Pages

Wednesday, November 28, 2012

నవ లబుక్యోఈ మధ్యనే  ఆఫీస్ నుండి రూమ్ కి  ట్రైన్ లో వెళ్తుంటే ఇనుప ఊచ చిన్నది  చొక్కాకి తగిలి హాండ్స్ దగ్గర చిరిగిపోయింది.

కొత్త చొక్కా కొనుక్కుందామని షో రూమ్ వైపు వెళ్ళాను
చలికాలం లో బట్టల షాపు వాడు వేసిన   AC కి నాకు చిరాకొచ్చి ఒక సూక్తి నా నోట్లో నుండి వచ్చింది
"చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో" అని
వెంటనే బుక్ స్టోర్ వైపు పరుగులు తీశానుఅలా ముంబై ఫేమస్ అయిన బుక్స్ దొరికే ఏరియా లోకి ప్రవేశించాను

                                  

న్యూ అరైవల్స్ చూపించు అని అడిగితే ఇష్టమొచ్చిన నవల్స్ అన్నీ చూపించాడు
ఇది బావుంటుంది సార్  ఇది చూడండి  సార్  థ్రిల్లర్,బెస్ట్ సెల్లర్ అని ప్రాసలతో పిచ్చెక్కించాక 
ఒక అరగంట గడిచాక నాకొద్దు నాకేమీ నచ్చలేదు అని చెప్పినా ఏంటి కొనకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ అరగంట నా శ్రమ వృధా అని తిరిగి గొడవ పెట్టుకున్నాడు

 నాకు ఇష్టంలేదు ఆల్రడీ చదివేసినవే ఉన్నాయి అని చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు
కొను  కొను అని మరో పది నిమిషాలు అరిచాడు

నా సహనం లిమిట్ క్రాస్ అయ్యి పిచ్చి పీక్స్ కి  shift అయిపోయింది

వీడెవడురా బాబు డిస్ట్రిబ్యూటర్ లు దొరకని ఢమరుకం ప్రొడ్యూసర్ లా నా వెంట పడుతున్నాడు ఏం చెయ్యనురా దేవుడా అని రెండు నిమషాలు ఆలోచించాను

అదే టైం  లో తెలుగు బ్లాగులు పోస్ట్ కి ఎవరో మహనీయుడు నా పాలిట  దేవుడు లా  కామెంట్ పెట్టారు.
తెలుగు బ్లాగులు ముంబై బ్లాగర్లు అని మెదడు లో  ఒక ఫ్లాష్ మెరిసింది,ఆ ఫ్లాష్ లైట్ నేరుగా 

వెను వెంటనే
నేను:I'm searching for the one which  my friend had recommended
షాప్ కీపర్:ఏంటా నవల్  ?
నేను: మా గూరూజీ  రాఘవేంద్ర రావు కొత్త హీరోయిన్ ది అంటే బాగుండదని
Wind rains of Moon Light (తెలుగు లొ తర్జుమా చేసుకొనుము)
షాప్ కీపర్:ఆథర్ ఎవరు
నేను:రాబిన్ శర్మ 

                                

షాప్ కీపర్:అది లేదండీ సారీ, వేరే ఏదైనా తీసుకోవచ్చుకదా
మళ్ళీ నేను ఆలోచనలో పడ్డా

కొద్ది క్షణాల్లో 
I need "The Guava tree in our backyard" అని అనేసరికి వాడు రెండు వరుస బాలయ్య సినిమాలు చూసిన ప్రేక్షకుడిలా నీరసించిపోయి లేదు సార్  అని జాలిగా అన్నాడు

వాడి మైండ్ బ్లాక్ అయిపోవడం తో
నాకు వచ్చేవారానికి ఈ రెండు పుస్తకాలు కావాలి
ఎందుకంటే  ఖచ్చితంగా ఈ నెలాఖరకు వాటిని చదివితే కాని నిద్ర పట్టదు 
అని చెప్పేసి  జంప్ అయిపోయాను అక్కడ నుండి రాఘవేంద్ర రావు కి మనసు లోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ! 

19 comments:

వేణూశ్రీకాంత్ said...

హహహ పాపం బుక్ సెల్లర్ :-P

ఫోటాన్ said...

బుక్ టైటిల్స్ బాగున్నాయి... ఎవడైనా కాపీ కొట్టేడు.. జాగర్త :)

ధాత్రి said...

మీ కామెంట్ పేజీలో ఉన్న మేటర్ చూసి..అసలేం కామెంట్ పెడదామనుకున్నానో మర్చిపోయానండి బాబోయ్..
హా..
బుక్స్..పేర్లు ..
..పాపం బుక్ సెల్లర్..:)

మధురవాణి said...

హేహ్హేహ్హే... అప్పుడు ఆ బుక్ షాప్ అతని మొహంలో ఎక్ష్ప్రెశన్ ఎలా ఉంది ఉంటుందో కదా! :D :D
రెండోది ఓకే గానీ ట్రాన్స్లేట్ చేసుకు చచ్చినా మొదటిది ఏంటో నాకు అర్థం కాలేదు.. :(

మధురవాణి said...

ఇంతకీ ఈ పోస్ట్ టైటిల్ ఏ భాష బాబూ? అర్థం ఏవిటో? :P

Priya said...

మీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండీ :D

Chinni said...

మీరు కేకో కేక.. అమ్మో! ఎంత రాఘవేంద్ర రావు గారి మీద అభిమానముంటే ఇలా చేస్తారా??!!!

..nagarjuna.. said...

మొదటి బుక్ పేరు అర్ధం కాలేదా మధురగారూ.... సో సాడ్ :(

రాజ్ కుమార్ said...

డిస్ట్రిబ్యూటర్ లు దొరకని ఢమరుకం ప్రొడ్యూసర్ లా నా వెంట పడుతున్నాడు>>>
kikiki kevvvvvvvvvvvvvv

తృష్ణ said...

poor man! (book seller) :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ మధ్య మీ టపాలు చదువుతుంటే దరహాసాలు రావటం లేదు. అట్టహాసాలు పొంగి పొర్లుతున్నాయి.

అవునూ ఇంతకీ ఆ శీర్షిక ఏమిటి చెప్మా?

A Homemaker's Utopia said...

మీరు నిజం గా సూపర్ అండీ..:-))

A Homemaker's Utopia said...

మీరు నిజం గా సూపర్ అండీ..:-))

మధురవాణి said...

హిహ్హిహ్హీ.. నాగార్జునా.. ఇప్పుడు తెలిసిందిలే.. హరే కృష్ణ మెయిల్ చేసి మరీ చెప్పాడు.. :D

రసజ్ఞ said...

రెండోది ఓకే గానీ ట్రాన్స్లేట్ చేసుకు చచ్చినా మొదటిది ఏంటో నాకు అర్థం కాలేదు.. :(
నాదీ సేం ఫీలింగ్ :( నాకింకా వెలగలేదు :(

మాధవ్ said...

వెన్నెల్లో గాలి వాన అనా? Wind rains of Moon Light అంటే.
Super..

శశి కళ said...

I need "The Guava tree in our backyard".....హ...హ..ఈ పేరు ఏమిటి?
ఈ శీర్షిక ఏమిటి?వీళ్ళ కామెంట్లు పుణ్యమా అని అర్ధం అయింది.బాగుంది

చాతకం said...

ROFL. ;)

హరే కృష్ణ said...

వేణూ శ్రీకాంత్ గారు,హర్ష,ధాత్రి గారు,మధుర,ప్రియ గారు,చిన్ని గారు,నాగార్జున,రాజ్,తృష్ణ గారు,గురూజీ,నాగిని గారు, రసజ్ఞ గారు,మాధవ్ గారు,శశి గారు& చాతకం గారు స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు