Pages

Thursday, March 17, 2011

గ్రామ గేదెలు..సమయం:సాయంత్రం అయిదు గంటలు
ప్రదేశం:మర్రి చెట్టు కింద రచ్చ బండ ఎదురుగా
గ్రామం:బిక్కవోలు
జిల్లా:ఏ జిల్లా..ఏ జిల్లా !
ఏ జిల్లా పేరు చెబితే బ్లాగు కాండలు జరుగుతాయో,ఏ నది పేరు చెబితే కామెంట్లు ఏరులై పారుతాయో..
       

 
పదిహేనేళ్ళ  వయసున్న సమీర్  కి ఆరెంజ్  సినిమా విడుదల అయ్యేవరకు  గ్రాఫిటీ అంటే ఏంటో తెలియదు..
ఆరెంజ్ చూసాక నేను కూడా ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని తమ గ్రామం లో వేసిన గోడలను ఏదో ఒక మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశ్యం తో తన దగ్గర మిగిలిన పాకెట్ మనీ తో రెండు స్కెచ్ పెన్ లు ఒక మార్కర్ తీసుకొని గ్రాఫిటీ గ్రామోద్ధారకుడై  బయలు దేరి ఒక్కసారిగా సడెన్ గా ఒక దగ్గర ఆగాడు.                                                                             

ఏదో మిస్ అయ్యింది  అని ఆలోచిస్తూ మళ్ళీ ఇంటికి చేరి ఒక ఎరుపు హిట్ మరొక నలుపు హిట్ తో  hitman అవతారం దాల్చి మళ్ళీ బయలు దేరి కొంత దూరం వెళ్ళాక  ఒక దృశ్యాన్నిచూసి మంత్ర ముగ్ధుడైనాడు(గోడ పై ఉన్న మంత్ర సినిమా పోస్టర్ ఆ  ప్రక్కనే ఉన్న  ముగ్ధా గాడ్సే ని మిక్స్ చేస్తే వచ్చిన ఫైనల్ రిజల్ట్- సమీర్ వక్ర దృష్టి సంధి).

అదే దారిలో సమీర్ వాళ్ళ మామయ్య ఎదురుపడి మా శృతి ఏది..అసలే నెట్టు,చాటింగ్ అని పెడదోవ పడుతోంది.. మొన్ననే దానికి వార్నింగ్ ఇచ్చాను బుద్ధి గా చదువుకోమని ..తనని బాగా చూసుకుంటావ్ అని నీతో పాటు పంపిస్తే నువ్విలా ధ్యాస లేకుండా రోడ్ల మీద విచ్చలవిడి విలేజీ విహారాలు చేస్తున్నావ్ !...ఏంటో కలికాలం.
           
పొద్దున్న తను కూడా నీతో పాటు స్కూల్ కి వచ్చింది కదా.అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా,ఈ గోడలెమ్మట తదేకం గా చూస్తున్నావ్.అసలేం జరుగుతోందిక్కడ వెంటనే నాకు సమాధానం తెలియాలి అని గట్టిగా అడగడం తో గుక్కతిప్పుకోకుండా గోడ్యేషు గాడ్సే  అని చెప్పేసి పరుగుమొదలెట్టాడు సమీర్.

మామయ్య నుండి తప్పించుకుంటూ ఇంకో వీధి కి వెళ్ళాక  గోడల నిండా  కొన్ని అక్షరాలు వింతగా వేరే రంగులో రాసి ఉండటం గమనించిన సమీర్ వాటి మీద గోడలను గీకేసి గోడపై గ్రాఫిటీ లు గీసినారు అంటూ అక్కడున్న ఒక అక్షరాన్ని ఖండ ఖండాలుగా చెరిపేసి  హిట్ స్ప్రేయ్ తో  ఏయ్ ఏయ్ అని  కొట్టేసి ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయాడు.

ఇక నుండి తన resume ని ఇలా తయారు చేసుకోవచ్చని ఒక కల కన్నాడు
సమీర్ ఫీచర్స్:
Graduate ఇన్ భక్తి 
Masters in భయ భక్తి 
Doctorate in విభక్తి 
Finally అబ్బురపరిచే మేధాశక్తి
  
ఇలా ఇదే కలని మరో వారం రోజులు పాటు కన్నాక..ఈ వారం లో గ్రామం లో ఏదో జరగరానిదే జరిగింది

ఆ  మరుసటి రోజు  సమీర్ పొద్దున్న లేచి బ్రష్ చేద్దామని లేచాడు నవ్వుతూ.ఎప్పటిలానే పేస్ట్ కోసం శృతి వాళ్ళ ఇంటికి  వెళ్ళాడు. దారిలో బయట ఆ  గోడలను చూసి మురిసిపోయి కేక కళ ని తీసుకొచ్చిన సమీర్ భుజాలను తట్టుకుంటూ శబాష్ లు చెప్పుకుంటూ తనలో తానే సిగ్గు మొగ్గలేసి మెలికలు తిరిగి మురిసిపోతున్నాడు.  

అయితే గ్రామాన్ని అల్ల కల్లోల కబోడియా  చేసిన సమీర్ ఇంటి ముందు గ్రామ పెద్దలంతా వచ్చి ఆగారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారు
సగం పేస్ట్ నోట్లో ఉండటం తో ఇంట్లో పేస్ట్ లేదు,ప్రస్తుతం నోరు ఖాళీ గా లేదు.కాసేపు ఆగండి అని వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టాక

గ్రామ పెద్దలు:నువ్వేం చేశావో నీకు తెలుసా,అసలు ఎందుకలా చేసావ్!
సమీర్:ఇప్పుడు కొత్తగా నేనేం చేసాను..ఏ నిందారోప్ పాప్  హై!
గ్రామ పెద్ద:గ్రామమంతా బ్రష్టు పట్టుకుపోయింది నీ వల్ల. కారణం చెప్పకపోతే నీకు నాన్న రాజశేఖర్ రణం సినిమానే
సమీర్:డిక్షనరీ లో నాకు నచ్చని ఒకే ఒక్క పదము.దగ్గర దర్శన్  శాస్త్రం ప్రకారం దు అనేది ఒక దుష్ట పదం.  గ్రామం లో  ఈ సమీర్ అయినా ఉండాలి  దు ఫ్రీ గ్రామమైనా అవ్వాలి.

గ్రామ పెద్దలు:కిరాణా  కాణం,మార్పిడి చెల్ల ,మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఇక్కడ  కల ఇటువంటి సాధారణ పదాలను  వక్రీకరించే లా చేసిందే కాకుండా

ఇక్కడ  చెత్త వేయరా! నొటీసులు అంటించరా ! అని సామాన్య ప్రజలను రెచ్చగొట్టి  పడుకున్న గాడిద ని లేపి తన్నించుకునేలా చేసావ్ కదరా గ్రామ ప్రతిష్ట ని.
సమీర్:అయితే ఇప్పుడు ఏం అంటారు.    

గ్రామ పెద్ద:.నిన్ను అంటే నువ్వు పారిపోతావ్.నీకు  పదివేల  రూపాయలు జరిమానా విధించి  సర్పంచ్ ఆఫీస్ లో ఉన్న కౌంటర్ లో డబ్బు కట్టి మీ ఇంట్లో  ఉన్న ఆ  రెండు  గేదె లను తిరిగి తీసుకెళ్ళమని చెప్పి గ్రామ పెద్దలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

గేదెలను తిరిగి హస్త గతం చేసుకొవడానికి వెళ్ళిన సమీర్  డబ్బులు కట్టేసి గేదెలు విడిపించేసి ఇంటికి  తిరిగి వస్తుండగా..
వెనుక నుండి గట్టిగా హారన్ మోగింది.ఒక లారీ వెనుక నుండి  వస్తోంది. గేదెలను ప్రక్కకి త్రోలి లారీకి  దారిచ్చిన సమీర్ 
లారీ వెళ్ళిపోయాక

లారీ వెనుకున్న రెండక్షరాలు చూసి  బ్లాగుల్లో  కధానాయకుని  పేరు సమీర్, హీరోయిన్ పేరు శృతి, బ్లాగు పేరు ఇంద్రధనుస్సు లా పుంఖాను పుంఖాలుగా ఉండేసరికి ఏ బ్లాగుకొచ్చి ఏ కధ చదువుతున్నాడో తెలియక కన్ఫ్యూజన్ కెరటాల్లో కలిసిపోయి నట్టు  నిచ్చేష్ఠుడై అక్కడే కాసేపు ఉండిపోయాడు.
ఆ  లారీ వెనుక ఉన్న రెండక్షరాలు 
చెరపకురా చెడేవు..34 comments:

మనసు పలికే said...

1st comment ..???

మనసు పలికే said...

హరే.. హహ్హహ్హా.. నీ క్రియేటివిటీని గ్రామ గేదెలెత్తుకెళ్ల..;)
>>పేస్ట్ కోసం శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
>>ఇంట్లో పేస్ట్ లేదు,ప్రస్తుతం నోరు ఖాళీ గా లేదు
హిహ్హిహ్హీ.. భలే రాశావులే:)))

వేణూరాం said...

బాబూ.. నీ పదప్రయోగాలకి నా లాల్సలాం.. గర్జించావ్ గా..
గోడ్యేషు గాడ్సే
హిట్ స్ప్రేయ్ తో ఏయ్ ఏయ్ అని కొట్టేసి (ఇతి పిచ్చి కేక..)
Graduate ఇన్ భక్తి
Masters ఇన్ భయ భక్తి
Doctorate in విభక్తి
Finally అబ్బురపరిచే మేధాశక్తి

అల్ల కల్లోల కబోడియా.. (దీనర్ధం ఏమిటీ?) :) :) :)

వేణూరాం said...

"గ్రామ గేదెలు.kevvvvvvvvvvvvvvvvvvv

మంచు said...

గ్రామం:బిక్కవోలు
జిల్లా:ఏ జిల్లా..ఏ జిల్లా !
ఏ జిల్లా పేరు చెబితే బ్లాగు కాండలు జరుగుతాయో,ఏ నది పేరు చెబితే కామెంట్లు ఏరులై పారుతాయో..
---------------
అదే తూర్పు గొదావరి ...గొదావరి .....గొదావరి ....:D:D

karthik said...

kevvu keka.. rachcha chesav :D

రహ్మానుద్దీన్ షేక్ said...

బిక్కవోలులో ఈ సీన్ జరుగుద్దా? అని నేను బ్లాగ్ముఖంగా అడుగుతున్నాను.

..nagarjuna.. said...

ఇందులో నా బలాగు పేరుంది, నవ్వాలో ఏడ్వాలో తెలుస్తలేదు వాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

మధురవాణి said...

హహ్హహా....బాబోయ్.......తెగ నవ్వించేసారు.. బాగా నవ్వొచ్చినవి కొన్ని చెప్తాను..
వక్ర దృష్టి సంధి
విచ్చలవిడి విలేజీ విహారాలు
గోడ్యేషు గాడ్సే - ఇది టూ మచ్ అసలు.. :))
గోడపై గ్రాఫిటీ లు గీసినారు... మిగతా పాట కూడా రాస్తే అదిరిపోయేది! :D
సమీర్ ఫీచర్స్ లిస్టు :)
దగ్గర దర్శన్
ఫైనల్ గా.. టైటిల్ కేక! :))

Sravya Vattikuti said...

హ హ సూపర్బ్ ! చెరపకురా చెడేవు ఇవి రెండు పదాలు :)

కావ్య said...

నేను మర్డర్స్ చెయ్యడం మానేసి చాల రోజులు అయ్యింది .. నిన్ను మాత్రం ఈ రోజు లేపెయ్యకపోతే .. చూడు .. దొంగ మొహం .దొంగ మొహం .. నా శ్రుతి సమీర్ ని ఇలా చేస్తావా .. దొంగ మొహం :)

నాగప్రసాద్ said...

:D :D

Indian Minerva said...

గోడ్యేషు గాడ్సే :D అనగానేమి? (16 Marks)

vikky said...

last post lo punch lu taggayi kaani ee post lo malli form lo ki vachaavu....punch lu adirayi....koncehm editing chesi unte inka effective ga udnedi..aa "sameer kala kanadam" anna part sarigga fit avvaledu katha lo.....godyeshu godse highlight.......O....range lo undi punch :)

హరే కృష్ణ said...

అప్పూ..కధ కాన్సెప్ట్ ముందే తెలిసిపోతే వచ్చిన చిక్కిదే :)
పోస్ట్ నచ్చినందుకు చాలా ధన్యవాదాలు :)

రాజ్
హమ్మయ్య! నీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమనిపించింది
థాంక్ యూ థాంక్ యూ :)

హరే కృష్ణ said...

మంచు గారు అవును ముమ్మాటికీ తూర్పు గోదావరి నే :)
ధన్యవాదాలు!

కార్తీక్ చాలా థాంక్స్ :)

రహ్మానుద్దీన్ గారు :D :D
జరిగే చాన్సులు బాగా ఉన్నాయి :)
థాంక్స్ :)

హరే కృష్ణ said...

మధురవాణి
మీ వ్యాఖ్య,రాజకుమార్ కామెంట్ తో మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈరోజు మ్యాచ్ లో గ్రౌండ్ లో మరింత గోల చేసేసాను :))
thank you my friends

నచ్చినవి quote చేసినందుకు థాంక్స్ :)
టైటిల్ కి కేకేసుకున్న ఇద్దరికీ కేక పెడుతూ ధన్యవాదాలు చెబుతున్న హరే :)

హరే కృష్ణ said...

శ్రావ్య గారు థాంక్ యూ థాంక్ యూ :)
ఇవి కూడా రెండక్షరాలే :)
jk


నాగ ప్రసాద్ థాంక్ యూ :)

హరే కృష్ణ said...

నాగార్జునా..సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ...
ఆ ఇంద్రధనస్సు బ్లాగులు సంఖ్య చూసి నాకు దిమ్మతిరిగిపోతోంది ఏ అగ్రిగేటర్ చూసిన మినిమం ఆరు ఏడు బ్లాగులు ఉన్నాయి ఒకే పేరుతో
ఇంద్రధనస్సు violet

ఇంద్రధనస్సు indigo

ఇంద్రధనస్సు brown

ఇంద్రధనస్సు green

ఇంద్రధనస్సు yellow

ఇంద్రధనస్సు orange

ఇంద్రధనస్సు red

ఇలా IPL టీమ్ లు పెట్టుకున్నట్టు మీ ఇంద్రధనస్సు franchise owners టీం మీటింగ్ పెట్టుకుంటే
ఏదైనా confusion తగ్గే సూచనలు కనిపించేలా ఉన్నాయి :)

హరే కృష్ణ said...

ఇండియన్ మినేర్వా గారు నా బ్లాగులోనికి స్వాగతం :)
అది situation తో పాటు పోస్టర్ లెంగ్త్ విడ్త్ బట్టి మార్కులు డిపెండ్ అయి ఉంటుందండీ :)
వర్ణన కూడా చాలా crucial :)
పదహారు మార్కులంటున్నారు..పెద్ద కామెంట్ అవుతుందేమో..తొందర్లో ఒక పోస్ట్ రాసేస్తా మీకోసం తప్పకుండా
ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

విక్కీ,చాలా థాంక్స్
తప్పకుండా నీ సూచనలు పాటిస్తాను
చదివిన వాళ్ళకే తెలిస్తుంది ఏది మిస్ అయిందో అనేది :)
thank you very much buddy:)

హరే కృష్ణ said...

కావ్య..సభ కి నమస్కారం

ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది

Ennela said...

వామ్మో హరే గారూ, యీ టపా యేంటీ, యీ పద ప్రయోగాలేంటీ!! ఎక్కడ చేసారో చెబితే, నేను ఆయ్యా యూనివర్సిటీ నందు జాయిన్ కలదానను..ఇంతకీ రామాయణం విన్నాక రాముడు ఎవరు అని అడిగినట్లు అనుకోకుండా ' గ్రాఫిటీ అనగానేమి'- సరిగ్గా రెండు వాక్యములలో తెలుపుడు. గమనిక: నేను ఆరెంజ్ కానీ ఓ రేంజ్ కానీ చూడలేదు..
నాకు నచ్చిన పదములు వ్రాయమని అడిగిన ఎడల, మీ టపా అంతయు వ్రాయవలసి వచ్చును. డూప్లికేషన్ ఎందుకులే అని వ్రాయుట లేదు..గమనించ గలరు.

..nagarjuna.. said...

IPL తరహాలో ఇంద్రధనస్సు బ్లాగర్ల ఫ్రాంచైస్ మీటింగ్ హ్మ్...ఇదేదో బాగుంది హరే, యే ఏరియా కా ఏరియా పంచేసుకొని బ్లాగు పోస్టులేసుకుంటాం. చదవడానికి, వద్దులే కామెంటడానికి, వచ్చినోళ్ల దగ్గర టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం ఇహ జూస్కో పైసలే పైసలు :)

Malakpet Rowdy said...

అనపర్తికి తక్కువ - పెద్దబ్రహ్మదైవానికెక్కువ :P

హరే కృష్ణ said...

నాగర్జున..ఎంట్రీ ఫీజ్.. కెవ్వ్..percentage నాకు కూడా ఇవ్వాలి మరి :)

ఎన్నెల గారు..బోలెడన్ని ధన్యవాదాలు!
http://en.wikipedia.org/wiki/Graffiti

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఇంద్రప్రస్థ లో చేరాక ఇవన్నీ ఆటోమాటిక్ గా వచ్చేస్తాయి
ఎలా చేరాలంటే ముందు ఎంట్రెన్స్ టెస్ట్ తీసుకోవాలి..చైతన్య,నారాయణ లో కోచింగ్ వద్దు వాడికి నాకు కచ్చి.
ఇన్స్టిట్యూట్ లో కనీసం రెండేళ్ళు ఉంటే ఇంక కేకంతే..కావాలంటే నాగార్జున ని అడగండి :)
>>డూప్లికేషన్ ఎందుకులే అని వ్రాయుట లేదు
thank you very much :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>ఇలా ఇదే కలని మరో వారం రోజులు పాటు కన్నాక..
అంత పెద్ద కలని వారం రోజులు కని, కని, దగ్గర దర్శన్ లో పెద్ద ఇంద్రధనస్సు ను చూసినా ఇల్లా పరిధి దాటడం బాగాలేదేమో. పైగా ఏ సమీరాని కైనా ఒకే శ్రుతిలో నాదం ఉంటుదని అంటారా. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. టపా మాత్రం కెవ్వు కెవ్వు.

@మనసు పలికే .. >>హహ్హహ్హా.. నీ క్రియేటివిటీని గ్రామ గేదెలెత్తుకెళ్ల..;)
ఇది సూపర్.

శివరంజని said...

.... కొన్ని పంచ్ లు చదువుతున్నప్పుడు ...........ఆఫీస్ లో నవ్వు ఆపుకోలేక పోయా ..........ఎప్పటిలా నే బాగా రాసారు ................

మీ పోస్ట్ లు ...........నేను పోస్ట్ రాసుకోవడానికి రిఫరెన్స్ లా పని చేస్తుందేమో

మీది గోదావరి నా ?????? బిక్కవోలా మీది ????

మురళి said...

సదరు నారింజ చిత్ర రాజాన్ని చూడక పోవడంవల్లనేమోనండీ. ఏదో మిస్సైన ఫీలింగ్ నాకు.. మళ్ళీ చదువుతాను..

హరే కృష్ణ said...

బులుసు గారు థాంక్ యూ :)

శివ రంజని నచ్చినందుకు ధన్యవాదాలు :)

మురళీ గారు catchy గా ఉంటుందని ఆరంజ్ కాన్సెప్ట్ తో రాసేసా :)
ధన్యవాదాలు

కథాసాగర్ said...

గ్రామా గేదెలతో గ్రాఫిటీ యా...అబ్బో......

ఏం రాసారండి..

హరే కృష్ణ said...

కదా సాగర్ గారు బోలెడు ధన్యవాదాలు :)

Anonymous said...

ఈ టపా చాలా బాగున్నది ;)
-- బుజ్జిగాడు

హరే కృష్ణ said...

బుజ్జి గారు :))
థాంక్ యూ ,థాంక్ యూ :) :)