Pages

Thursday, May 26, 2011

జలుబు మేఘం

శిశిర ఋతువు
ప్రశాంతమైన ప్రకృతి,సన్నటి చినుకులు శరీరాన్ని తాకుతున్న భావనకు తోడు, చల్లని గాలి.. అలాంటి అందమైన వాతావరణం లో లైబ్రరీ మెట్లపై కూర్చున్న మేఘ, తమ సుతిమెత్తని పాదాల పై నడక సాగిస్తున్న ఈగలు దోమలను తరుముతూ హేమంత్ కోసం ఎదురుచూస్తోంది.


***సమయం సాయంత్రం ఏడు దాటాక***

హేమంత్ కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కాసేపయ్యాక హేమంత్ ఫ్రెండ్ నుండి ఫోన్ "లబ్బీ పేట్ లో ఉన్న కేర్ హాస్పిటల్ దగ్గరకు తొందరగా రా" అని.

అసలేం జరిగిందో అర్థం కాక హేమంత్ మీద బెంగతో, అరకిలోమీటర్ కు ఒక స్టాప్, కిలోమీటర్ కు మరో సిగ్నల్ చొప్పున గంట సేపు జర్నీ చేసాక కంగారుగా హాస్పిటల్ కు చేరుకుంది. తీరా చూస్తే క్లాస్‌మేట్స్ అందరితో సర్ప్రైజ్ డిన్నర్. ఫ్రెండ్స్ అందరితో సంతోషంగా ఆ హాస్పిటల్ పైన ఉన్న రెస్టారంట్ లో డిన్నర్ ముగించింది. తిరిగి వచ్చేటప్పుడు మేఘ ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి, ఒక ముసి మౌస్ నవ్వు నవ్వి తన చేతిలో ఒక కవర్ పెట్టాడు హేమంత్..
సంతోషం, సంశయం కలగలిపి అదేం లెటరా అని సందేహిస్తూ ఆ రాత్రి పూట హాస్టల్ గేట్ నుండి తన రూం వరకూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు వేసి లెటర్ ఓపెన్ చేయగానే
.
.
.
.
.
.
.
.
.
.
.
లెటర్ లో
"నువ్వు నవ్వితే చాలా బావుంటావ్.. నోరు కాస్త మూసి మూయనట్టు మూస్తే, మూసీ నది లా ఇంకా ఇంకా బావుంటావ్ ఇంద ఇది తీసుకో" అని గిఫ్ట్ పాక్ లో ఉన్న ఫెవి క్విక్ ని చూసి నిద్ర లో మూర్చబోయింది.
--------------------------------------------------------------------------------------------------------------------
అస్వస్థత తో బాధపడుతున్న మేఘ ను చూడడానికి వాళ్ళ నాన్న ఊరి నుండి హాస్టల్ కి వచ్చారు. హేమంత్ మాత్రం తన మూలంగా జరిగిన ఈ "ఆపరేషన్ అస్వస్థత" ని తగ్గించడానికి రాత్రనక పగలనక మేఘ యోగక్షేమాలకోసం అక్కడే ఉంటున్నాడు.. కంట్లో నలుసుని కాపాడుకున్నట్లు కాపాడుకుంటున్నాడు

మేఘ తండ్రి:ఏమమ్మా ఎప్పుడూ ఇలానే ఉంటారా మీ ఇద్దరూ..
మేఘ:ఇతను మా ఫ్రెండ్ డాడీ..ఎలా ఉన్నాడు?
తండ్రి: రెప్ప ఆర్పే లోపే కన్ను ఎత్తుకేలిపోయేలా ఉన్నాడు.
మేఘ చెల్లి:దొంగ మొహం గాడు నిద్రపోతున్న కోడిపెట్టలని ఎత్తుకెళ్ళిపోయే లా వాడి మొహం చూడు.
మేఘ:తన చూపే అంత లే..లైట్ తీసుకో.
మేఘ చెల్లి:తన వక్ర దృష్టినంతా ఉపయోగించి నీ బతుకు ని జున్నుతో కక్రాలు చేసిపాడేసాడు అని నువ్వు ఒప్పుకున్తున్నట్టే కదా.
మేఘ:మాటలు జాగ్రత్తగా రానీ ! నేను చదివేది ఇంజనీరింగ్.. నువ్వు ఇంకా ఇంటర్ లోనే ఉన్నావ్ ఇవేం నీకు అర్ధం కావు.. బెంజ్ సర్కిల్ లో ఉన్న మీ కాలేజ్ కి ఫో.
------------------------------------------------------------------------------------------------------------------
మేఘ తన చెల్లి అయేషా ని కాలేజ్ కి పంపించిన తర్వాత ఆ రోజంతా నిద్రపోలేదు. వాళ్ల నాన్నతో జరిగిన హేమంత్ గురించిన సంభాషణ తనకి నిద్ర పట్టనివ్వలేదు.అసలు హేమంత్ విషయం ఎత్తక ముందే నాన్న అడిగేసారు. వాళ్ల అనుమానం నిజమైతే తనని కడిగేసినా కడిగేస్తారని భయం పట్టుకుంది మేఘకి. తర్వాత రోజు క్లాస్ లో కూర్చొని లెక్చర్ వినకుండా ఒక్కో పేపర్ ని చించి పడేస్తూ, ఈ ఆలోచనలలో నుండి వచ్చిన వత్తిడి ని తట్టుకోలేక ప్రతి అవర్ కి మధ్యలో కాంటీన్ కి వెళ్ళి టీ తో పాటు చిరుతిళ్ళ చిట్టి తల్లి పేరు ని సుస్థిర పరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ పక్కన కూర్చున్న హేమంత్ కి పిచ్చెక్కిస్తోంది.

మేఘ అతని బుర్రతో పాటు వాలెట్ లోని మనీని కూడా తినడం మొదలు పెట్టడంతో ఈ బాధ తట్టుకోలేక 23 బస్ ఎక్కి అయేషా ను కలవడానికి హాస్టల్ దగ్గరకు వెళ్లాడు హేమంత్.

హేమంత్: హలో ,మీతో కొంచెం మాట్లాడాలి.
అయేషా :(అసహనమైన నవ్వుతో) హాయ్ మీరేం చేప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. మా అక్క చాలా అమాయకురాలు తన జీవితం తో ఆడుకోవద్దు ప్లీజ్.. మా ఇంట్లో ఇట్లాంటివి నామోంకిన్ హై
హేమంత్: Well,Then tell me about your family.
అయేషా: Get the hell out of here.
_______________________________________________________________________

ఆరోజు నుండి మేఘ తో పాటు హేమంత్ కి కూడా నిద్ర పట్టడం మానేసింది. హేమంత్ పరీక్ష ధ్యాస లో మునిగిపోయి బ్యాక్ లాగ్ లను ఒక్కొక్కటి రాసుకుంటూ ఈ బాధను కొంచెం మరచిపో సాగాడు.

***సరిగ్గా సంవత్సరం గడిచింది***

ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి.. అక్క కాలేజ్ చెల్లికి ముద్దు కాబట్టి హేమంత్ మేఘాల మధ్య అతివృష్టి అయేషా వచ్చి పడడం తో, వర్షం లేని పంటభూమి లా హృదయం చిగురించక వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ పలచబడి వాడిపోయిన బ్రెడ్ పెరుగు వడ అయిపోయింది. అలా ఓ ఆరునెలలు గడిచాక ఒక రోజు బ్యాక్ లాగ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే రిజల్ట్స్ చూసిన హేమంత్ అయేషా,మేఘ లు ఉంటున్న రూమ్ కి వెళ్లాడు అదోలాంటి హావభావాలతో.

"సంవత్సరం పాటు పుస్తకాలే లోకం గా బతికాను. పరీక్ష లేని నెల ఏంటో తెలియకుండా కష్టపడ్డాను. అయినా కూడా అయిదు పేపర్లు ఫెయిల్.. ఇదంతా మీ వల్లే మీ వల్లే" అని నొక్కి వక్కాణించి రూమ్ లో ఉన్న గ్లాస్ పెయింటింగ్‌లు బద్దలు కొట్టాడు. చేతికి చిన్న గాయమైతే, వాష్ రూమ్ లో నికి వెళ్ళి క్లీన్ చేసుకొని ఖాళీగా ఉన్న నోటితో తిడుతూ కట్టు కట్టుకొని బయటకొచ్చాడు.

****ఆ మరుసటి రోజు****

హేమంత్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.
కాసేపయ్యాక సెల్ ఎదురుగా మేఘ, అయేషా తో పాటు వాళ్ళ పేరెంట్స్. అయేషా మొహం నిండా గాయాలు ఉన్నాయి. మేఘ మొహం కూడా చిన్న చిన్న గాట్లు పడి ఉన్నాయి. అభావంగా కూర్చుని దిక్కులు చూస్తూ ఈ సెల్ సినిమా చూస్తున్న కానిస్టేబుల్ తో,

సబ్ ఇన్స్పెక్టర్ :చట్టాన్ని అతిక్రమించాడు ఇతన్నేం చేద్దాం.
హెడ్ కానిస్టేబుల్:వెయ్యి రూపాయిలు ఫైన్ కట్టించి వదిలేద్దాం.

సబ్ ఇన్స్పెక్టర్ "సరే ! వీళ్లనేం చేద్దాం ? అసలు ప్రాబ్లెం ఏంటి?" అని అడగడం తో మేఘ వాళ్ళ పేరెంట్స్ హేమంత్ ఫోటో ని సబ్ ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టారు.
హెడ్ కానిస్టేబుల్ : ఈ హేమంత్ మూలం గానే వీళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మరో అయిదు వేలు కట్టించి బయటకు పంపిద్దాం.
***********************************************************************************************************
బ్లాంక్ expression తో చూస్తున్న హేమంత్ మరో అయిదు వేలు కట్టి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక మేఘ, అయేషా ల తో "అసలేం జరిగింది ?" అని అడగడం తో
.
.
.
.
.
.

***ఆ ముందు రోజు రాత్రి***

పడుకునే ముందు బెడ్ షీట్ ని సర్దుతున్నారు మేఘ, అయేషా. సడెన్ గా ఆ రోజు మద్యాహ్నం తమ రూమ్ కి వచ్చిన హేమంత్ వాలెట్ లో నుండి క్రింద పడిన ఫోటో కనిపించింది. ఇది నాదంటే నాది అని జుట్టు చించుకొని ఒకర్ని ఒకరు గాయపర్చుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. కానీ అక్కడ హేమంత్ ని చూసి కంప్లైంట్ ని withdraw చేసీ చేసుకోలేక ఇంక ఫైన్ తో సరిపెట్టుకొని వచ్చేసారు.
అయేషా: సరే కాని నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎందుకొచ్చావ్.


హేమంత్ : నిన్న బస్ పాస్ లో ఉన్న నా ఫోటో ని ఎవడో కొట్టేసాడు. ఈరోజు చెకింగ్ లో ఫోటో కనిపించకపోవడం తో ఫైన్ కాకుండా స్టేషన్ కి పట్టుకోచ్చేసారు..అని చెప్పి ముగించాడు.


*****************************************************************************************************************

ఆ మరుసటి రోజు హేమంత్ ని మేఘ నిలదీయడం మొదలు పెట్టింది. "నిజం చెప్పు నువ్వు అయేషా కలసి నిన్న సినిమాకి వెళ్ళారా లేదా ?" హేమంత్ మేఘ చెంప చెళ్లుమనిపించాడు. "దొంగ మొహంది ఆ తర్వాత పార్క్ కి కూడా వెళ్ళాం అని చెప్పలేదా".
మేఘ:ఛీ..దరిద్రుడా..ఒక్క కారణం చెప్పు నేనంటే నీకెందుకు ఇష్టం లేదో..
హేమంత్:చెబితే ?
మేఘ:ముందు చెప్పు..చెబితే నీ మొహం కూడా చూడను ఈ జన్మ లో.
హేమంత్: పుట్టుమచ్చలకి నోమార్క్స్ క్రీమ్ రాసుకొనే నీలాంటి అమ్మాయిలను నేను ప్రేమించను కాక ప్రేమించను అని చెప్పి తనకి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసి ఆ అయేషా ..హా అవును అలంకార్ లో ఏడింటి షో కి బుక్ చేసా.. అని చెప్పి ఫోన్ కట్ చేసి మేఘ కి కట్ చెప్పేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు.

24 comments:

Sravya Vattikuti said...

ఇంతకీ ఇది మొన్న మీరు విజయవాడ వెళ్ళినప్పుడు జరిగిందా :))))))))))))))))))))))))))))

వేణూరాం said...

హిహిహి... నాకు పోలీస్ స్టేషన్ సీనూ, ట్విస్ట్ నచ్చిందీ,
క్లయిమాక్స్ లో తిట్ల పురాణం కూడా..

>>ముసి మౌస్ నవ్వు
నోరు కాస్త మూసి మూయనట్టు మూస్తే, మూసీ నది లా ఇంకా ఇంకా బావుంటావ్ ఇంద ఇది తీసుకో
నిద్రపోతున్న కోడిపెట్టలని ఎత్తుకెళ్ళిపోయే లా వాడి మొహం చూడు
>>>

ఇవి కేకలు

పుట్టుమచ్చలకి నోమార్క్స్ క్రీమ్ రాసుకొనే..

ఇది కేకన్నర.

డౌట్లూ...

జున్నుతో కక్రాలు??? అనగానేమీ?? ;)
ఈ పోస్ట్ కి జలుబు మేఘం అని టైటీల్ ఎందుకు పెట్టితిరో.. నాకు మోకాలు ఎంత గోక్కున్నా అర్ధం కావట్లేదు.. ;( ;(

చెప్పు హరే. చెప్పు.. ఐ డిమాండ్ యూ... ;) ;)

మనసు పలికే said...

హరే.. ఎప్పుడూ అన్వేష్ కి కష్టాలు తెప్పిస్తున్నావు అంటే కొత్తగా ఇప్పుడు మేఘ ని తీసుకొచ్చావా? మొత్తానికి ఎవరో ఒకరికి ఏదో ఒక స్ట్రాంగ్ ట్విస్ట్ లేకుండా మాత్రం కథ ఉండదు కదా;);)
టపా మాత్రం సూపరు :))))

ఇందు said...

ఇదేంటో భలే వెరైటీగాఉందే! "అక్క,చెల్లి ఒక పిచ్చోడు"...అని టైటిల్ పెట్టల్సింది!! ఈ జలుబు మేఘం ఎందుకబ్బా?? మేఘా ఏడ్చి...ఏడ్చీ జలుబు చేసిందా? ;)

>>నువ్వు నవ్వితే చాలా బావుంటావ్.. నోరు కాస్త మూసి మూయనట్టు మూస్తే, మూసీ నది లా ఇంకా ఇంకా బావుంటావ్ ఇంద ఇది తీసుకో

హ్హహ్హహా...ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండీ???

>>చిరుతిళ్ళ చిట్టి తల్లి ,కంట్లో నలుసుని కాపాడుకున్నట్లు,వాడిపోయిన బ్రెడ్ పెరుగు వడ,

ఏమి పదప్రయోగములు!! ఆహా! ఓహో!! :))))))))


>>పుట్టుమచ్చలకి నోమార్క్స్ క్రీమ్ రాసుకొనే నీలాంటి అమ్మాయిలను నేను ప్రేమించను కాక ప్రేమించను

ఇది మత్రం అల్టిమేట్...కెవ్వుకేక :))

మొత్తనికి అప్పు చెప్పినట్టు ఇప్పుడు ఇంకో కేరెక్టర్ మటాష్ అన్నమాట మీ చేతిలో :))

బులుసు సుబ్రహ్మణ్యం said...

అవే డౌట్సు నాకు కూడా వచ్చి నేను కూడా వేణూ రాం గారి మోకాలు ఘట్టిగా గోకాను. అయినా బల్బు వెలగలేదు.

కంట్లో నలుసులా కాపాడుకున్న మేఘని, ఫెవికాల్ బంధంతో పెనవేసుకున్న మౌస్ నవ్వుని, మూసి నది లాంటి చిరుతిళ్ళ చిట్టి తల్లిని వదిలి హేమంత్ అయేషాతో వెళ్లిపోవడం ఖండిస్తున్నాను.
టపా కేకో కేక

హరే కృష్ణ said...

శ్రావ్య గారు ఇది అమానుషం :))
IIT వాళ్ళకు మరీ ఇన్ని బ్యాక్ లాగ్ లా :(((
నాగార్జున ఎక్కడ ఎక్కడ ? ఇక్కడ మనకి అన్యాయ్ జరిగింగ్స్
జరిగిన కధ అని కూడా రాయలేదు నేను ఈ అనుమానం నిజం కాదు కానే కాదు..మీ అనుమానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

హరే కృష్ణ said...

హ హ్హ రాజ్ థాంక్ యూ :)
కక్రాలు ఈ రెసిపీ నాకు చాల ఇష్టం బ్రేక్ ఫాస్ట్ కి సూపర్ గా ఉంటుంది

ముందుగా కక్రాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం

కావలసిన వస్తువులు:
‌‌శనగపిండి - 3 కప్పులు .
పంచదార - 1 కప్పు.
‌‌పాలు - ‌1 కప్పు.
నెయ్యి - పావు కప్పు.
ఏలకులు - ‌4.
జీడిపప్పు - ‌10.
బాదం పప్పు - 10.
పిస్తా - 10.
‌‌అల్లం తరుగు - ‌‌అర టీ స్పూన్‌.
వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్‌.
‌‌కొత్తిమీర తరుగు - ‌‌2 టీ స్పూన్స్.
నూనె - వేయించేందుకు తగినంత.
‌ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

చనగ పిండి ని layers గా ఒక ఆకుపచ్చని ఆకు మీద వేసి నాలుగుముక్కలు చేసి నేతిలో వేయించుకోవాలి.పంచదార పాకం పట్టుకొని పక్కనుంచాలి.
పాలు మరిగించి మరొక పాత్రలో తీసుకోవాలి.
బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నని ముక్కలుగా తరిగి నేతిలో వేయించి మిక్స్ చేయాలి :)
బాదం, పిస్తా, జీడిపప్పు సన్నగా తరిగి నేతిలో వేయించి పక్కన ఉంచుకోవాలి.చనగ పిండి ని నేతిలోవేయించాలి. పంచదార, పాలు కలిపి పాకం పట్టి చనగ పిండి చేర్చి కలుపుతూ వుండాలి. దీనిని సన్నని మంట మీద మగ్గనివ్వాలి.
తర్వాత మిగతావి మిశ్రమం చేసి రకరకాలుగా రుబ్బేసి నచ్చిన ఆఖరు లో నూనెలో
చనగ పిండి మిశ్రమం ఉడికి దగ్గరకు రాగా నే వేయించి వుంచిన బాదం, పిస్తా, జీడిపప్పులు, ఏలకులపొడి కలిపి మరో పది నిమిషాలు మగ్గనిచ్చి స్టౌపైనుంచి దించేయాలి.
అలా వేయించి వేయించి పక్కన మర చెంబు లో జున్ను వేసుకొని కక్రాలు తింటూ జున్ను తింటుంటే ఏదో లోకంలోనికి వెళ్లి మళ్ళీ తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు


అవును రాజ్ నిరంతర జలుబు
జ -జడుసుకుంటూ
లు-లుకేమియా తో
బు-బవ్వ తింటున్న మేఘ అనే ఉద్దేశ్యం తో ఆ టైటిల్ అలా పడేసాను :)
ఓపిగ్గా కామెంటినందుకు బోలెడు థాంక్స్ :)

హరే కృష్ణ said...

అపర్ణ నేనెంత మంచిగా ఉన్నా కూడా అదేంటో అకస్మాత్తుగా ప్రతీక్ ఆవహించి ఇలా రాసేస్తున్నాడు
ఓపిగ్గా నేను రాసిన ఈ కధని జాగ్ట్టగా అనలైజ్ చేసినందుకు బోలెడు థాంక్స్ :)
అన్వేశ్ ని మేఘ ని కలిపి కధ రాసేస్తా మంచి ఐడియా ఇచ్చావ్ థాంక్ యూ :)

వేణూరాం said...

జ -జడుసుకుంటూ
లు-లుకేమియా తో
బు-బవ్వ తింటున్న మేఘ అనే ఉద్దేశ్యం తో ఆ టైటిల్ అలా పడేసాను :)

ఇది పోస్ట్ లో రాసి ఉంటే అద్దిరిపోయి ఉండేదీ..

నువ్ తొందరలో వంటల బ్లాగ్ కూడా మొదలెట్టు ఇకా ;)

బులుసు గారూ.. వా..వాఆఆ... మధ్యాహ్నం సిగరెట్ కాలుస్తొ, గొడుకేసుకొచ్చి ఒక వ్యక్తి హఠాత్తుగా నా కాలు గోకాడు అది మీరేనా?? ;) ;) ;)

హరే కృష్ణ said...

అక్క,చెల్లి ఒక పిచ్చోడు హ హ్హ :)
ఇందు గారు ఇప్పటికే కామెంట్లు లేక మేఘ ఈగలు దోమలు తోలినట్టు లాప్టాప్ ముందు తోలుకున్తున్నాను kaasta డీసెంట్ గా పెడితే కామెంట్ కాకపోయినా విసిత్ అయినా కుంట్ అవుతుంది అనే ఒక చిన్ని దురాస అడ్డొచ్చింది
థాంక్ యూ, థాంక్ యూ :)
మేఘా ఏడ్చి...ఏడ్చీ జలుబు చేసిందా? ;)
అవునండీ ఇప్పటకీ పడుకునే ముందు ఒక డీ-కోల్డ్ మరో డైజీన్ వేసుకుంటుంది తప్పని సరిగా
ఇప్పుడు ఇంకో కేరెక్టర్ మటాష్ అన్నమాట మీ చేతిలో :))
ష్..! నిజం నిప్పులాంటిది BINGO
:D :D

హరే కృష్ణ said...

బులుసు గారు
అయ్యబాబోయ్ అవునా!
రాజ్ కుమార్ నాకు ఫోన్ చేసాడు ఇందాకే.. బ్లడ్ వచ్చేసింది హరే అని కవిత్వం మీరు రాయడం తగ్గించాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం :)
హేమంత్ సంధ్య లైలా మజ్నూ లు లాంటి వాళ్ళు బేసిగ్గా హీరొయిన్ కి జబ్బుచేస్తే లైలా ని మార్చేసి ప్రొడ్యూసర్ అచ్చి రెడ్డి చెప్పినట్టు డైరెక్టర్ కృష్ణా రెడ్డి నిత్యా మీనన్ ని తీసుకురావాలి అంతే :)
నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు :)

SHANKAR.S said...

అవునూ అసలు అక్కా చెల్లెళ్ళ పేర్లు మేఘ, అయేషా ఏంటండీ? వాళ్ళ పేరెంట్స్ ది మతాంతర వివాహమా? :)

శివరంజని said...

జ -జడుసుకుంటూ
లు-లుకేమియా తో
బు-బవ్వ తింటున్న మేఘ అంటే ఒకసారి మీ స్టోరీలో రాసారు "మగిస" లా అన్నమ్మాట ... బాగుంది బాగుంది .......


1. శిశిర ఋతువు
ప్రశాంతమైన ప్రకృతి,సన్నటి చినుకులు శరీరాన్ని తాకుతున్న భావనకు తోడు, చల్లని గాలి.. అలాంటి అందమైన వాతావరణం లో లైబ్రరీ మెట్లపై కూర్చున్న మేఘ,
2 .తమ సుతిమెత్తని పాదాల పై నడక సాగిస్తున్న ఈగలు దోమలను తరుముతూ హేమంత్ కోసం ఎదురుచూస్తోంది.>>>>>>>>>

.1నువ్వు నవ్వితే చాలా బావుంటావ్..
2. నోరు కాస్త మూసి మూయనట్టు మూస్తే, మూసీ నది లా ఇంకా ఇంకా బావుంటావ్ ఇంద ఇది తీసుకో" అని గిఫ్ట్ పాక్ లో ఉన్న ఫెవి క్విక్ ని చూసి నిద్ర లో మూర్చబోయింది.>>>>>>>>>>>>>>>> హ హహ మీరూ రాసినా మొదటి లైన్ కి రెండవ లైన్ కి అనుసంధానం చేసిన మీ క్రియేటివిటినీ చూసి చాలా సేపు నవ్వుకున్నాను

హరే కృష్ణ said...

శంకర్ గారు :))) కేక :)
హీరోయిన్ పేరు ayesha కాదు aisha :)
తెలుగీకరిస్తే అయేషా అయిపోయింది
కావాలంటే ఇక్కడ మా హేమంత్ aisha జిల్ జిల్ జిగా ఇక్కడ చూడొచ్చు
http://www.youtube.com/watch?v=H7eVDJgNamw&feature=related

http://www.youtube.com/watch?v=wuxIfwhgXl4

హరే కృష్ణ said...

శివ రంజని గారు చూసారు కదా మీ లాంటి మిత్రులు తప్ప వేరెవరూ కామెంట్లు పెట్టడం లేదు అసలు ఈ గూగుల్ రీడర్ లు వచ్చి కామెంట్లను దారుణం గా దెబ్బ తీస్తున్నాయ్ :)
నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ :)
అభినవ అనుసంధాన ఈ బిరుదేదో బావుందండి! నాకు నచ్చింది. కేకంతే :)
మరోసారి ధన్యవాదాలు :)

Anonymous said...

జ -జడుసుకుంటూ
లు-లుకేమియా తో
బు-బవ్వ తింటున్న మేఘ
ఇలాంటి ఐడియాలు ఎలావస్తాయి మీకు?
ఎక్సెలెంట్

Ennela said...

ఫస్ట్ ఆఫ్ అల్ నాకూ శంకర్ కొచ్చిన డవుటు వచ్చీసినాది..సెకండ్ ఆఫ్ ఆల్ కథ ఇంకా ఉందా అని ఇంకొక డౌటు...యీ పాలి కథ అయిపోయింది, కథ ఇంకా ఉంది అని ఎండింగ్ లేకుండా పోస్టులు వెయ్యరని ఆశిస్తున్నాను..ఇలా వ్రాసినందుకు నాకు ఫెవికాల్ పంపిస్తారేమో..ఒకవేళ పంపేట్లయితే ఒక టన్ను పంపండి...టొకుగా అమ్మేసి..సగం లాభం మీకు అంపేస్తాను...

కథ పేరు సూపరో!
ఇంత వెరైటీగా కథలు వ్రాయడం బెంగళూరులో నేర్పుతారా! ఒకవేళ నేర్పితే నాకు ఫోన్ చెయ్యడం మరిచిపోవద్దు. అప్పటికపుడు బయల్దేరి వచ్చేస్తా...

snigdha said...

జలుబు కి బాగా ఇచ్చారండీ నిర్వచనం..అసలు ఇలాంటి అవిడియాలు,పద ప్రయోగాలు ఎలా తడతాయి గురూజీ మీకు? కథ ఇంకా ఉందనిపిస్తోంది నాకు..నెక్శ్ట్ పార్ట్ ఎదురుచూడొచ్చన్నమాట...
:)

హరే కృష్ణ said...

అనోనిమస్ గారు మీ పేరు కూడా రాస్తే ఇంకా బావుండేది
చాలా థాంక్స్ :) మీరు ఇలా కామెంట్లు పెడుతూనే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలతో
హరే
>>ఇలాంటి ఐడియాలు ఎలావస్తాయి మీకు?
బల్బ్ ని కనిపెట్టిన ఎడిసన్ మరి
చదువుకు కనిపెట్టాడా మరి మెడిసిన్
టెలిఫోన్ తో స్టాప్ అని అనుకుంటే
స్టార్ట్ అయ్యేదా మరి సెల్ ఫోన్...
ఇంతే చాలు అనుకుంటూ పోతే
ఎవ్వరూ ఆవ్వరూ హీరొ
నిన్నటి తో సారి పెట్టుకుంటే
నేటి కి లేదు టుమారో...

ఆ తర్వాత నేను చెప్పలేను :)
అహో హరే..ఓహో హరే అని మీరు కోరస్ లో పాడేసుకోండి :)
స్పందన కు చాలా థాంక్స్ :)
Thank you for visiting my blog :)

హరే కృష్ణ said...

ఎన్నెల గారు
ముందుగా కధ చదివి మీ స్పందన తెలియచేసినందుకు బోలెడు కృతజ్ఞతలు :)
తప్పకుండా ఈ సారి కధ అయిపొయింది కధ ఇంకా ఉంది తో పాటు తర్వాత ఏం అయి ఉంటుంది..అనే ఆప్షన్ జత చేసి మరీ ముగిస్తాను :)
ఈ పోస్ట్ కోసం మాత్రం నాలుగో ఆప్షన్ జతచేయాలి ఇది కధ కాదు అని...ఎందుకంటే ఇది విజయవాడ లో లైవ్ జరుగుతోంది :)

టన్ను ఫెవికాల్ ఆ ఆ. అదీ కొరియర్ ఆ..వాఆఆ... మధ్యలో ఆ Fedex వాడిని పోషించినట్టు అవుతుంది
ఫెవికాల్ తయారు చేద్దాం అంటే Polyvinyl Acetate ఇంకా ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ఉన్న కాంపౌండ్స్ చాలా వాడాలి.. పెద్ద ప్రాసెస్సింగ్ ఉంటుంది
adhesives బదులు మైదా తో బేషుగ్గా తయారు చేసేసుకోవచ్చ్చు..సంతోషం కోసం మిశ్రమం లో కాస్త చక్కెర వేస్తే టేస్ట్ కి టేస్టు glue కి glue..

నేనే ఒక institution మొదలుపెడదామని అనుకుంటున్నాను తప్పకుండా తెలియచేస్తాను మొదలు పెట్టాక మీ పిచ్చి తల్లి తో సహా ఇక్కడికి పట్టుకోచ్చేయండి..international స్టాఫ్ అని ఇంకా దండుకోవచ్చు ప్రాఫిట్ లో కమీషన్ గట్రా మాట్లాడుకుందాం
థాంక్ యూ :)

హరే కృష్ణ said...

స్నిగ్ధ గారు ఎనీ వే నాశన లా నాశనం అయిపోతుందేమో అనే సంశయం వెంటాడుతోంది
హాలీవుడ్ లో బాలీ వుడ్ లో మాత్రమె సీక్వెల్ లకు విలువ
సీక్వెల్ అంటేనే పరమ చిరాకు మన బ్లాగు ప్రేక్షకులకు

ఎలానో కామెంట్లు రావు కాబట్టి ఇదే కధ కామెంట్ల లో ఎండింగ్ రాసేయడం అన్న ఉత్తమ పని మరొకటి లేదని ఆ ఘాట్టి అభిప్రాయం..సో ఈ కధ కూడా ఇలా ఉంటుంది చివరికి
http://www.youtube.com/watch?v=LkpoBIseGAc

స్పందన తెలియ చేసినందుకు చాలా థాంక్స్ :)

Ennela said...

అలగలగే...పిచ్చి తల్లి ఇంగిలీసు ఇరగదీస్తుంది..కానీ వినేవాడికి అర్థం కావాలంటే కనీసం 6 చెవులు 3 బుర్రకాయలు ఉండాలంతే..నేనంటే యీ 6 యేళ్ళలొ 4గురు చింకీ చాన్లతో కలిసి చదివే/పనిచేసే ప్లాటినం అవకాశం వచ్చిన మూలాన...చెవుల మాట పక్కనుంచి మోకాలు, అరికాలూ కూడా వాడి ఎలాగోలా ఈదుకొస్తున్నా...

Ennela said...

అయితే ఓకే సయిడ్ నుంచి , పిచ్చితల్లి సయిడ్ నుంచి కూడా డబుల్ ఓకే...

హరే కృష్ణ said...

ఎన్నెల గారు :)
అన్ని ద్రువాలనుండి దండేసుకుందాం
త్రీ చీర్స్ :)