Pages

Monday, February 28, 2011

A Few Good Men..


స్థలం: Microelectronics and VLSI ప్రొఫెసర్ పాండురంగారావు మాష్టారు ఇల్లు
సమయం : రాత్రి 10.45

ఏంటండీ ఎంత కష్టపడి థీసిస్ లు గైడ్ చేస్తే మాత్రం ఇంక  రాత్రి పగలు తేడా లేకుండా ఇట్లా డిపార్ట్మెంట్ కి అంకితం అయిపోతే  మీ ఆరోగ్యం ఏం కాను.  తిండి కూడా  పట్టించుకోకుండా ఏమిటిది అని పాండు గారి సతీమణి సునంద అడుగుతోంది

ఏం చెప్పమంటావ్ నందూ,ఆ ముఖర్జీ చాలామంది ని గైడ్ చేసేసి బోలెడు పేరు తెచ్చేసుకుంటున్నాడు.. ఇల్లు పెళ్ళాం అని కూర్చుంటే నేను associate ప్రొఫ్ ని ఎప్పుడు అయ్యేది అని అసహనంగా కోపం లో వచ్చిన తన బాధని వెల్లగక్కుతున్నారు పాండు.

ఇక పాండురంగారావు కాంపిటేటర్ ముఖర్జీ ఇతను బహుముఖ రచ్చయో!  ఇతను కాంపస్ లో  చేరిన అతి కొద్ది కాలంలోనే అందరి అభిమానం తో పాటు డిపార్టుమెంటు లో బోలెడు పేరు సంపాదించుకున్నాడు..పాండు హార్డ్ వర్కర్..ముఖర్జీ కంటే మంచి పేరు తెచ్చుకోవడానికి మరింత కసితో  కష్టించి పనిచేస్తున్నాడు.

మరుసటి రోజు డిపార్ట్మెంట్ లో రాత్రి పదిగంటల టైం లో  ముఖర్జీ రూమ్ లో లైట్ ఆన్ చేసి ఉండటం గమనించిన పాండు,ముఖర్జీ ఈ టైం లో ఏం చేస్తున్నాడా అని తన రూమ్ కి కాస్త దగ్గరగా వెళ్ళాడు.
 ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముఖర్జీ కి ఎదురుగా నిల్చొని ఉన్నారు అదే రూమ్ లో..వాళ్ళిద్దరికీ  ఏదో కౌన్సిలింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది..డోర్ కాస్త తెరిచి వుండటం తో బయటకు మాటలు వినిపిస్తున్నాయి..ఆ  మాటలు విన్న పాండు వెంటనే
ఇంటికి  చక చకా వెళ్ళి ..ఇంట్లో వాళ్ళ తో కాసేపు అందరితో మీటింగ్ పెట్టాడు.

-----------------------------------------------------------------------------------------------

 ఆ  మరుసటి రోజు ముఖర్జీ దగ్గర పని చేస్తున్న స్టూడెంట్ సంతోష్ ని పిలిచి
పాండు:నువ్వు ఏ హాల్ లో ఉంటావ్
సంతోష్:అది సినిమా ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది
పాండు:సాటి తెలుగు వాడివని ఏమి అనడం లేదు,అయినా నిన్న అంత రాత్రి టైం లో నువ్వు ఆ  అమ్మాయి  ఏం మాట్లాడుతున్నారు మీ గైడ్ తో
సంతోష్ చెమటలు కక్కుకుంటూ వాళ్ళ హాస్టల్ వైపు పరిగెత్తాడు

------------------------------------------------------------------------------------------

తమ హాస్టల్ కి వెళ్ళాక దారిలో ఒక నెంబర్ కి ఫోన్ చేసి తొందరగా హాస్టల్ కి వచ్చేయ్ అని చెప్పి కట్ చేసాక
అప్పటికే షివర్ లో ఉన్న సంతోష్  షవర్ కెళ్ళి రూమ్ కి వచ్చాక రెండు మిస్ కాల్స్ ఒక మెసేజ్ ఉన్నాయి,చూసుకుంటే సంధ్య నుండి మెసేజ్
Waiting in guest room of your hostel.అని ఉంది

గెస్ట్ రూమ్ నుండి కాస్త దూరం లో ఉన్న ఆడిటోరియం వైపు గా ఇద్దరూ నడుస్తున్నారు

సంధ్య:ఏమయ్యింది సంతోష్,ఇంత కంగారుపడుతూ పిలిచావ్
సంతోష్:మన ప్లాన్ తెలిసి పోయింది అనుకుంటా పాండు సార్ కి
సంధ్య:ఏం మాట్లాడుతున్నావ్.ఇది బయటకు తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా
సంతోష్:అవును.నిన్న రాత్రి ముఖర్జీ సర్ రూమ్ లో మనం మాట్లాడుకుంటున్న విషయం వినేసాడు అనుకుంటా
సంధ్య:అవునా! అయ్యయ్యో ఇప్పడు మన భవిష్యత్తు ఏం కాను
సంతోష్:ఈరోజు మనం పాండు సర్  వాళ్ళ ఇంటికి అయినా వెళ్దాం లేకపోతే మన ముఖర్జీ సర్ దగ్గర ఈ విషయం చెబుదాం
--------------------------------------------------------------------------------------------

టైం రాత్రి తొమ్మిది అవుతోంది
డిన్నర్ చేసి  సంధ్య,సంతోష్ పాండు మాస్టారి ఇంటికి వెళ్లారు
థీసిస్ టైం కదా మాస్టారు ఇంకా ఇంటికి రాలేదు మరో అర్ధ గంటలో వస్తారు అనుకుంటా ఇక్కడే కూర్చోండి అని పాండు గారి భార్య సునంద చెప్పడం తో వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొన్నారు.కాస్త చినుకులు పడేలా అనిపించడంతో మీరు ఇక్కడే కూర్చోండి మేడ మీద బట్టలు ఆరబెట్టాను ఇప్పుడే వస్తా అని వెళ్లారు సునంద.
మేడ మీద నుండి కిందకి వచ్చాక సంతోష్ సంధ్య మేము వచ్చి చాలా టైం అయ్యింది..మా థీసిస్ చేసుకోవాలి మేము ఇంక రేపు కలుస్తాం.అని చెప్పి వెళ్ళిపోయాక
ఎప్పటిలానే పాండు గారు పదిన్నర కు ఆరోజు కూడా ఇంటికి వచ్చారు
--------------------------------------------------------------------------------------------

మరుసటి రోజు ప్రొద్దున్న పాండు గారి నాన్న నారాయణ రావు  గారు ఎంతకీ లేవడం లేదు ..ఊపిరి తీసుకోలేకపోతున్నట్టు గా గమనించి,సునంద&పాండు ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు
సంపూర్ణ ఆరోగ్యం తో  ఉండే నాన్నఇలా emergency లోనికి వెళ్ళడం అనేది అసాధ్యం.
అసలు ఏమై ఉంటుందా  అని ఆలోచిస్తుంటే 

అప్పుడు సునంద చెప్పింది రాత్రి మీ స్టూడెంట్స్ అంట సంతోష్ సంధ్య ఇద్దరు మిమ్మల్ని కలవడానికి అని వచ్చారు అని చెప్పడం తో వెంటనే పాండు ఇద్దరినీ పోలీసులకి పట్టిద్దాం.వాళ్ళే ఏదో చేసి ఉంటారు మొన్న నేను డిపార్టుమెంటు కి వెళ్ళినప్పుడు కూడా నారాయణ నారాయణ అని రెండుసార్లు ముఖర్జీ అనడం నేను చూసాను.ఖచ్చితంగా వాళ్ళే చేసుంటారు ఈ ఘోరం అని చెప్పి ముఖర్జీ తో పాటు సంతోష్ సంధ్య ను  పోలీసులకి అప్పగించాక
ఈ విషయం తెలిసి హఠాశుడయిన ముఖర్జీ స్నేహితుడు లాయర్ శశి భూషణ్ కోర్ట్ లోనికి వెళ్ళాడు.

లాయర్ హరి ప్రసాద్ పాండు తరపున వాదిస్తున్నాడు.
శశి భూషణ్:యువర్ ఆనర్, నా స్నేహితుడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఎంతో గౌరవ వృత్తి  లో ఉన్న తను ఇటువంటి పని చేయడు

హరి ప్రసాద్:జడ్జి గారు ముఖర్జీ అసలు విషయం ఏంటంటే పాండుకి వచ్చే పేరు ని తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసాడు.
దీనికి సాక్ష్యం ఆ  ముందు రోజు రాత్రి జరిగిన సంభాషనే నిదర్శనం .

శశి భూషణ్:ప్రూఫ్ లు ఉన్నాయా.
హరిప్రసాద్:అవును ఉన్నాయి.ఆ  పాండు రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ ఇదిగో అని ఆన్ చేసాడు
సంతోష్,సంధ్య తల్లి తండ్రుల గుండె వేగం పెరుగుతోంది
.
Nokia C3-01తీసి స్పీకర్ ఆన్ చేసాడు 
మీకేమీ భయం లేదు మీ పని మీరు ధైర్యంగా  చేయండి నా అండదండలు మీకెప్పుడూ ఉంటాయ్. మిమ్మల్ని సేఫ్ గా చూసుకునే బాధ్యత నాది go ahead.. అంతా నారాయణ నారాయణ
అని అదే క్లిప్ ని బర బరా ప్లే  చేసాక

హరిప్రసాద్: వీళ్ళు చెప్పింది కరెక్టే నా,
పాండు:అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు.వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు నేను జరిపిస్తా అని మాట ఇచ్చా..అంతే!
హరిప్రసాద్:సరే వాళ్ళ తల్లి తండ్రులనే అడుగుదాం.వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారో  లేదో 
అవును వాళ్ళు మాకు విషయం చెప్పారు కాని మాకు ఇలా పోలీసులు కేసులు అంతే ఇంక వీళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని అసలు ఊహించలేదు

 శశి భూషణ్:అయితే ఇప్పుడు ముద్దాయిలు కాకపోతే మీరు వీళ్ళ  పెళ్లి చేయడానికి మీకేమి అభ్యంతరం లేదు కదా. 
పేరెంట్స్:పెళ్లి చేసి జైలు లో ఏం చేస్తారు. గుడ్డి కంటే మెల్ల నయం ఏదోకటి ముందు ఈ గండం నుండి గట్టెక్కాలి అదే మాకు ముఖ్యం
జడ్జి:అసలు ఏం జరుగుతోందిక్కడ
హరిప్రసాద్:నాకు తెలియాలి,తెలియాలి
పనిమనిషి:నాకు తెలుసు

పాండు ఇంట్లో పనిమనిషి ని నారాయణ రావు తన చేదస్తం తో తెగ విసిగించేవాడు. విసిగిపోయి ఆ  రోజు పొద్దున్నఆరోజు మార్నింగ్ కాఫీ లో  ఎక్కువ నిద్రమాత్రలు  కలిపేశాను.ఇలా అవుతుందని అనుకోలేదు.
జడ్జి:నిజమేనా ?
పని మనిషి:అవును నిజం నిజం నిజం.
హరి ప్రసాద్:its a lie
జడ్జి పనిమనిషి మస్తానమ్మ కి శిక్ష విధించి కధ ని  కోర్ట్ రూమ్ బయటికి తీసుకొచ్చాడు  

కోర్ట్ బయట 
పాండు ముఖర్జీ తో: మిమ్మల్ని నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను 
Sir,i 'm extremely sorry

సంతోష్,సంధ్య ముఖర్జీ తో Sir,we are extremely thankful 


16 comments:

మనసు పలికే said...

Nade first comment..:)))))

మనసు పలికే said...

హరే.. కెవ్వు..:))) సడెన్‌గా చూసి, టైటిల్‌లో పెట్టిన ఇంగ్లిష్ సినిమాని తెనుగీకరించావేమో అనుకున్నాను..;)మళ్లీ ఏ ఇన్సెప్షన్ లాంటి సినిమానో అనుకుని కాస్త దూరం దూరంగానే ఉంటూ చదివాను ల్యాప్‌టాప్‌కి;) స్టోరీ చదివాక అర్థం అయింది ఇది నువ్వు సొంతగా రాసిన కథ అని:)) సూపరు:)

నాకు ఇంకా డవుటే, నాకు తెలియని ఇంగ్లిష్ సినిమాని దేన్నైనా తెనుగీకరించావేమో అని:P

రాజ్ కుమార్ said...

నాకు కూడ మనసుపలికే గారి డౌటే వచ్చింది...
పూర్తిగా అర్ధం కాలేదు.. మళ్ళి చదివి చెప్తా..:)

శివరంజని said...

ఆస్కార్ కి నామినేట్ అయ్యే మూవీస్ గురించి రాస్తానని మొక్కుకున్నారా ఏమిటో అనుకుని చూస్తుంటే ...సంద్య అన్న పేరు కనిపించి హమ్మయ్యా మీరు రాసిందే అనుకున్నాను..... హి హి హి చాలా బాగా రాశారు ..కేకసలు మీ డైలాగ్స్

కృష్ణప్రియ said...

హరేకృష్ణ,
నైస్ :)

చిన్న కరెక్షన్..
మొదటి పారా లో సేన్ గారి భార్య సునంద అన్నారు.. తర్వాత పాండు గారి భార్య అన్నారు... జస్ట్ అబ్సర్వేషన్..

Sravya V said...

కొంపదీసి మీ కాంపస్ లో నిజంగా జరిగిందా :)

..nagarjuna.. said...

నిజం చెప్పు హరే, ఈ కథ రాసేముందు ఏం చూసావ్, ఏం చేసావ్ ?
I want to know right now.....

హరే కృష్ణ said...

అప్పూ ..చాలా థాంక్స్ :)
నా స్వహస్తాలతో రాసింది ఈ కధ...హా :)

రాజ్ :))

శివరంజని థాంక్యూ :)
మహాశివరాత్రి శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు :))..థాంక్స్!
భలే పట్టేశారు :)
సేన్ గారికి డేట్స్ దొరకకపోవడంతో ఆఖరు నిమిషం లో పాండు సార్ ని తీసుకున్నాం :)
కాపీ రైట్స్ కి ఇబ్బంది లేకుండా :)

శ్రావ్య గారు థాంక్స్ :)
నాగార్జున గారి కామెంట్ చూడండి..ఇది ముమ్మాటికి నిజమే :)

నాగార్జున :D
నేనేమీ చూడలేదు చదవలేదు..ఇది నిజానికే నిజం :)

మధురవాణి said...

ఇతను బహుముఖ రచ్చయో! :D :D :D

Unknown said...

హహ లాజిక్ లో మేజిక్కు .. దొంగ హరే కృష్ణ .. సస్పెన్స్ తో చంపేసావ్ .. హహ :) సూపర్ ఉంది .. చాల బాగుంది :) ఇంసేప్షన్ పిచ్చోడు అన్పించుకున్నావు కదా మై ఫ్రెండ్ :)

Anonymous said...

hahahahahha nice 1

Ennela said...

అయ్య బాబోయ్! ఇంత సస్పెన్సే? చివరి దాకా వచ్చేటప్పటికి చమటలు పట్టి గుండె ఆగినంత పని అయ్యింది. సస్పెన్స్ తెగ మైంటెయిన్ చేసారు..బాగుంది...నిజ్జం సినేమా చూస్తున్నట్టే అనిపించింది..కీప్ ఇట్ అప్ !

హరే కృష్ణ said...

మధుర వాణి :D

కావ్య మీ అభిమానానికి చాలా థాంక్స్ :)

మరిన్ని కధలు రాయడానికి ప్రయత్నిస్తాను

హరే కృష్ణ said...

ఎన్నెల గారు థాంక్ యూ,థాంక్ యూ :)

anonymous గారు థాంక్స్ :)

Unknown said...

ee hal .....adi cinema meeda depend ayi untundi...baagundi :)