Pages

Thursday, July 14, 2011

A Wednesday..

జూలై వచ్చిందంటే చాలు..భారీ వర్షం తో పాటు ఏదో ఒక అంతకంటే పెద్ద ఉపద్రవం ముంచుకొస్తోంది  

జూలై 05 2005 లండన్- killing 50 injured 700
జూలై 11 2006 ముంబై-Seven blasts over a span of 11 minutes and killing 209 people
జూలై 26 ,2008 అహ్మదాబాద్ -17 serial blasts in two hours killing as many as 49.
ఇప్పుడు 
జూలై 13,2011 three blasts in South Mumbai killing 23 and injuring over 1oo

ఏదో వర్క్ వచ్చి బయటకు వెళ్ళి పూర్తి చేసేసరికి సాయింత్రం నాలుగు దాటింది..రూమ్ ? ఆఫీస్ ?
ఏం చేయాలో తెలియక సరే మరో రెండు గంటలు కూర్చుందాం పోయేదేముంది అని ఆఫీస్ కి బుద్ధిగా వెళ్ళాక
సాయింత్రం ఏడు గంటలు కావస్తోంది.కొలీగ్ ఇలా బ్లాస్ట్ అని న్యూస్ చెప్పాడు.. జోక్ అనుకున్నాం వెబ్ చూస్తే అప్పటికి update చెయ్యలేదు
మరో అయిదు నిముషాల్లో వెబ్ లో వచ్చాక ఇంటికి ఫోన్ చేసి ఏం పానిక్ అవ్వద్దు అని చెప్పేసి
ఎలా వెళ్ళాలి అని అంతా బయటకు వచ్చేసాం

ఒక టాక్సీ లో వెళ్ళొచ్చు అని ముగ్గురం అడిగితే బ్లాస్ట్ అయింది కాబ్ లోనే..మా అసోసియేషన్ తరపున ఎక్కడికీ వెళ్లొద్దు అని ఫోన్ వచ్చింది అని అన్నాడు
ఇంకేం చేస్తాం అని ట్రైన్ కోసం వెళ్తే అన్ని ఆఫీస్ లనుండి భయం భయం తో స్టేషన్ అంతా నిండి పోయింది
వీటికి తోడు భారీ వర్షం
ట్రైన్స్ లేట్ గా నడుస్తున్నాయ్...వచ్చిన ట్రైన్ లో ఒక కార్నర్ లోనికి కూర్చున్నా ..ఎవరికి నచ్చ్సిన న్యూస్ రూమర్స్ ని చెప్పేసి మిగతా ప్రయాణీకుల టెన్షన్ ని మరింత పెంచేస్తున్నారు
సడెన్ గా ట్రైన్ ఆగిపోయింది... ఏదో అటాక్ అయ్యే ఉంటుంది చాలా మంది మొదలెట్టేసారు, వర్షం పడుతోంది అని ఒక్కరు కూడా అనలేదు
ఏం చెయ్యాలో తెలియడం లేదు నెట్ లో న్యూస్ ఏముందో చూద్దామంటే సిగ్నల్ పూర్తిగా డౌన్ అయిపోయింది..the key to Rebecca నావెల్ తీసి చదవడం మొదలెట్టి సగం అయ్యాక
గంట ప్రయాణం మూడు గంటల్లో తీసుకొచ్చాక బతుకు జీవుడా అనుకుంటూ రూమ్ కి చేరి చూస్తే సిగ్నల్ కాస్త బెటర్ గా ఉంది
మెయిల్స్ కాల్స్ అన్నీ చెక్ చేసుకొని తిని వేళకు నిద్రపోదామన్నా ఎందుకో నిద్రపట్టలేదు..

పొద్దున్న ఎవరో స్టేటస్ మెసేజ్ పెట్టారు
నిన్న చనిపోయిన వాళ్ళు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లతో సమానం
ఎందుకింత నైరాశ్యం అందర్లో.మన రాజకీయ నాయకులు, పాలకులు మన నుంచి వచ్చిన వాళ్ళే......మన సమాజం యొక్క సగటు పరిస్తితి మాత్రమే వాళ్ళ పనితీరులో ప్రతిబింబిస్తుంది.ఒక దేశం ఎంతో డబ్బు పెట్టి ఉగ్రవాదాన్ని పోషిస్తుంటే మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ఆపలేకపొవచ్చు.అవి చూసి నిరాశ చెందేకన్నా ఇకముందు ఏం చెయ్యగలం అని ఆలోచించడం వల్ల అందరికీ ప్రయోజనం

he is right అనుకుంటూ నిద్ర లేచేసరికి బాగా లేట్ అయింది

పేపర్ చూస్తే చాలా భయంకరంగా అనిపించింది ఆ గాయపడి,చనిపోయిన వారిని చూస్తే
ఆఫీస్ దగ్గర లోనే ఉన్న సిద్ధి వినాయక్ టెంపుల్ కి వెళ్ళిన ప్రతిసారి కబూతర్ ఖానా కి తప్పకుండా వెళ్తాను
అయిదు రోజులు కూడా కాలేదు ఈ ఫొటోస్ capture చేసి




అక్కడే ఉన్న బస్ స్టాప్ పక్కనే ఉన్న ఎలెక్ట్రిక్ పోల్ లో బాంబ్
బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడే ఎక్కువమంది చనిపోవడం.

ఎక్కడ ఏం జరిగినా ఎవరి పనుల్లో వారు బిజీ ,ఉదాహరణ మన తెలంగాణా వాదులు .. నిన్న జరిగిన విషయం పెద్ద విషయం కాదు మమ్మల్ని disturb చేయలేదు అని ప్రూవ్ చేస్తున్నారు రైల్ రోకో చేస్తూ.....జనాలు నైరాశ్యం లో లేరు ..అలవాటు పడిపోయారు... ఇంకా చెప్పాలంటే "ఎంత మంది చనిపోయారు అని అడుగుతున్నారు..." క్రికెట్ స్కోరు ఎంత అని అడిగినట్టు.. This is disgusting
  The rains will stop one day but not the tears,Which will hunt them for life long.

7 comments:

ఇందు said...

నాకైతే ఆ దృస్యాలు బీబీసిలో చూసి...కళ్ళలో నీళ్ళు తిరిగాయి! ఏంపాపం చేసుకున్నారని వాళ్ళు అంత బాధ అనుభవించాలి?? చెప్పలేనంత బాధ.... చాలాసేపు మామూలు కాలేకపోయా! జనం అలవాటు పడిపోయారు నిజమే! పొద్దున లేస్తే...ఇంట్లో సమస్యలే చూసుకోవాలో..వీధిలో సమస్యల గురించి ఆలొచించాలో తెలియక...పోతే పోయిందిలే అనే నైరాస్యానికి వచ్చేస్తున్నారు! హ్మ్! అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు...మన దేశానికి అన్నీ ఉన్నా..ఈ దరిద్రమేంటో!

Sravya V said...

Nicely written !
మీరు చెప్పినట్లు నిజమే ! జంతువులని కాపాడటానికి బ్లూ క్రాస్ లు వగైరాలు ఉన్నాయి , టెర్రరిస్టులు ని కాపాడటానికి మానవహక్కుల సంఘాలు ఉన్నాయి , మామూలు మనిషి ప్రాణానికి మాత్రం విలువ లేదు

నేస్తం said...

జనాలు నైరాశ్యం లో లేరు ..అలవాటు పడిపోయారు... ఇంకా చెప్పాలంటే "ఎంత మంది చనిపోయారు అని అడుగుతున్నారు..." క్రికెట్ స్కోరు ఎంత అని అడిగినట్టు

>>>>నువ్వు చెప్పింది నిజమే హరే ...రెండు రోజులు అయితే మళ్ళీ మామొలే..కాని ఏం చేయగలం సామాన్య ప్రజానికం :((

కృష్ణప్రియ said...

Yeah, Sad!

హరే కృష్ణ said...

ఇందు,అక్కా,శ్రావ్య Well said...కృష్ణ ప్రియ గారు hmm
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.. గాయాలు చూసి భయానకంగా అనిపించాయి.మరుసటి రోజు పేపర్ లో ఒక్కొక్కరి పరిస్థితి చూసి నా కళ్ళలో నీళ్ళు చాలా సేపటి వరకు అలానే ఉన్నాయి

http://www.hindustantimes.com/My-husband-does-not-remember-me/Article1-721320.aspx

పరిపాలించే వాడు , తప్పుచేసినవాడు అపర సుఖాలను పొందుతున్నారు..మామూలు మనిషి కే ఈ కష్టాలు అన్నీ...

one of my friend said this '


After Sept 11 attacks on the US, not one single terrorist attack took place in the US..... we had the parliament attack, the Mumbai train blasts, THE MUMBAI attacks... to mention a few........Actually there are so many of them....that its even hard to recollect and pen them down........ we speak of the great Mumbai spirit and the great Indian spirit....where in after every major terrorist attack, we go about with our lives as if nothing happened........it looks like.......we have accepted terrorist attacks like any other Tendulkar's hundred or another political scam....a day to day happening......We must look forward to the day with earnest...when every Indian puts his hand up and says enough is enough. When We say good bye to family in the morning,and we should feel secure that we come back home in one piece back to our family,the way ppl came fwd and strong against the current burning issues like fight against corruption and a sensible INDIAN should say, ENOUGH. we had enough of this bloody mess. We wont take it any more. If need be, lets go ahead and burn the complete POK
that's true

Unknown said...

hare gaaru... bavundi me post..:)

మధురవాణి said...

Hmmm... :(