Pages

Sunday, April 4, 2010

జంబలకిడి Java


సందీప్ కి నాకు ఒకడే గైడ్, మా గైడ్  పోరు పడలేక జావా క్లాసు కి వెళ్ళడం మొదలెట్టాడు సందీప్
కాంపస్  దగ్గరలో ఉన్న institute లో చేరాడు
ప్రొద్దున్న క్లాస్ కి వెళ్లి వచ్చి కాలేజీ కి అటెండ్ అయ్యేవాడు

ఒక రోజు ల్యాబ్ లో
నేను: నీ కంప్యూటర్ క్లాస్ ఎలా ఉంది, అన్నీ  నేర్చేసుకుంటున్నావ్ కదా సైలెంట్ గా   

దీప్:ఏం  నేర్చుకోవడంరా బాబు ఇప్పటి వరకు ఒక ముక్క చెప్పలేదు నెలరోజులు నుండి
నేను:ఏం? బేసిక్స్ కూడా మొదలెట్టలేదా ఇంతవరకు
దీప్: ఉహూ
నేను:ఎందుకని
దీప్:డబ్బులు ఇవ్వందే వాడి స్వరపేటిక వాడట్లేదు, %^**(%&^*(

నేను:అడ్వాన్స్ ఇవ్వలేదా ఇంతవరకు,స్టైపెండ్ వచేసింది కదా ఎప్పుడో 
దీప్:హి హి హి మాకు తెలీదా,institute లో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా డబ్బులు కట్టట్లేదు,నా లైఫ్ సెటిల్ అయ్యిపోయేటట్టు ఉంది మరో నెల రోజుల్లో

నేను: నీ లాంటి వాళ్ళ వల్లేరా  మాట్రిమోనీ సైట్ లు మరుగున పడుతున్నాయ్,కాలేజీ లు పార్క్లు లా తయారవుతున్నాయ్
దీప్:నువ్వు మరీ టెన్షన్ పడిపోవద్దు లేరా మేము కాలేజీ లో కలవట్లేదు ఇప్పుడు కేవలం పార్క్ లోనే 

మా గైడ్ కి అనుమానం వచ్చేసింది  ఈ సందీప్ గాడు గాల్లో తేలిపోవడం చూసి,ఒకరోజు మమ్మల్ని క్లాసు అయ్యాక పిలిచి

గైడ్:ఏం సందీప్ ఎలా చెప్తున్నారు కోచింగ్ ,బాగా నేర్చుకుంటున్నావా
దీప్: మొదట్లో అంతా కొత్తగా ఉండేది సర్,ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నా సర్,ఒక రకం గా చెప్పాలంటే అనుభవించడానికి చాలా దగ్గరలో ఉన్నా
సర్: ఓ! గుడ్ గుడ్
నేను:$%%&**(*()()()^^$$^


అలా కాంపస్ లో ఉన్నప్పుడు కూడా,నేను జావా నేర్చుకుంటా అని కలలో కూడా అనుకోలేదు
విధి వక్రించి నేర్చుకోవాల్సి వచ్చింది

కొన్ని రోజుల తర్వాత
ప్రాజెక్ట్ పని మీద మా గైడ్ నన్ను కూడా జావా నేర్చుకోమన్నాడు కొన్ని రోజులకు ఇదేం ట్విస్ట్ రా బాబు అని అనుకుంటూ ఇంట్లో డబ్బులు అడిగేసా జావా క్లాసు కి వెళ్తున్నా అని

నా దురదృష్టం కొలదీ మా సందీప్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసారు జనాలు లేక
ప్రాజెక్ట్ హడావుడి లో అంతా జావా కి ఎవరూ వచేవారు కాదు నాకు థార్పే అనే మరో అతనికి కలసి చెప్పేవారు జావా

మార్తాండని తిడితే వచ్చేవే కామెంట్లు అన్న పలంగా దొరికిందే దేవుడిప్రసాదం అనే రేంజ్ లో మాకు జావా తో పాటు c,c++, c-,c--- కూడా చెప్పేసేవాడు దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది

జావా క్లాస్ మొదటి రోజు

సర్: నువ్వేనా జాయిన్ అయ్యావు, సరే నీకు c వచ్చా
నేను:బేషుగ్గా,ధార్పే మరి నీకు
సర్:సరే నీకు c గురించి ఏం తెలుసో చెప్పు
థార్పే:C is a general-purpose computer programming languadeveloped in 1972 by Dennis Ritchie
సర్: గుడ్,ఇంకా

ధార్పే:డెన్నిస్ హ్యాడ్ ఎ  గాల్ ఫ్రెండ్ నేమిడ్ క్రిస్టో ఫర్, she is gorgeous just like scarlet Johnston and charlize theron, i just love scarlet Johnston she is tooo అంటూ మొదలెట్టాడు 
సర్: అంటే సినిమాల గురించి తప్ప ఏమి తెలీదా నీకు
థార్పే:ఉహూ


మార్తాండ కధలో వదిన క్యారక్టర్ లాగా
ఒకే  టికెట్ కి రెండు సుమన్ సినిమాల్లా మాకు మిగతా కోర్స్ లు చెప్పేవాడు

ఒక పదిహేను రోజులు వెళ్ళా క్లాస్ కి ఇంతలో ప్రాజెక్ట్ డెడ్ లైన్ వచేస్తోంది 
మా సర్ పిలిచాడు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటయ్యా అని జావా నేర్చుకుంటున్నా అని చెప్పా, సరే మరో నెల కూడా లేదు ఇంకా అవసరం లేదులే ముందు ప్రాజెక్ట్ ఫినిష్ చేయి  అని చెప్పాడు
 
తర్వాత  రోజు
ఆరోజు హోలీ బయట షాపులు అన్నీ మూసేశారు ఏమైనా  తిందామని  కాంటీన్ కు  వెళ్ళా అది కూడా క్లోజ్
సరే ఏదో మిక్స్ వుంది పక్క రూం లో
చాల మంది కి ఫోన్ చేశా ఎలా చెయ్యాలి అని ఒక్కొకరు ఒక్కోలా చెప్తున్నారు
అప్పుడే స్టవ్ మీద పెట్టి మిక్స్  వేసి కలుపుతున్నా

ఇంతలో కంప్యూటర్ లో గేమ్ మద్యలో ఉందన్న విషయం గుర్తొచ్చి 
స్టవ్ సిమ్ లో పెట్టి. pause లో ఉన్న గేమ్ ఆడటానికి  రెడీ అయ్యా

ఒక అరగంట సేపు అన్నీ మర్చిపోయి ఆడాక సడన్ గా ఫోన్ మోగుతోంది బయట ప్రపంచం లోకి వచ్చి ఫోన్ తో వెళ్ళా స్టవ్ దగ్గరకి
ఇంటి నుండి ఫోన్ డబ్బులు వచ్చాయా అని
హోమ్: జావా నేర్చుకుంటున్నావా ? ఏమైనా వచ్చిందా
జస్ట్ ఇప్పుడే అయ్యింది డాడీ జావా నేర్చుకోవడం i am an expert now (స్టవ్ వైపు చూస్తూ)

31 comments:

karthik said...

ha ha ha

నాగప్రసాద్ said...

:-) :-).

సుజ్జి said...

:D

మురళి said...

:-) :-)

Karthika said...

:))

Unknown said...

baagundi mee post

Naresh said...

బాగుంది..
టైటిల్స్ పెట్టడంలో నీకు నువ్వే సాటి డియర్ :)

శ్రీనివాస్ పప్పు said...

"మార్తాండని తిడితే వచ్చేవే కామెంట్లు అన్న పలంగా దొరికిందే దేవుడిప్రసాదం అనే రేంజ్ లో మాకు జావా తో పాటు c,c++, c-,c--- కూడా చెప్పేసేవాడు దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది"

"మార్తాండ కధలో వదిన క్యారక్టర్ లాగా" అదేదో సినిమాలో ఆవు వ్యాసం లా అన్నమాట
ఒకే టికెట్ కి రెండు సుమన్ సినిమాల్లా మాకు మిగతా కోర్స్ లు చెప్పేవాడు"
ఎక్కడనించొస్తాయి సార్ మీకు ఈ అవిడియాలు.ఎప్పటిలాగే పోస్ట్ అదుర్స్.

ఆ.సౌమ్య said...

హ హ హ మొత్తానికి జావా జావ అయిపోయి మిమ్మల్ని జావగార్చిందన్నమాట

చైతన్య.ఎస్ said...

హ హ సూపరు.

Unknown said...

matrimony sites maruguna paduhunnai ... baagundi :)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Super :)

హరే కృష్ణ said...

కార్తీక్
నాగ ప్రసాద్
సుజ్జి
థాంక్స్ :)

హరే కృష్ణ said...

కార్తిక గారు, మురళి గారు,గంగాధర్ గారు
ధన్యవాదాలండీ :D

హరే కృష్ణ said...

నరేష్, శ్రీనివాస్ గారు మీ అభిమానానికి థాంక్సండీ :)

హరే కృష్ణ said...

సౌమ్యా, చైతన్యా,విక్కీ
చాలా థాంక్స్ :)

keep visiting

హరే కృష్ణ said...

గణేష్ గారు నా బ్లాగుకి స్వాగతం
థాంక్సండీ

మంచు said...

హ హ హ సూపర్...

హరే కృష్ణ said...

మంచుపల్లకీ గారు థాంక్యూ :)

కౌండిన్య said...

బాగుందండి మీ టపా సరదాగా :)

హరే కృష్ణ said...

అందరికీ ధన్యవాదాలు :D

హరే కృష్ణ said...

కార్తీక,నాగ ప్రసాద్,సుజ్జి,మురళి,పింకీ,గంగాధర్ థాంకులు :D

హరే కృష్ణ said...

నరేష్, సౌమ్యా, చైతన్యా, శ్రీనివాస్ గారు చాలా థాంక్స్ :P

హరే కృష్ణ said...

విక్కీ,కౌండిన్య గారు ధన్యవాదాలండీ

Bhãskar Rãmarãju said...

తమ్మీ గింత సైలెంటుగా పోస్తేస్తే ఎట్టా....

Unknown said...

:D.bagundi...

స్వర్ణమల్లిక said...

అయితే మీ ఇంటికి వచ్చిన అతిదులకి రుచికరంగా చేసి ఇస్తారన్నమాట జావా.

హరే కృష్ణ said...

భాస్కరన్నా
అవును సైలెంట్ గానే వేసా ఈ టపా :(

కిరణ్ గారు నా బ్లాగుకి స్వాగతం
మీ స్పందనకు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

స్వర్ణమల్లిక గారు
హహహ
బేషుగ్గా వండి వడ్డిస్తా జావా
thank you

Ravi Gadepalli said...

"ఒకే టికెట్ కి రెండు సుమన్ సినిమాల్లా"...super..collegelo ticket lekundaa rojantaa balayya cinemalu choopinche varu kada....

హరే కృష్ణ said...

Ravi,
ఇప్పుడు మళ్ళీ చారి గారి క్లాస్లు (పీడ కలలు) గుర్తుచేయకు
బాలయ్య movie నే అది :) :)