కుక్కలు చింపిన విస్తరి..
హొలీ .. ఈ మాట వింటేనే మాకు ఎక్కడ లేని ఉత్సాహం అంతా వస్తుంది.. ఇంజనీరింగ్ లో కుల విద్వేషాల వాళ్ళ నేను జరుపుకోలేకపోయాను హొలీ ని కాంపస్ లో హొలీ జరుపుకోవడం నాకు అదే మొదటిసారి ..ఢిల్లీ-16 (మా కాంపస్ పిన్ కోడ్) లో ఎంజాయ్ + రచ్చలు + రక్తాలు + సో అండ్ సో సోది ..మసక్కలి చేసేవాళ్ళం (కాని మిగతా రాష్ట్రాల అబ్బాయిలు మాత్రం అంతా బాలికల వసతి గృహాలలో జరుపుకునేవారు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నాను అంటే అమ్మాయల ముహాలమీద రంగు కంటే వాళ్ళ షర్టు ల మీద నే ఎక్కువ రంగు వుండేది ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ సుమారు ఒక వంద రంగులు చూడొచ్చు మీరు,ఒక్కొక్క చొక్కా మీద ఆ రోజు.. ) అది అర్ధం కాని మా అజయ్ కాంత్ గాడు వాళ్ళు కావాలనే మాసిన చొక్కాలు వేస్తారని చిన్నపటి నుండి ఒక హొలీ డ్రెస్ (holyshit..ఏం కాదు) వుంటుంది అని మాకు చెప్పేవాడు ..మేము కూడా అవునా అని నోళ్ళు వేల్లబట్టేసరికి వాడికి పట్టలేని ఆనందం కలిగేది..
పొరుగు రాష్ట్రాల వాళ్ళు ప్రొద్దున్న ఒక రెండు మూడు గంటలు అక్కడ గుంటల గుడ్లు పగలగొట్టి కంప్రెషన్ టెస్టింగ్ ప్రాక్టికల్స్ చేసి మా హాస్టల్ కి వచ్చేవారు ఇది ఇలా వుంటే ...
మన తెలుగు ప్రజానీకం అంతా వెరైటీ నే అన్నన్ని రంగులు చాలా గుడ్లు ప్రక్కనే వున్నా బురదలో దొర్లకపోతే హొలీ కాదు అనే (ముడాచారం ,ఫాంటసీ ఏదో కరెక్ట్ పదం వుంది నాకు ఇంకా గుర్తు రాలా ) తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెప్పి బురదపూజ చేసేవారు,అంతా 7 గం. లేచి 8 దాక గుంట(బురద, వేరే గుంట గురుండి బ్రేక్ తర్వాత చెప్తాను) ను ప్రిపేర్ చేసి ఒక గంట సేపు అలా కసితీరా దొర్లిన తర్వాత ఆ అద్భుతమైన రూపాలను సందర్సన కు ఒక్క ప్రేక్షకుడు కూడా మిగలకపోవడం తో ప్రజల వద్దకు పాలన లాగా మేమే హాస్టల్ లోనికి వెళ్లి లేవని వాళ్ళను ఒక 20 మంది ఒకే తలుపును ఒకే సారి కొడితే దాన్ని 'నెమ్'మది బ్రమించండం (స్లో మోషన్ ) లో వూహించడం కూడా చాలా కష్టం..రూం లో వున్నవాడికి బ్రమించని పార్ట్ ఆంటూ వుండదు ఆ క్షణం లో..
పొద్దున్న తలుపు కొట్టిన వెంటనే వాడు ఒక నిక్కరు మహా అయితే ఒక బనియన్ + దుప్పటి మాత్రం వుండేది అందరకి ఓపెన్ చేసేటప్పుడు వెంటనే వాడి తల మీద రెండు గుడ్లు వాడి దుప్పటి మీద తల మీద మొహం మీద రంగులు fraction of సెకండ్స్ లో రంగు పడేది..వాడు కూడా అంతే స్పీడ్ గా రియాక్ట్ అయ్యేవాడు మాతో జాయిన్ అవ్వడానికి ..నన్ను ఎలాగో పాడుచేసారు..నేను ఇంక నా పగ తీర్చోకోవాలి అని వెంటనే ప్యాంటు వెయ్యడానికి ధైర్యం చెయ్యలేక అలాగే వచ్చేవారు ..
అంతా కలిసి అంతమందిని పోగేసి చివరగా అజయ్ కాంత్ రూం దగ్గరకు వెళ్ళేవాళ్ళం..వాడు రోజూ 9 కి లేచేవాడు..హొలీ అని చెప్పి వాడు పకట్బందీ బయటనుండి వాళ్ళ రూంమేట్ తో బయట తాళం వేయించేవాడు ..మా అందరం వీడి కోసం అంత ప్రిపేర్ అయితే వాడు మమ్మల్ని dissappoint చేసేవాడు అని చాలా మంది అనుకునే వాళ్ళం..కాని హచ్ నెట్వర్క్ లాగా వాడిని దరిద్రం ఎప్పుడూ వెంటాడుతూనే వుంటుంది అని అందరికి తెలుసు ..అప్పుడే మేము వాడికి కాల్ చేస్తే
'మొ' గాడు సైలెంట్ మోడ్ లో పెట్టి లిఫ్ట్ చేసే వాడు కాదు..వీడికి ఇలా కాదు అని మా హాస్టల్ STD బూత్ నుండి బాత్ ఇన్ బూతు చేసేవాళ్ళం..హిందీ లో వాడు హిందీ లో కొంచెం కాదు బాగా వీక్ ( తూ కిదర్ హో సాలె..బె కి etc అనేసరికి వాడు మై రూం మే రూం మే అని వెంటనే రెండు సార్లు చెప్పేసేవాడు) ..
వెంటనే ఒక పెద్ద బండరాయిని తీసుకువచ్చి వాడి తాళం + compensasion గా గొల్లాన్ని కొట్టి అదనంగా (మాండటరి గా) వాడి 'జి' పగలగోట్టేవాళ్ళం..వాడికి ప్యాంటు లో కూడా 4 గుడ్లు వుండేటట్టు చేసేవాళ్ళం(2 గుడ్లు బయట పగలగొట్టి ఆ రసాయనాన్ని రంగులో కలిపి ప్యాంటు లో విత్ casing వేసేవాళ్ళం) ఇంకా శిక్ష గా వాడి రూం లో నీలాంటి వాళ్ళను చేరదీస్తున్నావు అని వాడికి ఒక సాకు చెప్పి వాడి రూం అంతా నాశనం చేసే వాళ్ళం చివరికి బట్టలు పెట్టే అల్మారా లో కూడా ..చాలా కాలం పాటు గుర్తునే ఒక నిజమైన కలర్ సినిమా 'రంగుల హరివిల్లు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసి 10 నిమిషాల్లో చూపెట్టేవాళ్ళం..
వాడు చాలా బ్రాండెడ్ (పంచ్ కోసం ప్రాణాలు తీసే టైపులో) ఇంకా బలిసిన కుటుంబం అయ్యేసరికి రంగు పడ్డ బట్టలని బయట విసేరేసే వాడు...మమ్మల్ని కించపరిచే ఒక చూపు చూసి స్నానానికి వెళ్ళేవాడు..మేము టార్గెట్ సరిగా చెయ్యలేదు అని ఒక అభిప్రాయం కొంత మందిలో ఇంకా వుండేది (వీడికి బలిసింది ఇంకా దిగలేదు కరెక్ట్ అనుకుంటా) స్నానం పూర్తయ్యాక హెడ్ అండ్ షౌల్దెర్స్ తో వెళ్లిన వాడు బయటకు అన్ ఫెయిర్(నిర్ధాక్షన్యం) అండ్ అన్ లోవ్లీ (లోపల చెసే లొల్లి ) తో వచ్చేవాడు బయటకు
మాకు ఆరోజు సుమారు 12 గం లకు హాస్టల్ బయట ఒక పెద్ద ప్రదర్శనకు(బల) అంతా సిద్ధమయ్యేవాళ్ళం ఎవరైనా చొక్కా వేసుకుంటే అది చించెయ్యడం..అజయ్ కాంత్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అయ్యేసరికి అది హద్దులు దాటి వాడి ప్యాంటు కూడా చిరిగి చాట చేయడానికి దోహద పడింది మిగతా రాష్ట్రాల వాళ్ళ వాళ్లకి ఇలా చొక్కాల చాట చేయడం అనేది వాళ్ళకు తరతరాల ఆచారం..అలా బల ప్రదర్సన కాస్తా మా అజయ్ కాంత్ కు బలి ప్రదర్సనను కళ్లారా సూపెడితిమి...
.
6 comments:
prajala vada paalana....
hutch network......
head and shoulders tho velli fair and lovely ga bayataki raavadam...
keka , baagundi
@Vikky
నేను ఇప్పుడే పోస్ట్ చేశాను ..ఇంత తొందరగా నీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు చాలా థాంక్స్ ..కేకలు ఇంకా కొనసాగాలని నా అభిలాష
Ammaila gurinchi kotta logic cheppavura...ee angle lo ippativaraku aalochinchaledu
@Ravi
అరుణాచలం ఆల్బం చూసినాక లాజిక్ నాకు వెలిగింది
ore last para chadivi naa potta chekkalayyindi.
@Adi
థాంక్స్ :)
Post a Comment