బ్లాగులు మనిషికి సంతోషాన్ని ఇవ్వాలి గానీ శాపాలను కాదు . జరిగిన నష్టానికి తోడు ఈ ఆచారాలన్నీ తనను మానసికంగా చిత్రవధకు గురిచేస్తాయని ఎవరికీ అనిపించదా? ప్రతి వ్యక్తికీ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని అతిక్రమించి ఇతరులు చొరబడే ప్రయత్నంచేస్తే అడ్డుకోవడం తప్పుకాదు. వారికి చేతనైతే సాంత్వన పలకాలి. అండగా నిలవాలి. కానీ ఉన్న ధైర్యాన్ని బలవంతంగా దోచుకునే ఈ దురాచారాలకు అడ్డుకట్ట వేయాలన్న బ్రహ్మచారుల నిర్ణయం సరైనదే!
---------------------
---------------------
బ్రహ్మచారులు చాలా సెన్సిటివ్ . పైగా పని వత్తిడి , బ్రహ్మి బ్రహ్మి అంటూ అనాదిగా ఉద్దేశపూర్వకంగా వివక్షా కామెంట్లకు పరిమితంచేసిన జాతికి ప్రతినిధి. చదువు, సంస్కారం నేర్చి... ఆర్థికంగా నిలబడి ఉన్నా ఇంకా బ్రహ్మచారి పైన అదే అణగదొక్కే ధోరణి. అంతులేని చాకిరి. ఇదీ నా మనసు, ఇదీ నా ఆలోచన అన్నా వినిపించుకునే వారే లేరు. తరతరాలుగా బ్రహ్మచారి ఆవేశాన్నీ, ఆక్రోశాన్ని పంచుకునే 'బ్లాగుడే' లేదు . తన వ్యక్తిత్వాన్ని సహించలేని, గుర్తించలేని సమాజంలో బ్రహ్మచారి ఏకాకి. కాదని తిరగబడితే 'తెగించారనే' అపవాదుతో సిద్ధంగా ఉండే సంఘంలో బ్రహ్మచారి రెక్కలు తెగిన పక్షి.ఇన్ని విపత్కర పరిస్థితుల్లో జరగబోయే అకృత్యాన్ని అడ్డుకుని, ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన వారు చరిత్రను తిరగరాసేవారే!
బ్రహ్మి జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి పోరాడినవారే! అంధకారంలో బతుకుతున్న బ్లాగుని మార్చడానికి తమ వంతు కృషి చేసినవారే! వారు బ్లాగు లోకాన్ని ఉద్ధరించలేకపోవచ్చు. కీ బోర్డు ని పట్టుకొని రణరంగంలో దూకినట్లు లోకానికి వెల్లడి కాకపోవచ్చు. కానీ వారు బ్లాగు 'మార్పు'కు తమ పరిధిలో ప్రయత్నించినవారే! మరికొందరికి ఆ 'ధైర్యాన్ని' నూరిపోసినవారే!
బ్రహ్మచారి కూడా మనిషేనని, తమకూ ఒక మనసుంటుందని ఆలోచించక బ్రహ్మి కి బ్లాగ్ కు సంబంధించిన నిర్ణయాలు ఇతరులు తీసుకుని... వాటిని బలవంతంగా వారిపై రుద్దాలని చూస్తే ఈకాలం బ్రహ్మి ఊరుకోడని బ్ర.బ్లా.స (3g గారి పేటెంట్) నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మరెందరికో మార్గదర్శకమైంది. బ్రహ్మి కథే ఇది.. కాదు, యథార్థ గాధ ఇది!
***
ఆఫీస్ లో deadlines తో మేనేజర్ టార్చర్ తో బ్రహ్మచారుల మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎటూ పాలుపోని స్థితి. బాధ, దుఃఖం, ఆక్రోశం, వేదన... అన్నీ కలిసికట్టుగా బ్రహ్మచారులను ఊపిరాడకుండా చేశాయి. బ్రహ్మి లకు తనివితీరా ఏడవాలనిపిస్తుంది. కానీ కర్తవ్యం ముందు నిలవడంతో ఏడవడానికి కూడా టైం లేక తమ కన్నీటిని వీకెండ్ కి postpone చేసుకున్నారు.
ఇన్ని సమస్యల వలయం లో కూరుకుపోయిన తర్వాత రూమ్ కి వచ్చి aggrigator ఓపెన్ చేసి బ్లాగు తెరిచిన బ్రహ్మిలకు రెండు కామెంట్లు రాసాక వాటికి వచ్చ్సిన రిప్లై లు చూసి ఆశ్చర్య పోయారు. సైన్ అవుట్ చేసే లోపు ఆ కామెంట్ల తీవ్ర తరాన్ని తట్టుకోలేక అతను మూర్చపోయాడు. తను కోమా లోనికి వెళ్ళాడు అది నిజమని అర్థంచేసుకోవడానికి బ్రహ్మి కు చాలా సమయం పట్టింది. చుట్టూ ఒక్కసారిగా శూన్యం. బ్లాగుల్లో అభిజాత్యం అదుపు తప్పుతోంది. అయినా శక్తిని కూడగట్టుకుని వెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నించడానికి కారణం అక్కడున్నది తనుమాత్రమే! మాటల్లో చెప్పలేని కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా అర్థంకాలేదు .
ఇన్ని జరుగుతున్నా ఎవరూ బ్రహ్మిను సంప్రదించలేదు. కనీసం చెప్పలేదు. బ్రహ్మి ఆలోచించాడు. జరిగిన నష్టాన్ని పూడ్చబోయేది ఇంతగా తనను బాధపెట్టిన ఆ పోస్ట్ రచయతలు కాదు. ఇకపై ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపేది వారు కాదు. ఆఫీస్ లో పనిని , పెండింగ్ ప్రాజెక్ట్ లను కొలిక్కి తెచ్చేదీ వారు కాదు.
తనకిప్పుడు కావలసింది ఆచారాల మాటున జరిగే 'తంతు' కాదు. తను కూడగట్టుకోవలసింది మనోధైర్యం. అదే తనను, తన పనిని ఒడ్డుకు చేర్చేది. తన బ్లాగ్ ప్రపంచాన్ని ఆఫీస్ ప్రపంచాన్ని అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోయిన బాధ్యతలను ఒడ్డుకు చేర్చేలా చేసేది. తననుండి ఆ 'బ్లాగ్ ధైర్యం' పారిపోకుండా... గుప్పిట్లో బంధించాలంటే ముందు ఈ 'అనాచారాలను' ఆపాలి. అందుకు తనే ఉపక్రమించాలి.ఆచారాలు మనిషికి ఓదార్పునివ్వాలి గానీ కుళ్లబొడవకూడదు. జరిగిన నష్టానికి తోడు ఈ ఆచారాలన్నీ తనను మానసికంగా చిత్రవధకు గురిచేస్తాయని ఎవరికీ అనిపించదా?
తనకిప్పుడు కావలసింది ఆచారాల మాటున జరిగే 'తంతు' కాదు. తను కూడగట్టుకోవలసింది మనోధైర్యం. అదే తనను, తన పనిని ఒడ్డుకు చేర్చేది. తన బ్లాగ్ ప్రపంచాన్ని ఆఫీస్ ప్రపంచాన్ని అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోయిన బాధ్యతలను ఒడ్డుకు చేర్చేలా చేసేది. తననుండి ఆ 'బ్లాగ్ ధైర్యం' పారిపోకుండా... గుప్పిట్లో బంధించాలంటే ముందు ఈ 'అనాచారాలను' ఆపాలి. అందుకు తనే ఉపక్రమించాలి.ఆచారాలు మనిషికి ఓదార్పునివ్వాలి గానీ కుళ్లబొడవకూడదు. జరిగిన నష్టానికి తోడు ఈ ఆచారాలన్నీ తనను మానసికంగా చిత్రవధకు గురిచేస్తాయని ఎవరికీ అనిపించదా?
ఎన్నడూ తన మనసు తప్ప వేరే టీం మేట్స్ మనసును నొప్పించని, ఎలాంటి సాయానికైనా ముందుండే తన ఆఫీస్ వాడు ఇప్పుడూ తన వెనకుండి ముందుకు నడిపిస్తాడు అని అనుకున్నాక బ్రహ్మి కు మరింత ధైర్యం చేకూరింది.
తన నిర్ణయాన్ని ముందు తన ఆఫీస్ వారికి చెప్పాడు. అప్పటివరకూ ఈ తంతునెలా ఆపాలా అని బ్లాగ్ లో వారప్పటికే తల్లక్రిందులవుతున్నారు. మరోదారిలేక బ్రహ్మి పరిస్థితులకు తలవంచుతాడేమోనని దిగులు చెందుతున్నారు. కానీ తను నిర్ణయమిదీ అని తెలిశాక వారు నిశ్చింతగా ఊపిరిపీల్చుకున్నారు. నీ పీడా విరగడయ్యింది అని నృత్యాలు చేసారు భోజ్ పురి పాటలు పాడారు . వెంటనే బ్రహ్మి ని అక్కడికి పిలిచారు. అతనొక పావుగంటసేపు "పెళ్ళి చేసుకో", "పప్పన్నం ఎప్పుడు?" "ఇంటివాడివైతే తెలుస్తుంది" లాంటి భావజాలన్ని ప్రదర్శించి తన సామూహిక అవమానం చేసారు.
అప్పుడు బ్రహ్మి ''ఇది నా వ్యక్తిగత విషయం. అందరూ వచ్చి గతి తార్కిక భౌతిక వాదం గురించి అర్హత లేని వాళ్ళు మాట్లాడడం నాకిష్టంలేదు. చేసిన అవమానాలన్నీ మీ అందరి సూటి పోటి మాటలతో చేయడం అంతకన్నా ఇష్టంలేదు. నేనే స్వయంగా బ్లాగ్ ఓపెన్ చేస్తాను. నాబ్లాగు కి సంబంధించినవి నా చేతులతో నేనే రాస్తాను. కామెంట్ moderation తీసే ప్రసక్తేలేదు. అది నా యిష్టం. మీకు నన్ను చూడటం ఇష్టంలేకుంటే నాకొక aggrigator ఇవ్వండి. నేనక్కడ రాసుకుంటాను. అని చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. ఆమాటల్లో ధ్వనించిన ఆత్మవిశ్వాసం, నాలుగు ముక్కల్లో కానొచ్చిన స్థిరత్వం ఇక మరెవ్వరినీ మాట్లాడనీయలేదు.
****************
మర్నాడు బ్రహ్మి బ్లాగ్ ఓపెన్ చేసాడు. ఈమెయిలు id ,పాస్వోర్డ్ , లేఖిని ఓపెన్ చేసి పక్కనపెట్టాడు . లేతరంగు బాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే బ్లాగ్ ని ఫైరుఫాక్సు లో ఓపెన్ చేసాడు బ్రహ్మి నిర్ణయాన్ని హర్షించినవారంతా తనకు తోడుగా పక్కనే కూర్చున్నారు.
అటూఇటూ ఊగినవారు కూడా మరో ఆలోచన లేకుండా తన వద్దకొచ్చారు.పోస్ట్ పూర్తయిన పిమ్మట తన బ్లాగ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని తన సహా బ్లాగర్లతో కామెంట్లు సమర్పింప చేసాక ఒక సారి నిట్టూర్చాడు. ఇదంతా చేసింది తాను బ్లాగ్ , టెంప్లేట్, ను అలంకరించుకోవాలనే కోరికతో కాదు. తనను అలా చూడలేని తమ సభ్యుల కోసం. తననలా హింసించి ఆనందించేవారిని అడ్డుకోవడంకోసం. ఇలా కూడగట్టుకున్న ధైర్యంతో తన బ్లాగుల భవిష్యత్తును నిర్మించగలననే విశ్వాసం మనసుకు కలగడంకోసం!
ఇప్పుడు తమ బ్లాగ్ పై హెడర్ సూర్యబింబంలా వెలుగుతోంది. ఆ వెలుగు ధైర్యానికి మారుపేరులా ఉంది. ఆ వెలుగే తమను ముందుకు నడిపిస్తుంది.మరికొందరికి దారిచూపే ఇలాంటి ప్రయత్నాన్ని మనసున్నవారిగా మనమూ ప్రోత్సహిద్దాం. సంకుచిత మనసులతో కాక,బ్లాగువత్వంతో ఆలోచిద్దాం.బ్లాగు బ్రహ్మచారులారా ఏకంకండి!
35 comments:
:P
ఇదేం బాలేదబ్బాయ్, మనలోమనం ఇలా కొట్టేసుకుంటున్నామని అప్పుడే ప్రమదావనంలో వీకెండ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. మనలో మనం లోపాయకారిగా ఏదన్నా ఏర్పాటు చేసుకుందాం. మీ సంఘాన్ని మా మాజీ బ్రహ్మిల సంఘం a.k.a. కుటుంబరావుల సంఘం లో విలీనం చేసెయ్యండి ముందు. మిగతా విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం.
మీరు మాజీ కుటుంబరావుల a.k.a. మళ్ళీ కొత్త బ్రహ్మిల సంఘం పెడితే విలీనం చేస్తారేమోనండి.
హరే కృష్ణ గారు
నాకైతే నచ్చింది మీ పోస్ట్...మీకష్టాలు బావున్నాయి..
little funny too :)
keep posting
ఈ వ్యాసానికి ఒరిజిల్ టపాలు ప్లీజ్...
బ్రహ్మచారి బ్లాగరుల సంఘం వర్థిల్లాలి
brahmachari blog lo nenu cheripoyanu
"jai brahmachari blog sangham,vardhillali "
మీరంతా ఒఠ్థి, ఉత్తుత్తి బ్రహ్మచారులే. నాలాంటి అస్ఖలిత బ్రహ్మచారుల సంగతేంటో ముందు తేల్చండి.
పాపం ఎన్ని కస్టాలండి :)
ఈ సంఘం ఎక్కువ కాలం నిలిచేది కాదు . మీరు ఎదోనాటికి పెళ్లి చేసుకుని తీరాల్సిందే . అదే కుటుంబరావుల సంఘానికి అనుబందంగా నడుపుకుంటే బాగుంటుంది ఆలోచించుకోండి
నేను మార్గదర్శిలో చేరాను ఇదే విషయం పై టపా రాశాను..
బ్లాగాగ్ని గారు, వికటకవి గారు,
మీకు ఆ టపాలో జవాబివ్వడం జరిగింది చూసుకోండి..
శ్రీనివాస్ థాంక్ యూ :)
బ్లాగాగ్ని గారు అంతే అంటారా
కార్తీక్ తోడుంటే బ్లాగంతా సందడంతే!
తన పోస్ట్ కుమ్మేసాడు తప్పక చూడండి :)
అజ్ఞాత గారు భలే చెప్పారండి థాంక్ యూ :))
స్నిగ్ధ గారు నా బ్లాగు లోనికి స్వాగతం
మీరు సౌమ్య ఫ్రెండ్ కదా!
మీ కామెంట్ కి ధన్యవాదాలు :)
నాగార్జున :))
బంతి గారు బ్ర.బ్లా. స వర్ధిల్లాలి
జై బ్ర బ్లా స
జై జై బ్ర బ్లా స!
thanks for the support :)
సావిరహే గారు మీ కామెంట్ కి ధన్యవాదాలు
నా బ్లాగులోనికి మరియు బ్ర.బ్లా.స లోకి స్వాగతం సుస్వాగతం
మెంబర్ అయినందుకు ఆభినందనలు :)
శరత్ గారు అంతే అంటారా :)
మీ కామెంట్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాము మేము కూడా మరి :) :)
""అదే కుటుంబరావుల సంఘానికి అనుబందంగా నడుపుకుంటే బాగుంటుంది ఆలోచించుకోండి""
శ్రీనివాస్ గారు కార్తీక్ ని కన్విన్సు చేసి బ్ర.బ్లా.స కి కుటుంబరావుల సంఘం అనుభందం గా పెట్టుకొనేలా ఒప్పిద్దాం :)
శ్రావ్య గారు ముందుగా నా బ్లాగ్ లోని స్వాగతం
మీ స్పందన కి ధన్యవాదాలు :)
కార్తీక్
you rock dude!
its Hillarious
keep posting..!!
@శ్రీనివాస్ భాయ్: >>కుటుంబరావుల సంఘానికి అనుబందంగా నడుపుకుంటే <<
అదెట్టా కుదురుద్ది...మా (బ్రహ్మచారుల) నుండి విడిపోయి వాళ్లు వేరుకాపురం పెట్టారుగాని మేము వాళ్లనుండి విడిపోలేదుగా...కాబట్టి ఆళ్లనే మాకు అనుబంధ సంఘంగా ఉండమనండి, వీలైన సహాయం చేస్తాం
కుటుంబరావులకు సహాయం కావాలంటే వారు మనకు ముందుగా ధనకనకవస్తువాహన సహాయం చెయ్యాలి అప్పుడే మనం వాళ్ళకు మద్దతు ఇచ్చేది. అది కూడా అంశాలవారి మద్దతు మాత్రమే సుమా!
>>అదెట్టా కుదురుద్ది...మా (బ్రహ్మచారుల) నుండి విడిపోయి వాళ్లు వేరుకాపురం పెట్టారుగాని మేము వాళ్లనుండి విడిపోలేదుగా.......
హ్హ..హ్హ...లోళ్ళు.. నాగార్జునా good point
>>బ్ర.బ్లా.స (3g గారి పేటెంట్)
హరే కృష్ణ గారు...... బ్ర.బ్లా.స ని ఇప్పటికే జాతికి అంకితం చేయడం జరిగింది. దీనికింక పేటెంట్ చెల్లదు.
నాగార్జునా కేవ్వ్ :D
కార్తీక్,రైట్!
మనం ఎక్కడా తగ్గేది లేదు
>>బ్ర.బ్లా.స ని ఇప్పటికే జాతికి అంకితం చేయడం జరిగింది
3g గారు
మీ పేటెంట్ ని జాతికి అంకితం చేసి ప్రాజెక్ట్ approval చేసేసారు
థాంక్ యూ :)
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
ఎవరు ? ఎవరు ? మా బ్రహ్మ చారుల మీద నోరు చేసుకుంది ? ఆయ్! ఎంత కండ కావరం ? నేను కూడా మీకు సపోర్టు బాసు , కానీ మరీ బ్రహ్మీ కాకుండా బ్రహ్మచారులు అంటే బాగుంటుంది ఏమో ?
brahmi only suits to young guys like tara ;)
హరే కృష్ణ గారూ...,happy vinakayaka chavithi
హారం
:D:D
SR Rao గారు
భాస్కర రామి రెడ్డి గారు
మన:పూర్వక ధన్యవాదాలు
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు
కిరణ్ థాంక్స్ :)
:) :)
హరేకృష్ణ గారు .... ఇన్ని కష్టాలా ????? పోనీలేండీ .... సంఘం నిలబెట్టిన నెల రోజుల లోపే మీకు పెళ్ళి అయిపోవాలి అని కోరుకుంటున్నాను
revolution lo kooda comedy ni puttinchaavu ... kummesavu :)
kanneti ni weekeend ki postponse chesukunnadu...baagundi :)
ఇదా సంగతి బా బ్లా స ఏంటా అనుకున్నా :)
పరిమళం గారు థాంక్స్ :)
విక్కీ థాంక్ యూ :D
శివ రంజని అంత మాట అంటావా ఇదిగో నీకు క్లాస్..!
‘యావత్కంఠగతాః ప్రాణాః/ యావన్నశ్యతి చేంద్రియమ్/ తావత్ చికిత్సా కర్తవ్యా/ కౌసల్య కుటిలా గతిః’- మనస్సు నిర్మ లంగా, శాంతిగా ఉండడానికి ఆరోగ్యమే మూలమని ధన్వంతరి శ్లోకం ఇలా వివరిస్తుంది.‘శాంతిం కాంతిం స్మృతిం జ్ఙానం/ ఆరోగ్యం చాపి సంతతిమ్’- శాంతిగా, స్మృతిగా, జ్ఞానవంతంగా ఉండాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మ చర్యం వల్ల దేహ సౌందర్యం, ఇంద్రియపుష్టి- ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. ‘మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదివా’ అని చెప్పడం వలన బ్రహ్మచర్య- అంటే మనస్సును పరబ్రహ్మవైపు మళ్లించడమే. ప్రియంగా మాట్లాడడం, ప్రీతికరమైన కార్యాలు- అంటే పూర్వం యజ్ఞయాగాది క్రతులు- ఇపుడు సత్యవచో శీలురుగా, ధర్మ ప్రవర్తనులుగా ఉండాలని ధన్వంతరి అభిప్రాయం. ఏ పని చేసినా త్రికరణశుద్ధిగా చేయాలనే సంకల్పం గొప్పది.
‘శరీర మాద్యఃఖలు ధర్మ సాధనమ్’- అన్ని కార్యాలకు, కర్మలకు శరీరమే ముఖ్యము కదా! ఆ శరీరమే అనా రోగ్యం పాలయితే ఏ పనీ చేయలేము కదా! అందుచేత శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి ఏమాత్రం ఏమరుపాటు చేసినా వ్యా దులు దాడి చేయడానికి సిద్ధమౌతాయి. శరీరం ప్రకృతి సంబందం.పంచభూతాలతో కూడియున్నది- తిరిగి పంచభూతాలలో కలిసిపోయేది. ఎలా వస్తారో ఎలా వెళ్లిపోతారో గమనా గమన దారులు మాత్రం తెలియవు. భూమి మీద పడిన తర్వాత ఆత్మీ యత, అనురాగం పెరుగుతుంది.
తల్లిదండ్రులు, సోదరీ సోద రులు, బంధుజనులు, ప్రియజనులపై మమకారవల్లులు అల్లుకు పోతాయి. కనుక ఈ శరీరమున్నంత కాలము సేవలు నిరాటం కంగా సాగవలసిందే. శరీరానికి ప్రతి నిత్యము సంస్కారాలు అవసరం. దేహ శుద్ధికోసం స్నానం, అంతఃశుద్ధికోసం దైవ చిం తన తప్పనిసరి.ఆరోగ్యం ఆధ్యాత్మికం పరస్పర జన్యాలు. అనా రోగ్యంతో పూజలు చేయలేము.ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవాన్ని విస్మరించజాలం. స్నానము వలన దేహం శాంతి బడుతుంది.ఆత్మ చల్లగా ఉంటుంది. కల్మషాలులేని సరస్సువలె మనస్సు నిర్మలంగా ఉంటుంది.
శరీర ఆరోగ్యానికి దేహ వ్యాయామము, ఆత్మ ఆరోగ్యానికి మానసిక వ్యాయామము అవసరం.వ్యాయామము వల్ల కండపుష్టి, పను లలో సామర్థ్యం మెరుగవుతుంది. ఆకలి పెరుగుతుంది.ఆరో గ్యంగా ఉంటారని చరకసంహిత తెల్పుతుంది (చరకం7-32).‘లాఘ్రువం కర్మ సామర్థ్యం/ స్థైర్యం దుఃఖసిహష్ణుతా/ దోషక్ష యోన్ గ్ని వృద్ధశ్చ/ వ్యాయామా దుపజాయతే’ చరకం - ఒక వైపు ఆరోగ్య సుస్థిరత్వాన్ని, కాపాడుకుంటూ మానసికంగా పరి శుద్ధులై దైవానుగ్రహం సంపాదించాలి. కాయేన మనసా వాచా సర్వావస్థాను సర్వదా-మనోవాక్కాయ కర్మలచేత చేసే పనులే పరమాత్మ అనుగ్రహానికి మార్గాలని భావించాలి. అతిగా తిన డం, అతిగా నిద్రపోవడం-ముఖ్యంగా పగటి నిద్ర పనికిరానివి.
.
నేస్తం గారు అంతా మీ అభిమానం
థాంక్స్ :)
Post a Comment