Pages

Monday, August 22, 2011

జయ కృష్ణా..ముకుందా..మురారీ!


శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జగన్నాధుని కీర్తిద్దాం.బాష వేరైనా భావం ఒక్కటే కాబట్టి తన్మయత్వం తో శ్రవణం,కీర్తనం  చేసి గోకులాష్టమిని ఘనంగా జరుపుకుందాం  


īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam

isvarah--the controller; paramah--supreme; krishna--Lord Krishna; sat--comprising eternal existence; cit--absolute knowledge; ananda--and absolute bliss; vigrahah--whose form, anadir--without beginning; adir--the origin; govindah--Lord Govinda; sarva-karana-karanam--the cause of all causes.

Krishna who is known as Govinda is the Supreme Godhead. He has an eternal blissful spiritual body. He is the origin of all. He has no other origin and He is the prime cause of all causes.


(jaya) rādhā-mādhava (jaya) kuñja-bihārī
(jaya) gopī-jana-vallabha (jaya) giri-vara-dhārī


Krishna is the lover of Radha. He displays many amorous pastimes in the groves of Vrindavana, He is the lover of the cowherd maidens of Vraja, and the holder of the great hill named Govardhana.



(jaya) jaśodā-nandana, (jaya) braja-jana-rañjana,
(jaya) jāmuna-tīra-vana-cārī

He is the beloved son of mother Yasoda, the delighter of the inhabitants of Vraja, and He wanders in the forests along the banks of the River Yamuna!


Amazing grace how sweet the sound that save the soul a soul like me I once was lost but now I'm found was blind so blind but now I see

Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare!!

All you need is love (Krishna)
Hari Bol


Happy Sri Krishna Janmashtami to All....
Have a Blessed Krishna Conscious Day!

Wednesday, August 17, 2011

ఒసేయ్.. ముఖ పుస్తకనీ !


డియర్ దుర్మార్గురాలా ,
నేనేం పాపం చేసాను,కాఫీ టీ లు కూడా తాగని నామీద..ఏదో హాలీవుడ్ హీరోయిన్లను అప్పుడప్పుడు ఆరాధించే నా పాలిట హెరాయిన్ లా తయారయ్యావ్.

రెండేళ్ళ క్రితం రాహుకాలం లో లాగిన్ అయ్యాను,నేనేదో కాస్త వర్క్ తక్కువగా ఉందీ ఖాళీ సమయం లో నీలో లీనమవ్వడానికి ట్రై చేసేవాడిని. అందులో పరిచయం నీకు బానిస ని చేసేసింది.కంటికి రెప్పలా పెంచితే నామీద రాళ్ళూ రప్పల్లా రివర్స్ అయి కచ్చి కప్పవవుతావా!

ఒక విషయం లో మాత్రం నీకు నే ఋణపడిపోయా..నీ ప్రేమ లో పడి తేలియాడుతున్న తప్పిపోయారనుకున్న పాత స్నేహితులని తిరిగి సంపాదించుకోగలిగాను.మమ్మల్ని అందరినీ నీ వెనుక ఎలా తిప్పించుకున్నావ్ అసలు  ?

నువ్వు ఏం చేసినా ఒక సంచలనమే మా అందరికీ,ఇల్లే ఇల్లే అనుకుంటూనే మా అందరితో ఫామ్ విల్లే నెలల తరబడి ఆడాను. ఇంకా మాఫియా వార్స్ ని కూడా బేస్ మెంట్ నే అండర్ వరల్డ్ గ్రవుండ్ ని చేసి రణ రంగం లోనికి అడుగు పెట్టి ముగించాక మొదటి ఫ్లోర్ లో విజయోత్సవాలు చేసుకొనేలా చేసావు.

వీక్ ఎండ్ లో ఏం చేయాలో తెలియక గోళ్ళు కొరుకుతూ ఒంటరి గా ఎడారి ఒంటె లా ఉన్న నా పాలిట ఒయాసిస్సు అయ్యావ్.
ఒక బర్త్ డే మర్చిపోతే ఏం జరుగుతుందో అని అనుభవ పూర్వకం గా తెలుసుకొని వేరే వాళ్ళ పుట్టిన రోజులు మిస్ కాకుండా విష్ చేయించడం అంతా నీ చలవే!

నా అనుభూతులన్నీ పదిలపరుచుకోవడానికి నీ విశాలమైన హృదయం లో అనంతమైన చోటిచ్చావ్.నా సోది భరించదానికి అంతకంటే పెద్దదైన అన్ లిమిటెడ్ నోటిచ్చావ్.నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ని కూడా నీ ఫ్రెండ్స్ గా చేసుకొని  నాకొక మరొక దారిని చూపించావ్.సెలెబ్రిటీ లెజెండ్ ల విషయాల కోసం పేపర్ వాళ్ళు రాసే అభూతకల్పనలకు తెరదించుతూ భూత బంగ్లా లాంటి గోడపేజ్ లు ఇచ్చావ్.

నా ఫీలింగ్స్ ని అర్ధం చేసుకొని నా expressions ని బుల్లెట్ express లా పరిగెత్తించి నా భావ వ్యక్తీకరణ కొరకు ఒక త్రోవ చూపించావ్.నాకు ఊహ తెలిసాక ప్రేమలో పడి లేవడం మొదలెట్టాక నీ అంత అంబుజా సిమెంట్ బంధం లా వేరే ఏదీ నన్ను అల్లుకోలేదు.

ప్రతి క్షణం నన్ను పెనవేసుకున్న నీకు ఈ పోస్ట్ అంకితం.

Monday, August 15, 2011

ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు
పుట్టింది ఈ మట్టిలో సీత,రూపు కట్టింది దివ్య భగవత్గీత
వేదాలు వెలసిన ధరణిరా
వేదాలు వెలసిన ధరణిరా
ఓంకార నాదాలు పలికిన అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవనినాడు వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతమురా,కోకిలది ఏ కులమురా
గాలికి ఏ భాష ఉందిరా,నీటికి ఏ ప్రాంతముందిరా
గాలికి,నీటికి లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు,కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

గౌతమబుద్ధుని భోదలు మరవద్దు,గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు,గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు,స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు
ఇకమత్యమే జాతికి శ్రీరామరక్ష,అందుకే నిరంతరం సాగాలి దీక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష 
కానీ ఇక్కడ ఏం జరుగుతోంది
A Nation where PIZZA reaches home faster than AMBULANCE & POLICE...
Where u get CAR LOAN @8% but EDUCATION LOAN @12%.
Where 1 kg ONION is Rs.24 but SIM CARD for Free.
Olympic shooter wins GOLD ,govt gives 3 Crore. another shooter dies fighting with TERRORIST. GOVT pays 1 lakh
భయంకరమైన నిజాలను సైతం అలా అలా అలవాటు చేసుకుపోయేలా చేసాయి.  
మన దేశ స్వాతంత్రం  కోసం ఎందరో  మహానుభావులు పడ్డ కష్టాలను గుర్తుచేసుకొంటూ
నిన్న సినిమా కి వెళ్తే  ఒక్కోసారి తలనొప్పి తో పాటు కాస్త రిలీఫ్ దొరుకుతుంది అని తెలిసింది మంచి మెసేజ్ రూపం లో



స్వాతంత్ర శుభాకాంక్షలు అని నోరు తెరిచి చెబుదామన్నా


Today is one day to forget and forgive ourselves of all the inbuilt curses.Be with it..Corruption,Terrorism,Sca​ms and many more and be proud of ourselves.... Mera Bharat Mahan. Happy Birth Day India!






Sunday, August 7, 2011

భాగ్ భాగ్..


స్కూల్ అయ్యాక ట్యూషన్ కి వెళ్ళి టీచర్ ఇచ్చిన వర్క్ లో లీనమయిన నాకు
సలాం చేస్తే గులాము నేనై ఉంటా
ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంటా
రెచ్చ గొట్టితే రచ్చ కీడ్చి కవ్విస్తా!
హోరబ్బా, హోల్ సేలుగా గోలుమాలు చేయిస్తా
దేఖో మెహబూబా
పోటీ తగదికా
కాలు కదిపితే కాటు తప్పదికా సోజా
మెరుపులా లా..లా.. బ్లాగుతా తా.. తా..


అని ఘాట్టిగా చిరంజీవి పాట ని బాల కృష్ణ రాగం లో ఖూనీ చేస్తూ ఆ పరిసరాలను నాగార్జున సినిమా లో హీరోయిన్ పరిస్థితిలా అపవిత్రం చేస్తున్న ఓ జీవి కంట పడింది.

ట్యూషన్ లో ప్రతిరోజూ ఇదే తంతు,వాడేదో వాగాడని,
ఒక వైపు టీచర్ పర్మిషన్ తో సంబంధం లేకుండా తన పాలిట పెదరాయుడు అయిపోయి పళ్ళు రాలగోట్టేయడం తో
ఇంకోవైపు వాళ్ళింట్లో వాడి వీపు విమానం మోత మోగేది..దబ దబా బాదేసి వాడు ఏడుపు మొదలెట్టాక నా దగ్గర ఉన్న చాక్లెట్లు ఇచ్చి బుజ్జి గాడిని బుజ్జగిస్తూ బండి లాగించేస్తున్న రోజుల్లో...

ఎప్పటిలానే ఆరోజు కూడా షారుక్ దరహాసం తో ట్యూషన్ కి వెళ్ళాను.
టీచర్ ఇచ్చిన రెండు లెక్కలు చేసి మూడో లెక్కలోకి అడుగుపెడుతున్నాను.తన ప్లేస్ నుండి మేడం కాస్త కదిలిందో లేదో నా చేతులకు దురద మొదలయ్యింది. ట్యూషన్ మొదలయ్యి అరగంట దాటింది బుజ్జి గాడు ఇంకా రాలేదు..వేరే వాళ్లతో తగవులాడితే నా దగ్గరున్న చాక్లెట్లతో పాటు నన్ను కూడా పీస్ పీస్ లు గా కొరికేసి నాకు peace లేకుండా చేసేస్తారు అని వెనుకంజ వేసి ఆ ఆలోచన విరమించుకున్నాను. 

ఆ  మరుసటి రోజు కూడా మహా మహులు సైతం మామిడి తాండ్ర దాసులయా అనే ఆకలి సత్యం ని నోరారా జీర్ణించుకున్న నేను, తాండ్ర పట్టుకొని వెళితే వాడు మాత్రం ట్యూషన్ కి రాలేదు.
ఇదే తంతు ఆ  వారమంతా సా..గాక

ఆ ఆదివారం వాళ్ళింటికి వెళ్తే,
వాడి పళ్ళు పాడైపోవడానికి కారణం నేనే అని తెలిసి ఆ  బ్రాండ్ చాక్లెట్లకు అలవాటు పడిపోయిన బుజ్జి తన లో ఉన్న చోరకళను చేరదీసి ఎరుపు చేతులతో పట్టుబడడం తో (రెడ్-హేండడ్) ట్యూషన్ మానిపించేశారు అనే కాడ్బరీ నిజం తెలుసుకున్న కొద్ది రోజులకి..

బుజ్జి వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు
వేరే దారిలేక నేను 'ఒక తన్ను కి రెండు చాక్లెట్లు ఫ్రీ.. త్వరపడండి' ఆఫర్ తో అలా అలా స్కూలింగ్ లాగించేసా!

పన్నెండేళ్ళ తర్వాత
ఇంజనీరింగ్ లో చేరిన మొదటి రోజు  ఫర్స్ట్ అవర్లో క్లాస్ మొదలయిన పది నిముషాల తర్వాత వెళ్ళాక  ప్రొఫ్ లేట్ కమర్స్ ని క్లాస్ బయట నిల్చోమన్నారు.
మేమంతా బయట మా పరిచయ కార్యక్రమం చేసుకుంటూ ఉండగా మధ్యలో ఎవరో జోకాక ఒకడు గట్టిగా నవ్వాడు.

ఆ  సుకుమారమైన దంతాకృతి చూసాక 
నేను కెవ్వ్ అని  అరిచాను..అటునుండి కూడా కేవ్వ్వ్ అని రిప్లై వచ్చింది.
డవుటే లేదు వీడు మా బుజ్జి గాడే..అడ్డ గాడిద లా పెరిగిపోయాడు
అన్నేళ్ల తర్వాత కలిసాక  కాదేదీ సోదికి అనర్హం అనే సూత్రాన్ని విచ్చల విడిగా ఫాలో అయిపోయి ఒకే హాస్టల్ వింగ్ లో రూమ్స్ తీసుకున్నాం.


ఎనిమిదింటికి క్లాస్ ఉంటే ప్రతి రోజూ హాస్టల్ లో  7 .50  కి లేచి క్లాస్ కి భాగ్ భాగ్  అని బావురుమని సమీప పరిసరలాను భయబ్రాంతులకు గురిచేసేలా పాడుకుంటూ,
అవే లేట్ మార్కులను గ్రేట్ స్పార్క్ లతో నాలుగేళ్ళు ఇందోళంలో  కొన సా..గించి 
కాలేజ్ లైఫ్ ని
సారిగమా పాదనిసా... సానిదపా మాగరిసా ..శృతి లో అలా అలా ఆహ్లాదంగా ప్రతి సంవత్సరం క్షణాల్లా గడచి అనంతమైన అనుభూతులు మిగిలిపోయాయి.

నా నోటికి తోచిన ఒక నోట్ ఈ మధ్యనే రాసుకున్నా

స్నేహానికి నిజమైన ఆస్తి నిష్కపటము
నిజాన్నినిలబెట్టుకోవడం లోనే ఉంది మన సహృదయము
అటువంటి స్నేహమే నిలిచి ఉంటుంది జీవితాంతం.
తోడ బుట్టిన వారితో చెప్పలేని విషయాలను కూడా చెప్పుకోవడం మిత్రత్వము యొక్క గొప్పదనం
కష్ట కాలంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగించే దివ్యౌషదం స్నేహం .

ప్రియమిత్రులందరికీ మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు.


Friendship is a little more trust,
A little less try,
A little more laugh,
And a little less cry,
A little more WE and a little less I.

Happy Friendship Day!!!

Wednesday, August 3, 2011

కొత్తావకాయ తో కోకోకోలా


ప్రదేశం
IIT ఢిల్లీ

హరే కాంపస్ లో చేరిన రెండు నెలల్లో నాలుగు కిలోలు తగ్గ్గిపోయి తిండి కి అడ్జస్ట్ కాలేక,
చేరక ముందు చేరిన తర్వాత అని ఫేస్ బుక్ లో కంపారిజన్ ఫోటో పెట్టిన వెంటనే వాళ్ళ అక్క నుండి unlike అనే కామెంట్ చూసి

ఔరా ఏమి ఈ వైపరీత్యము..పక్కోడి ఫుడ్ తో పాటు వాడి కుక్కు ఫుడ్ కూడా తిని పంది కొక్కులా ఉండాల్సిన నువ్వు ఇలా తయారయ్యావేంటి అని ఆశ్చర్యార్ధకం పెట్టాక!

ఏమి సేత్తుము సోదరీ,  నీకు అక్కడ  జావా అర్ధం కావడం లేదు నాకిక్కడ మా మెస్ లో పెట్టే జావ ఎక్కడం లేదు
సరే ఖాళీ ఉన్నపుడు మాట్లాడుకుందాం, అని ఫేస్ బుక్ లో ఫేస్ ఆఫ్ సినిమా ముగించేసాక

మిచిగాన్ లో ఉన్న వాళ్ళ అక్కకు మిస్సేడ్ కాల్  ఇచ్చి, ఫోన్ కట్ చేసిన హరే
చదివేది మాస్టర్స్ అయినా మిస్సేడ్ కాల్స్ విషయం లో  తన బట్టలను రూమ్ మేట్ వాడే డిటర్జంట్ల తో ఉతికేసి పీ.హెచ్ డీ చేసిన హరే కి తిరిగి ఫోన్ రానే వచ్చింది

సోదరీ ఏమిటీ ఈ సభ్రమాశ్చర్యముల ఫోను కాల్
నీ ఫేస్ బుక్ లో చిత్ర దృశ్యం చూసి నా అవుట్ గోయింగ్ పరి పరి విధములుగా పారి పోవుటకు ప్రయత్నించుచున్నది  (మనసు లో మిస్సేడ్ కాల్ ఇచ్చి ఎందుకు  కాల్ చేసావ్ అంటావ్ ఏంట్రా కన్నీటి బండా)
అక్క:బాగా చిక్కిపోయావ్ రా ఏం గడ్డి తింటున్నావేంటో
హరే:సోది వల్ల బాలెన్స్ పెరుగును,సొల్యూషన్ చెప్పుము 

హోదరి:ఒక ఎలెక్ట్రిక్ కుక్కర్ కొనుక్కో.. చక్కగా అన్నం పెట్టుకొని పెరుగు తో హాయిగా తినెయ్
హరే:జీ టీ వీ లో జీబ్రా ని చూసినట్టు టేస్ట్ అఘోరించదూ.. కర్రీ లేకపోతే!

హోదరి:నీకోసం ఇంత ఆలోచించి నీ పెళ్లి కి గిఫ్ట్ ఇచ్చేంత ఖరీదైన అవుట్ గోయింగ్ చేస్తున్నా నేను ఆ  మాత్రం సాయం చేయలేనా కొత్తావకాయ సీజన్ మొదలయ్యింది  భయం వలదు నేను రుచికరమైన పచ్చడి ప్రిపేర్ చేసి  నీకు attach చేసి ఫార్వార్డ్ చేస్తాను
హరే:ఏంటి మైల్ లోనా ?

అలా నిముషాలు కాస్తా సెకన్లు గా మారిపోయి దగ్గరలో ఉన్న మార్కెట్ కి వెళ్ళి ఒక మాంచి  ఎలెక్ట్రిక్ కుక్కర్ కొనుక్కున్నాడు హరే
హరే Fedex ట్రాకింగ్ నెంబర్ ని నోట్ చేసుకొని fedup అయిపోతూ రోజులు నెలలు సంవత్సరాలు డేలివేరీ పేకెట్ కోసం డెవిల్ లా కళ్ళల్లో కొబ్బరన్నం కారేలా వేచి వేచి వాచీ చూడ సాగాడు..బాటరీ అయిపోయిందే కానీ లాటరీ పేలనట్టు డెలివరీ మాత్రం ఇల్లే.


అప్పటికే కేస్ట్ అవే సినిమా ని చూసేసిన హరే కి ఎవడో టామ్ హాంక్స్  జీవితం ని  టామ్ అండ్  జెర్రీ లా అయిపోయి ఉంటుంది.అని అనుకొని తన కాంపస్ జీవితం  ఫినిష్ చేసుకొని ఇంటికి పొద్దున్న Airport కి బయలు దేరుతుండగా రిసెప్షన్ లో సెక్యూరిటీ గార్డ్ తనకేదో పెద్ద డబ్బా ఇచ్చాక హరే కి అర్ధం అయిపోయింది అందులో ఏముందో..

సరే రూమ్ లో పెట్టేద్దాం పక్కన ఉన్నవాళ్ళకు కనీసం రెండు రోజులైనా నిద్రపట్టదు. చివరిసారిగా గా ఈ హాస్టల్ కి తనవంతుగా నాశనం చేయడానికి చివరి అడుగు వేద్దాం అని తన రూమ్ వరకు వెళ్ళాడు.

సమయం అయిదు కావస్తోంది..తన పక్కరూం లో ఉన్న అన్వేష్ నిద్రలేచాడు వెళ్ళిపోతున్నావా హరే, అంటూ హాలా హలపు హగ్  చేసుకొని సాగనంపుతుండగా...

హరే :ఈ టైం లో నువ్వేంటి? నిద్ర పోలేదా ఇంకా ? అంత సౌండ్ పెట్టుకున్నావేంటి హాస్టల్ అంతా నిద్రలేచేలా .
అన్వేష్:మరీ అంత ఫీలవ్వకు హరే , హాస్టల్ లో చాలా వరకు జూనియర్స్ ఇంటికి వెళ్ళిపోయారు
ఆల్మోస్ట్  మనం కూడా కాలేజ్ ని విడిచి  వెళ్ళిపోతున్నాం కదా  ఒక చిన్న గెట్ together లాంటిది రూమ్ లో చేసుకుంటున్నాం చాలా మంది ఫ్రెండ్స్ మా రూమ్ లోనే ఉన్నారు ..అదే ఆ సౌండ్

అంతా బావుంది కానీ  పార్టీ లో కాస్త కారం అంతా ఖాళీ చేసేసారు కోకాకోలా లో కిక్ పోయింది.. అసలే  పాత డ్రింక్స్ బావుంటాయని ఎక్స్పైర్ అయిపోయిన కోక్ ని చాలా డబ్బులు పెట్టి తెచ్చాను తెలుసా... వా ఆఆ ...అని ఆహాకారాలు చేస్తుండడం తో


హరే :నీ దగ్గర ఉన్న ఓల్డ్ డ్రింక్ కి దీటుగా ఈ గోల్డ్ పచ్చడి తీసుకో మళ్ళీ జీవితం లో మరచిపోవు అని చెప్పి అప్పగింతలు పూర్తిచేసి డ్రింకింగ్ వాటర్ బాటిల్ లో రెండు బిస్లరీ బొట్లను స్వహస్తాలతో కార్చేసి చివరిసారిగా తమ హాస్టల్ నుండి నిష్క్రమించి

Flying మెషిన్ డ్రెస్ వేసుకున్నహరే  తమ హాస్టల్ ఎదురుగా ఉన్నలేడీస్ హాస్టల్ కి ఒక flying కిస్ ఇచ్చేసి అక్కడనుండి దగ్గరలో ఉన్న కాంపస్ హాస్పటల్ ని చూస్తూ రేపు ఎంతమంది అడ్మిట్ అవుతారో అని సంతోషంగా తెలుగు అంత స్వచ్చం గా గెంతులేసి ఇంగ్లీష్ బాషలో జంప్ అవుతూ సెలవులకు బెంగళూర్ లో ఉన్న Fedex అక్క నెంబర్ కి డైల్ చేసి

అక్కోయ్, మిషన్ పాతావకాయ టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ కంటే అద్భుతమైన రిజల్ట్స్ ని ఇచ్చేయడానికి రడీ గా ఉంది.. 

నేను వచ్చే వారం బోంబే  లో జాబ్ లో  జాయినింగ్..మా కంపనీ అడ్రెస్స్ కి మాగాయ పంపించు,ఎంచక్కా యో యా అనుకుంటూ మాగాయ తో మిరిండా షో మొదలుపెడతాను


హోదరి:అది సరే.. ఇన్ని చేస్తున్న నా ఋణం ఎలా తీర్చుకుంటావు చిట్టీ
ఇక్కడ మా టీచర్ల కోసం నాటిన మునగ చెట్లు నీకు ఫార్వార్డ్ చేస్తాను. ఆఫీస్ అవర్స్ అయ్యాక మంచి గా రోజూ నీ బ్లాగ్ లో బజ్ లో పొగుడుతూ బోల్డు కామెంట్లు పెడతాను.. సరే మరి ఆమ్రికా వెళ్ళాక మిచిగాన్ లో మునగచెట్టు ఆట ఆడుకో. 
హోదరి:అంతేనా ?
అందుకే కదా వీటితో పాటు మా లాన్ లో నీకు ప్రాణమైన  టామ్ అండ్ జెర్రీ 25 జీ బీ తెస్తున్నా..మొత్తం నీకే!
హోదరి:డెట్రాయిట్ లో డేటాల్ లేక నేనేడుస్తుంటే ముంబై లో మాగాయ దొరకలేదని నువ్వేడుస్తున్నావా.. కేవ్వ్వ్ !