ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక వుండేది.
మనసులో ఏ కల్మషంలేని ఆ పిచ్చుకకు ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది.
పిచ్చుకకి మిగతా జంతువులందరూ విక్రమ్ కుమార్ చెప్పినట్టు విడమరచి ఆ కాకులతో స్నేహం చేయద్దు అని చెప్పారు , అవి మంచివి కావు, అని. కాని ఆ పిచ్చుక మరో సీతయ్య సినిమా చూపించింది.
ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను తెలుగు హీరోలు మెహెర్ రమేష్ నమ్మినట్టు నమ్మి వాటితో వెళ్ళింది.
కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నటిని ధ్వంసం చేయ సాగాయి. పిచ్చుక నరసింహుడు నిర్మాతలా ఏమి చేయాలో తెకా అటూ ఇటూ గెంతుతూ వుంది.
ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది అని మీరు నమ్మాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది అని మీరు నమ్మాల్సిన సమయం ఆసన్నమైంది.
“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని డిస్కో రాజా సినిమాలో సునీల్ మీద ఒట్టు, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచ్చుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు చాలా కోపం మీద ఉన్నారు.. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.
ఏ కారణం లేకుండా నన్ను కొట్టుట మిక్కిలి బాధాకరం ఏ రుజువు లేకుండానే మీరు నేను మీ పంటను పాడుచేసాను అని ముందు నిరూపించండి అని సవాల్ విసిరెను
కొద్ది సేపయ్యాక ఒక బాల రైతు వచ్చి
కొద్దిసేపటి క్రితం ఆ కాకులతో కలసి ఈ పిచ్చుక పొలిచెర్ల హరనాథ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అనేసరికి
మారు మాట్లాడకుండా రైతులు సినిమాలో 95 శాతం సినిమా అయ్యాక చివరి 5 నిమిషాల్లో రక్తపాతం ఆపేయమని ఇంద్ర సినిమా క్లైమాక్స్ సినిమా లా కాకుండా మరో సోషల్ మెసేజ్ ని ఇస్తూ
పిచ్చుక నీకు తెలియాల్సిన నిజం ఆసన్నమైంది.. ఆ కాకుల గుంపు చైనా వైరస్ లాంటిది నీ లాంటి వారిని టార్గెట్ చేసి పరోక్షంగా నిన్నే కాదు మీ అడవిలో అందరినీ నాశనం చేసే శక్తి ఉంది.. ఇప్పటికైనా మేం చెప్పేది ఏంటంటే
ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంది అని సెలవిచ్చారు ..
దానికి బదులుగా పిచ్చుక రైతులతో నేను కూడా మీ మేలు కోరి చెబుతున్నా ఈ 2020 లో
ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంది అని సెలవిచ్చారు ..
దానికి బదులుగా పిచ్చుక రైతులతో నేను కూడా మీ మేలు కోరి చెబుతున్నా ఈ 2020 లో
5 comments:
అడక్కుండానే కరోనా వచ్చినట్టు, గ్యాప్ కూడా expect చెయ్యకుండానే వచ్చింది :)
Hey...
How are you?
Nenu pinkyyy.
ఆహా ఎన్నాళ్ళకెన్నాళ్ళకి.. బావుంది హరే.. వెల్కమ్ బ్యాక్ :-)
చాల రోజుల తర్వాత ఇప్పుడే మీ బ్లాగు మళ్ళీ చూసాను. కామెంట్ బాక్స్ పై మీరు రాసింది చదివాక నవ్వు ఆపుకోలేక పోయాను. ఎక్సలెంట్ క్రియేటివిటీ. అందరికి బ్రేక్ ఇవ్వండి మరి. కీప్ పోస్టింగ్.
Post a Comment