Pages

Friday, April 22, 2011

కఠోర కూత..


ఏప్రిల్ 30 1997
ప్రదేశం: విజయవాడ సరిహద్దులు
ఏం జరుగుతోందిక్కడ : టేలంట్ హంట్

ఎందుకు:కెన్నెడీ హై స్కూల్
అకడమిక్స్ లో  కేకాయే
స్పోర్ట్స్ లో వీకాయే

district wise ఆటల పోటీల్లో  నిరంతరం  చివరి స్థానానికి కాంట్రాక్ట్ తీసుకున్నట్టు గత పదేళ్లుగా ఒక్క సారి కూడా ఆఖరి స్థానం నుండి తప్పించుకోలేని స్థితి ని చూసి చూసి విసిగి వేసారి పోయిన  పాఠశాల రూపు మార్పడానికి ఆ సంవత్సరం నుండి చుట్టు ప్రక్కన గ్రామాల్లో ఉన్న విద్యార్ధులకు ఉచిత విద్యను అందిస్తూ IPL టీమ్ లో నాలుగు overseas ప్లేయర్స్  ఉన్నట్టు  నలుగురు గ్రామ సింహాలను టీం లోనికి తీసుకొచ్చేలా యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు..

ఆటల  పోటీల పతకాలను సాధించి స్కూల్ పరువును  పతాక స్థాయి లో  పరుగులెట్టించడానికి  గేర్ మార్చి , ఏప్రిల్ లో గ్రామ సింహాలను  గైకొని పోయెను

 కట్ చేస్తే ..
వేసవి సెలవుల్లో గ్రామాల్లో నుండి ఒక్కోతరగతి కి నలుగురు చెప్పున నైపుణ్యమైన  క్రీడా బాలురను చేర్చుకున్నారు  
ఎప్పట్లానే సంవత్సరపు క్లాసులు జూన్ లో  మొదలయ్యాయిజూన్ 25 ,1997
నాలుగవ తరగతి
కెన్నెడీ హై స్కూల్ లో ఒక సాయంత్రం
సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిముషం


ఎప్పటిలానే లాస్ట్ అవర్  బెల్ మోగింది..పిల్లలంతా ప్లే గ్రవుండ్ వైపు పరుగులు తీసారు..కెన్నెడీ స్కూల్ వాళ్లకు ఆరోజు డిఫెండింగ్ చాంపియన్స్ అయిన సిస్కో sponsored  డాన్ బాస్కో డిస్కో ఉస్కో  తో చాలా కీలక మ్యాచ్ వచ్చి పడింది.


సమిత్ తన బేగ్,లంచ్ బాక్స్ ను  క్లాస్ లో వదిలేసి  వైట్ షూస్ తో కబడ్డీ ఫీల్డ్ లోనికి వెళ్ళాడు

కెన్నెడీ కేక క్రోస్ Vs డాన్ బాస్కో డిస్కో ఉస్కో
కెన్నెడీ టీం లో

ఓవర్ సీస్ హైప్డ్  ప్లేయర్స్ :-
పెనమలూరు నుండి పరేష్
రామవరప్పాడు నుండి రాజేష్
ఉయ్యూరు నుండి  అన్వేష్   :)
ఇబ్రహీం పట్నం నుండి ఇంద్రేష్ ఈ నలుగురు గ్రామ సింహాలు మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ పేరు చెప్పి ప్రక్కోళ్ళ లంచ్ బాక్స్ లు ఖాళీ చేస్తూ బిజీ గా ఉన్నారు..

శంకర్ మహదేవన్ పాటలు విని వినీ బ్రెత్ లెస్ పాటలు ప్రాక్టీస్ చేసి విఫలమయ్యి కబడ్డీ కూత ను రెగ్యులర్ కూత తో పాటు వేరే ఏదైనా ఆప్షనల్  గా మార్చుకునేలా అన్ని స్కూళ్ళ  వాళ్ళు అంగీకరించడం తో వికెట్ కీపర్ గా చేరిన ప్లేయర్ బేట్స్ మన్ కం కెప్టైన్ అయినట్టు కెన్నెడీ స్కూల్ కి ప్లస్ అయ్యింది..

గ్రౌండ్  లో గేమ్ కోసం టాస్ వేసారు
సమిత్ వాళ్ళ టీమ్ కూత మొదలెట్టింది

పెనమలూరు సింహా పరేష్ ముందు వెళ్ళాడు..చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం.. చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం.. అని అరచుకుంటూ ఇద్దరిని అవుట్ చేసి వచ్చాడు

తర్వాత రెండో టీమ్ నుండి ఒకరు  వచ్చి సమిత్ వాళ్ళ టీమ్ లో ఒకర్ని అవుట్ చేసాడు
క్లాస్ లో నుండి ఒక అమ్మాయి చదువుతూ మధ్య మధ్య లో ఈ ఆటను చూస్తోంది కూత తర్వాత వంతు సమిత్ ది
సమిత్ లైన్ దగ్గరకు వెళ్ళాడు లైన్ క్రాస్ అవుతూ సందేహం లేకుండా గట్టిగా నక్క లా ఒక ఊల  వేసాడు..వెంటనే ఆ  అమ్మాయి ఒక ఈల వేసింది  సమిత్  కూత మొదలెట్టాడు..

దాక తెచ్చుకో దుమ్ములేరుకో..మధ్య మధ్యలో ఊలల స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ తో గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరికీ నరకానికి చివర వరకు తీసుకెళ్ళిపోయాడు...కూత ని ఎంతకీ ఆపడం లేదు..చివరికి విండో వెనుకున్న అదే అమ్మాయి యాక్ యాక్ అని ఆ  తింటున్న చిప్స్ కక్కేసింది వెంటనే ఆ  కూత చూసి చివరి నిముషం లో మ్యాచ్ fixing ఆరోపణలు ఎదుర్కుంటున్న అన్వేష్  వచ్చాడు...

రాతిరి పది గంటలకు  పొలం లో ఎత్తేసిన చెరకు మూటలకు మా నాన్న కొట్టిన దెబ్బలకు   జువిచ్ ఊ..జువిచ్ ఊ ..జకోవిక్ లా ఈ జువిచ్ ఏమిటో అని జనాలు జుట్టు పీక్కోవడం మొదలు పెట్టారు

ఈ బాష మరీ కఠోరం గా ఉండడం తో అన్వేష్ కి రెడ్ కార్డ్ లేకపోవడం తో ఎల్లో కలర్ లో ఉన్న ప్రోగ్రెస్ కార్డ్ ని ఇచ్చేసి వార్నింగ్ ఇచ్చాడు రిఫరీ  

వెంటనే సబ్ స్టిట్యూట్  ఇంద్రేష్ వచ్చి... నీకు నాకు మాటలు లేవు.. ఎలుగు బంటి కి వెంట్రుకులు లేవు అని తన ట్రేడ్ మార్క్ కూతతో అందరినీ అలరించాడు


సమిత్ వాళ్ళ టీం దాదాపు గెలిచేసినట్టే..ఇరవై పాయింట్ల లీడ్ లో ఉంది ఆట కు  మరో రెండు నిమిషాలు మిగిలి  ఉంది..ఆఖరున ఇక కెప్టైన్ సమిత్ తో ఈ సారి నువ్వు నార్మల్ కూత తో రెండు నిముషాలు వేస్ట్ చేసి వచ్చేసేయ్ అని చెప్పి పంపించాడు.సమిత్  ముందు కబడ్డీ కబడ్డీ కబడి బడి బడి బడి బడి అని ఊపిరి అంతా ఆగిపోయేలా breathless బడి power of n  ని ధ్యానిస్తూ కోర్ట్ అంతా పరిగెడుతూ అరుస్తూనే ఉన్నాడు..అలసట ఆఖరు క్షణం లో సమిత్ మీద ఒక్క ఉదుటున ఇద్దరు పట్టుకుని వెనక్కు లాగేశారు

సమిత్ అలసి పోయి ఇంక నే ఇంటికెళ్తున్నా  అని కోచ్ కి చెప్పి క్లాస్ రూంలో ఉంచేసిన లంచ్ బాక్స్ తీసుకు రావడానికి వెళ్ళాడు..సూర్యాస్తమయం అవ్వబోతోంది..అసలే నీరసించిపోయి ఉన్న సమిత్ పై సూర్య కిరణాలు వెల్లువలా వచ్చి మొహం మీద  పడుతున్నాయి..జీవితం లో సమిత్ కు  మొదటి సారి సూర్య రశ్మి కి సల్మాన్ రష్డీ బుక్ కి తేడా తెలియనంత భావం చోటు చేసుకొని క్లాస్ రూమ్ అలా ఎంటర్ అయ్యి మొదటి బెంచ్ మీద పడిపోయాడు.


సరిగ్గా అప్పుడే incredible పుస్తకాల చీడపురుగు చైత్రి  ఈ దృశ్యాన్ని చూసి మంచి నీళ్ళు తో  పాటు మజా,మిరిండా కాసిన్ని చిప్స్ కుక్కేసి తిరిగి ఊపిరి తో పాటు సమిత్ కు టేస్ట్ ని ప్రసాదించింది (నాలుగో తరగతికి పిల్లలకు మాత్రమే అన్ సెన్సార్డ్ :)

బాల్యం బెస్ట్ ఫేజ్ లో ఉన్న కిక్ తీసుకొస్తున్న దశ లో విధి ఫుట్ బాల్ ఆడి సమిత్ వాళ్ళ నాన్న కు UK లో వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళడానికి ఇంకో రెండు రోజులుందనగా


సమిత్:అక్కడ డాడ్ తో పాటు మేము కనీసం మరో పది సంవత్సరాలు ఉండొచ్చు చైత్రి.
చైత్రి:నీతో నేనూ వస్తాను సమిత్
సమిత్:నీ దగ్గర ఉన్న విజయవాడ బస్ పాస్ ఏం వరల్డ్ వైడ్ విసా కాదు.. ఎక్కడి బడితే అక్కడికి వెళ్ళిపోవడానికి.. నన్ను మర్చిపో అని చెప్పాక 

ఇప్పుడంటే నువ్వు హాస్టల్ లో ఉన్నావ్ మరో పదేళ్ళకి ఎక్కడ ఉంటావో..అందుకే చెబుతున్నా నన్ను మర్చిపో .. అని చెబుతూ చైత్రి తీసుకొచ్చిన చేగోడీలు,జంతికలు,రవ్వలడ్లు బర బరా నమిలేసి చిరు తిళ్ళను చిరు నవ్వుతో ముగించి chilled కూల్ డ్రింక్ ని తాగేసి చారూ ఐ మిస్ యూ సో మచ్ అని చెప్పి భారమైన పొట్టతో నడుస్తూ అక్కడనుండి నిష్క్రమించాడు   18 comments:

Anonymous said...

baagundi..

kaani oka mudra raakshasam..

Grama simham ante kukka kada!!! adi konchem correct cheyandi...

Sravya Vattikuti said...

హ హ బావుంది !
నీ దగ్గర ఉన్న విజయవాడ బస్ పాస్ ఏం వరల్డ్ వైడ్ విసా కాదు - ఇంత దారుణం గా ఎలా చెప్పాడు , పైగా చెప్పినాకా తీసుకొచ్చిన చేగోడీలు,జంతికలు,రవ్వలడ్లు తినే కార్యక్రమం కూడా :)

karthik said...

as usual gud fun :D

వేణూరాం said...

మాలిక లో చూస్తూ ఉండగా.. "కఠోర కూత.." టైటిల్ చూసి ఎవరబ్బా.. అనుకున్నా.. పక్క్నే "ఆత్మానందం" ఉన్నాడు.. హహహ... టైటిల్ నే కేక
>>>>>
గ్రామ సింహాలను టీం లోనికి తీసుకొచ్చేలా యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు..

దాక తెచ్చుకో దుమ్ములేరుకో.
సమిత్ ముందు కబడ్డీ కబడ్డీ కబడి బడి బడి బడి బడి అని ఊపిరి అంతా ఆగిపోయేలా breathless బడి power of n ని ధ్యానిస్తూ కోర్ట్ అంతా పరిగెడుతూ అరుస్తూనే ఉన్నాడు..అలసట ఆఖరు క్షణం లో సమిత్ మీద ఒక్క ఉదుటున ఇద్దరు పట్టుకుని వెనక్కు లాగేశారు
>>>>
బాబొఇ.. ఈ పంచ్ లు తట్టుకోలేక పోతున్నా..

ఇది భీమిలి కబడ్డీ జట్టూ, గోల్కోడా హై స్కూల్ లకి కలిపికొట్టిన పేరడీనా???

Sravya Vattikuti said...

కొత్త టెంప్లేట్ బావుంది :)

హరే కృష్ణ said...

అనోనిమస్ గారు ధన్య వాదాలు :)
97 లో గ్రామసింహం అంటే సింహమే :) టౌన్ సింహం అంటే ప్రాస కుదరకపోవడం తో జస్ట్ ఫర్ ఫన్ :)
keep visiting!
మీ పేరు కూడా రాస్తే బావుండేది థాంక్స్ :)

శ్రావ్య గారు థాంక్ యూ :)
మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసారు ఆ టెంప్లేట్ బాగా నచ్చేసింది నాకైతే :)
థాంక్స్ :)

హరే కృష్ణ said...

కార్తిక్ చాలా థాంక్స్ :)

రాజ్
తెలుగు సినిమాలు చూడకపోతే ఇలానే అయిపోతానేమో అసలు ఇటువంటి సినిమాలు కూడా వస్తున్నాయా ఈ మధ్య ఆ రెండు సినిమాలు చూడలేదు నేను :(

మనసు పలికే said...

హరే.. కెవ్వు....:) ముందు ఆ టైటిల్ చూసే దిమ్మ తిరిగిపోయింది..హహ్హహ్హా..
ఏంటీ నువ్వు తెలుగు సినిమాలు చూడకుండానే ఇలాంటి కథలు రాసేస్తున్నావా.? గోల్కొండ హై స్కూల్ పల్లెటూర్లో తీసినట్లుగా ఉంది నాకైతే..;)
సూ...పర్ పోస్ట్..

Anonymous said...

పంచ్లు అదిరినాయ్ బాసూ...

bhanuprasad said...

cooolll.. ROFL man..

హరే కృష్ణ said...

అపర్ణ థాంక్స్! :)
రెండు రోజులు సెలవు వచ్చినప్పుడు పోస్ట్ రాస్తే కామెంట్లు రెండంకెల సంఖ్య ఎందుకు దాటవో తెలిసొచ్చింది..పాహిమాం పాహిమాం...

హరే కృష్ణ said...

అనోనిమస్ గారు థాంక్ యూ థాంక్ యూ!

భాను ప్రసాద్ గారు ధన్యవాదాలు :) నా బ్లాగుకి జీవం తీసుకొచ్చారు :)

Anonymous said...

nuvvem raasina naaku enduko teda kodutune untundi .. nijam cheppu .. idi evarki parody ???
;)

baggundabbai .. pasi vayasulo ne preminchadam .. mosam cheseyadam kuda chupinchesavv .. nuvu superehe ..

-kavya

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>నీకు నాకు మాటలు లేవు ఎలుగు బంటి కి వెంట్రుకులు లేవు..కూత ఇల్లా కూడా పెట్టుతారా? కేక. ఎప్పటి లాగానే పంచులు ఆదిరాయి.

హరే కృష్ణ said...

కావ్య..అదో పెద్ద కధ రెస్పాన్స్ బట్టి రెండో పార్ట్ రాద్దామనుకున్నా విషాద ముగింపు ఇచ్చేయాల్సి వచ్చింది చైత్రి ని జిం లో జాయిన్ చేసేసాం :)
Thanks! :)బులుసు సుబ్రహ్మణ్యం గారు.. హమ్మయ్య మీ కామెంట్ చూసాక హ్యాపీ :)
బోలెడు థాంక్స్! :)

Vineela said...

హీహీ.. అసలు కెన్నెడీ అలాంటి స్కూల్ ఉంటదని ఎవరికన్నా తెలుసున అనుకుంటూ వున్నాను..మీరేమో కెన్నెడీ స్కూల్ గురించి మల్ల స్కూల్ లో చిన్న లవ్ స్టొరీ గురించి స్టొరీ రాసేర..సూపర్ అండి..ఈ batch లో చదివారు మీరు

హరే కృష్ణ said...

వినీల గారు
థాంక్ యూ థాంక్ యూ :)
రెండో పార్ట్ రాయాల్సి ఉంది బద్దకం వాళ్ళ మొత్తం రాయలేకపోయాను ఈ మధ్య డైరెక్ట్ పోస్టులకే స్పందన కరువైపోతోంది ఇంకా సేక్వేల్స్ రాస్తే మాంకి మనమే కెవ్వ్ కెవ్వ్ అని అనోన్య్మాస్ గా కామెంట్లు పెట్టుకోవాలేమో అనిపిస్తుంది ఒక్కోసారి :)
మీ స్పందన కి ధన్యవాదాలు!
keep visiting :)

హ హ్హ భలే పట్టేశారు :)
అయినా విజయ వాడలో కెన్నెడీ స్కూల్ తెలియనిది ఎవరికి చెప్పండి :)
చైత్రి ది మాత్రమే కెన్నెడీ స్కూల్ :)
నేను సిద్ధార్థా లో చదివాను :)
అప్పుడప్పుడు విసిట్ లకు వెళ్ళేవాళ్ళం :)
మీరు కూడా కెన్నెడీ నా great !
మీది ఏ batch

కావ్య said...

కెన్నడి స్కూల్ విజయవాడలోనే కాదు .. అమలాపురం .. కొత్తపేట పక్కన నరేంద్ర పురం లో కూడా ఉంది .. :)

మా చిన్నప్పుడు ఆ ఊళ్ళల్లో ఉన్న ఒక్కగానొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్ .. బస్ ఎక్కి స్కూల్ కి వెళ్ళేవాళ్ళు తెల్సా