Pages

Saturday, June 5, 2010

క్రికెట్ కవరింగ్

2007 వ  సంవత్సరం
స్థలం: హాస్టల్ గ్రౌండ్ లో  ఒక సాయంత్రం 

Btech మరియు Mtech కి జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ T10 మ్యాచ్  జరుగుతోంది
అప్పుడే హాస్ట జెర్సీ లు వచ్చాయి డిజైన్ చాలా బావుండటం తో ఒక్కొక్కరం మూడు నాలుగు జెర్సీ లు తెప్పించుకున్నాం రకరకాల పేర్లను display  అయ్యేలా

Mtech వాళ్ళు బౌలింగ్ మొదలెట్టారు అప్పటికే రెండు సార్లు ఓడిపోయిన అనుభవం ఉన్నాఈసారి జెర్సీ లు రావడం వల్ల మాలో నూతనోత్సాహాన్ని నింపాయి

సురేష్ ఓపెనింగ్ బౌలింగ్ మొదలెట్టాడు మొదటి ఓవర్ లో బౌండరీ దగ్గర fielding experts నరసింహా,నాగార్జున  fielding వైఫల్యం వల్లన ఒక పది పరుగులు సమర్పించుకున్నాడు
తర్వాత మజ్జిగ ప్రకాష్ తన భయంకర వైడ్ల తో  మరో పది రన్స్
ఛీ ##$$$ గొప్ప స్పెల్ రా బాబూ అని నాలుగు ఓవర్ల వేసాక తెలిసింది మా బెస్ట్ స్పెల్ అదే అని
మిగతా ఆరు ఓవర్లలో Btech వాళ్ళు 70 రన్స్ చేసి టార్గెట్ 107 ఇన్ 10 ఓవర్స్ ఇది equation

Mtech వాళ్ళ batting మొదలయ్యింది ఇంత స్కోరు ఉంది అని చెప్పి మాకు అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేసిన వాళ్ళే బట్టింగ్ కి దిగిపోయారు
వాళ్ళ విసురుడికి బలవ్వక తప్పలేదు ఒక 5 మంది batsman లు

స్కోరు 4 ఓవర్స్ 28 /5
required : 79  in 6 overs
బౌండరీ దగ్గర fielding చేస్తున్న  Btech వాడికి కాలికి దెబ్బ తగిలడం తో మాలో ఒకడిని replacement పంపడంతో పదహారు పరుగులు వచ్చేసాయి ఆ  ఓవర్ లో
స్కోరు 44 /5  required 63 in 5 overs

నరేష్ ఇంకా చండూ కూడా అవుట్ అయిపోయారు మరో రెండు ఓవర్లలో

66 /7 in 6 overs
required 41 runs in 4 overs

ఒక ఓవర్లో fielding మిస్ చేస్తే వాకే అదే పనిగా మూడు ఓవర్ల లో  Mtech వాళ్ళ fielding మహత్యం తట్టుకోలేక fielding positions ని మార్చేశాడు Btech టీం కెప్టైన్

ఆ  నెక్స్ట్ ఓవర్ లో 14 పరుగులు స్కోరు చేసాక
score 80/7 in 7 overs
మా భూపాల్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టడం తో స్కోరు
          90/7 in 7.2 overs అయ్యాక మా భూపాల్ అవుట్ అయ్యాడు
మా టెన్షన్ బాగా పెరిగిపోయింది లాస్ట్ వికెట్ మాత్రమె మిగిలుంది 17 పరుగులు పదహారు బంతుల్లో చెయ్యాలి రెండు వికెట్లు వున్నాయి చేతిలో

వీళ్ళిద్దరులో ఎవరు అవుట్ అయినా  మా బాచి ఒక్కడే ఉన్నాడు నెంబర్ 11 బ్యాట్స్మన్,కాని గ్రౌండ్ లో లేడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు అనౌన్స్ చేస్తే రిప్లై రావడం లేదు Btech వాళ్ళు టైం అవుట్ పెట్టారు ఇదే లాస్ట్ వికెట్ నో delays అని  మరో పదినిమిషాల్లో బాచి రాకపోతే మ్యాచ్ Btech  వాళ్ళదే

సరే ఇలా జరిగేది కాదు అని ఒక రన్నర్ ని మేము ఫైనల్  ఓవర్ అయ్యేవరకు పెడతాం వాడు వచేస్తాడు అని ఒప్పించి అవతల వైపు ఉన్న బ్రదర్ నరేందర్ తో కంటిన్యూ చేస్తున్నాం. ఒక ఫోర్ కొట్టక ఆఖరిబాల్ single  తీయడం తో స్కోరు 95/8 అయ్యింది 12 బంతుల్లో పన్నెండు కావాలి అన్నౌన్సుమేంట్ ఫోన్ రెండూ చేస్తున్నాం బాచిగాడు రాలేదు ఇంకా చివరికి ఫోన్ లిఫ్ట్ చేసాడు situation చెప్పాక వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాడు వీడు వస్తాడో రాదో అని మాకు టెన్సన్ మొదలయ్యింది 

మరో తొమ్మిది బంతులు మిగిలున్నాయి ఒక ఫోర్ కొట్టి  అనవసర single తీసి బ్రదర్ నరేందర్ runout  అవ్వడంతో  స్కోరు 99 /9 అయ్యింది మేము ఇలా గెలిచే పొజిషన్ కి వచ్చేయడం తో Btech వాళ్ళు వేరే runner ని allow  చెయ్యలేదు
మళ్లే Btech  వాళ్లతో గొడవ పెట్టుకున్నాం

మరో అయిదు నిమిషాలు టైం అవుట్ పెట్టాక  అప్పుడు చెమటలు కక్కుకుంటూ బాచి గాడు ముందుకు వచాడు

రకరకాల తిట్లతో మిగతా  పదిమంది బాచి ని ప్రశ్ని౦ చాం ఎక్కడికెల్లావ్ బే అని

నాకు మన మ్యాచ్ crucial పోసిషన్ లో ఉంది అని తెలుసు అందుకే ల్యాబ్ కి వెళ్లి ఏ ప్రింట్ అవుట్ తీసుకొచ్చాను అని మాకు చూపించాడు
ఇంతకూ వాడు చేసిన ఘనకార్యమేంటంటే యు కెన్ విన్ బై శివ ఖేరా పుస్తకాన్ని మా ముందు పెట్టాడు
ఆ  మ్యాచ్ ఏమయ్యిందో వేరే చెప్పాలా  :)




8 comments:

Unknown said...

aithe match odi poyaaraa.... leka mee godava valla abandon aindaa ??

Unknown said...

bacgi gaadini aa roju uthiki aareyaalsindi

హరే కృష్ణ said...

Mtech వాళ్ళు గెలుపొందినట్టు చరిత్రలో లేదు :)
ఆరోజు మిగతా పదిమందిమి కలిసి బాచి ని పిచ్ సాక్షిగా కుమ్మేసాం :D

thanks for the response

Unknown said...

cricket ni TV lo chudatanike kastapadthuntanandi..
meeru blog lo ki kuda techesaru....
edo mee dantlo kabatti chadivanu kastapadi... :P

హను said...

ayyooo,,, entha pani jarigimdi....

Ravi Gadepalli said...

narasimha nagarjuna characters real lifelo manam IIT lo chosaam...migata match imagination bavundi....
Majjiga prakash aa...good namakaranam...

హరే కృష్ణ said...

కిరణ్ గారు థాంక్స్ :)

హను గారు అవునండీ చాలా ఘోరం జరిగిపోయింది మా బాచి గాడు పరువు తీసేసాడు
తరువాత వాడిని కుమ్మేసాం అనుకోండి అది వేరే విషయం

హరే కృష్ణ said...

హ హ్హ
థాంక్స్ రవి
బాషా ముత్తు అని పెడదామనుకుంటే ప్రాస కుదరలేదు అందుకే నరసింహా అని పెట్టేసా
సత్పుర హాస్టల్ మన హాస్టల్ లో కూడా అన్ని సౌలభ్యాలు వాడుకొనేవాడు ప్రకాష్ ని మిస్ చెయ్యలేదు :)