Pages

Saturday, July 30, 2011

కచ్చ కెవ్వ్ త..



బ్లాగుల్లో కవితలకు  ఈ మధ్య డిమాండ్ బాగా తగ్గిపోయిందని  బజ్ లో అనుకుంటుంటే

అయ్యారే,ఎంత ఘోరం జరిగిపోయింది. మనవంతుగా ఒక స్నేహ హస్తంతో చిన్న హాండ్ ఇద్దాం అని సముద్రం లోనికి దిగితే ఇసుక వలే ఈ కచ్చల విచ్చల కవిత came అవుట్. 


నీ స్వప్నం లో ఒక ఇందోళం అవుతా
నీ కవితల్లో నే కలువితరణ అవుతా
నీ పక్కన కాస్త చోటివ్వవూ ..
క్యోన్?
INR 25000 per Square feet.Property in South Mumbai is hot :)

ఓ సఖీ నీ పైరగాలి పిలుపు విని నేనోచ్చేసా ఊరకుక్కలా ఉరికి ఉరికి..  
నువ్వు పొమ్మంటే నే పోతా బర బరా బార్ కి
సై అంటే నిన్ను తీసుకెళ్తా బీచ్ లో బ్లీచింగ్ కి  
నువ్వే లోకంగా బతుకుతూ అయిపోతా బైరాగిని బ్లాగులోకానికి  


నీ భావనల్లో ఒక భాగమవుతా
ఇష్టంగా తలూపితే నీ తలపునవుతా
లేదంతే తలుపు కింద గుమ్మం అవుతా
చంద్రుడు కురిపించే వెన్నెల కళ్ళల్లో కలకనవుతా

పాదాలను తాకే అలల వలే నిరంతరం తరుముతున్న నీ తలపులు
కేరట్ తురుమువలె నన్ను ఎర్రగా మార్చేస్తున్న ఆ జ్ఞాపకకెరటాలు
ఒంట్లో వేడి పెరిగిపోయి తినడం ఆపేసా పరాఠాలు 
తొండ లాంటి తొండి ని తట్టుకోలేక తేరే కో చెప్పేస్తున్నా బై బై టాటాలు

25 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>ఓ సఖీ నీ పైరగాలి పిలుపు విని నేనోచ్చేసా ఊరకుక్కలా ఉరికి ఉరికి
>>>చంద్రుడు కురిపించే వెన్నెల కళ్ళల్లో కలకనవుతా
>>>కేరట్ తురుమువలె నన్ను ఎర్రగా మార్చేస్తున్న ఆ జ్ఞాపకకెరటాలు

ఇదంతా కవితా వేషమేనా? @25000/Sq.ft.
సాఖీ యా సఖి యా కావాల్సింది. మొదటి లైనులో పలకరించి చివరి లైనులో టాటా బై బై. ఏమిటో ఏమి అర్ధం కాలేదు.అంతా ఏ 'కవిత' మాయయో.

Sravya V said...

వామ్మో శనివారం పైత్యం , దేవుడా నిద్ర రానీయకుండా ఎంత తప్ప చేసావు :((((

..nagarjuna.. said...

ఆహా... కెవ్వు. కేక. గునపం. గడ్డపార. రచ్చో రచ్చ :P

మధురవాణి said...

<<నీ కవితల్లో నే కలువితరణ అవుతా
ప్రతీ లైనుకీ కెవ్వ్ కెవ్వ్... వాహ్వా వాహ్వా.. శనివారం పొద్దున్నే చాలా చాలా నవ్వించారు... Thanks a lot! :D :D

SJ said...

:))

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

హహ్హ్హహ..కవితకు తగ్గ ఆనిమేటడ్ జిఫ్ పెట్టారు

వేణూశ్రీకాంత్ said...

కవితల్లో కూడా స్పోర్ట్సా !!
కెవ్వ్ త కెవ్వ్... :-)))

ఇందు said...

>>కేరట్ తురుమువలె నన్ను ఎర్రగా మార్చేస్తున్న ఆ జ్ఞాపకకెరటాలు

Wahwaaa!!!

ఏంటండీ ఏంగ్రీ బర్డ్ ఏండీగారూ...ఆ కవితలూ మీరూనూ!!! బాబోయ్! కెవ్వ్వ్వ్! అని అరిచి పారిపోతుంది ఏ అమ్మాయైనా ఈ కవిత రాసిస్తే :)))

మీ కవిహృదయానికి జోహార్లు :))

అయినా ఇంకో టపా పడుతుంది అనుకుంటే ఇది పడిందేంటబ్బా? ;)

హరే కృష్ణ said...

గురూజీ
>>సాఖీ యా సఖి యా కావాల్సింది
రాఖీ సావంత్ కాకుండా ఎవరైనా ఓకే :)

అయ్యో అర్ధం కాలేదా..కవిత శృతి తప్పింది
కెవ్వ్ పెట్టిస్తే అపశ్రుతి కాకుండా తయారవుతుంది అనే ఆశ మిగిలి ఉంది.

కవిత తెంచుకున్న తాళం ఒక నంబర్, రాసిన టెంపో వేరే నంబర్ :))
తకిట తకిట తకదిమి 24
తకిట తకిట తకిట 68
ఒక్కోసారి బ్లాగు పరిపక్వతా భావుకత్వం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తోంది :)
ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

శ్రావ్య :))
>>>వామ్మో శనివారం పైత్యం , దేవుడా నిద్ర రానీయకుండా ఎంత తప్ప చేసావు :((((
శనివారం మొదలయ్యింది స్మశానం లో నక్కలు ఊలలు వేస్తున్నాయి (ఇండియా లో అదేరోజు రాత్రి పదింటికే వేసేస్తున్నాయి అది వేరే విషయం)

12:30:00 AM

అర్ధరాత్రి పన్నెండునరకి పోస్ట్ చేసినప్పుడే సింగపూర్ కి స్వాతంత్ర్యం వచ్చింది అని లేట్ గా తెలుసుకున్నాను
మీరు పోస్ట్ వేసిన చిట్టి దినం కూడా శనివారమే కాబట్టి ,పైత్యం పైత్యావలోకనం కోర్ట్ లో వాదోపవాదాలు విచ్చలవిడిగా వాదించేసుకోవాలి అని అంతర్జాతీయ ప్రత్యేక పైత్యపు సెషన్స్ కోర్ట్ నుండి తీర్పు వెలువడింది
దీనికి బులుసు గారే సాక్ష్యం :)

నాగార్జున :)))))))))))))
Thank you very much buddy!

హరే కృష్ణ said...

మధుర,
థాంక్ యూ థాంక్ యూ :)
మొదటి పాజిటివ్ కామెంట్ మీదే ఈరోజు..ఐస్ టీ తాగితే కలిగే ఉపసమనం ఆ కామెంట్,నాగర్జున సానుకూలమైన స్పందన ఒకేసారి కరుణించి రాజశేఖర్ కోపాన్ని కాస్తా కామెంట్ తో నవరత్న ప్రోడక్ట్ పడినట్టు
చల్ల చల్లని కూల్ కూల్ అనుభూతి ని కలిగించాయి
థాంక్స్ :)

హరే కృష్ణ said...

సాయి గారు
థాంక్స్ :) Keep visiting!


బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు
చివరి నిముషం లో ఆ File ఫైనలైజ్ అయ్యింది :) I loved that Expression :)
నచ్చినందుకు చాలా థాంక్స్ :)

హరే కృష్ణ said...

వేణూ శ్రీకాంత్ గారు థాంక్ యూ :)))
>>స్పోర్ట్స్ :))
తల్లి బిడ్డల ప్రేమలా అలా కంటిన్యూ చేసేస్తున్నా :)

హరే కృష్ణ said...

ఇందు గారూ
కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు...బాబోయ్! కెవ్వ్వ్వ్! అని అను కుంటుదనే అనుకున్నాను..రాతి గుండె తిరిగి నాతోనే క్రోకేవ్వ్ పెట్టించేసేలా ఉన్నారు :)))
జోహార్లు కి ప్రతి జోహార్లు :)
>>అయినా ఇంకో టపా పడుతుంది అనుకుంటే ఇది పడిందేంటబ్బా? ;)
మన ఆరాధ్య దైవం శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు, ఫేవరేట్ హీరో మహేష్ బాబు ఏం చెప్పాడు
ఏ టపా రాసామన్నది కాదు కెవ్వ్ పడిందా లేదా :)
Thank you :)
-------------------------------
>>అయినా ఇంకో టపా పడుతుంది అనుకుంటే ఇది పడిందేంటబ్బా? ;)
:))))

వేసేస్తా..వేసేస్తా, ఆ టపా డెకరేషన్స్ దశలో ఉంది మేకప్ వేసి రిలీజ్ చేసేస్తాను జనాల మీదకు :))
అతి పెద్దకామేంట్ కి ఆరాధ్య వందనాలు :)

Sai Praveen said...

కెవ్వు :) :)

బంతి said...

మీ కవిత రచ్చండి బాబు. మీ ఈ కవితను స్పూర్తి గా తీసుకొని మరి కొంత మంది ముందుకు వచ్చి బ్లాగ్లోకాన్ని కవితలతో నింపేయాలి అని కోరుకుంటు...

హరే కృష్ణ said...

సాయి ప్రవీణ్ :))))
థాంక్స్!

బంతి గారు
మీ ఈ కవితను స్పూర్తి గా తీసుకొని మరి కొంత మంది ముందుకు వచ్చి బ్లాగ్లోకాన్ని కవితలతో నింపేయాలి
బాబోయ్ తెలుగు బ్లాగర్లు ఏ పాపం చేసుకున్నారు...:)

ఎంతమంది ఎంత బాగా రాసినా కవిత కి కెవ్వ్ అని ఒక్క స్పందన కూడా రాకపోవడం తో నా హృదయము నిద్రలేచి ఈ పోస్ట్ కి అంకురార్పణ జరిగినది
చాలు ఒక రచ్చ మూడు కెవ్వులు వచ్చేసాయి :)
ధన్యవాదాలు :)

రాజ్ కుమార్ said...

వహ్..వా...వహ్..వా.....
వామ్మో.. ఈ కవితలు నేను తట్టుకోలేక పోతున్నా..
నీ లోని కచ్చకవి కి నా జోహార్లు..
>కేరట్ తురుమువలె నన్ను ఎర్రగా మార్చేస్తున్న ఆ జ్ఞాపకకెరటాలు >> >హహహ్ బీట్ రూట్ అయితే ఇంకా వయొలెంట్ గా ఉండేదేమూ?? హిహిహి

ఇదే ఊపులో ఒక పిచ్చెక్కించే పేరడీ సాంగ్ రాసెయ్యీ.. చాలా కాలమయ్యింది గా రాసీ.. ;)

రవికిరణ్ పంచాగ్నుల said...

మీ "కెవ్వు"త నిజంగానే సార్ధక నామధేయురాలు సార్!!!

మనసు పలికే said...

హహ్హహ్హా.. హరే, అసలు ఆ టైటిల్‌కే 200 మార్కులు ఇచ్చెయ్యొచ్చు. కేరెట్ తురుము ఎందుకొచ్చింది బాబూ మధ్యలోకి..సూపరు క్రియేటివిటీలే నీది.
కవిత కేకో కేక..:D:D

హరే కృష్ణ said...

రాజ్ :)))
>>>నీ లోని కచ్చకవి కి నా జోహార్లు..
హ హ్హ మొత్తానికి అంగీకరించావు :))
>>ఇదే ఊపులో ఒక పిచ్చెక్కించే పేరడీ సాంగ్ రాసెయ్యీ.. చాలా కాలమయ్యింది గా రాసీ.. ;)
;-)))
నిన్నే సబ్బులు మీద పడి ఇందు గారి బ్లాగ్ లో ఒక చిరు పాట రాసేసా వీక్ ఎండ్ లో అదే పని లో ఉండాలి టీం ఉంటే :)
థాంక్స్ :)

రవి కిరణ్ గారు నా బ్లాగ్ లోనికి స్వాగతం :)
మామూలు కెవ్వ్ కదండీ కెవ్వ్ స్క్వేర్
నచ్చినందుకు చాలా థాంక్స్ :)
keep visiting!

హరే కృష్ణ said...

అపర్ణ చాలా థాంక్స్ :)
టైటిల్ కే మార్క్స్ వేసేస్తే తురుము అని ఎవరు ఒప్పుకుంటారు చెప్పు :)
థాంక్ యూ :)

ఫోటాన్ said...

కవిత కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్.........


>>>>>>>ఊర కుక్కలా <<<<<
నవ్వాగడం లేదు...హ హ అ హ హ

-- HarshaM

kiran said...

కికికికికికికికికికికి :D

హరే కృష్ణ said...

హర్ష,కిరణ్ మిత్రులిద్దరికీ ధన్యవాదాలు :)