Pages

Thursday, May 14, 2009

నన్ను చూసి ఏడవకు

రోజు ఎప్పటి లాగానే నా అల్పాహారం తీసుకోవడానికి నేను ఛత్రపతి శివాజీ టెర్మినస్ కి వెళ్ళాను, మా ఆఫీసు కాంటీన్ లో వున్న గడ్డి కంటే ఇది ఒక 10 రెట్లు బెటర్ అని నా ఫీలింగ్..వేడిగా మనముందే ప్రిపేర్ చేస్తాడు quality assurance ఉంటుంది కదా అని నేను ఫాలో అవుతున్నా, అక్కడ అల్పాహారం అయ్యాక వెంటనే ఒక గ్లాస్ నిండుగా నీళ్ళు తాగుతా..మినెరల్ అండ్ కూలింగ్ అని extra ఛార్జ్ బిల్ తో పాటు వేస్తాడు, వీర ముష్టి కంటే ముష్టి నయం కదా అని నేను కూడా ఆలోచించకుండా శీతలజలం (కోల్డ్ వాటర్ అని నా అభిప్రాయం,సీత ఎవరు అని డౌట్ వచ్చిన వాళ్ళకోసం) సేవిస్తాను..

ఈరోజు దాకా అంతా బాగానే వుంది, ఈరోజు నాకు ఒక నిజం (పచ్చి కి పరాకాష్ట లాంటిది) తెలిసింది నా మటుకు నేను నీళ్ళు తాగడానికి లైన్ లో నిల్చున్నా ఇంతలొ ఒకాయన గ్లాస్ ని 5 నిమషాలు క్లీన్ చేసాడు..ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు కూడా వుంటారా అని నాకు మొదటిసారి అనిపించింది... ముందు వెనక కింద అన్ని భాగాలలో శుభ్రం చేసాడు..(అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇలానే చెయ్యాలి ఇక నుండి ) అని ఇంకా వాడి పేరుతో సంభందం లేదు వాడే నాకు రోల్ మోడల్ అనుకున్నా(ఏకలవ్య ,ద్రోణాచార్య రేంజ్ లో కాకపోయినా )..కడిగాక తెలిసింది వాడు అంత కంటే నెమ్మదిగా నీరుని తీసుకొని గ్లాసు లో నోరు ముక్కు మొహం మొ..etc అన్ని పెట్టేసి గ్లాస్ ని చూసిన వెంటనే నాకు మళ్ళీ నా చిన్నప్పుడు పుస్తకాల వెనక అంటరానితనం అమానుషం రాసిన వెధవ ఎవడో తెలుసుకొని వాడి ఇంట్లో వీడితో లంచ్ చేయించాలనిపించింది ..చివరగా అతని మొహం చూడాలని ఫోటో తీసి పూజ చెయ్యాలని అనిపించింది ..నా మొబైల్ కెమెరా ఆన్ చేశా..అతను వెనక్కి తిరిగి చూసే సరికి వాడు ఎవడో కాదు మా **** గాడు..

వెంటనే నేను రేపటి నుండి ఇటువంటి మనుషుల అరాచకాల్ని ఆపడానికి హాఫ్ లీటర్ బాటిల్ కొనుక్కున్నా..వాడు టాప్ లో నోరు పెట్టేస్తే నేను ఏమి చెయ్యలేను..!

8 comments:

Unknown said...

bagundi! oak simple scene , oka chinna thought ni bore kottincha kundaa baaga present chesaavu, well composed and edited,

Unknown said...

mee karthik evqaru, nijamga ne unnada leka fake ipl player laaga fake friend aa :p

హరే కృష్ణ said...

@Vikky
అబ్బా!..లంచ్ చేశాను ఆయినా ఏదో వెలితి ..ఇప్పుడే కడుపు నిండింది నీ కామెంట్స్ చదివాక..నచ్చినందుకు చాలా థాంక్స్

హరే కృష్ణ said...

@Vikky
inchuminchuga fake ipl player lantide almost ...

Ravi Gadepalli said...

Almost alanti experience e naaku roju officelo.....

హరే కృష్ణ said...

@Ravi
:) :)

Aditya Maddula said...

♪♪ బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేడు ఆ దేవుడు... ♪♪

Yemi aadukunnavu mama kathick tho.. Nice presentation.. Thotaramudi blog choosaka rayadam modalettavu kadaa.. vaadi influence lekunda superb ga present chesav thoughts ni.. konni english words ki telugu translations choostunde, sankar dada cinemalo english samethalu gurthuki vachayi. Inko chinna vishayam.. memu eppudoo CST gurinchi TV lono, news lono, bolly movies lonoo choostuntaam.. kani nee varnana akkade unnatlu chesindi.. Hats off dude. You rock!! Gaadodu Roxx!!

ప్రభాకర్ said...

మా ఆఫీసు లో కూడా ఇలాంటి ఒక వెదవ ఉన్నాడు, చీపురు కూడా చీప్‌ది కొనే చప్రాసెదవ