మొన్న పేపర్ చదువుతూ ఇక్కడ ఆగాను...
ఛీ..నా బతుకు!
నేను పదో తరగతి లో క్లాస్ ఫస్ట్ వచ్చినా నా ఫోటో పేపర్ లో వెయ్యలేదు..
ఈ అమ్మాయికి ఏడేళ్ళు కూడా లేవు పేపర్లో హెడ్ తో పాటు హెడ్ లైను..
సరే మనకెందుకులే అని youtube ఓపెన్ చేస్తే అసలు వీడియో ఓపెన్ అవ్వకుండా ఈ ad ప్లే అవుతోంది..
వెంటనే నేను ఒక్కసారి నా పదో తరగతి రోజుల్లోకి వెళ్ళాను..
పరీక్షలు రాసేసి సెలవుల్లో
నేను,Wasim ,Teja మరియు Hemanth (WTH ) నాతో కలసి నలుగురం అందరం మా ఊరికి అయిదు కిలోమీటర్ల దూరం లో కొండ మీద జాతర అవుతుంటే ఎలాగోలా ఉన్న డబ్బులు పోగేసుకొని వెళ్ళాం.
కాసేపటకి ఎండ తీవ్రత పెరిగిపోవడం తో చేసేది లేక థామస్ కుక్ ఉప్పేసిన నిమ్మ సోడా తాగుదాం అని డిసైడ్ అయ్యాము ..
మా తేజ మాత్రం థమ్స్ అప్ తప్ప వేరేది తాగేది లేదు అని మంకు పట్టు పట్టాడు..
రెండొందల మిల్లీ లీటర్లను నలుగురం పంచుకొని కొండ దిగుతుండగా
హేమంత్:థమ్స్ అప్ తాగాక కిందకు వెళ్ళడం అవమానం మరియు అమానుషం, మనం వెళ్ళాల్సింది towards అప్ నాట్ డౌన్ అని డైలాగ్ వేసాడు.
సరే ఇంకొంచెం పైకి వెళ్దాం అని ఒక అరగంట పైకి నడిచాం..నడిచాక తెలిసింది దాహం పెరిగింది మళ్ళీ థమ్స్ అప్ కి వేళయింది..
అని జేబులు ఖాళీ చేసేసి ఈ సారి అర లీటరు థమ్స్ అప్ స్వాహా చేస్తుండగా కాసేపటకి..
సర్వం తెలిసినట్టు ఒక వృద్ధుడు మా దగ్గర కూర్చున్నాడు.. బాబూ దాహం అని అడిగేసరికి మిగిలిన థమ్స్ అప్ అతనికి ఇచ్చేసాం
తను మమ్మల్ని ఆశీర్వదించి వెల్లిపోతుండగా మేము అడిగాము
మా దగ్గర డబ్బులు లేవు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా ఊరు వెళ్లిపోవాలి అని
వెంటనే ఒక అరణ్య మార్గం చూపించి
మీ ఊరికి షార్ట్ కట్ ఇదే.. అని వాడు ఫినిష్ చేసే లోపు
నేను మా వాళ్ళకు మార్గదర్శి శ్రీ రామ్ చిట్స్ అవుతూ ఆ రూట్ వైపు అడుగులు వేసాను...
నడిచాం,పరుగులు పెట్టాం చివరకి అరణ్యం నుండి హైవే పైకి వచ్చేసాం
అయిదు కిలో మీటర్లను బస్ వేరే ఏ వాహనం వాడకుండా మా ఊరు చేరిపోయాం అని ..
నేను విజయ గర్వం తో మా WTH టీమ్ తో చూసారా తీస్ మినిట్ కా రాస్తా తీన్ మినిట్ కా బనాదియా అని మహేష్ బాబు లా చెప్పాను.
కొంత దూరం నడిచేసరికి
హైవే పైన - బోర్డ్ లో పెద్ద అక్షరాలతో మా ఊరు దాని క్రింద చిన్న ఫాంట్ లో 12 కిమీ..
ఈ లోపు మా రూమ్ మేట్
aqua guard లో నిండిపోయిన నా బాటిల్ వైపు వేలు చూపిస్తూ
ఔర్ కల్ ?
నేను:కల్ సే పానీ,జ్యూస్ ఔర్ కోక్ కే బినా కోయీ డ్రింక్ నహీ పీయేంగే
19 comments:
మహేశ్ బాబు ఫోటో పెట్టావ్ సూపరో సూపర్...:)
హమ్ కో హిందీ సే మాలుం సమజ్ నహీ ఆతా హూ...
తుమ్ పంచ్ డైలాగ్స్ హిందీ మే లిఖో... ముజ్ కో అర్థ్ నహీ ఆతా హై :))
సో,
వాసిం, తేజ, హేమంత్, యాండీ... WTHA :)))))))
మీ WTH ఊసు బావుంది. చిత్రం కదా! ఆ రోజు న్యూజెర్సీ లో మా బంధువుల ఇంట్లో ఉన్నాను. తను కూడా అంతగా అంధ్రా రాజకీయాలు ఏమీ ఫాలో కాదు, కానీ ఎందుకో ఓవర్ రియాక్ట్ అయింది (నాకసలు తెలియవు అనుకోండి). ఒక పక్కన దోశలు వేస్తూనే, ఐఫోన్లో వార్తల అప్డేట్స్ చూస్తూ ఒకటే ఆదుర్దా, అదే పనిగా పదే పదే తండ్రి లేడని, పార్టీ వదిలాడనేగా ఈ వేధింపు అని గోల. నాకే జాలేసి (ఈ పిల్ల స్థితికి మాత్రమే సుమా) "కాసేపు కూర్చో పోనీ, నేనిక్కడ పని చూస్తాను ," అంటే "వద్దు ఇలా పనిలో పడితే కాస్త బాధ మరిచిపోతాను." అంది. ;) ఇప్పటికీ పొట్ట చెక్కవలుతోంది ఆ సంఘటన తలపుకొస్తే. నేనూ మీలాగే "ఈవేళ ఏదోటి అదరగొడదాం" తరహా కబుర్లలోకి లాగి పులిహోర కలుపుకుని తిని చక్కా వచ్చాను. మాకు పెరుగన్నం-మాగాయ, పులిహోర - గారెలు ఇచ్చే ధైర్యం శక్తికి మారేదీ సాటి రాదు ఇప్పటికీను. మీ సాహసం వంటివే మాకు ద్వారకా/చిన్న తిరుమల కి నడిచి నప్పుడు, ఫతేఫూర్ సిక్రీకి వెళ్ళినపుడు కలిగాయి. అవి మరెప్పుడైనా... ;) విసుగ్గా ఉన్న మనసుకి కాస్త ఊరట మీ బ్లాగే సుమీ!
నువ్వు మార్గ దర్శి చిత ఫండ్స్...హ...హ...
నైస్ పోస్ట్..))
:))
<< ఈ అమ్మాయికి ఏడేళ్ళు కూడా లేవు పేపర్లో హెడ్ తో పాటు హెడ్ లైను..
LOL :)))))))
<< బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
once more.. ROFL... :))))))
బాబు...హరే క్రిష్ణా... ఏమి పోస్ట్ అయ్యా...
భలే బాగుంది.....Actually hindi title చూసి...ignore చేసా..
ఈ రోజు తెలుగు టపాలన్ని చదివేసాను కదా..పొన్లే హిందీ కూడా మన భాషే కదా, అని చదవటం మొదలుపెట్టా.. చదువుతూ తెగ నవ్వుకున్నా ... You have a great sense of humor అని comment పెడదామని comment box కోసం చూసా.. అమ్మో....చాంతాడంత మీ warning చూసా... Comment పెట్టాలా వద్దా అని అలోచించా.. చివరకు ఎమైతే అయ్యింది అని...ధైర్యం చేసి సగం తెలుగు సగం english లో comment పెట్టేసా....
Jokes apart......చాలా బాగుంది... Please write more frequently.
ఫణీంద్ర గారు :))
ఈ బ్లాగు పోస్ట్ బోణీ చేసినందుకు థాంక్యూ :)
హ హ్హ హర్ష :)))
ఈవేళ ఏదోటి ఆదరగొడదాం ప్రకటన ఒరిజినల్ వెర్షన్ ఇది :)
ముప్పై నిముషాల్లో చేరాల్సిన ప్రదేశానికి మూడు నిమిషాల్లో చేరాం అని మహేష్ చెబుతాడు
మనం ఇక్కడ ఏడు కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళాం అని భావము :)
WTHA అదిరింది :)
థాంక్యూ :)
ఉష గారు :)
మీ అమూల్యమైన ప్రయాణ జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు :)
మాకు పెరుగన్నం-మాగాయ, పులిహోర - గారెలు ఇవి పంచుకోనందుకు మంగిడీలు, పకోడీలు :) JK
ఆరోజంతా నేను LOLing మా కార్యాలయం లో
కెవ్వ్.. ఫతే పూర్ సిక్రీ అక్కడ తిరగడం కాస్త సమస్యే ఈ మధ్య మా టీవీ లో ప్రతి వారం pardes సినిమా వేస్తున్నాడు బాగా అలవాటైపోయింది నాకా ప్రదేశం :)
విశేషాలను బ్లాగ్ లో పంచుకోవలసిందిగా మనవి..
>>విసుగ్గా ఉన్న మనసుకి కాస్త ఊరట మీ బ్లాగే సుమీ!
థాంక్స్ అగైన్ :))
శశి గారు థాంక్స్ :)))
తృష్ణ గారు :))
Thankyou :)
మధుర :))
కెవ్వ్..ఏ పోస్ట్ రాసినా కామెంట్ బాక్స్ చదివి పోస్ట్ లో కంటెంట్ మర్చిపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నా :P
థాంక్స్ :))
జలతారు వెన్నెల గారు :))
థాంక్యూ వెరీ మచ్!
Everyday I'm at my desk
At my desk I'm like the rest with no rest
పని వత్తిడి పెరగడం వల్ల తరచుగా రాయలేకపోతున్నాను
ఫాలో బటన్ కొట్టండి వీకెండ్ లో రాయడానికి ప్రయత్నిస్తాను :)
thanks for the compliments
`
కికికికికికికి ;)
రాజ్ :)))))
థాంక్యూ!
LOL. So you guys walked back home for 12km? ;) This ad reminds me of French movie B13. Don't think mahesh or for that matter any telugu hero got enough stamina to do that film.
చాతకం గారు ఇప్పుడు కూడా నవ్వు వస్తూ ఉంటుంది
ఎవరో మహానుభావుడు లారీ లో లిఫ్ట్ ఇచ్చాడు
ఇంటికి చేరిపోయాము :)
Thankyou :)
Yes B13 is my favorite movie too :)
the stunts are awesome
చాలా ఏళ్ల క్రితం ఆ సినిమా చూసి నోరు వేల్లబెట్టాను :)
ఇప్పుడు మీరు మళ్ళీ గుర్తు చేసారు
డౌన్ లోడ్ చేసుకోవాలి :P
థాంక్యూ :))
My toofani is that, when I first visited US, we went to see Washington DC. We missed our exit off highway. One hero suggested that as the 495 highway is a circle around the city, like ring road, we can continue on same road and make a circle to reach same spot again. It took us forever on road & our car ran out of gas too. Found that its 103kms the hard way.
Oh God!
that was terrible
Post a Comment