter (Michael Caine) ఇలా చెబుతాడు.


Every magic trick
consists of three parts, or acts.


The first part is called "the pledge.


The magician shows you
something ordinary.

The second act is called "the turn."

The magician takes
the ordinary something

and makes it into
something extraordinary.


But you wouldn't clap yet,
because making something disappear

isn't enough. You have to bring it back.

Now you're looking for the secret.

But you won't find it, because,
of course, you're not really looking.

You don't really want to work it out.

You want to be fooled.


టైటిల్స్ వేసేస్తాడు...ఒక మంచి సౌండ్ ట్రాక్ తో, ఒక ఎండింగ్ లేకుండా, ఏమిటిది హీరో అయిన Angier ని చంపేసాడు అని అనుకున్నా. రెండు గంటలు తల తినేసిన దర్శకుడిని మనస్పూర్తిగా తిట్టకుండా ఉండలేము అనేది మొదటి reaction :) సెకండ్ హాఫ్ మళ్ళీ మళ్ళీ చూసాక వావ్ అనిపించింది. సినిమా గురించి సూటిగా చెప్పాలంటే, సినిమా స్టొరీ కంటే దర్శకుడు మనల్ని ఆలోచింప చేసే విధానం ఈ సినిమాకి హైలైట్.

MTech చేస్తున్న కొత్తలో ఈ సినిమా చూసి ఆ ఆ మరుసటి రోజు మా ఫ్రెండ్ కి చూపించాను బావుంది ఈ సినిమా చూడు అని.. మా వాడు ఒక్కటే సమాధానం ఇచ్చాడు కధకి సరిగ్గా సరిపడే టైటిల్ పెట్టాడు అని.
ఎందుకు ? అని అడిగితే , "బుర్ర ని బాగా ప్రేస్టీజ్ లో ఉడకెట్టేశాడు" అని వాడి నుండి సమాధానం.


రెండో సారి చూసాక.. చూడడానికి ధైర్యం చేయరు జనరల్ గా రెండో సారి. .మనం అర్ధం చేసుకునే విధానం లో ఖచ్చితంగా మార్పు వస్తుంది..మూడు డిఫరెంట్ ట్రాక్ లు నేరేట్ చేస్తూ సినిమా మొదలు అవ్వడం చివర్లో మనం ఎండింగ్ ని అర్ధం చేసుకొనే విధానం వల్ల mutiple viewing must :) for this Nolan's Masterpiece!

సినిమాను ఎలా ముగించాడు అని మనం ఆలోచిస్తే interpretations unlimited :
interpretation 1 : Angier colorodo లో జరిగిన టెస్లా ఎపిసోడ్ ద్వారా మోసపోయి(మెషిన్ డబుల్ ని క్రియేట్ చేయడం) ఎడిసన్ మనుషులు టెస్లా ప్రయోగశాలను కాల్చేశారు అనే అబద్ధం చెప్పి Angier కి ఒక డబ్బా ఇచ్చేసి
జంప్. ఒకవేళ టెస్లా మీద Angier కేస్ వేస్తే వరల్డ్ ఫేమస్ మెజీషియన్ కి అంత కంటే మరో అవమానం ఉండదు.
టెస్లా కొయిల్ -లైట్ ప్రొడ్యూస్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు. తను "The Real Transported Man " లో ఉపయోగించింది డబుల్ (రూట్) నే. వాటర్ ట్యాంక్ లో చనిపోయింది రూట్.


interpretation 2:"The Real Transported Man " one of the 100th షో అయ్యాక ఆ వాటర్ ట్యాంక్ ను క్లాత్ తో కవర్ చేసి ఒక బండి మీద వెళ్తుంటే Fallon ఫాల్లో అవడం సినిమాలో చూపిస్తాడు..అది కూడా Angier ట్రిక్ లో భాగం కావొచ్చు
dummies /Wax బొమ్మలను Fallon /Borden కి నమ్మకం కలిగించేలా చేస్తాడు. అంటే వేర్ హవుస్ లో ఏదో జరుగుతోంది అనే నమ్మకం కలుగుతుంది బోర్డెన్/Fallon ఇద్దరికీ.

ఇంకా క్లియర్ గా చెప్పాలంటే duplication /డబుల్ క్రియేట్ అవుతుంది అని నమ్మించడానికి జైల్లో ఉన్న బోర్డెన్ కి తన డైరీ ని Lord Caldlow గా పరిచయమ అయ్యి తన డైరీ ని అందచేస్తాడు. డైరీ లో కూడా వ్యూహాత్మకంగా cipher నుండి మొదలు పెట్టడం తో జైలు లో ఉన్న బోర్డెన్ ఇంకా నమ్మడానికి దోహదపడేలా చేస్తాడు. చివరికి Borden, Fallon ఒకే లా ఉండటం తో ఫల్లోన్ ఉరికంబం ఎక్కుతాడు. బోర్డెన్ Angier ని చంపేస్తాడు. ఉరి వేసినప్పుడు చనిపోయింది బోర్డెన్ ఖచ్చితం గా కాదు,చనిపోయింది Fallon. ఎందుకంటే ఉరి తాడు వేసే క్షణాల ముందు Abracadabra అని చెప్పి చనిపోతాడు.

interpretation 3 : for a Happy Ending :) మెషిన్ లో డబుల్ క్రియేట్ అయ్యింది చివరికి చనిపోయింది Angier కాదు. చివర్లో Angier బోర్డెన్ కి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అబద్దం. ఒక డబుల్ క్రియేట్ అయ్యాడు వాడిని నేను చంపేసాను అని చెబుతాడు. చెప్పడం వరకే నిజంగా చంపాడా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అదే నిజం అయితే రూట్,మెషిన్ ద్వారా నోలన్
చివర్లో ఒక హింట్ కూడా ఇస్తాడు. ఈ లాజిక్ కరెక్ట్ అని చెప్పడానికి లార్డ్ caldlow కట్టర్ తో మాట్లాడేటప్పుడు మరియు Lord caldlow గా బోర్డెన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు కాలు విరిగిపోయిన Angier చేతి కర కనిపిస్తుంది. చివరి సీన్ లో Warehouse లో తను నడిచేటప్పుడు angier చేతి కర్ర ఉండదు :)

23 comments:

మనసు పలికే said...

1స్ట్ కామెంట్ నాదే నాదే నాదే...:))))
చదివి మళ్లీ వస్తా..:)))

మంచు said...

You are getting obsessed with Nolan ... :-D

కావ్య said...

నీ బుర్రని కలిగా ఉంచుకోడం నీకు ఇష్టం ఉండదా :) ?? ఎప్పుడు అలా రన్నింగ్ చేయ్పిస్తావ్ .. అసలు .. పాపం ..

నీ బ్రెయిన్ కి నా సంతాపం ప్రకటిస్తున్న :(

బాగా అనలైజ్ చేసావ్ :)

మనసు పలికే said...

బాబూ హరే..:)
ఇంగ్లీష్ సినిమాలు అస్సలు చూడని నేను నీ కారణంగా (ఆల్మోస్ట్) చూసేస్తున్నా:) అంటే చదివేస్తున్నా, కానీ చూపించినట్టుగా చెప్పేస్తున్నావు కదా. టపా బాగుంది, స్టోరీ బాగుంది. ఇంకా నువ్వు చాలా ఓపికగా పెట్టిన ఫోటోలు అన్నీ కూడా స్టోరీని కనెక్ట్ అయ్యేలా చేసాయి:) గుడ్ వర్క్..

మధురవాణి said...

This is just amazing! ఇలాంటి సినిమాలు చూసి అర్థం చేసుకోగలగడమే చాలా గొప్ప విషయం.. అలాంటిది ఇంత ఓపికగా నాలాంటి మట్టి బుర్రలకి కూడా అర్థమయ్యేలాగా రాయడం.. అద్భుతం నిజంగా! :))
And I agree with manchu garu! ;)

విజయ క్రాంతి said...

చాలా సార్లు చూసినా విసుగు రాని సినిమా ఇది .
మీకు వీలైతే 'ILLUSIONIST' అనే సినిమా చూడండి .prestige and illusionist are released almost at the same time. Illusionist is also a magic man's movie but its completely different concept . You will love it .

Rottentomatoes : http://www.rottentomatoes.com/m/illusionist/

Imdb : http://www.imdb.com/title/tt0443543/

విజయ క్రాంతి said...

c.nolan known for non linear narration and this movie is the best work of him.

Ravitheja said...

చాలా బాగా వివరించారు

karthik said...

>>మీకు వీలైతే 'ILLUSIONIST' అనే సినిమా చూడండి
my fav movie :D
క్రాంతి గారూ,
నావరకూ Inception కంటే Illusionist బాగా నచ్చింది..

Arun Kumar said...

చాలా బాగా వివరించారు

మధురవాణి said...

'ILLUSIONIST' is my favotrite too! :)

@ Hare krishna,
ఈ బ్లాగ్ కొత్త టెంప్లేట్ చాలా బాగుంది. :)

వేణూ శ్రీకాంత్ said...

I agree with మంచు గారు :-) చాలా బాగా రాసారు :-)

Sravya Vattikuti said...

Great job Hare Krishna !
రెండో సారి చూసాక.. చూడడానికి ధైర్యం చేయరు జనరల్ గా రెండో సారి
---------------------
ఇది కరెక్టు కాదేమో , రిపిరేట్ ఆడియన్స్ కోసమే స్క్రీన్ప్లే ని కొంచెం కాంప్లికేట్ గా చేయటం ఒక టెక్నిక్ కూడా !

హరే కృష్ణ said...

అపర్ణ థాంక్ యూ :)
బాగా బుర్ర తినేసా కదా :P
ఓపికగా చదివి కన్నెక్ట్ అయ్యినందుకు చాలా చాలా థాంక్స్ :)

మంచు గారు ;-)
obsession లేకపొతే ఎడిసన్,టెస్లా ఇద్దరూ అంత ఫేమస్ అయ్యేవాళ్ళు కాదేమో :)

హరే కృష్ణ said...

కావ్యా! తెలుగు బాష లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పదం ఖాళీ :)
ఖాళీ సారీ స్పేర్ టైం లో :) మూవీ ని ఎంజాయ్ చేస్తూ ఈ రివ్యూ రాసేసా :)
సంతాపానికి బ్రెయిన్ తరపున బోలెడు ధన్యవాదాలు
interpretations మాత్రం ఈ సినిమాకు కోకొల్లలు..కన్నెక్ట్ అయితే బ్రెయిన్ కి ఫుల్ చిల్లులు ఈ మూవీ ని ఎన్నిసార్లు చూసినా హాంగ్ ఓవర్ నాకు ఒక రెండు రోజులు వరకు వదలదు :)

Thank you :)

హరే కృష్ణ said...

మధురవాణి థాంక్ యూ వెరీ మచ్ :)
స్టోరీ లో complicated పార్ట్ అంటే non Linear screenplay తో మొదటి సగం అంతా వాటితో కన్నెక్ట్ అయ్యేసరికి సరిపోతుంది
సెకండ్ ఆఫ్ లో ట్విస్ట్ మీద ట్విస్ట్ లు అంతా సర్దుకుంటుంది అనగా నోలన్ తన మార్కు ప్రతిభ ని చూపిస్తాడు
95 లో Christopher Priest రాసిన అదే పేరుతొ విడుదలైన నోవెల్ కోసం ఎంత వెతికినా మార్కెట్ లో దొరకలేదు..నోవెల్ కి సినిమా కి చాలా తేడా ఉంది అని ఇంటర్వ్యూ లో నోలన్ నే స్వయంగా చెప్పాడు, I am very much fond of this movie Especially the way Nolan crafted! A Masterpiece from Nolan for sure.

రాయడం కంటే interpretations చేతి కర్ర లేకపోవడం అనే చిన్న లాజిక్ లు వెతికేసరికి కాస్త టైం పట్టింది అంతే :) Thank you :)

హరే కృష్ణ said...

విజయక్రాంతి గారు సరిగ్గా చెప్పారు..విసుగు అనేది అసలు ఉండదు సినిమా లో.. లీనం అయిపోతూనే ఉంటాం సినిమా ఎండింగ్ నోలన్ చెప్పేసి ఉంటె ఇంత anxiety ఉండదు ప్రతి సారి చూసినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది

అవును ILLUSIONIST is a great watch! కాకపొతే ఈ రెండు సినిమాలు వేటికవే సాటి..నోలన్ నోలనే నోర్టన్ నోర్టనే :)
ఎడ్వర్డ్ నోర్టన్ కి నేను ఆ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయా అన్ని pages కమ్యూనిటీ లో జాయిన్ అండ్ లైక్ :)
ఇటాలియన్ జాబ్ లో విలన్ గా చేసిన క్యారెక్టర్ తోనే తను అప్పటి వరకు ఫేమస్ కదా Fight క్లబ్ కి నేరేషన్ కూడా తనే అనుకుంటాను. మీ అభిప్రాయం పంచుకున్నందుకు చాలా థాంక్స్
నా బ్లాగు కి స్వాగతం :)

Christopher Nolan known for non linear narration and this movie is the best work of him.
yes.. well said!


రవి తేజ గారు థాంక్ యూ :)

హరే కృష్ణ said...

అరుణ్ కుమార్ గారు థాంక్ యూ

కార్తీక్ థాంక్ యూ :)


>>నావరకూ Inception కంటే Illusionist బాగా నచ్చింది..అసలు prestige గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు..ఆయ్!



మధుర :)
మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసారు ఈ టెంప్లేట్. నాకు బాగా నచ్చింది ,థాంక్స్!
ఈ కామెంట్స్ చూస్తుంటే ILLUSIONIST గురించి భారీ లెవెల్ లో రాసే ప్రోగ్రాం లు పెట్టుకొనేలా ఉన్నారు..రాసేద్దాం రాసేద్దాం అది కూడా :)

హరే కృష్ణ said...

వేణూ శ్రీకాంత్ గారు మీ కామెంట్ రాలేదేమిటి అని సాయంత్రం వరకు అనుకుంటూనే ఉన్నా :))
నెనర్లు.నోలన్ inception స్క్రిప్ట్ మీద ఎనిమిదేళ్ళు వర్క్ చేస్తే ఈ మూవీ interpretations మూడు నెలలు గా research చేస్తే చివరికి పూర్తయ్యింది :)
వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు :)

జేబీ గారి నుండి కామెంట్ రావడం ఒక్కటే మిగిలి ఉంది ఆయన ఒకసారి మంచు గారి పోస్ట్ లో mention చేసారు
http://manchupallakee.blogspot.com/2010/10/34.html

హరే కృష్ణ said...

శ్రావ్య గారు మా కేంపస్ లో విద్యార్ధులందరికీ విపరీతమైన బద్దకం సినిమా ఎలా ముగిసిపోయిందో అవసరం లేదు కాని పేరుకి చూసేసాం అని చెప్పేయాలి అన్నమాట..లేకపొతే రోజుకి మూడు చెప్పున సినిమాల టార్గెట్ మిస్ అయిపోయేది :)


రిపిరేట్ ఆడియన్స్ కోసమే స్క్రీన్ప్లే ని కొంచెం కాంప్లికేట్ గా చేయటం ఒక టెక్నిక్ కూడా !
Exactly! only in DVD Not possible in Theater for most of the Viewers..theatre ప్రేక్షకులకు అని మెన్షన్ చేయడం మరిచిపోయాను :) sorry!

Thank you very much for the compliments :)

..nagarjuna.. said...

>>రోజుకి మూడు చెప్పున సినిమాల టార్గెట్ మిస్ అయిపోయేది

మరే...ఆలస్యం అమృతం విషం మరి, సినిమాలు చూడాలి, హార్డ్ డిస్కులు నింపాలి, షేర్ చేయాలి. చాలా తతంగం ఉంటుంది :)

హరే కృష్ణ said...

హ హ్హ నాగార్జున..సరిగ్గా చెప్పావ్ :)
IIT అంతా ఇంతే..మనందరిదీ
పిచ్చికే పిచ్చి లే అసలు
హార్డ్ డ్రైవ్ ఎక్కడ corrupt అయ్యి క్రాష్ అయిపోతుందనో..గంట నర సినిమా చూసే టైం కి మూడు DVD లు తో రైట్ చేసేసేవాళ్ళం extra safety కోసం :)
ఇప్పటికీ భద్రంగా అలానే ఉన్నాయ్ అందరి దగ్గర :)
చదువుకొనే material ప్రోఫ్ ఇచ్చే presentations మాత్రం ఇల్లల్లియో :)

రాజ్ కుమార్ said...

హ్మ్మ్.. సినిమా చూశాకనే రివ్యూ చదువుదాం అనుకున్నా నీ మాట ప్రకారం.. అది కుదిరేపనిలా అనిపించకా ఇక చదివేశా.. నా మట్టీ బుఱకి అర్ధమయ్యి,అర్ధం కానట్టూ ఉంది.. కానీ సినిమా చూడాలని డిసైడ్ అయ్యేలా మాత్రం చేసింది..
ఆ లాజిక్ లు అవీ ఇంకా బుఱ లోకి వెళ్ళలేదు..
సినిమా చూసొచ్చి.. మళ్ళీ వస్తా.. విపులంగా మాట్లాడుకుందాం...