Pages

Sunday, August 7, 2011

భాగ్ భాగ్..


స్కూల్ అయ్యాక ట్యూషన్ కి వెళ్ళి టీచర్ ఇచ్చిన వర్క్ లో లీనమయిన నాకు
సలాం చేస్తే గులాము నేనై ఉంటా
ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంటా
రెచ్చ గొట్టితే రచ్చ కీడ్చి కవ్విస్తా!
హోరబ్బా, హోల్ సేలుగా గోలుమాలు చేయిస్తా
దేఖో మెహబూబా
పోటీ తగదికా
కాలు కదిపితే కాటు తప్పదికా సోజా
మెరుపులా లా..లా.. బ్లాగుతా తా.. తా..


అని ఘాట్టిగా చిరంజీవి పాట ని బాల కృష్ణ రాగం లో ఖూనీ చేస్తూ ఆ పరిసరాలను నాగార్జున సినిమా లో హీరోయిన్ పరిస్థితిలా అపవిత్రం చేస్తున్న ఓ జీవి కంట పడింది.

ట్యూషన్ లో ప్రతిరోజూ ఇదే తంతు,వాడేదో వాగాడని,
ఒక వైపు టీచర్ పర్మిషన్ తో సంబంధం లేకుండా తన పాలిట పెదరాయుడు అయిపోయి పళ్ళు రాలగోట్టేయడం తో
ఇంకోవైపు వాళ్ళింట్లో వాడి వీపు విమానం మోత మోగేది..దబ దబా బాదేసి వాడు ఏడుపు మొదలెట్టాక నా దగ్గర ఉన్న చాక్లెట్లు ఇచ్చి బుజ్జి గాడిని బుజ్జగిస్తూ బండి లాగించేస్తున్న రోజుల్లో...

ఎప్పటిలానే ఆరోజు కూడా షారుక్ దరహాసం తో ట్యూషన్ కి వెళ్ళాను.
టీచర్ ఇచ్చిన రెండు లెక్కలు చేసి మూడో లెక్కలోకి అడుగుపెడుతున్నాను.తన ప్లేస్ నుండి మేడం కాస్త కదిలిందో లేదో నా చేతులకు దురద మొదలయ్యింది. ట్యూషన్ మొదలయ్యి అరగంట దాటింది బుజ్జి గాడు ఇంకా రాలేదు..వేరే వాళ్లతో తగవులాడితే నా దగ్గరున్న చాక్లెట్లతో పాటు నన్ను కూడా పీస్ పీస్ లు గా కొరికేసి నాకు peace లేకుండా చేసేస్తారు అని వెనుకంజ వేసి ఆ ఆలోచన విరమించుకున్నాను. 

ఆ  మరుసటి రోజు కూడా మహా మహులు సైతం మామిడి తాండ్ర దాసులయా అనే ఆకలి సత్యం ని నోరారా జీర్ణించుకున్న నేను, తాండ్ర పట్టుకొని వెళితే వాడు మాత్రం ట్యూషన్ కి రాలేదు.
ఇదే తంతు ఆ  వారమంతా సా..గాక

ఆ ఆదివారం వాళ్ళింటికి వెళ్తే,
వాడి పళ్ళు పాడైపోవడానికి కారణం నేనే అని తెలిసి ఆ  బ్రాండ్ చాక్లెట్లకు అలవాటు పడిపోయిన బుజ్జి తన లో ఉన్న చోరకళను చేరదీసి ఎరుపు చేతులతో పట్టుబడడం తో (రెడ్-హేండడ్) ట్యూషన్ మానిపించేశారు అనే కాడ్బరీ నిజం తెలుసుకున్న కొద్ది రోజులకి..

బుజ్జి వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు
వేరే దారిలేక నేను 'ఒక తన్ను కి రెండు చాక్లెట్లు ఫ్రీ.. త్వరపడండి' ఆఫర్ తో అలా అలా స్కూలింగ్ లాగించేసా!

పన్నెండేళ్ళ తర్వాత
ఇంజనీరింగ్ లో చేరిన మొదటి రోజు  ఫర్స్ట్ అవర్లో క్లాస్ మొదలయిన పది నిముషాల తర్వాత వెళ్ళాక  ప్రొఫ్ లేట్ కమర్స్ ని క్లాస్ బయట నిల్చోమన్నారు.
మేమంతా బయట మా పరిచయ కార్యక్రమం చేసుకుంటూ ఉండగా మధ్యలో ఎవరో జోకాక ఒకడు గట్టిగా నవ్వాడు.

ఆ  సుకుమారమైన దంతాకృతి చూసాక 
నేను కెవ్వ్ అని  అరిచాను..అటునుండి కూడా కేవ్వ్వ్ అని రిప్లై వచ్చింది.
డవుటే లేదు వీడు మా బుజ్జి గాడే..అడ్డ గాడిద లా పెరిగిపోయాడు
అన్నేళ్ల తర్వాత కలిసాక  కాదేదీ సోదికి అనర్హం అనే సూత్రాన్ని విచ్చల విడిగా ఫాలో అయిపోయి ఒకే హాస్టల్ వింగ్ లో రూమ్స్ తీసుకున్నాం.


ఎనిమిదింటికి క్లాస్ ఉంటే ప్రతి రోజూ హాస్టల్ లో  7 .50  కి లేచి క్లాస్ కి భాగ్ భాగ్  అని బావురుమని సమీప పరిసరలాను భయబ్రాంతులకు గురిచేసేలా పాడుకుంటూ,
అవే లేట్ మార్కులను గ్రేట్ స్పార్క్ లతో నాలుగేళ్ళు ఇందోళంలో  కొన సా..గించి 
కాలేజ్ లైఫ్ ని
సారిగమా పాదనిసా... సానిదపా మాగరిసా ..శృతి లో అలా అలా ఆహ్లాదంగా ప్రతి సంవత్సరం క్షణాల్లా గడచి అనంతమైన అనుభూతులు మిగిలిపోయాయి.

నా నోటికి తోచిన ఒక నోట్ ఈ మధ్యనే రాసుకున్నా

స్నేహానికి నిజమైన ఆస్తి నిష్కపటము
నిజాన్నినిలబెట్టుకోవడం లోనే ఉంది మన సహృదయము
అటువంటి స్నేహమే నిలిచి ఉంటుంది జీవితాంతం.
తోడ బుట్టిన వారితో చెప్పలేని విషయాలను కూడా చెప్పుకోవడం మిత్రత్వము యొక్క గొప్పదనం
కష్ట కాలంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగించే దివ్యౌషదం స్నేహం .

ప్రియమిత్రులందరికీ మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు.


Friendship is a little more trust,
A little less try,
A little more laugh,
And a little less cry,
A little more WE and a little less I.

Happy Friendship Day!!!

19 comments:

Krishnapuram Chinna said...

Happy Friendship Day!!!

చాలా బాగుంది.

Krishnapuram Chinna said...

Happy Friendship Day.

చాలా బాగుంది.

--HarshaM

ఇందు said...

Happy Friendship day :)
Ayinaa ee comment box message entandi babuuuuuuuu? Meeru Hilarious :)))))))))
Keka undi post+commentbox mesg :)))

వేణూరాం said...

నాగార్జున సినిమా లో హీరోయిన్ పరిస్థితిలా అపవిత్రం...
>>>> kevvvvvvvv...

స్నేహం‌గురించిన లైణ్స్ చాలా బాగున్నాయ్..
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... ;)

బాబూ.. కమెంట్‌బాక్స్ దగ్గర నో‌ట్ అదరహో.... దీన్నే‌కసి ప్రేలాపన అంటారు. హహహహ... నీ అరాచక అజెండా ఏంటీ????‌

మధురవాణి said...

కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్... సూపర్ ఉంది మీ కామెంట్ బాక్స్ మెసేజ్.. ROFL :D :D :D

Sravya Vattikuti said...

Fiendship day శుభాకాంక్షలు !

కృష్ణప్రియ said...

ఈ పోస్ట్ చాలా బాగుంది.. బాగా రాసారు.

కృష్ణప్రియ said...

అన్నట్టు.. మీ కామెంట్ బాక్స్ లో ఆత్మానందం బ్లాగ్ లో కింగ్ సైజ్ 'బ్రహ్మానందం సందేశం' చూసి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను..


:) హిలేరియస్..

వేణూ శ్రీకాంత్ said...

స్నేహితులరోజు శుభాకాంక్షలు హరే :)
కొత్త టెంప్లేట్ అదిరింది... కామెంట్ బాక్స్ మెసేజ్ బెదిరింది :-) మీరు కేకంతే :)))

హరే కృష్ణ said...

హర్ష, థాంక్ యూ వెరీ మచ్ :)

ఇందు, Comment box Message వెనుక రెండు గంటల శ్రమ ఉంది
మీ కాంప్లిమెంట్ చూసాక ఆ కష్టానికి ప్రతిఫలం లభించినట్టే :)
రెండూ నచ్చినందుకు Thanks a Lot :)

హరే కృష్ణ said...

రాజ్ హ హ్హ :))
థాంక్ యూ, ఒక్కోసారి అరాచకం లేకపోతే శృతి బాగా రావడం లేదు
నచ్చినందుకు చాలా థాంక్స్ :)

మధుర :)))

Thank you very much :)

హరే కృష్ణ said...

శ్రావ్య , మీకు కూడా మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు.
ధన్యవాద్ :)

కృష్ణ ప్రియ గారు
>>>ఆత్మానందం బ్లాగ్ లో 'బ్రహ్మానందం సందేశం'
>>కింగ్ సైజ్
కెవ్వ్ వ్వ్ :)) సూపర్ కామెంట్ :)
తెలుగు బ్లాగులో మరిన్ని ఆత్మలను పరిశీలింప చేయడమే ఒక బ్లాగరు కనీస కర్తవ్యమ్ అని ఆ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది :)
నచ్చినందుకు చాలా థాంక్స్!

వేణూ శ్రీకాంత్ గారు :))
హ హ్హ మొన్న బజ్ లో కామెంట్ పెట్టినప్పుడే ఈ అవుడియా తట్టింది, జయసూర్య కి inception చేస్తే వచ్చిన అవుట్ పుట్ :)
కేకలకి బోలెడు థాంకులు :)

kallurisailabala said...

స్నేహానికి నిజమైన ఆస్తి నిష్కపటము ఇది నిజంగా నిజం.
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

కామెంట్ పెట్టేచోట ఇలా రాస్తే భయం వేస్తుంది ఎం రాస్తే ఏమి అంటారో అని...!!?

బులుసు సుబ్రహ్మణ్యం said...

Good wishes for Friendship day,

Template very good hai.

>>>ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము.

ఎక్కడికి అంటే కామెంటు బాక్స్ కి అంటున్నారు. మరి మాకేంటి. మేము కామెంటు గడి దాకా ఎందుకు నడవాలి? ఒక్కో నడకకి ఒక్కో విలువ ఉంటుంది. అదేంటో తేలందే అడుగు పడదు అని తెలియ చేసుకుంటున్నాం.

హరే కృష్ణ said...

శైల బాల గారు థాంక్ యూ :)
కింగ్ సినిమా సైడ్ ఎఫెక్ట్ ఆ కామెంట్ మెసేజ్ :)

గురూజీ మనం మనం ఒకటి
నాకొచ్చే గిఫ్ట్స్ చెరో సగం పంచుకుందాం
బ్లాగులు బహుమతులతో దద్దరిల్లాలే అన్నట్టు దుమ్ము లేపేద్దాం :)
కింగ్ పోస్ట్ లైకింగ్స్ కి ధన్యవాదాలు :)
బ్లాగు షేర్ మార్కెట్ మరియు mutual ల్ ఫండ్స్ కి స్వాగతం సుస్వాగతం
దందా షురూ :)

kiran said...

nuvv telugu lo rasina lines chala bagunnay...!!
nee post bagundi..!!
nee comment box paina statement bagundi..:)
nee blog template bagundi...:)

Happyy frndship dayy :))

హరే కృష్ణ said...

నీకు నిజంగా చాలా డెడికేషన్ ఉంది కిరణ్ :)

అన్నీ కలిపి నచ్చేసినందుకు చాలా పెద్ద థాంక్ యూ :))

happy Friendship Day :)

Anonymous said...

Happy friendship day to you too.

I liked the post, clicked on comment link and then only saw the comment box message. Alas, you see this message only AFTER the reader decided to put a comment. But again, I did learn a thing or two now, would sure be commenting on the Telugu blog posts that I liked from now onwards, not just your wonderful blog, if possible in Telugu too. Keep up the good work. Hats off to your blog, added as favorite on my cellphone. Add me as your friend/fan. Happy friendship day.

-- Bujjigadu made in Guntur ( I really do have very good smile/teeth)

హరే కృష్ణ said...

బుజ్జి గారు :)))
Thank you very very much!
you made my day!
the best comment that i have ever read in my blog career :)

Happy Friendship day!
:)) thank you for following my blog!
keep visiting :)


మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు :)