శిశిర ఋతువు
ప్రశాంతమైన ప్రకృతి,సన్నటి చినుకులు శరీరాన్ని తాకుతున్న భావనకు తోడు, చల్లని గాలి.. అలాంటి అందమైన వాతావరణం లో లైబ్రరీ మెట్లపై కూర్చున్న మేఘ, తమ సుతిమెత్తని పాదాల పై నడక సాగిస్తున్న ఈగలు దోమలను తరుముతూ హేమంత్ కోసం ఎదురుచూస్తోంది.
***సమయం సాయంత్రం ఏడు దాటాక***
హేమంత్ కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కాసేపయ్యాక హేమంత్ ఫ్రెండ్ నుండి ఫోన్ "లబ్బీ పేట్ లో ఉన్న కేర్ హాస్పిటల్ దగ్గరకు తొందరగా రా" అని.
అసలేం జరిగిందో అర్థం కాక హేమంత్ మీద బెంగతో, అరకిలోమీటర్ కు ఒక స్టాప్, కిలోమీటర్ కు మరో సిగ్నల్ చొప్పున గంట సేపు జర్నీ చేసాక కంగారుగా హాస్పిటల్ కు చేరుకుంది. తీరా చూస్తే క్లాస్‌మేట్స్ అందరితో సర్ప్రైజ్ డిన్నర్. ఫ్రెండ్స్ అందరితో సంతోషంగా ఆ హాస్పిటల్ పైన ఉన్న రెస్టారంట్ లో డిన్నర్ ముగించింది. తిరిగి వచ్చేటప్పుడు మేఘ ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి, ఒక ముసి మౌస్ నవ్వు నవ్వి తన చేతిలో ఒక కవర్ పెట్టాడు హేమంత్..
సంతోషం, సంశయం కలగలిపి అదేం లెటరా అని సందేహిస్తూ ఆ రాత్రి పూట హాస్టల్ గేట్ నుండి తన రూం వరకూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు వేసి లెటర్ ఓపెన్ చేయగానే
.
.
.
.
.
.
.
.
.
.
.
లెటర్ లో
"నువ్వు నవ్వితే చాలా బావుంటావ్.. నోరు కాస్త మూసి మూయనట్టు మూస్తే, మూసీ నది లా ఇంకా ఇంకా బావుంటావ్ ఇంద ఇది తీసుకో" అని గిఫ్ట్ పాక్ లో ఉన్న ఫెవి క్విక్ ని చూసి నిద్ర లో మూర్చబోయింది.
--------------------------------------------------------------------------------------------------------------------
అస్వస్థత తో బాధపడుతున్న మేఘ ను చూడడానికి వాళ్ళ నాన్న ఊరి నుండి హాస్టల్ కి వచ్చారు. హేమంత్ మాత్రం తన మూలంగా జరిగిన ఈ "ఆపరేషన్ అస్వస్థత" ని తగ్గించడానికి రాత్రనక పగలనక మేఘ యోగక్షేమాలకోసం అక్కడే ఉంటున్నాడు.. కంట్లో నలుసుని కాపాడుకున్నట్లు కాపాడుకుంటున్నాడు
మేఘ తండ్రి:ఏమమ్మా ఎప్పుడూ ఇలానే ఉంటారా మీ ఇద్దరూ..
మేఘ:ఇతను మా ఫ్రెండ్ డాడీ..ఎలా ఉన్నాడు?
తండ్రి: రెప్ప ఆర్పే లోపే కన్ను ఎత్తుకేలిపోయేలా ఉన్నాడు.
మేఘ చెల్లి:దొంగ మొహం గాడు నిద్రపోతున్న కోడిపెట్టలని ఎత్తుకెళ్ళిపోయే లా వాడి మొహం చూడు.
మేఘ:తన చూపే అంత లే..లైట్ తీసుకో.
మేఘ చెల్లి:తన వక్ర దృష్టినంతా ఉపయోగించి నీ బతుకు ని జున్నుతో కక్రాలు చేసిపాడేసాడు అని నువ్వు ఒప్పుకున్తున్నట్టే కదా.
మేఘ:మాటలు జాగ్రత్తగా రానీ ! నేను చదివేది ఇంజనీరింగ్.. నువ్వు ఇంకా ఇంటర్ లోనే ఉన్నావ్ ఇవేం నీకు అర్ధం కావు.. బెంజ్ సర్కిల్ లో ఉన్న మీ కాలేజ్ కి ఫో.
------------------------------------------------------------------------------------------------------------------
మేఘ తన చెల్లి అయేషా ని కాలేజ్ కి పంపించిన తర్వాత ఆ రోజంతా నిద్రపోలేదు. వాళ్ల నాన్నతో జరిగిన హేమంత్ గురించిన సంభాషణ తనకి నిద్ర పట్టనివ్వలేదు.అసలు హేమంత్ విషయం ఎత్తక ముందే నాన్న అడిగేసారు. వాళ్ల అనుమానం నిజమైతే తనని కడిగేసినా కడిగేస్తారని భయం పట్టుకుంది మేఘకి. తర్వాత రోజు క్లాస్ లో కూర్చొని లెక్చర్ వినకుండా ఒక్కో పేపర్ ని చించి పడేస్తూ, ఈ ఆలోచనలలో నుండి వచ్చిన వత్తిడి ని తట్టుకోలేక ప్రతి అవర్ కి మధ్యలో కాంటీన్ కి వెళ్ళి టీ తో పాటు చిరుతిళ్ళ చిట్టి తల్లి పేరు ని సుస్థిర పరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ పక్కన కూర్చున్న హేమంత్ కి పిచ్చెక్కిస్తోంది.
మేఘ అతని బుర్రతో పాటు వాలెట్ లోని మనీని కూడా తినడం మొదలు పెట్టడంతో ఈ బాధ తట్టుకోలేక 23 బస్ ఎక్కి అయేషా ను కలవడానికి హాస్టల్ దగ్గరకు వెళ్లాడు హేమంత్.
హేమంత్: హలో ,మీతో కొంచెం మాట్లాడాలి.
అయేషా :(అసహనమైన నవ్వుతో) హాయ్ మీరేం చేప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. మా అక్క చాలా అమాయకురాలు తన జీవితం తో ఆడుకోవద్దు ప్లీజ్.. మా ఇంట్లో ఇట్లాంటివి నామోంకిన్ హై
హేమంత్: Well,Then tell me about your family.
అయేషా: Get the hell out of here.
_______________________________________________________________________
ఆరోజు నుండి మేఘ తో పాటు హేమంత్ కి కూడా నిద్ర పట్టడం మానేసింది. హేమంత్ పరీక్ష ధ్యాస లో మునిగిపోయి బ్యాక్ లాగ్ లను ఒక్కొక్కటి రాసుకుంటూ ఈ బాధను కొంచెం మరచిపో సాగాడు.
***సరిగ్గా సంవత్సరం గడిచింది***
ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి.. అక్క కాలేజ్ చెల్లికి ముద్దు కాబట్టి హేమంత్ మేఘాల మధ్య అతివృష్టి అయేషా వచ్చి పడడం తో, వర్షం లేని పంటభూమి లా హృదయం చిగురించక వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ పలచబడి వాడిపోయిన బ్రెడ్ పెరుగు వడ అయిపోయింది. అలా ఓ ఆరునెలలు గడిచాక ఒక రోజు బ్యాక్ లాగ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే రిజల్ట్స్ చూసిన హేమంత్ అయేషా,మేఘ లు ఉంటున్న రూమ్ కి వెళ్లాడు అదోలాంటి హావభావాలతో.
"సంవత్సరం పాటు పుస్తకాలే లోకం గా బతికాను. పరీక్ష లేని నెల ఏంటో తెలియకుండా కష్టపడ్డాను. అయినా కూడా అయిదు పేపర్లు ఫెయిల్.. ఇదంతా మీ వల్లే మీ వల్లే" అని నొక్కి వక్కాణించి రూమ్ లో ఉన్న గ్లాస్ పెయింటింగ్‌లు బద్దలు కొట్టాడు. చేతికి చిన్న గాయమైతే, వాష్ రూమ్ లో నికి వెళ్ళి క్లీన్ చేసుకొని ఖాళీగా ఉన్న నోటితో తిడుతూ కట్టు కట్టుకొని బయటకొచ్చాడు.
****ఆ మరుసటి రోజు****
హేమంత్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.
కాసేపయ్యాక సెల్ ఎదురుగా మేఘ, అయేషా తో పాటు వాళ్ళ పేరెంట్స్. అయేషా మొహం నిండా గాయాలు ఉన్నాయి. మేఘ మొహం కూడా చిన్న చిన్న గాట్లు పడి ఉన్నాయి. అభావంగా కూర్చుని దిక్కులు చూస్తూ ఈ సెల్ సినిమా చూస్తున్న కానిస్టేబుల్ తో,
సబ్ ఇన్స్పెక్టర్ :చట్టాన్ని అతిక్రమించాడు ఇతన్నేం చేద్దాం.
హెడ్ కానిస్టేబుల్:వెయ్యి రూపాయిలు ఫైన్ కట్టించి వదిలేద్దాం.
సబ్ ఇన్స్పెక్టర్ "సరే ! వీళ్లనేం చేద్దాం ? అసలు ప్రాబ్లెం ఏంటి?" అని అడగడం తో మేఘ వాళ్ళ పేరెంట్స్ హేమంత్ ఫోటో ని సబ్ ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టారు.
హెడ్ కానిస్టేబుల్ : ఈ హేమంత్ మూలం గానే వీళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మరో అయిదు వేలు కట్టించి బయటకు పంపిద్దాం.
***********************************************************************************************************
బ్లాంక్ expression తో చూస్తున్న హేమంత్ మరో అయిదు వేలు కట్టి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక మేఘ, అయేషా ల తో "అసలేం జరిగింది ?" అని అడగడం తో
.
.
.
.
.
.
***ఆ ముందు రోజు రాత్రి***
పడుకునే ముందు బెడ్ షీట్ ని సర్దుతున్నారు మేఘ, అయేషా. సడెన్ గా ఆ రోజు మద్యాహ్నం తమ రూమ్ కి వచ్చిన హేమంత్ వాలెట్ లో నుండి క్రింద పడిన ఫోటో కనిపించింది. ఇది నాదంటే నాది అని జుట్టు చించుకొని ఒకర్ని ఒకరు గాయపర్చుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. కానీ అక్కడ హేమంత్ ని చూసి కంప్లైంట్ ని withdraw చేసీ చేసుకోలేక ఇంక ఫైన్ తో సరిపెట్టుకొని వచ్చేసారు.
అయేషా: సరే కాని నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎందుకొచ్చావ్.
హేమంత్ : నిన్న బస్ పాస్ లో ఉన్న నా ఫోటో ని ఎవడో కొట్టేసాడు. ఈరోజు చెకింగ్ లో ఫోటో కనిపించకపోవడం తో ఫైన్ కాకుండా స్టేషన్ కి పట్టుకోచ్చేసారు..అని చెప్పి ముగించాడు.
*****************************************************************************************************************
ఆ మరుసటి రోజు హేమంత్ ని మేఘ నిలదీయడం మొదలు పెట్టింది. "నిజం చెప్పు నువ్వు అయేషా కలసి నిన్న సినిమాకి వెళ్ళారా లేదా ?" హేమంత్ మేఘ చెంప చెళ్లుమనిపించాడు. "దొంగ మొహంది ఆ తర్వాత పార్క్ కి కూడా వెళ్ళాం అని చెప్పలేదా".
మేఘ:ఛీ..దరిద్రుడా..ఒక్క కారణం చెప్పు నేనంటే నీకెందుకు ఇష్టం లేదో..
హేమంత్:చెబితే ?
మేఘ:ముందు చెప్పు..చెబితే నీ మొహం కూడా చూడను ఈ జన్మ లో.
హేమంత్: పుట్టుమచ్చలకి నోమార్క్స్ క్రీమ్ రాసుకొనే నీలాంటి అమ్మాయిలను నేను ప్రేమించను కాక ప్రేమించను అని చెప్పి తనకి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసి ఆ అయేషా ..హా అవును అలంకార్ లో ఏడింటి షో కి బుక్ చేసా.. అని చెప్పి ఫోన్ కట్ చేసి మేఘ కి కట్ చెప్పేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
Thursday, May 26, 2011
Monday, May 9, 2011
Any Way నాశన!
ఇంటర్వ్యూ జరిగినరోజు రాత్రి ప్రతీక్ కి నిద్రపట్టడం లేదు.. ఇంటర్యూ కోసం కంపనీ కి వెళ్లడం, అక్కడ అన్వేష్ ఎదురయ్యి పాత రోజులు గుర్తు రావడం, అన్వేష్ కళ్లుతిరిగి పడిపోవడం వలన అదే రోజు హాస్పిటల్ కి వెళ్ళిరావడం ఆ తర్వాత తన
ఇంజనీరింగ్ రోజుల ఙ్ఞాపకాలతో నిద్రపట్టక టెర్రస్‌పై కూర్చున్నాడు. ఇక రాత్రంతా తన ఫ్రెండ్స్‌తో ఫోన్లలో కంపెనీలో అనలిస్ట్‌గా వారం రోజుల్లో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ ఇమెయిల్ లో ఉంది.
ప్రతీక్ రిపోర్ట్ చెయ్యాల్సింది, తన మూలంగా ఇంజనీరింగ్ లో సొరచాపకు వల వేసి నట్టు రాగింగ్ చేస్తూ అడ్డంగా ప్రిన్సిపాల్ కి దొరికిపోయిన అన్వేష్ కి. తమ డిపార్టుమెంటు కి అతనే మేనేజర్ కావడం తో భయం భయం తో పని చేయసాగాడు.
రెండు నెలల ముందు టీమ్ లో చేరిన హిమ బిందు అలియాస్ అల్లా ఆమెన్ బిందు ప్రతీక్ కి హెల్ప్ చేస్తుండగా ఓర్వలేని అన్వేష్, బిందు ని తన కేబిన్ కి పిలిచి అతనికి హెల్ప్ చేయొద్దని చెప్పి ప్రతీక్ కి మరింత వర్క్ ఇవ్వసాగాడు. ప్రతీక్ కి ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక, అంత వర్క్ ముందుకు కదలక పోవడంతో ప్రోగ్రెస్ కావడం లేదని అందరి ముందు తిట్టేసేవాడు అన్వేష్.
రెండు నెలలు గడిచాయి
ఇటువైపు ప్రతీక్ కి చిరిగి చేతబడి చేసేస్తున్నాడు అన్వేష్. ఎంత మొరపెట్టుకున్నా వర్క్ ని తగ్గించక, ఇంకో అనలిస్ట్ ని కూడా recruit చేయించక ఇద్దరు చెయ్యాల్సిన పని ని ఒక్కరితో చేయిస్తున్న అన్వేష్ పై రోజురోజుకీ ప్రతీక్ కి కోపం పెరిగి పోతుంది.
ఆ తర్వాత రోజు అన్వేష్ తన ప్లేస్ కి వచ్చే టైం కి రెండు నిముషాల ముందు గబ గబా కేంటీన్ వైపు వెళ్ళిపోయాడు ప్రతీక్.
ప్రతీక్ క్యూబికల్ కి వచ్చిన అన్వేష్, ప్రతీక్ లేకపోవడం తో తన ప్లేస్ లో కూర్చొని వెయిట్ చేయసాగాడు. ఇంతలో ప్రతీక్ డెస్క్ లో ఉన్న ఫోన్ మోగింది.
అందరూ అన్వేష్ ని చూడసాగారు.. మరికొంత మంది గట్టిగా నవ్వడం మొదలు పెట్టడం తో అక్కడనుండి కోపం తో తన కాబిన్ వైపు నడిచాడు అన్వేష్. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండెకోత కోసినా చేసినావు ఊయల
అని ప్రతీక్ డెస్క్ లో ఫోన్ రింగ్ టోన్ రిపీట్ అవ్వడం తో అన్వేష్ కి గర్వ భంగం కలిగి అక్కడ నుండి జంప్.
తనెంతగానో ఇష్టపడిన బిందుకి, అన్వేష్ తన ప్రేమ సంగతి తెలియజేసే రోజు రానే వచ్చింది. బిందు మాత్రం, అన్వేష్ ప్రపోజల్‌ని కాదనలేక అవుననలేక ఆలోచించుకోడానికి తనకి కాస్త టైం కావాలని అడిగి అన్వేష్ కి బిందెడు నీళ్ళు తాగించేలా చేసింది. బిందు ఆలోచనలతోనే అన్వేష్ ప్రతీక్ డెస్క్ దగ్గరకు వచ్చి "వర్క్ ఇంకా బాగా చెయ్యాలి Always remember one thing Love Your Neighbor as Yourself. if you follow this the success will be yours" అని తన ప్రపోజల్ ని పక్కన పెట్టిన బిందు మీద కోపాన్ని ఇలా ఒక గంట సేపు క్లాస్ గా బిందు కి వినబడేలా ప్రతీక్ కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత రోజు నుండి ప్రతీక్ లేట్ గా రావడం మొదలు పెట్టాడు. ఇదే తీరు ఆ నెలంతా కొనసాగడం తో ప్రతీక్ ని అందరి ముందు నిలదీశాడు అన్వేష్. మేనేజ్ మెంట్ కూడా అక్కడే ఉండటం తో, "సరే మా ఇంటి దగ్గర ఒక రూమ్ ఉంది అక్కడ ఉండు ఆఫీస్ కూడా కాస్త దగ్గర పడుతుంది" అని చెప్పి ప్రతీక్ ని అక్కడకి షిఫ్ట్ చేయించాడు అన్వేష్. రెండు నెలలు గడిచాయి.. అంతా సెట్ అయ్యేసరికి అక్కడి నుండి "రెండు కిలోమీటర్ల దూరం లో నీకు వేరే రూమ్ చూసి పెట్టా" అని చెప్పి ప్రతీక్ ని వేరే రూమ్ కి షిఫ్ట్ చేయించాడు అన్వేష్.
అయితే ప్రతీక్ రూమ్ షిఫ్ట్ అయ్యాక టైం కి వస్తున్నాడు కానీ ముందు ఉన్నంత చురుకుగా పనిచేయడం లేదు.. ఏమయ్యిందో తెలియక అన్వేష్ ఇదే విషయం ఎన్నోసార్లు ప్రతీక్ ని అడిగినా nothing like that .I'm fine అని చెబుతూనే ఉన్నాడు ప్రతీక్.
అతని బాధకి కారణం అతని మీద రోజు రోజుకీ పెరుగుతున్న బర్డెన్ అని ఫీల్ అయ్యిన మిగతా టీం మేట్స్ అందరూ, మేనేజర్ దగ్గరకు వెళ్ళి ప్రతీక్ కి వర్క్ తగ్గించమని చెప్పి చూసినా, అన్వేష్ మాత్రం "మిగతా పని మీరు చేస్తారా" అని వాళ్ళ నోళ్ళు మూయించేసాడు.
ఒకవైపు ప్రతీక్ మీద పగ తెర్చుకుంటున్న అన్వేష్, మరోవైపు బిందు ఎప్పుడెప్పుడు "యస్" చెబుతుందా అని ఎదురు చూస్తూ పొరపాటున "నో" చెబుతుందేమో అని భయపడుతున్నాడు కూడా. సరే, బిందుతో ఏదో ఒకటి తేల్చుకోవాలి అనుకుని ఒకరోజు అడిగాడు అన్వేష్, "ఇంకా ఎంత టైం కావాలి నీకు, తొందరగా ఏదో ఒక డేట్ ఫిక్స్ చెయ్" అని. బిందు మాత్రం తడబడుతూ "ఇంకొంత టైం కావాలి" అని చెప్పడంతో అన్వేష్‌కి అసహనం మరింత పెరిగిపోయింది.
బిజినెస్స్ మీటింగ్ పని మీద అన్వేష్ ఒక వారం రోజుల పాటుకొరియా వెళ్లాల్సి వచ్చింది.
సరిగ్గా వారం రోజుల తరువాత తిరిగి వచ్చి చూస్తే, తన కేబిన్ లో నాలుగు కవర్లను చూసి నిశ్చేష్టుడై మళ్లీ రెండో సారి ఆఫీస్ లో కింద పడిపోయాడు అన్వేష్ .
మిగతా కొలీగ్స్ వచ్చి చూస్తే బిందు ప్రతీక్ ల రిజిగ్నేషన్ లెటర్స్ , ఒక invitation కార్డ్ ఇంకో లెటర్ లో
డియర్ అన్వేష్,
you are right
Love Your Neighbor as Yourself. the success will be yours ఇదే ఫాలో అవ్వకపోతే నాకు బిందు దొరికేది కాదు. నీ ఇంటిదగ్గర, అదే బిందు వాళ్ళ ఇంటి ఎదురుగా నాకు రూమ్ ఇప్పించినందుకు నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను.
విత్ లవ్,
బిందుప్రతీక్.
కొరియా లో హోటల్ లో ఉన్న అన్వేష్ ఈ ప్రేత ప్రతీక్ కల ని తలచుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకు జరగబోయే ప్రతీకారం ని ఆపడానికి ఆ తర్వాత రోజే మలేషియా వచ్చేసాడు. ఆ తర్వాత ప్రతీక్ తో ఇంతకు ముందు ఉన్నంత కర్కశంగా కాకుండా కాస్త ఫ్రెండ్లీ గా ఉండడం అలవరుచుకున్నాక అన్వేష్ ప్రతీక్ కొద్ది రోజులకి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.. అన్వేష్ బిందు మీద పెంచుకున్న ప్రేమ కారణంగా, ప్రతీక్ కి పని తగ్గడం తో పాటు ఇంక్రిమెంట్,బాస్ సప్పోర్ట్ లభించాయి. బిందు ఏ సమయంలో ఏం చేస్తుందో, తనకి ఏ విషయాలు నచ్చుతాయి, ఎవరెవరితో క్లోజ్‌గా ఉంటుంది ఇట్లాంటి విషయాలను అన్వేష్ కి అందచేస్తూ informal informer గా తయారయ్యి హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు.
ఇంతలో వేరే టీం లో ఉన్న వరుణ్ తో బిందు intercom ని ఇంటిని చేసేసి విచ్చలవిడిగా పిచ్చేక్కేంచేయడం తో ప్రతీక్ అన్వేష్ కి చెప్పాడు..
ప్రతీక్: ఫైర్ ఇంజిన్ నీ ఇంట్లో పెట్టుకుంటావో లేక ఆ వరుణ్ ని ఫైర్ చేస్తావో తేల్చుకో
అన్వేష్:ఎందుకు ఏం జరిగింది??
ప్రతీక్:నా ప్లేస్ లో ఒక రెండు రోజులు కూర్చో.. బిందు నీకు 4D సినిమా చూపించేయడానికి రడీ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
రెండు రోజులు ఇదంతా గమనించిన అన్వేష్ ఫైర్ కాదు, వీళ్ళిద్దరినీ ఒకేసారి ఉద్యోగం లోనుంచి తీసేసినా ఒకర్ని తీసేసినా నా మీద డవుట్ వచ్చేస్తుంది.. వీళ్ళను ఇంకేదైనా చెయ్యాలి అని చెప్పి కాంటాక్ట్స్ లో మలేషియా ముఠా నెంబర్ తీసి కాల్ చేసాడు అన్వేష్. "i will send the details by today work should be finished by next week!"అని చెప్పి ఇంటికేల్లిపోయాడు.
ఆ వచ్చేవారం ఊహించినట్టు గానే బిందు వరుణ్ కనిపించడం మానేశారు. పోలీసులు వచ్చి అన్వేష్ ని కోర్ట్ కి ఈడ్చుకెల్లిపోయారు. ఊహించి ఊహించనట్టుగా ప్రతీక్ కూడా అన్వేష్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేసాడు.. అన్వేషే వాళ్లను ఏదో ఒకటి చేసి ఉంటాడు, ముఠా అని తన కాంటాక్ట్ లో నేను కూడా చూసాను, ఇది ఖచ్చితంగా అన్వేష్ పనే అని చెప్పాడు. తన కళ్లని తానే నమ్మలేక విస్తుపోయి చూస్తూ "Mutha అంటే Malaysia Ultra Telnet Hi-tech Association" అని ఎంత గట్టిగా గొంతు చించుకుని అరిచి చెప్పినా కూడా వినకుండా, జడ్జ్ పదేళ్ళ కఠోర కారాగార శిక్ష ని
విధించేసాడు.
వారం తర్వాత ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ కమ్ కల్లోలియా అయిన వరుణ్ వాళ్ళ అన్నయ్య తో బిందు పెళ్లి మలేసియా కాపిటల్ నుండి ఇండియా బిజినెస్ కాపిటల్ లో ఘనంగా జరిగింది.
సాక్షి సంతకాలు ప్రతీక్, వరుణ్ ముంబై రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టేసి పార్టీ చేసుకున్నారు.
ఇదంతా తెలుసుకున్న అన్వేష్ మాత్రం "పామని తెలిసీ పాలు పోసీ పెంచితినే" అని ప్రతీక్‌ని తలుచుకుంటూ కొత్త పాటకి బాణీ కట్టి మరీ పాడుకుంటూ జైల్లో కూర్చున్నాడు.
రాత్రి పూట సలాడ్ మాత్రమే తిని నిద్రపోయే బ్లాగాభిమానులకు ఈ కధ అంకితం.

ఉన్నట్టుండి ప్రతీక్ పెర్ఫార్మన్స్ లో మార్పు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది..ఏరోజు ఇచ్చిన పనిని ఆరోజే సహనంగా పూర్తి చేయడం తో ఆనంద పడాలో కోప్పడాలో తెలియని అన్వేష్, మరొక రెండు వారాలు చూసి ప్రతీక్ కి మరింత వర్క్ ని ఇవ్వసాగాడు. బిందు అంటే అన్వేష్ కి వల్లమాలిన అభిమానం; బిందు కి అన్వేష్ అంటే వల్ల దిక్కు మాలిన గౌరవం. బిందు వాళ్ళ ఇల్లు కూడా అన్వేష్ ఇంటికి దగ్గరగా ఉండటం తో జాయిన్ అయిన రెండు నెలల్లోనే బిందు వాళ్ళ అమ్మ నాన్నలకు బాగా చేరువయ్యాడు అన్వేష్.

Subscribe to:
Posts (Atom)