చిన్నతనం నుండి ఇంటిదగ్గరే పెరిగి నూట యాభై కిలోమీటర్ల దగ్గర లో ఉన్న సిటీ లో మంచి సీట్ వచ్చినా ఇంటిని వదిలి వెళ్ళాలి అన్న ఒకే ఒక ఉద్దేశ్యం తో తమ ఊర్లోనే ఇంజనీరింగ్ చదివి తమ ఊరే లోకంగా పెరిగిన అంతరిక్ష్ ఉద్యోగం కోసం బోంబే వెళ్ళక తప్పలేదు..
కాలేజ్ లో హిందీ క్లబ్ లో చురుగ్గా ఉండడం చేత బాష వల్ల ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నప్పటికీ.. ఇంటి దగ్గర ఉండడం లేదు అనే బాధ.. అమ్మా,నాన్నలను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎక్కువై జాబ్ లో చేరిన కొద్ది రోజులకే అంతరిక్ష్ కి ప్రశాంతత కరువయింది
.ఇంటికి తరచుగా వెళ్ళి వస్తున్నా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆవహించి The city Never sleeps లో నిద్ర కరువై రోజు రోజుకి frustration పెరిగిపోతోంది
చాలా మంది స్నేహితులు బంధువులు ఉన్నా కూడా ఎవరి బిజీ జీవితాల్లో వాళ్ళు తల మునకలై ఉండటంతో బోంబే అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అందరూ ఉన్నారు మరేం ఫర్వాలేదు అని ఎంతో ఊహించుకున్న అంతరిక్ష్ కి నిజంగానే మొదటి ఆరు నెలలు అంతరిక్షం కనిపించింది..
ఎప్పటి లానే లోకల్ ఎక్కి కూర్చోడానికి చోటు లేక కాస్త వెనుక నిల్చొని linkin park వింటూ వింటూ తల ముందుకి వెనుకకి ఆడిస్తూ తనని తానే మరచిపోయి వెనుక ఉన్న అమ్మాయి తల ని అసంకల్పితంగా ఢీకొని తనకి సారీ చెప్పాక ఐపాడ్ తీసేసి పేపర్ చదవడం మొదలెట్టాక
తను మాత్రం తన ఫ్రెండ్ తో ఐ లవ్ అతిఫ్..what a beauty this song has been అని pehli najar mein పాట ని తన ఫ్రెండ్ తో పాటు గట్టిగా హమ్ చేయడం మొదలెట్టాక..తన ఫ్రెండ్ you know my all time favorite will be kya mujhe pyaar hai అంతరిక్ష్ గట్టిగా $#!^@ అని అరిచాక...
అమ్మాయి:hello, what you have been said to me
అంతరిక్ష్: $#!^@
అమ్మాయి:mind your words
అంతరిక్ష్ వెంటనే తన మొబైల్ లో నెట్ ఓపెన్ చేసి ఇక్కడ మరియు ఇది కూడా వీక్షింప చేసాక
అంతరిక్ష్ బర్త్డే కి రుమా మరియు తన ఫ్రెండ్ కి ట్రైన్ లో స్వీట్ ఆఫర్ చేయడం తో ..హే పార్టీ మరి అని అడిగాక సాయింత్రం ముగ్గురూ కాఫీ డే కి వెళ్ళి తమ స్నేహ ప్రయాణం ఒక కాఫీ టేస్ట్ లాంటి అనుభూతిని మొదటి సారిగా పొంది ఒక చిన్న get together చేసుకొని ఈ లైఫ్ కి కాస్త అలవాటయ్యాక అంతరిక్ష్ రుమా పరిచయం లో అంతరిక్ష్ చాలా హ్యాపీ గా ఉన్నాడు.
santacruz నుండి అంధేరీ ఇద్దరూ ఒకే లోకల్ లో కలసి వెళ్ళడం నుండి ఒకే కంపార్ట్మెంట్ లో పక్క ప్రక్కన కూర్చునే అంత సన్నిహిత్వం ఏర్పడింది ఇద్దరికీ
ఈరోజు తొందరగా వచ్చేస్తా అని చెప్పావ్ కదా పొద్దున్న ..lets go and have some fun అని చెప్పి తమ కామన్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు .. పన్నెండు తర్వాత మెరైన్ డ్రైవ్ లో తనతో గడిపిన ఆ క్షణాలు అంతరిక్ష్ ఆనందానికి అవధులు లేకుండా చేసాయి
నెల కు రెండు సార్లు ఇంటికి వెళ్ళే అంతరిక్ష్ ఇప్పుడు రెండు నెలలకి ఒకసారి కూడా వెళ్ళడం లేదు
రెండేళ్ళు గడిచాయి గడిచాక రుమా కి చర్చి గేట్ ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోయింది ..తమ పేరెంట్స్ కూడా బోంబే వచ్చేయడం తో ఫోన్స్ చేస్తూ ఉన్నా అంతరిక్ష్ , రుమా వీక్ ఎండ్స్ లో కూడా కలవడం కుదరడం లేదు..
ఒకరోజు ధైర్యం చేసి రుమా వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంతరిక్ష్
కాలింగ్ బెల్ కొట్టగానే తన యాభై లలో ఉన్న క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోన్న వ్యక్తి తలుపు తీసాడు
ఎవరు మీరు ఏం కావాలి
నేను రుమా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను
రండి హాల్ లో కూర్చోండి
నేను రెండు మూడు సార్లు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేసారు నా వాయిస్ గుర్తు పట్టలేదా లాంటి ప్రశ్న లన్నీ అడిగి మంచి నీళ్ళు తాగుతున్నాడు
అంతరిక్ష్ హాల్ లో బయటకు నవ్వుతూ మాట్లాడుతున్నా లోలోపల తను మాత్రం చాలా నెర్వస్ గా ఉన్నాడు
where is ruma?అని అడగడం తో
కాసేపయ్యాక రుమా వల్ల నాన్న తో అంతరిక్ష్ చెప్పేసాడు మీ అమ్మాయి అంటే నాకిష్టం అని
ఇంతలో అంతరిక్ష్ చెంప చెల్లు మంది
దీనర్ధం ఇంకా ఉంది :)