Pages

Thursday, January 26, 2012

బూచి బల్ల...

డేట్:డిసెంబర్ 31
టైం:రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిముషాలు
ప్లేస్:బందరు స్మశాన వాటిక


సెమిస్టర్ సెలవులు కావడం తో ఇంజనీరింగ్ కాలేజీ లో బ్యాక్ లాగ్ లు రాసుకొంటూ
పబ్ కి వెళ్ళడానికి తమ స్నేహితురాళ్ళని వెతుక్కొంటూ గులకరాళ్ళను విసురుకొంటూ లేడీస్ హాస్టల్ వెళ్ళాక అక్కడ ఎవరూ లేకపోవడం తో...


తన సోల్ మేట్ కోసం ఆత్మలను అన్వేషిస్తూ 
హాస్టల్ పక్కనే ఉన్న స్మశానం లో మాస్ టైటిల్ సాంగ్ ప్లే చేస్తూ మన్నూ మసానాన్ని లేపుతున్నాడు రాద్రా.

కాసేపటికి బోంబే dying బెడ్ షీట్ కప్పుకొని 

బొండాలు తింటూ చెండాలంగా స్మశానం లోనికి అదే సమయం లో అడుగిడినాడు కాద్రా.            
                        
పిచ్చి కుక్కలా అరుస్తున్న కాద్రా అరుపులని చూసి పెద్ద పిడుగు పడింది రాద్రా గుండెలో..



                                                               
నిస్సహాయుడై The Naked Truth సినిమా చూస్తున్నరాద్రా కి ఏం చెయ్యాలో తెలియక

వెంటనే జై పోసాని జై ఓంకార్ జై శివ శంకర్ మాస్టర్ అని దండం పెట్టుకొని చాలెంజ్ చాలెంజ్ అని అరుపులు మొదలెట్టాడు  కాద్రా..
 

వెనుక ఫ్లిర్ట్ పిశాచినులు మరో వైపు నుండి గోకేయడం తో వీపు విమానం మోత అయిపోతోంది కాద్రా కి
లైట్ గా చెమటలు టమోటా ఫ్లేవర్ లో పడుతున్నాయి.

పక్కనే ఉన్న కాటికాపరి ఖద్దరు శాలువా ని తీసి కప్పుకున్నాడు కాద్రా.

                                                  

రాద్రా: అబే! చెమటలు పడుతుంటే నువ్వు ఫేన్ వేసుకోవాలి కాని ఇంకా కప్పుకుంటున్నావేంటిరా కబోది కాద్రా..
 

అని రాద్రా గట్టిగా అరిచాక కాద్రా పైన ఉన్న Neon లైట్ వెలిగి.. కపాలం పగిలి ఒక అందమైన దెయ్యపు కన్య గా మారిపోయాడు కాద్రా. 

దెయ్యపు కన్య(దె.క) : నా ఆత్మను బంధించి వీడు పైశాచిక పిశాచ ఆనందాన్ని పొందేవాడు,నీ రాక తో నాకు మోక్షం కలిగింది..నీకేం ఏం కావాలో కోరుకో.  
రాద్రా:నాతో పబ్ కి రావాలి...ఆడాలి పాడాలి..


                           


వెంటనే ఆ  వాతావరణం అంతా పబ్ లా మారిపోయింది
దెయ్యాల DJ మొదలయ్యాక..బాక్ గ్రౌండ్ లో ప్రారంభ గీతం నిను వీడనులే నను నేనే అని మొదలయ్యింది
అంతా చప్పట్లు కొట్టారు.
వెంటనే రాద్రా తన సోల్ మేట్ కోసం ఒక సాంగ్ ప్లే చేసాడు

బ్లాగాలీ ఇన్ తెలుగు లాలీ
బ్లాగాలీ బ్లాగి బొంగు బొషానమవ్వాలి
చేతబడికి కావాలొక డాలీ
చూసినోడి కపాలం పగలాలీ నా బొమ్మాలీ..
అన్నాక మన ఆడ దెయ్యం తన్మయత్వం తో రాద్రా ని ఆలింగనం చేసుకుంటుంది అనగా

అబవ్ bow అని శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి
దెయ్యపు కన్య, రాద్రా అటువైపు తిరిగారు

రెండు శునకాలు స్మశానపు సిమెంట్ బల్ల మీద
గాఢంగా ప్రేమించుకుంటున్నాయి..
అదే
టైం లో ఆ శునకాల మీద ఈ టైటిల్ పడడం తో సినిమా అయిపోయింది.

                          
   

5 comments:

శశి కళ said...

కాసేపటికి బోంబే dying బెడ్ షీట్ కప్పుకొని
బొండాలు తింటూ చెండాలంగా స్మశానం లోనికి అదే సమయం లో అడుగిడినాడు కాద్రా....ha...ha...yendi baabu...ee varnana...bongu,boshanam laaga..

ఫోటాన్ said...

అయ్యో బాబోయ్ యాండీ... పిచ్చ ఫార్మ్ లో వున్నావ్ గా... అదిరింది...

>>చెమటలు టమోటా ఫ్లేవర్ లో పడుతున్నాయి.<< హ హ హ హ హ కేవ్వ్వ్.... :)))

రాజ్ కుమార్ said...

బ్లాగాలీ ఇన్ తెలుగు లాలీ బ్లాగాలీ బ్లాగి బొంగు బొషానమవ్వాలి
చేతబడికి కావాలొక డాలీ
చూసినోడి కపాలం పగలాలీ నా బొమ్మాలీ..

ట్యూన్ ఏటీ? యా ఆలీ సాంగ్ ??
ఎంత అమ్మాయిల కొరతయితే మాత్రం దెయ్యాల మీద పడతావా? ;)

రాజ్ కుమార్ said...

బూచి బల్ల = సమాధి?

Anonymous said...

finally... ;) :P