Pages

Monday, January 9, 2012

18th floor..



Sadda Haq పోస్ట్ చదవని బ్లాగర్లకు నా వందనాలు
చదివి కామెంట్ పెట్టని వారికి నా బ్లాగాభివందన నాభి డాన్సులు..


లోభీ లోభీ ఎక్కడ కెళ్తున్నావ్ అంటే
ఫ్రీ షో కోసం లోధీ గార్డెన్ కి వెళ్తున్నా నడుచుకుంటూ అని అన్నాడంట ఒక సురేష్ గోభీ


రెండు మొక్క జొన్న
పొత్తులున్నయ్ తిందువా  
నా బ్లాగ్ వదిలేసి అడ్డమయిన బ్లాగులున్నీ చూస్తవా లాంటి పాటలు పాడకుండా,

బ్లాగులు లేకుండా అవి నేను నబ్లాగి నై నయనానందకరంగా పండగ చేసుకుంటున్న రోజులు.

డిసెంబర్ వచ్చేసింది బయట చలి చిత్ర శైలజ మనో వధ చేసి చావగొడుతోంది.
ఒకరోజు మా హాస్టల్ ఆదివారం నాడు ఫుడ్ అంతగా బాగుండదని తెలిసి మా తెల్సినవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్దామని అంత చలిలో కూడా పెందలాడే స్నానం చేసి తల దువ్వకుండా వెళ్ళాను.
రెండు గంటల్లో బస్సులు ఆటోలు ఎక్కి ఎలా
గోలా వాళ్ళింటికి చేరుకున్నాను..


ఇల్లు చాలా బావుంది.
ముప్పై ఫ్లోర్ల భవంతి మా వాళ్ళు ఉండేది పద్దినిమిదో అంతస్తు లో 
హాయిగా తినేసి మధ్యాహ్నం నాకు నిద్రపట్టేవరకు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ చాలా సేపు జాలీ గా గడిపేసి
నేనింక మధ్యాహ్నం బాగా నిద్రపోయి రాత్రి ఎనిమిదింటికి లేచి డైరెక్ట్ గా డిన్నర్ చేసేసి మళ్ళీ హాల్ లో మా సోది మొదలెట్టేసాం.




రాత్రి పదకొండు కావస్తోంది మిగతావాళ్ళు నిద్రపోతున్నారు మొత్తం మర్చిపోయి ఎవరి రూముల్లో వాళ్ళు
నాకు ఇంకా నిద్ర రావడం లేదు కంప్యూటర్ తీసుకొని గేమ్ లు ఆడుకున్నాక
ఒక హారర్  సినిమా చూసి తిన్నది కాస్త అరిగినట్టు అనిపించాక పొద్దున్న అయిదింటికి నిద్రపోయాను..దుప్పట్లు,రజాయ్ లు కప్పుకొని


ప్రొద్దున్న మెలుకవ వచ్చేసరికి ఏమీ కనిపించడం లేదు.
సినిమా
లు చూస్తే కళ్ళు పోతాయ్ అని అని చిన్నప్పుడు ఎవడో చెప్పాడు అది నిజమేనా అని జీవితం లో మొదటి సారి అనిపించింది
కాసేపటకి దీర్ఘం గా తలకట్టు ఎత్తి చూస్తే మొత్తం పొగ మంచు తో పగలే సెగలు... 
టైం కోసం కంప్యూటర్ ఆన్ చేస్తే మధ్యాహ్నం రెండయిపోయింది.
మా relatives ఇంట్లో అందరూ మొత్తం జాబ్ చేసేవాళ్ళు
కావడంతో..
వాళ్ళు వెళ్లేముందు పొద్దున్న నాకు ఏదో చెప్పారని గుర్తు...కానీ నాకింకా నిద్ర మత్తు వదలలేదు...వాళ్ళంతా ఆఫీస్ లకి జంప్అయిపోవడం తో..

నిద్ర లేచాక బ్రష్ చేసుకొని మొహం కడుక్కుందాం అని టాయ్ లెట్ కి వెళ్దామంటే దొంగ మొహాలు అతిధి ని అని కూడా చూడకుండా రూమ్లతో సహా లాకేసుకేల్లిపోయారు
తాళం చెవి కోసం వెతుకుతుంటే దొరకడం లేదు నా మొబైల్ ఇంకో రూమ్ లో పెట్టేసాను

ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ కూడా కనిపించలేనంత  బయట దట్టమైన పొగమంచు..

పద్దెనిమిదో అంతస్తు కనీసం కిందకు కూడా వెళ్దామంటే ఎవరైనా వచ్చి హాల్ లో ఉన్న టీవీ చాలా ఫర్నిచర్ దోచుకుపోతే ?
కనీసం ఫోన్ కూడా లేదు...ఇంకో వైపు హారర్ సినిమా టెన్షన్ ఎక్కువైపోయి ముందు రోజు రాత్రి విపరీతం గా నీళ్ళు తాగేయడం తో ధార ధ్రువతార లా తన్నుకొస్తోంది. 




తల్లా పెళ్ళామా సినిమా చూడలేదు కానీ ధారా లేక డోరా సినిమా కాసేపు లైవ్ ని అటూ ఇటూ చూసి 


హాల్ బాల్కనీ లో ఉన్న transparent Saintgobain గ్లాసులు తీసి బయట చెయ్యి పెట్టాను
హాశ్చర్యం...బోలెడు హాశ్చర్యం  నా చెయ్యి కనిపించడం లేదు..దెయ్యాల సినిమా చూసిన ఫీలింగ్ రెండు డిగ్రీలు ఉంటుంది అనుకుంటా సుమారుగా.. 


ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది లా
నాలో ఉన్న
ధారాలమైన ధారను బయటకు పంపించేసి ఒక కెవ్వ్ పెట్టి ..ఆ స్టేట్ మెంట్ ని, 
ఒక ఐడియా గ్రౌండ్ ఫ్లోర్ లో నడిచే మహానుభావులకు పావనం చేస్తుంది గా మార్చేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ
నేను హాల్ లో టీవీ చూస్తుంటే టీవీ పక్కనే కీస్ కనిపించాక నా మనసు తేలిక అయింది. 

ఆరోజు రాత్రి భోజనం చేసి అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోతూ
భారమైన తిండితో   
అతిధినై వచ్చాను భవనానికి
ధారలై పోసాను దండకారణ్యానికి   

అని అనుకుంటూ మా కాంపస్ కు పయనమయ్యాను.


18 comments:

Ennela said...

Yentasalu aatmaanandaa.. canada lo ayite yee paatiki jaillo pettedduru telusaa..!!!! hamma pilladiki bottigaa bhayam lekundaa poyindi!!

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> చదివి కామెంట్ పెట్టని వారికి నా బ్లాగాభివందన నాభి డాన్సులు..

ఇంకో మాటు మీకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఈ కామెంటు.

రాజ్ కుమార్ said...

పాపం ఎవడో బుక్కయ్యిపోయుంటాడుగా.. ;)
అవునూ.. హారర్ మూవీ చూస్తే తిన్నది అరుగుతుందా? ;)
ఈ నాభి డ్యాన్స్ లు ఎప్పుడు నేర్చుకున్నావ్?;౦

వేణూశ్రీకాంత్ said...

<>
lolz :-)))

ఏదో కామెంటెట్టకపోయినంత మాత్రాన నాభీ డాన్సులని ఇలా బెదిరించడం ఏమైనా బాగుందా :)

రాజ్ కుమార్ said...

దీర్ఘం గా తలకట్టు ఎత్తి చూస్తే >>>

ఇందాక మిస్సయ్యాను ఇది. ఈ ప్రయోగం బాగు బాగు ;)

రాజ్ కుమార్ said...

కసి ప్రేలాపనా, అరాచక అజెండా... హిహిహి
మళ్ళీ చదివాను లే ;)

..nagarjuna.. said...

రెండో పేరాకు ఢాం అని పడిపోవడం అటుంచి,

>>దీర్ఘం గా తలకట్టు ఎత్తి చూస్తే

ఏం బాబు తలేమైనా బొప్పికట్టిందా :P

శశి కళ said...

రెండు మొక్క జొన్న పొత్తులున్నయ్ తిందువా
నా బ్లాగ్ వదిలేసి అడ్డమయిన బ్లాగులున్నీ చూస్తవా లాంటి పాటలు పాడకుండా,
నాయనా...హ...హ....ఇంక నవ్వలెను

Naresh said...

..ధార ధృవతార లా.. :D
నీ పోలిక.. పొలికేక.. :D

చాతకం said...

Here is my comment. I hate it when guys do belly dance.
Wishing you a happy year!

హరే కృష్ణ said...

బ్లాగు రేస్పాండీ దారులకు విన్నపము
నా బ్లాగాభివందన నాభి డాన్సులు.. అనగా నా బ్లాగాభి వందనాలు మరియు మా ఫేవరేట్ ఆర్టిస్ట్ నాభి డాన్సులు ఇచుట చూసి తరించండి అని :P
http://www.youtube.com/user/shakiraVEVO?feature=watch

హరే కృష్ణ said...

ఎన్నెల గారు
ఢిల్లీ లో కాబట్టి వేరే దారి లేక ఇంకా అలా జరిగిపోయింది
హ హ్హ :)
కాకినాడ నే ఇప్పటి వరకు వేల్లలేదండీ కెనెడా ఎలా వెళ్ళగలం :(
స్పందన కి బోలెడు థాంక్స్!

గురూజీ :)))

రాజ్ :)) థాంక్యూ :)
>>పాపం ఎవడో బుక్కయ్యిపోయుంటాడుగా.. ;)
ఎందఱో మహానుభావులు,కొందరికే పావనములు

హరే కృష్ణ said...

వేణూ గారు :)))
థాంక్యూ :))

రాజ్ :))
మళ్ళీ మళ్ళీ థాంక్స్ :)

నాగార్జున :D
ఏం బాబు తలేమైనా బొప్పికట్టిందా :))
హారర్ సినిమా కదా తలనొప్పి వచేసి వాచిపోయింది :))
థాంక్స్!

హరే కృష్ణ said...

శశి గారూ థాంక్యూ :))

నరేష్ :D
చాలా థాంక్స్! :)

చాతకం గారు ఎలా ఉన్నారు
వివరణ గివెన్ అబోవ్ :))
థాంక్స్!

రాజ్ కుమార్ said...

ఎందఱో మహానుభావులు,కొందరికే పావనములు>>
kevvvvv....

నీ పోస్ట్ కి నా కపిత

"చిరుజల్లు కురిసింది పొగ మంచులో"
"తనువంత తడిసింది..మేనంత మెరిసింది "

మధురవాణి said...

హమ్మయ్యా.. ఇప్పుడే Sadda Haq పోస్టులో కామెంట్ పెట్టి వచ్చాను కాబట్టి ఈ సారికి బతికిపోయానన్నమాట! :P

Unknown said...

baagundi..... aa tv edo munde choosi unte migatha vallu bagu padevaaru kada

హరే కృష్ణ said...

రాజ్ :)

మధుర :)))
హహ :))

విక్కీ ఎస్సో :)))
థాంక్స్!