Pages

Monday, September 10, 2012

పల్లె వెలుగులో దిమ్మ చీకటి..!


నగరమంతా తిరిగి తిరిగి సుమారు నాలుగు మైళ్ళు  నడిచాక ముందు నీరసం వచ్చింది


దగ్గరలో ఉన్న హోటల్ లో రెండు వడ ఒక ప్లేట్ పూరీ అని తిన్నాక ఆకలి తగ్గలేదు ఇంక చేసేది లేక ప్లేట్ మీల్స్ తినేసి బస్సెక్కాను
ఓ గంట ప్రయానించాక కడుపు లో వికారం మొదలయ్యింది
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరో అరగంట పాటలు విన్నా.. వికారం పెరిగిందే కానీ తరగలేదు
పక్కన విండో ఉన్నా విపరీతమైనా గాలి వస్తున్నా కారం లో కుంకుడుకాయలా వెగటు వదలలేదు
అప్పుడే నా ముందు సీటు వెనుకభాగం చాలా ఆకర్షించింది
కండక్టర్ బస్సులో లైట్లు ఆపేసాడు 
బయట చిన్నగా వర్షం పడుతోంది గాలి గోల పెరిగింది

అర్జునా నాగార్జునా అని బస్సు కేచర్ లో పైంట్ ని బర బరా గీకాక ఔట్పుట్ వచ్చిన ఆనందం లో గట్టిగా తొడగొట్టాను
(
ఎవరక్కడ బస్సు గీకుడు ని అభినందించకుండా పోస్ట్ చదువుతున్నది !! ) 


ఈలోపు చిన్న సైజ్ ముళ్ళపంది లా 
నా భుజం మీద ఒకడు తలపెట్టి  నిద్రపోతున్నాడు వాడిని  తట్టి లేపాను.   

ఇదే కునకు వాడు తర్వాత కంటిన్యూ చేయడం మరో మూడు సార్లు నా భుజం మీద పడడం తో నాకు అసహనం T.రాజేందర్ లా పెరిగింది. 

ఉన్న నరకానికి తోడు ఇప్పుడు ఈ బాలయ్య బాబు సినిమా ఏంటి సామీ అని అనుకొని

వెంటనే నా galaxy కి పనికల్పించి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మార్క్ ఆంథోనీ కి బాబు లాంటి ఆర్టిస్ట్ పాడిన విండురైనులో ప్లే చేసాను 

ముందొక రెండు వెనుక్కొక రెండు సీట్లలో ఉన్న ఇరవై మంది నా పక్కన ఉన్న మరో నలుగులు ఉల్లిక్కిపడి బెంబేలెత్తారు
అలా వికారానికి ఉపకారం సహ ప్రయాణీకులకు హాహాకారం తో నా ప్రయాణమును ముగించితిని

నీతి : ఒక RTC బస్సు ప్రయాణం మీతో పాటు మీ పక్క,వెనుక వాళ్ళ 
ఓహో హో ఓహో.. ఓహో ఓహో ఒహ్హో హో అని వినపడేలా చేస్తుంది  

22 comments:

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్. ఇదేంటి ఇంత చిన్న పోస్ట్ రాశావ్??

హరే కృష్ణ said...

రాజ్ థాంక్యూ :))
పెద్ద పోస్టంటే మొన్న పెద్దగా రాస్తే టైమార్పితం బాగా ఎక్కువగా జరిగింది అంతే :P

మధురవాణి said...

హహ్హహ్హా.. నువ్వెక్కిన బస్సు ఈ ఫోటోలోదేనా.. బాగుంది.. అయితే నువ్వేక్కింది ఎర్రబస్సు కాదన్నమాట.. బులుగు బస్సు.. :D

..nagarjuna.. said...

kevvvvvvvvvvvvvvv

"ohhoho hho hho hho" arupulaku bus geekudu ki linkaaa...

vaaa :(

Padmarpita said...

భల్లే భల్లే :-):-):-)

ఫోటాన్ said...

చిన్న పోస్ట్,
అయినా ఆ క్రియేటివిటీ, ఆ పంచ్ లు సూపర్.. :)
బస్సు కేచార్ సూపర్, ఇంతకూ నువ్వే గీసావ లేక ఫోటో మాత్రం తీసుకున్నావా?
నువ్వే గీసింటే పల్లె వెలుగు కి ఫైన్ కట్టాలి :)

వేణూశ్రీకాంత్ said...

ఏంటోనబ్బాయ్ కొంచెం చిన్నపోస్టేస్తే టూషార్ట్ అనాలనీ కొంచెం పెద్ద పోస్టేస్తే టూలెంగ్తీపోస్ట్ అని అనాలనీ అనిపిస్తుంది ఎందుకంటావ్ :-)

బైదవే బొమ్మలో ఉంది పల్లెవెలుగు బస్ కాదుకదా :) బస్సుకేచర్ సూపర్ గీశావ్ :)

ఇపుడు ఎర్రబసులు లేవు మధురా అన్నీ పచ్చబస్సులు బులుగు బస్సులే :)

జలతారు వెన్నెల said...

రెండు వడ, ఒక ప్లేట్ పూరి, ఇంకా ప్లేట్ మీల్స్ ఇన్ని తిన్నాక , మరి కడుపులో వికారం కాక ఏటొస్తుందబ్బాయా?

ఇంకా దానికి తోడు....ఈ రోజుల్లో వచ్చే పాటలు విన్నావు,వికారం పెరగదా మరి?

ఇంకా నిండు రైన్ లో పాట వినిపించావా? హాహా హహా..
"వికారానికి ఉపకారం సహ ప్రయాణీకులకు హాహాకారం" hilarious....ఇది మాత్రం!
బాగుంది పోస్ట్..చిన్న పోస్ట్ అయిన్నా భలే నవ్వించారు.

సుభ/subha said...

హా హా హా :):) తొడగొట్టినా కూడా బస్సు,బస్సులో జనాలూ అలాగే ఉన్నారంటే పర్వాలేదు..మీరు బాలకృష్ణ కాదు అని అర్ధమైపోతోంది..

హరే కృష్ణ said...

మధుర :D
ఈ పోస్ట్ సూర్యోదయాన తేజస్సు లేకుండా బులుగు లో వెలుగుని చూసిన చేతులతో రాయడమైనది తెలియ చేసుకుంటున్నా అద్యక్షా!!

హరే కృష్ణ said...

నాగార్జున :)))
అంతా ఆ హ హ్హా హాహాకరానికి పొంతన లేని కామెంట్ లా లింక్ పెట్టడమే సారి అనిపించినది
థాంక్యూ :)

హరే కృష్ణ said...

పద్మార్పిత గారు థాంక్యూ :)

హరే కృష్ణ said...

హర్షా :)))))
నా గోళ్ళు అరిగేలా కేచర్ ని గీసాను బర బరా
ఇది సత్యము :)
చివర్లో కండక్టర్ చిల్లర ఇవ్వలేదు అదే ఫైన్ RTC యాజమాన్యానికి :)

హరే కృష్ణ said...

వేణు గారు అంటే సామంత సినిమాలు చూసి చాలా రోజులు అవుతోంది వేణు గారు మరో నెల వరకు సినిమా లేదంత
బహుసా ఆ ఎఫెక్టేమో అని స్ట్రాంగ్ గా అనిపిస్తోంది :)
కేచర్ నచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ :))

హరే కృష్ణ said...

వెన్నెల గారు థాంక్యూ :)
మీ కామెంట్లే ఈ బ్లాగుకి కాల్గేట్ టూత్ పేస్ట్ లాంటివి లేట్ గా కామెంట్లు పెట్టినా చాలా ఫ్రెష్నెస్స్ అందిస్తుంది :P

హరే కృష్ణ said...

సుభ గారు బ్లాగుకి స్వాగతం :)
కార్నర్ సీట్ అయ్యేసరికి నా చెయ్యి సరిగ్గా అందలేదని అనుకుంటున్నాను
అదే సమయం లో ఒక ట్రైన్ ముందు వైపుకి కాస్త దూరం లో వెళ్తోంది
బాలయ్య ముందు సామాన్య బ్లాగర్లం మనమెంత
మీ స్పందనకు చాలా థాంక్స్ :)
కామెంటుతూనే ఉండండి!

చాతకం said...

How come 20 folks fit in 2 seats? One of them is sleeping on your shoulder too?No wonder you don't feel well. LOL. BTW you should have opted for north Indian thali in the first place, they usually come with puri. ;).

Raj said...

కారం లో కుంకుడుకాయలా ఏంటి స్వామి??

బాబోయ్... కేవ్వ్వ్వ్ కేకంతే.. as usual..

అందరూ post చిన్నది అయ్యింది అనుకుంటున్నారు కానీ.. ఇది T20 world cup time అని గ్రహించలేదు అనుకుంటా... :P

పాపం నాగార్జునగారికి satire అర్ధం కాలేదు అనుకుంటా.. :D

ఇందు said...

Andy babuuuuu karam lo kunkudukaya kalupukuni eppudu taagaavammaa???? :P

@madhu..... adi bulugu koodaa kadu.... tellanchu bulugu chokka vesukunna busssuuuuu :D

హరే కృష్ణ said...

చాతకం గారు ఆలస్యానికి క్షమించాలి
ఒక వరుసలో అయిదు సీట్లు చెప్పున ముందు రెండు వెనుక రెండు మొత్తం నాలుగు వరుసలలో ఇరవై మందికి వినిపించాను :))
కాస్త తిందామని టిఫిన్ తెచ్చుకున్నా ఆకలి ఇంత ఉందని తెలియలేదు
హ హ్హ మీరు చెప్పినట్టే నార్త్ ఇండియన్ తాలీ ట్రై చెయ్యాల్సింది
Thankyou :)

హరే కృష్ణ said...

రాజేంద్ర :)))
హ హ్హ కేవ్వ్వ్ T20 టైం కరెక్ట్ గా గుర్తు చేసావ్ :))
థాంక్యూ :)

హరే కృష్ణ said...

ఇందు :D
అదే అదే మా ఇంట్లో కుంకుడుకయలో ఘాటు లేదాని కారం పోసేస్తున్నారని డౌట్ గా ఉంది :))

thankyou :)