Pages

Wednesday, August 17, 2011

ఒసేయ్.. ముఖ పుస్తకనీ !


డియర్ దుర్మార్గురాలా ,
నేనేం పాపం చేసాను,కాఫీ టీ లు కూడా తాగని నామీద..ఏదో హాలీవుడ్ హీరోయిన్లను అప్పుడప్పుడు ఆరాధించే నా పాలిట హెరాయిన్ లా తయారయ్యావ్.

రెండేళ్ళ క్రితం రాహుకాలం లో లాగిన్ అయ్యాను,నేనేదో కాస్త వర్క్ తక్కువగా ఉందీ ఖాళీ సమయం లో నీలో లీనమవ్వడానికి ట్రై చేసేవాడిని. అందులో పరిచయం నీకు బానిస ని చేసేసింది.కంటికి రెప్పలా పెంచితే నామీద రాళ్ళూ రప్పల్లా రివర్స్ అయి కచ్చి కప్పవవుతావా!

ఒక విషయం లో మాత్రం నీకు నే ఋణపడిపోయా..నీ ప్రేమ లో పడి తేలియాడుతున్న తప్పిపోయారనుకున్న పాత స్నేహితులని తిరిగి సంపాదించుకోగలిగాను.మమ్మల్ని అందరినీ నీ వెనుక ఎలా తిప్పించుకున్నావ్ అసలు  ?

నువ్వు ఏం చేసినా ఒక సంచలనమే మా అందరికీ,ఇల్లే ఇల్లే అనుకుంటూనే మా అందరితో ఫామ్ విల్లే నెలల తరబడి ఆడాను. ఇంకా మాఫియా వార్స్ ని కూడా బేస్ మెంట్ నే అండర్ వరల్డ్ గ్రవుండ్ ని చేసి రణ రంగం లోనికి అడుగు పెట్టి ముగించాక మొదటి ఫ్లోర్ లో విజయోత్సవాలు చేసుకొనేలా చేసావు.

వీక్ ఎండ్ లో ఏం చేయాలో తెలియక గోళ్ళు కొరుకుతూ ఒంటరి గా ఎడారి ఒంటె లా ఉన్న నా పాలిట ఒయాసిస్సు అయ్యావ్.
ఒక బర్త్ డే మర్చిపోతే ఏం జరుగుతుందో అని అనుభవ పూర్వకం గా తెలుసుకొని వేరే వాళ్ళ పుట్టిన రోజులు మిస్ కాకుండా విష్ చేయించడం అంతా నీ చలవే!

నా అనుభూతులన్నీ పదిలపరుచుకోవడానికి నీ విశాలమైన హృదయం లో అనంతమైన చోటిచ్చావ్.నా సోది భరించదానికి అంతకంటే పెద్దదైన అన్ లిమిటెడ్ నోటిచ్చావ్.నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ని కూడా నీ ఫ్రెండ్స్ గా చేసుకొని  నాకొక మరొక దారిని చూపించావ్.సెలెబ్రిటీ లెజెండ్ ల విషయాల కోసం పేపర్ వాళ్ళు రాసే అభూతకల్పనలకు తెరదించుతూ భూత బంగ్లా లాంటి గోడపేజ్ లు ఇచ్చావ్.

నా ఫీలింగ్స్ ని అర్ధం చేసుకొని నా expressions ని బుల్లెట్ express లా పరిగెత్తించి నా భావ వ్యక్తీకరణ కొరకు ఒక త్రోవ చూపించావ్.నాకు ఊహ తెలిసాక ప్రేమలో పడి లేవడం మొదలెట్టాక నీ అంత అంబుజా సిమెంట్ బంధం లా వేరే ఏదీ నన్ను అల్లుకోలేదు.

ప్రతి క్షణం నన్ను పెనవేసుకున్న నీకు ఈ పోస్ట్ అంకితం.

17 comments:

ఇందు said...

హ్హహ్హహ్హ! బాగా రాసావ్ హరే! నేను మొన్నమొన్నటిదాకా ఇదే పట్టుకుకూర్చున్నా! ఇప్పుడే విర్ట్యువల్ లోకం నించి రియల్ లోకంలోకి తొంగి చూడ్డం మొదలుపెట్టా :))

ఎదేమైనా నీ పోస్ట్ కేకో కేక!

Padmavalli said...

:-)) Nice One

Also like your comment notes. :-)))

వేణూరాం said...

హహహ.. బావుంది హరే... ఏమిటో నాకింకా పెద్దగా అలవాటవ్వలేదు ఫేస్ బుక్. నీ పోస్ట్ చదివాకా ఒకసారి వెళ్ళి ఆ ముఖపుస్తకాన్ని తెరిచి చూడాలని ఉందీ. ;)
నైస్ పోస్ట్..

మనసు పలికే said...

హహ్హహ్హా.. హరేభలే రాసావులే:))) నాకైతే ఫేస్‌బుక్ ఎలా వాడాలో కూడా తెలీదు. నేను గుడ్ గర్ల్‌ని కదా;)

టపా మాత్రం సూపరు:))

Sravya Vattikuti said...

హి హి ఏమిటో :))))

..nagarjuna.. said...

చూసావూ, ఎంత ఎడిక్ట్ అయినా వదలం. ఫేస్‌బుక్‌ను తిడుతూ బ్లాగులో/ బజ్జులో రాద్దాం, ప్లస్‌ను తిడుతూ ఫేస్‌బుక్‌లో రాసేద్దాం :D:D

Vasu said...

కానీ మరీ ఎక్కువ సమయం వృధా ఐపోతోంది పేస్ బుక్ లో. అడిక్షన్ అయిపొయింది.

మంచి రిథం ఉంది పోస్ట్ లో. బావుంది.

నా రెండు పైసలు.
ఆర్కుట్ తో చిరకోచ్చినప్పుడు నువ్వు కనిపించావ్
ఒక క్లీన్ ఇంటర్ఫేసు ఇచ్చావ్
రాసుకోడానికి వాల్ ఇచ్చావ్
సరిపోకపోతే నోట్స్ ఇచ్చావ్
చూసుకోడానికి ఆల్బమ్స్ ఇచ్చావ్
కలుసుకోడానికి ఫ్రెండ్స్ ఇచ్చావ్
తెలుసుకోడానికి ప్రొఫైల్ ఇచ్చావ్
నచ్చిందని చెప్పడానికి లైక్ ఇచ్చావ్
.....
కానీ
డిసలైక్ ఇవ్వకుండా ఏడ్పిన్చావ్
అయినా
నువ్వు నాకు నచ్చావ్..
(కన్నీళ్లు తుడుచుకుంటూ.. )
నువ్వు నాకు నచ్చావ్..

హరే కృష్ణ said...

ఇందు హ హ్హ థాంక్ యూ :)
ఏమిటో చిన్నపాప్తి ఫ్రెండ్స్ ని మాత్రం ఫేస్ బుక్ దయవల్ల నే కలిసాను ఆ విషయం లో ప్లస్ బర్త్డే ల విషయం లో నిజంగానే ఋణపడిపోయా :)
సాటి ఫామ్ విల్లే మాజీ ఫాన్ గా నేనూ బయటకి వచ్చేస్తున్నా అప్పుడప్పుడూ :)

పద్మ వల్లి గారు ముందు గా నా బ్లాగ్ కి స్వాగతం
కామెంట్ బాక్స్ మరియు పోస్ట్ నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు :)
keep visiting my blog :)

హరే కృష్ణ said...

రాజ్,అప్పూ థాంక్ యూ థాంక్ యూ :)

శ్రావ్య :) ఎవరి ఫేస్ బుక్ పేజ్ వారికి ఆనందం అంతే :))
ధన్యవాదాలు :)

నాగార్జున హ హః ట్రేడ్ సీక్రెట్స్ అలా చెప్పేస్తే ఎలా చెప్పు :)))
బజ్ ని తిడుతూ రాసేద్దాం రాసేద్దాం :)))
థాంక్స్! :)

హరే కృష్ణ said...

హ హః వాసు గారు
కెవ్వ్ వ్వ్ వ్వ్ ..భలే చెప్పారు
సూపర్ కామెంట్ కి బోలెడు థాంక్స్ :)

చాతకం said...

Good one. How can you decide that Facebook is a girl? :)

హరే కృష్ణ said...

హ హ్హ చాతకం గారు :)
మనం అలా ఫీల్ అయ్యి రాసేసాం అంతే.
ధన్యవాదాలు! :)

kiran said...

హహహ ..:D
హాలీవుడ్ హీరోయిన్లను అప్పుడప్పుడు ఆరాధించే నా పాలిట హెరాయిన్ లా తయారయ్యావ్. -- kevvv

మురళి said...

అంకితం... నీకే అంకితం... లలలా
"ఏ వయసులో పిల్లల్ని కనాలనుకుంటున్నావ్?" అని చిన్నా పెద్దా లేకుండా అందర్నీ అడిగేస్తోందిట కదండీ ఫేస్బుక్కూ? నిన్ననే యువనేత గారి పేపర్లో చదివాను..

హరే కృష్ణ said...

మురళీ గారు :))
రకరకాల అప్లికేషన్స్ రోజుకి డెవలప్ చేసి users మీద వదిలేస్తున్నాడు.
Mark Zuckerberg ఆడే ఆటలో మనమంతా పావులమే :))
>>యువనేత గారి పేపర్ :))
హహ్హ సూపర్ :)

హరే కృష్ణ said...

కిరణ్ థాంక్ యూ :)

Krishnapuram Chinna said...

నేనెలా మిస్ అయ్యనబ్బా ఈ పోస్ట్..
నువ్వు సూపర్ యాండీ...

బానిస కానంతవరకు అన్నీ మంచివే అని ఇండైరేక్ట్ గా చెప్పినట్టు అనిపించింది....

--
HarshaM