Pages

Monday, May 18, 2009

కాట్రాజ్

ఒక రాత్రి ..అది కుడా నిన్ననే...కాల్ వచ్చింది కుమార్ నుండి..అలా మాట్లాడుతుండగానే ..మా కాంపౌండ్ వాల్ అవతల ఒక పెద్ద పాము తిరుగుతూ వుండడం గమనించాను..పాముని చూడగానే నాకు తెగ నవ్వు వచ్చింది..ఎందుకంటే దాని రంగు బ్రౌన్ మరి..సీన్ కట్ చేస్తే అవి నా ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు..ఫైనల్ ఇయర్ లో మా అదృష్టం బాగుండి హాస్టల్ ని శాశ్వతం గా మూసేసినాక మేము కుడా అన్నీ మూసుకొని బయట రూం తీసుకొని వున్నాం ..నా రూం లో ఒక 2 నెలలు ఉన్న తర్వాత నాకు తెలిసింది మా పెరడులో పశు పక్షాదులు (బాలకృష్ణ ,హోమన్ బాబు అనుకుంటున్నారా..విజయవాడ లో వాళ్ళు లేరు)ఒక మాదిరిగానే వున్నాయి అని .. మా రూం దగ్గర ఒకరోజు పాము కన్పించింది బ్రాండెడ్ బ్రౌన్ కలర్ లో వుంది ..మా ఇంటి ఓనరు ప్రతి రోజూ సాయంత్రం మాకు చాలా కధలు చెప్పేవాడు తనయొక్క శక్తీ ముక్తి రక్తి ..మాకేప్పుడు విముక్తి అనుకుంటూ మేము కూడా వినేవాళ్ళం వాడి సుత్తి ..ఇలానే ఒకరోజు తన హిస్టరీ లో ఎన్ని జంతువలను చంపాడో కూడా అందులో ఎన్ని పాములు,తేళ్ళు, విష కీటకాలు (మన పెరడు లో వుండే ప్రాణుల సంఖ్య 739 అందులో poisnous 376, non poisnous 363 etc.. అని మాకు ఠాగూర్ సినిమా statistics చెప్పేవాడు )..మేము కూడా అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా లో ఏమిరా బాలరాజు..డైలాగ్ వెంటనే గుర్తువచ్చి వాడి ముందే నవ్వే వాళ్ళం వాడికి వెంటనే ఎక్కడో కాలి మీకు ఒక రోజు నా యొక్క టాలెంట్ ని చూపిస్తా అని ఒక లుక్కేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు ...

రోజు నాకు పామును చూడగానే ముందు భయం వేసింది తర్వాత ..తర్వాత దాన్ని చూసి కొంచెం జాలి వేసింది, మా ఓనరు చేతిలో కుక్క చావు కొనితెచ్చుకోవడానికే ఇక్కడికి వచ్చింది అని.. మా ఓనరు వున్నాడు అనే దొంగ ధైర్యం తో ..వాళ్ళ ఇంటిలోకి వెళ్లి మా ఓనరు తో అంకుల్.. అంకుల్.. మన పెరడులోకి పాము వచ్చింది అని అరిచేసరికి ఏంటి పామా..నరికేస్తా(నేను మొదటి సారి విన్నా..పాముని ఎవడైనా నరుకుతాడా.. అంకుల్ ఆది సినిమా hangover నుండి బయటకు రాలేదు అనుకుంటా) నేను ఇప్పుడే వస్తున్నా డ్రెస్ మార్చుకొని అని చెప్పి అరగంట వరకు ఆయన బయటకు రాకపోయేసరికి ఓనరు హ్యాండ్ అంటే ఇలా వుంటుందా అని కళ్ళు తెరుచుకొనే లోపే అజయ్ కాంత్ గాడు ఏంటి పాము వచ్చిందా అని ఒక పెద్ద కర్రతో గ్లాడియేటర్ లో రుస్సెల్ క్రో లాగా కాకపోయినా అన్న సినిమా లో రాజశేఖర్ లా వచ్చేసరికి వీడి హడావుడి ని తట్టుకోలేక అది కొంచెం షార్ప్ అనుకుంటా (మా వాడి దరిద్రమో మరి 30 నిమిషాల దాక అక్కడే వుండి వీడు రాగానే ప్రక్కనే ఉన్న కొబ్బరి చిప్పల్లోకి జంప్ ) ..అరే నీ జి..దాన్ని నువ్వే ఎలాగోలా తరిమేయ్ అని చెప్పగానే మా వాడు చాలా ఆవేశంగా తన పౌరుషాన్ని బ్రహ్మనాయుడి రేంజ్ లో అర్ర(అన్న సినిమా లో కర్ర) ను తీసుకొని చిప్పలు లోకి పెట్టి గట్టిగా భూమిలోకి దించాడు.అంతే కాసేపట్లో ఎంత లాగుతున్నా కర్ర రావడం లేదు(క్షమించాలి అర్ర )..మేముడిసైడ్ అయిపోయాం మా అజయ్ కాంత్ కర్ర తో కొట్టేసి దాన్ని కడిగేసాడు అని వెంటనే నేను గట్టిగా పాము ని చంపేసాడు..పాము కి ఫూ పేక చేసిన అజయ్ కాంత్ అని ఈనాడు లో కృష్ణా డిస్ట్రిక్ట్ మెయిన్ పేజి లో వస్తుంది నీ ఫోటో పక్కనే మేము కూడా అని చాలా పొగిడేసరికి వాడు మాత్రం దున్నేవాడిదే భూమి చంపేవాడికే పేపర్ లో ఫోటో.. వాళ్ళు మీ ఫోటో తీస్తామన్నా నేను ఒప్పుకోను అని చెప్పేసరికి మధ్యలో బిగ్గరమైన స్వరం (గేదె గొంతు)తో ఏమైంది .. ఏమైంది.. అని మా దగ్గరకు అదే డ్రెస్ తో వచ్చాడు అంకుల్(భయానికే భయ్యా అని అప్పుడు తెలిసింది)

అప్పుడు నేను చెబుతుండగా అజయ్ కాంత్ నువ్వు ఉండు అని అన్నట్టు నావైపు ఒక చూపు చూసి ..పాములను పట్టడం ఒక కల( ఇంగ్లీష్ లో ఆర్ట్) అంకుల్..ఇప్పుడు మీ పరిసరాలను రక్షించింది నేనే అని సగర్వంగా చెప్పి ..పాముని తొందరగా తియ్యు దానిని వేరే చోట పడేయాలి అని అంకుల్ అనగానే కర్ర తీసాడు కార్తీక్ ..అప్పుడు మాకు (ముఖ్యంగా కార్తీక్ కు) పెద్ద షాక్..వాడు చంపినది పాముని కాదు అని దాని కడుపు లో ఉన్న కప్పనని చాలా లేట్ గా తెలిసింది..ఇంకా పాము చావలేదు అని లైట్ వెలిగిన అంకుల్ వెంటనే పాము కంటే ఫాస్ట్ గా ఇంట్లోకి జంప్ ..మేము కూడా లైట్ తీసుకొని పేపర్ ఫోటో ఏదేదో ఊహించుకొని కష్టపడ్డ అజయ్ కాంత్ చివరకు ఒకటి తెలుసుకున్నాడు


పాముని చంపడం అనేది ఒక కల (ఇంగ్లీష్ లో డ్రీం)..

12 comments:

Ravi Gadepalli said...

Sabhash kiran bhaiyya....neelo naakoka paruchoori trivikram, sirivennela sundararama sastry kanipistunnaru...nuvvasalu taggoddu...innallu ee talent anta ekkada daachavu...super...

హరే కృష్ణ said...

ధన్యవాదాలు నచ్చినందుకు .. పొగిడినందుకు ప్రణామములు ..ఇంక తగ్గను ...

vikky2vikram said...

paamu ni chami unte maneka gandhi mee karthik ni vadiledi kaadu, varun gandhi ki appa cheppedi

హరే కృష్ణ said...

@Vikky
menaka as an animal right activist..

Naresh said...

కాట్రాజ్.. పేరు చదివే నవ్వలేక చచ్చాను
ఇంకా నీ బ్లాగు గురించి మన మిత్రులకు చాలా మందికి తెలియదు..
అందరికి కలిపి ఒక మెయిల్ కొట్టు..

హరే కృష్ణ said...

@Naresh
నా బ్లాగ్ లో మొదటిసారి కామెంట్ రాసినందుకు చాలా థాంక్స్ ..తప్పకుండా మెయిల్ చేస్తాను..

ప్రభాకర్ said...

'కాట్రాజ్' టైటిల్ అదిరింది మాయ్యా ..పాముల సందడి సూపర్

Banda said...

dani narikestha...kek

హరే కృష్ణ said...

@Worlds Most Eligible Bachelor
బ్లాగు విజిట్ చేసి కామెంట్ రాసినందుకు చాలా థాంక్స్..పిచ్చకేక అంటే నీ బంప్స్ గురుండి రాయాలి ఒక పొస్ట్ లో

హరే కృష్ణ said...

@Prabhakar
పాముల పాప తో గుర్గావ్ లో అడుకోవద్దు....థాంక్స్

Unknown said...

bagundayya kiran...ee blagulanni oka pustakam rasi.. achu vesi telugucinema swarnotsavallo mohanbabu cheta release chepinchali.

హరే కృష్ణ said...

@Sravan
ha ha ha..tappakunda release cheddam enthaina vallu manchu chesina manushulu