Pages

Wednesday, May 13, 2009

'మై' పిఎల్

ఇప్పుడు పి ఎల్ జరుగుతోంది ...IPL అంటే గుర్తోచేది మా హాస్టల్ టీవీ రూం లో మొదటి సీజన్ కి మేము చేసిన హడావుడి..దురదృష్టమో అదృష్టమో ఢిల్లీ లో చదవాల్సి వచ్చింది నా చదువు(పేరుకే ఢిల్లీ మా హాస్టల్ లో సగం మంది తెలుగు వాళ్ళమే )తండోపతండాలుగా తరలి వచ్చిన తెలుగు విద్యార్ధుల తో మా హాస్టల్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ని తెలుగు గా మార్చేసాం ..మొదటగా మేము డెక్కన్ చార్జర్స్ టీం అనౌన్స్ చేసినప్పటి నుండి మన వాళ్ళకు తిరుగులేదు..కేక,పొడిచేస్తారు,$#%&* లేరు మనవాళ్ళని ,etc...అని మేము చేసిన గోలకు మిగతా రాష్ట్రాల వాళ్ళకు ఇది నచ్చింది అని చెప్పను కానీ ఖచ్చితంగా కాలింది..మా ప్రాజెక్ట్ వర్క్ లకు guides ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే..హా వాడు చెప్పేది ఏంటి 15 రోజులు చాలు అనే ఒక కాన్ఫిడెన్స్ చాలా మందిలో ఫీలింగ్ నాటుకుపోయింది..అంత మంచి environment ని వదిలే ముందు బాగా ఎంజాయ్ చెయ్యాలని మేము ఫస్ట్ ఇయర్ లోనే ఫిక్స్ ..అప్పటికే అందరికి జాబ్స్ వచ్చేసాయి ఇది కూడా మన వాళ్ళకు అగ్ని కి ఆజ్యం ఇంకా భలేక్రిష్ణ కి పౌరుషం పోసినట్టు పుంఖాలు పుంఖాలు గా బలిసింది..

నాకు ఇప్పటికి వాడి పేరు గుర్తులేదు, కాని ఒక పసుపు రంగు T-షర్టు వేసుకొని వచ్చేవాడు (అది వాడికి లక్కీ షర్టు అనుకుంటాను లేకపోతే ఒక్కటే వుందో తెలియదు ) వాడిది కోల్ కత(ఇది మా అందరికి ఎరుక)

ఇంతలో మా అజయ్ కాంత్ గాడు వాడికి చదువు తప్ప ఏమీ తెలియదు ఆఖరికి - సినిమాలు కుడా చూడడు..ఇటువంటి మనిషి ఇంకా భూమి మీద ఎలా వున్నాడో తెలియదు ..వాడికి ఆకు కి ఇంకా దేనికో అసలు తేడా తెలియదు అని అందరు అంటూంటారు..చివరకి వాడు కూడా చూడడానికి రెడీ అయిపోయాడు..ఛీ నా బతుకు వాడికే అంత వుంటే మనం ఏమైనా తక్కువ అని నేను మా ఫ్రెండ్ ganesh( ఇద్దరం కలిసి కామెంట్ చేసేవాళ్ళం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ) ముఖ్యం గా ఇండియన్ ప్లేయర్స్ నే..తిన్నది అలా అరిగించేవాళ్ళం

మా మెస్ లో టీ పెట్టేవాడు 3.30 కి అందరూ టీ గ్లాస్ లు బేస్ మెంట్ లో వున్న టీవీ రూం లోకి ఒక మమ్మీ సినిమా లో పురుగులు ఎంటర్ అయ్యేవో అలా మేము విత్ టీ తో అడుగుపెట్టేవాళ్ళం నరేందర్ భయ్యా నేను ఇంకా కుమార్ వెనకాల కావాలనే కూర్చునే వాళ్ళం ఎందుకంటే కొంచెం పర్సనల్ గా కూడా టార్గెట్ చేసేవాళ్ళం ఒక వేల మేము బకరాలం అయ్యే పోసిషన్ లో వుంటే వెనక కుర్చోంటే అదొక అద్వాంటేజ్ ..లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు పి.హెచ్ డి విద్యార్ధులు( మా గొడవలు పరిష్కరించే పెద్ద మనుషులు) మధ్యలో వచ్చేవాళ్ళు..

ఒక ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చేసరికి మా మెస్ లో పనిచేసే వాళ్ళకు ఫుల్ పని వుండేది టీవీ రూం లో..హాస్టల్ లో 100 మంది వుంటే టీవీ రూం లో మాత్రం 200 గ్లాసులు వుండేవి.. 2 గ్లాసులు ఎందుకు అని వాడు ఏమైనా అడిగితే నీ భార్య చల్లార్చుతుందా టీ ని అని అన్నట్టు చూసేవాళ్ళం వాడు కూడా లైట్ తీసుకున్నాడు తర్వాత

మా హాస్టల్ పసుపు చొక్కా గాడిని ఎప్పుడూ ఆడుకునేవాళ్ళం మ్యాచ్ జరుగుతున్నప్పుడు ...ఒకరోజు ముంబై vs చెన్నై మ్యాచ్ జరుగుతోంది మేము ముంబై కి ఫుల్ సపోర్ట్ వాడు వాడికి లోలోపల ముంబై కే సపోర్ట్ కాని మేము ఆల్రెడీ చేస్తున్నామని వాడు చెన్నై కి సపోర్ట్ చేసాడు ..కానీ సెకండ్ సెషన్ లో కొద్ది టైం లోనే మాకు మ్యాచ్ పొజిషన్ ఆర్ధం అయ్యింది మన తెలుగు ప్రజానీకం అంతా చెన్నై కి సపోర్ట్ చెయ్యడం మొదలు పెట్టేసరికి వాడి ముఖ కవళికలను చూసి ఓహో ఓహో అంటూ వాడిని భలేకృష్ణ ని చేసిన రోజు మర్చిపోవడం చాలా కష్టం( ఎందుకంటే రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మన వాళ్ళ ఓటమి కి జరిగినప్పుడు వాడి చేసిన డాన్సులు మర్చిపోవడం అంతకంటే కష్టం ఎందుకంటే ఎవరైనా కాళ్ళతో ఆయినా చేతులతో ఆయినా వేస్తారు కానీ వాడు కసితో వేసాడు అది మాకు ఎక్కడో గుచ్చుకుంది)

ఇంతలో మా అజయ్ కాంత్ గాడికి చాలా సందేహాలు వచ్చేవి వీడి గుంగుడు గుడు గుడు ఇక్కడ కూడా నా అని మేము చిరాకు పడేవాళ్ళం . మాకు రక్త కన్నీరు సినిమా ఎన్ని సార్లు చూపెట్టాడో మాకే తెలియదు.. నువ్వు ఎలా సెప్తే అలాగే మామా అని మేము వాడిని బాగానే ఉత్సాహ పర్చేవాళ్ళం..మా వార్డెన్ కి చాలా శ్రద్ధ ఎక్కువ మా హాస్టల్ మీద ఎందుకంటే సంవత్సరం లో ఒకసారి మాత్రమే చూసాం వాడి మొహం ఎలా వుంటుందో హాస్టల్ ఎలక్ష్షన్ కి డెమో ఇవ్వడానికి వచ్చాడు ఆరోజు కూడా కార్తిక్ గాడు పుస్తకాలూ తెచ్చేసి ఏదో వాడికి తెలిసన రీతిలో వచ్చాడు డైరెక్ట్ గా కాలేజీ నుండి బేస్ మెంట్ లోనికి అప్పుడే మన తెలుగు విద్యార్ధుల్లో నిద్రపోతున్న ఒక సింహం మేల్కొని ప్రతిపక్ష రాష్ట్రాల వాళ్ళని చీల్చి చెండాదేసింది


సోప్ బాక్స్ కంపల్సరీ కావడం తో ఒక తమిళ్నాడు కి చెందినా ఒకడు మెస్ సెకీ గా వాడి introduction వాడె సెకి అయితే ఏమి సీకేస్తాడో అని చెబుతూ వుండగా మా సింహం లేచి ఒక ఆరోగ్యమైన మనిషి కి ఎన్ని కాలోరీస్ కావాలో నువ్వు టిఫిన్ పెడితే ఎన్ని కాలోరీస్ తెలుసా నీకు అని అనేసరికి వాడి మొహం మొ.. మొ.. మొ ..మీరు వూహించినట్టే అలానే పెట్టాడు ఆంధ్రుల రాజ్యానికి మేము వోటర్లు గా పాల్గొని హాస్టల్ ఎన్నికలని విజయవంతం చేసాం..ఎన్నికల తర్వాత విషయాలు తర్వాత టపా లో బ్లాగుతాను ..

3 comments:

Ravi Gadepalli said...

Simham ippudu kanyakumarilo undi...yellow yellow dirty fellow peru palash....intaki ikkada karthik ante GE lo unna karthik ena????

Ravi Gadepalli said...

karthik rambabu aina roju miss ayyavu....

హరే కృష్ణ said...

@Ravi
వాడు ఢిల్లీ లోనే bunch of buckets సాంబార్ తాగేసేవాడు .. కనికరం లేకుండా కన్యాకుమారి లో కొద్దిరోజుల్లో సాంబారు ఎండిపోతోంది అన్నమాట.. drystate