Pages

Tuesday, April 24, 2012

నేను దేవుడిని చూశాను......


ఏప్రిల్ 2, 2012 ---- సరిగ్గా ఇండియా ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం తర్వాత…..
రిలయన్స్ ఉద్యోగుల మీద రిలై అయ్యి నెల ముందు టికెట్స్ బుక్ చేసుకుంటే మరో వారం రోజుల్లో టికెట్స్ వచ్చేసిన వెంటనే….
సచిన్ కి చేతి గాయం.. నెల రోజుల విశ్రాంతి అని ప్రాస హెడ్ లైన్ వాడిన ఈనాడు పేపర్ చూసి నా మైండ్ బ్లాక్ అయింది!

ఏమైతేనేం అలా పది రోజులు గడిచిపోయాయి.. సచిన్ జాడ మాత్రం తెలియలేదు!!


ఏప్రిల్ 22, 2012 -----

మధ్యాహ్నం మూడింటికల్లా స్టేడియం కి చేరుకున్నా..
మరో అరగంట సేపు అన్ని స్టాండ్స్ లో ఒక రౌండ్ వేసి, ఎండ దెబ్బకి చేతులెత్తేసి, స్టేడియంలో మూడు ఫ్లోర్లు పైన ఉన్న మా స్టాండ్ కి చేరుకొని అలా నీడలో కూర్చునే సరికి…
అష్టా చెమ్మా.. అచ్చా బొమ్మా.. ఆటకి వేళయింది, అని ఇద్దరు కేప్టన్స్ పిచ్ మధ్యకు చేరుకొని సిల్వర్ కపోతాన్ని ఎగరు వేసారు.

దేభ్యపు గొంతుతో రవి శాస్త్రి!!!
Mumbai Indians Won the toss and elected to bat first,
అని చెప్పేసరికిఅబ్బ రామేశ్వరం వెళ్ళినా రవి శాస్త్రి వదలడా’ అని నిట్టూరుస్తూ తల మీద ఉన్న టోపీ తీసి బుర్ర గోక్కుంటూ ఉండగా… ఆ క్షణం లో వెంటనే, “So Harbhajan, any changes today?” అని అడగగానే
“సచిన్ ఈజ్ ఇన్” అన్న వెనువెంటనే ఏం జరిగిందో తెలియదు!!

స్టేడియం అంతా సంవత్సరాలుగా చెవుల్లో పేరుకుపోయిన దుమ్ముని లేపారు!!!
నేనూ మార్గదర్శి లో చేరాను… క్లారిటీ తో ఒక పెద్ద ప్లాస్టిక్ క్లారినెట్ కొనుకున్నాను.. అని బయటకు తీసి నా వంతు గా జనాల మీదకు ఒక రమణ గోగుల మరియు చక్రిని మిళితము చేసి, మైండ్ ను మైమరిపితం చేసేసి, ఇంక బుగ్గలు అలసిపోయేలా ఊదుతూనే ఉన్నా!!
అంతలోనే ఒకడు ఊగుతూ ఉన్నాడు… వాడి చెవిలో పెట్టి నేను ఊదాను… చాల సీరియస్ గా నా వైపు తిరిగాడు!

ఆ వెంటనే
“సచిన్.. న్.. న్.. న్.. న్.. న్.. న్.. న్…………..ఆలారే ఆలా ఆలారే ఆలా” అనేసరికి...
వాడు వెంటనే
జల్వా దిఖాదేంగే హమ్
దునియా హిలాదేంగే హమ్!”
అని కోరస్ అందుకున్నాడు!!
యో యో..
‘బతుకు జీవుడా!’ అనుకుంటూ క్లారినెట్ పట్టుకొని నేను జంప్ అయిపోయాను!!
  
 

గోల పదిహేను నిముషాలు కంటిన్యూ అయ్యాక…..

మరో పది నిముషాల్లో మ్యాచ్ మొదలవుతుంది!
బయట సెక్యూరిటీ గార్డ్స్ దయ వల్ల సైబర్ షాట్ కి ఎంట్రీ లేకపోవడం తో నా దగ్గర ఉన్న గ్రీన్ హార్ట్ తీసి పిక్స్ తీస్తూ బిజీ గా ఉండగా….

డ్రెస్సింగ్ రూమ్ లో నుండి ఆరున్నర  ప్లస్ అయిదున్నర అడుగులు వడివడిగా వేసుకుంటూ ఇద్దరు మెట్లు దిగుతుండగా మేమంతా చైర్స్ నుండి లేచాము!

ఒక వ్యక్తి జేమ్స్ ఫ్రాంక్లిన్.. ముందు వచ్చేస్తున్నాడు!
వెనుక ఇంకో శక్తి, రెండు చేతులతో తన బ్యాట్ ని పట్టుకొని  తన కాళ్ళను ముందుకు వెనుకకు గాల్లో లేపి బౌండరీ లైన్ నుండి గ్రౌండ్ లోనికి కుడి కాలితో అడుగుపెట్టితన శిరస్సును ఆకాశం వైపు చూస్తూ నాలుగు అడుగులు వేసి పరిగెడుతూ పిచ్ వరకు చేరుకున్నాడు...

ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన క్షణం నుండి ప్రేక్షకులు ప్రపంచాన్ని మర్చిపోయి అవధులు లేని కేరింతలు కొడుతూ అదొక తన్మయత్వంతో, ఈలలతో ఆనంద హేళలు చేస్తూ, అరుస్తూనే ఉన్నారు!
మొదటి బంతిని ఎదుర్కున్న ఫ్రాంక్లిన్ అయిదు బంతులు పరుగులేమీ చేయకుండా డిఫెన్స్ ఆడాక, ఆరోబంతికి స్టేడియం అంతాసాఆఆచిన్… సాఆఆచిన్.. సాఆఆచిన్..”  అని అరుపులు అందుకున్నారు!
తెలుగు ప్రజలు జఫ్ఫా ఫ్రాంక్లిన్ అని అరవడం మొదలెట్టేసారు కూడా! నేను మాత్రం కాదు:P 
మేడిన్ ఓవర్ అయిపోయింది!!

1995
నుండి సచిన్ మరియు క్రికెట్ అంటే అభిమానం ఏర్పరచుకున్న నాకు సచిన్ లైవ్ గా తను ఆడబోయే బంతి ని చూసే అద్భుత అవకాశం రానే వచ్చింది!

కొట్టింది సింగిల్ అయినా దానిని ఆడే వైవిధ్యమైన తీరు, elegance ప్రతి షాట్ లోనూ తను చూపించే perfection
ఒకటేమిటి మాటలకు అందని ఆటని చూపించి మైమరపించిన మాస్టర్!!!


ఎనిమిది ఓవర్లు ఆడి వెళ్ళిపోయాక, స్టేడియం అంతా భయంకరమైన నిశ్శబ్దంలో ఉండిపోయింది!!

తర్వాత ఏమైందో తెలియదు……

ఆరెంజ్ లోనేను సింహాన్ని చూశాను!’ అని జెనీలియా అన్నట్టు….నేను సచిన్ ని చూశాను! నేను సచిన్ ని చూశాను!!!” అని అదే ఎక్స్ప్రెషన్ తో గోల గోల చేసుకుంటూ

గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళి బాగా తిని మరో నాలుగు ఓవర్లు తర్వాత మా ప్లేస్ లకు వచ్చేసాం..

మిగతా బ్యాట్స్‌మన్‌లు ఫోర్లు కొడుతున్నారు… సిక్సులు కొడుతున్నారు… రన్ రేట్ పెంచుతున్నారు!!!
class.. perfection.. timing..
ఎన్ని ట్రై చేసినా సచిన్ ఆట చూశాక, యాంత్రిక క్రీడ అన్నట్టు అనిపించి
గాడ్ ఫాదర్ చూశాక సర్కార్ ని థియేటర్లో చూసిన ఫీలింగ్ ఆవహించి,  

నామ్ కే వాస్తే అన్నట్టు ఫోటో సెషన్ కోసం మిగతా మ్యాచ్ చూసి ఇంటికి వచ్చి….. నిద్రపోదామంటే…కెవ్వ్… సచిన్ బాటింగ్ బాల్ కి ఎలా ఆడాడో!’ అన్నీ గుర్తొచ్చి.. సచిన్ ఉన్నంత వరకు మాచ్ ని మళ్ళీ రెండు సార్లు చూశాక, అప్పుడు నిద్రకు ఉపక్రమించాను!ఈ ప్రకృతిలో మనం ఆస్వాదించే ఆనందాలలో ఇంచుమించు అన్నీ తాత్కాలికమే.. వానజల్లు.. ఇంద్రధనుస్సు.. గులాబీ అందం.. మల్లెపూవు సౌరభం.. ఇలాంటివన్నీ కొద్ది ఘడియల సంతోషాలే!
కానీ…... ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక మనిషి మైదానంలో అడుగుపెడుతుంటే ఆనందంతో చప్పట్లు కొడుతున్నాం!! అతను ఆడుతున్నంతసేపు బరువైన ఉచ్చ్వాస నిశ్వాసాలతోలతో ఆటను ఆస్వాదిస్తున్నాం... అద్భుతమైన ఆటతోను, మచ్చలేని వ్యక్తిత్వంతోను, అశేష క్రీడాభిమానుల్ని రెండు దశాబ్ధాలనుండి ఉర్రూతలూగిస్తున్న ఉత్తుంగ హిమశిఖరం.. సచిన్ రమేష్ టెండూల్కర్!!!!!!!
ఏప్రిల్ 24: క్రికెట్ దేవుడు పుట్టిన రోజు!!

14 comments:

Vineela said...

అబ్బ.. ..how lucky you are !! మీకు నిద్ర పట్టి వుండదు నిన్న...btw comment box notes kathi keka :)

మధురవాణి said...

Suuuuper post! You are blessed to watch him playing. Thanks for sharing your precious memory.

Happy Birthday to our god.. SACHIN! :)

Last pic is super cute. :)

రాజ్ కుమార్ said...

happy b'day sachin.. :)))

మనసు పలికే said...

సచిన్ మీద నీకున్న ప్రేమంతా కళ్లకు కట్టినట్టు చూపించావు హరే :) టపా చాలా బాగుంది.
సచిన్‌కి జన్మదిన శుభాకంక్షలు.. అందజేస్తావు కదూ ;)

ఫోటాన్ said...

సూపర్ యాండీ ..!!
లక్కీ ఫెలో వి.
యాండీ ని, సచిన్ ని ఇంత వరకు ఫొటోస్ లో చూడటమే.
ఆ మ్యాచ్ కి వెళ్తున్నట్టు చెప్పింటే నేను లైవ్ మ్యాచ్ చూసే వాడిని కదా, సచిన్, యాండీ ఇద్దరినీ ఒకే చోట చూసే వాడిని :))

సచిన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !!

హరే కృష్ణ said...

వినీల గారు exactly :))
కళ్ళు తెరిస్తే కవర్ డ్రైవ్,లెగ్ గ్లాన్స్ లు
కళ్ళు మూస్తే paddle స్వీప్,అప్పర్ కట్ లు

పోస్ట్ మరియు కామెంట్ బాక్స్ నచ్చినందుకు బోలెడు థాంక్స్ :)

హరే కృష్ణ said...

Well Said Madhura,
We are Lucky and privileged to have lived in an era when of witnessing sachin's game :)

It's a surprise and dream come true moment for me :)

and
Happy Birthday to God of Cricket :)

హరే కృష్ణ said...

రాజ్,అప్పు
మనందరి తరపున సచిన్ కి జన్మదిన శుభాకాంక్షలు :))

జయహో సచిన్ :)))

హరే కృష్ణ said...

హర్షా, థాంక్స్ :)
సచిన్ ఆడటం లేదు ఎలానో కనీసం గిల్ క్రిస్ట్ అయినా వస్తాడేమో అనే ఫీలింగ్ తో వెళ్ళాను..
సచిన్ ఆడడం పెద్ద సర్ప్రైజ్
కెవ్వ్ కేక ఇంకా గొంతు నొప్పి తగ్గలేదు అరిచిన ఆ అరుపులకి!

సచిన్ కి జన్మదిన శుభాకాంక్షలు :)

జలతారువెన్నెల said...

దేవుడిని చూసాను అంటే ...సచిన్ cricket ఆడటం చూసారా? OK!

శివరంజని said...

HAPPY HAPPY BIRTHDAY our DEAREST GOD SACHIN :))


నాకు జెలసీగా ఉంది మీ మీద ...అంతే కాదు మీ ప్రొఫైల్ లో పిల్లాడు నేను సచిన్ ని చూసానోచ్ నువ్వు చూడలేదు వ్వెవ్వెవ్వెవ్వె అని వెక్కిరిస్తున్నట్టు ఉంది

క్లారినెట్ తో పక్క అతని చెవిలో ఊదారా ..హన్నా!!!!!!

పోస్ట్ మాత్రం సూఊఊఊఊఊఊఊఊఊఊఒపర్

హరే కృష్ణ said...

జలతారు వెన్నెల గారు అవును.. సచిన్ ని చాలా దగ్గర నుండి తను ఆడుతుండగా ఎనిమిది ఓవర్లు స్టేడియం లో చూసాను :))
థాంక్స్ :)

హరే కృష్ణ said...

రంజని గారు :))))
హహః
ఆ ముక్కు పచ్చ షర్ట్ వేసుకున్న పిల్లాడు వెక్కిరిస్తాడా చెప్పండి :)
సరదాగా ఆటపట్టిస్తాడు కానీ :P
తన సంతోషం చూసి నాకు కాస్త జెలసీ గా అనిపించి రెండో ఆలోచనలేకుండా ఊదేసా :)
అక్కడ కూడా సచినే ఆదుకున్నాడు :))
థాంక్యూ వెరీ మచ్ :)

శశి కళ said...

అష్టా చెమ్మా.. అచ్చా బొమ్మా.. ఆటకి వేళయింది, అని ఇద్దరు కేప్టన్స్ పిచ్ మధ్యకు చేరుకొని సిల్వర్ కపోతాన్ని ఎగరు వేసారు......ఏమి వ్రాస్తావు...హ..హ...
నిజమే ఇరవయ్ ఏళ్లుగా చూస్తూ ఉన్నా ఇంకా చూడాలి ...అనిపిస్తుంది...we love sachin...he for india ...we for him