Pages

Tuesday, April 27, 2010

పండంటి బ్లాగు కి పది సూత్రాలు
ఫార్ములా 1 : టెంప్లేట్
ఇల్లుని చూసి ఇల్లాలుని చూడమన్నారు పెద్దలు, బ్లాగు లోకం లో మీ టెంప్లేటే మీకు పెద్ద ఎస్సెట్
టెంప్లేట్ మంచిది చూసి తర్వాత పోస్ట్ చూడండి
మచ్చుకి నాకు నచ్చిన కాస్త ఆహ్లాదంగా, ఇంకాస్త అందంగా ,క్లాసికల్ గా,ముచ్చటగా,సూపర్ గా, idealగా  

ఇంకా మైండ్ బ్లాకయ్యేలా  ఎన్నో  ఉన్నాయి టెంప్లేట్స్,ఆఖరిది తప్పిస్తే మిగతావన్నీ నా ఫెవోరేట్ టెంప్లేట్స్


రెండవ సూత్రము : ప్రొఫైల్
ఇక్కడ మీ ప్రొఫైల్ మరియు మీ గురించి చూసి  ఒక అంచనాకు వచ్చేస్తారు(ఆత్రం ), అందువల్ల ఒక మంచి ఫోటో వెతకండి వెతకండి
 

మూడవ సూత్రము :మహాకూజ
maalika
హారం
కూడలి
జల్లెడ
మీ బ్లాగు అగ్గ్రిగేటర్ లో చేర్చుకోండి ఇప్పుడు quickest aggrigator beta versions కూడా రిలీజ్ అయ్యింది ఈ మధ్యనే
ఒక లుక్కేయండి


నాలుగవ సూత్రం:  నాకేంటి
పోస్ట్ రాసే ముందు రెండు రోజులు కాస్త తరచుగా కంమెంట్లు రాయడం మర్చిపోకండి మీరు రాసే ఎటువంటి పోస్ట్ అయినా మొహమాటానికి కొన్ని కామెంట్లు రావాల్సిందే

అయిదవ సూత్రము: అంచనాలు మరియు అల్లాడించడం   
మీకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాక వాటిని అందుకోవడానికి ప్ర
త్నిచడానికి మీ శాయశక్తులా కృషి చేయండి 
అడిగిందే అమ్మ అయినా పెట్టదు, కావున వేరే బ్లాగుల్లో కాస్త తరుచుగా వ్యాఖ్యలు రాయండి 

ఆరవ సూత్రము: ఆపరేషన్ మార్తాండ
కామెంట్లు కావాలా ? మీ టపా లో రంగనాయకమ్మ,చలం అనే పదాలను వచ్చేలా ఎక్కడో ఒకదగ్గర ఇరికిన్చేయండి,మీ బ్లాగులో కామెంట్ల పండగ చేసుకోండి మూడు చర్చలతో ఆరు రచ్చలతో మీ కామెంటు బాక్స్ నింపుకొని ఆనందించండి
ఇంతకీ మార్తాండ అంటే ఎవరు అనే ప్రశ్న వేసారు అంటే?  మీ బ్లాగు వయసు కేవలం పదిరోజులు అయ్యివుంటుంది  మీ లాంటి వాళ్ళ కోసం  ఈ ఒక్క విషయం లో నేను వాల్మీకినై  చెబుతున్నా

 
 (ఈ అఖండ బ్లాగావనిలో సన్నాసుల్లో చేరమనేవోడూ, చాలెంజీలు చేసేవోడు, పొంతనలేకుండా సమాధానాలిచ్చేవాడు, పరమమూర్ఖ లాజిక్కులు చేప్పేవోడు, అసలు విషయం వదిలి అడ్డంగా కామెంట్లు రాసేవోడు, జిడ్డుగా ఒకే పోస్టుకి వందల్లో కామెంట్లు రాస్తూ బుర్రతినేవోడు, సంబంధంలేని వివరణలు ఇచ్చేవోడు, కామెంట్లన్నీ స్టేట్‌మెంట్లలా ఇచ్చేవోడు, మనుషుల మతిపోగెట్టేవోడు, నవ్వించే వోడు…హ.హ.హమ్మ .. ఒకే ఒక్క మూర్ఖాగ్రేసరుండు). 
courtesy :  కేక  

 

ఏడవ సూత్రము: ఏడవండి
మీ ఏడుపే మాకు శ్రీరామ రక్ష
ఒక రచయితను పట్టుకోండి ఒక టపా రాయండి
ఎవరో వ్యాసం పై ఇంకెవరో విమర్శలకి సమాధానం అనే శీర్షికతో టపాలు రాసేసి మీ పేరు ని పాపులర్ చేసేస్తారు 
ఫ్రీ పబ్లిసిటీ :)

ఎనిమిదవ సూత్రము: వీక్ ఎండ్స్ లో పోస్ట్ లు
మీ హిట్లను పెంచుకోవడానికి వీక్ డేస్ లో పోస్ట్ చేయండి హిట్లతో పాటు కామెంట్లు కూడా వస్తాయి

తొమ్మిదవ సూత్రం:
   వెంబడించే వాళ్ళు
వెంబడించేవాళ్ళు లేరని బాధ పడుతున్నారా(
మార్తాండ కాదు ఫోల్లోవేర్స్),  మీ బ్లాగు ఏదో ఒక పేపర్లో రావాల్సిందే

పదవ సూత్రం : పగలే వెన్నెల
imagine  చెయ్యండి, మీ ఊహా శక్తి కి పదును పెట్టండి,అంతే కాని పట్టపగలే చుక్కలు చూపించకండి
అక్షరాల రంగు మరియు బ్యాక్ గ్రౌండ్ కలర్ కూడా చాలా ఇంపార్టంట్మొన్న ఇదే విషయాని మార్తాండ బ్లాగులో ఎవరో అజ్ఞాత రాసినప్పటి సంభాషణ
అజ్ఞాత: మీ బ్యాక్ గ్రౌండ్ కలర్ చాలా డార్క్ గా  ఉంది నల్ల  అక్షరాలు అసలు  కనిపించడం లేదు ముందు ఆ బ్యాక్గ్రౌండ్ ని మార్చండి
క్షవరాల ఖర్మ: మీరే మీ మోనిటర్ brightness ని పెంచుకోండి, అప్పుడు సరిగ్గా బాగా కనిపిస్తుంది   
ఇలాంటి సమాధానాలు చెప్పి  షాక్ లు ఇవ్వకండేం!! 


 

  

 

 

26 comments:

karthik said...

rasavaa..wait chestunnaa eppudu rastaavaa ani..

ROFL.. operation martanda.. supero super

Karthika said...

hehe :)gud oyeee.

chaala search chesi petta aa template :).

sowmya said...

ఏమిటీ పైత్యం. మీలో ఉన్న గొప్ప హాస్యాన్ని ఇలా వేస్ట్ చెయ్యడం నాకు నచ్చలేదు. పనికొచ్చే టాపా అంటే హాయిగ నవ్వించే టపా రాయకూడదా...కామెంట్లు అవే వస్తాయి.

తృష్ణ said...

నేనిoకా పాతరాతియుగమ్నాటి తెంప్లేట్నే కంటిన్యూ చేస్తున్నానే......?

అయ్యో మీరీ టపా పదకొండు నెలలు ముందర రాసి ఉంటే నాకు ఉపయోగపడేదేమో..:) :)

మురళి said...

మీరు బాగా రాయగలరండీ.. కానీ కొన్ని విషయాలు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్ధం కావడం లేదు నాక్కూడా..

నేస్తం said...

:) నా బ్లాగ్ టెంప్లెట్ ఆహ్లాదం గా ఉందా ???.. నిజ్జంగా .. ఒట్టుగా ..హమ్మయ్యా

శరత్ 'కాలమ్' said...

:)

Naresh said...

:)
బాగుంది
నీకు "బ్లాగోపదేశ చక్రవర్తి" , "బ్లాగ్ధురీన" లాంటి బిరుదులు ఇచేటంత లెవెల్లో రాసావు :). సూపరు

హరే కృష్ణ . said...

కార్తీక్
ఈ టపా రాయడానికి కేక లో నీ కామెంట్ కూడా బాగా తోడయింది
నీకు రెండు సార్లు థాంకులు :)


పింకీ :D
నీ టెంప్లేట్ చాలా బావుంటుందోయ్

హరే కృష్ణ . said...

సౌమ్య గారు
అలాగే అలాగే
>>హాయిగ నవ్వించే టపా రాయకూడదా
అదే పని లో ఉన్నాను
వచ్చేవారం మీరు మర్చిపోకుండా కామెంటు రాయండి :)


తృష్ణ గారూ స్వాగతం
చాలా థాంక్స్ :)
>>అయ్యో మీరీ టపా పదకొండు నెలలు ముందర రాసి ఉంటే నాకు ఉపయోగపడేదేమో..:) :)
-ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు ఒక సంవత్సర కాలం పట్టింది :)
0.8333 ఫార్ములా per month :D
లేదండీ టెంప్లేట్ మార్చుదాం అనుకుంటాం కాని ఒక పట్టాన కుదరదు
నేను కూడా ఈ మధ్య భంగపడి మళ్ళీ పాత టెంప్లేట్ నే కంటిన్యూ చేస్తున్నా

thank you

హరే కృష్ణ . said...

మురళి గారు
సూచనకు థాంక్స్
నేను హామీ ఇస్తున్నా సరేనా :)

:)
శరత్ గారు థాంక్స్

హరే కృష్ణ . said...

నేస్తం గారు,
నిజ్జంగా నిజం
అందుకే కదా మొదట మీ బ్లాగ్ టెంప్లేట్ గురించే రాసాను అంత బావుంటుంది :)హహహ
నీ అభిమానానికి థాంక్స్ నరేష్
"బ్లాగోపదేశ చక్రవర్తి" ఇదేదో బావుందే
నాకే ఇవ్వాలి మరి ఈ బిరుదు :)

banthi said...

ఆ ఆరో సూత్రం ఏదో బాగుంది ;)

nagarjuna చారి said...

మార్తాండ ‘కేక’లోకూడా పాపులర్ అయ్యాడా..!! కెవ్....

శ్రీనివాస్ పప్పు said...

కాగల కార్యం గంధర్వులే(సౌమ్య,మురళి)తీర్చారు.అయ్యా అదీ సంగతి.

హరే కృష్ణ . said...

బంతి గారు :)థాంక్ యూ

నాగార్జునా చారి గారు
హ హ్హ అవునండీ
కేక చాలా బావుంది :)

శ్రీనివాస్ గారు :P
thank you

మంచు పల్లకీ said...

హ హ హ,, బావున్నాయ్ .... నేను కొన్ని ఫాలొ అవ్వాలి...
ఆరొ సూత్రం గురించి : ఒకప్పుడు మన గురువు గారు చెప్పారు ..
" కుక్కని తంతే డబ్బులు...మార్తాండని తిడితే కామెంట్లు " రాలతాయని :-))

భాస్కర్ రామరాజు said...

నీకు వందమార్కులు వేస్తున్నా.
ఇది మాత్రం నిజం
నాలుగవ సూత్రం: నాకేంటి
పోస్ట్ రాసే ముందు రెండు రోజులు కాస్త తరచుగా కంమెంట్లు రాయడం మర్చిపోకండి మీరు రాసే ఎటువంటి పోస్ట్ అయినా మొహమాటానికి కొన్ని కామెంట్లు రావాల్సిందే

అయిదవ సూత్రము: అంచనాలు మరియు అల్లా

హరే కృష్ణ . said...

పల్లకీ గారు
థాంక్ యూ
గురువు గారు చెప్పింది భలే గుర్తుంది మీకు
:)

నిన్న శ్రీనివాస్ గారి పోస్ట్ లో కూడా అమాంతం వచ్చేసాయి కామెంట్లు

హరే కృష్ణ . said...

100/100
కేక
భాస్కరన్నా థాంకులు :)

vikky said...
This comment has been removed by the author.
vikky said...

telisi telikunda indulo chaala suthraalu nenu follwo aiyaa... baaga analyse chesaavu :)

హరే కృష్ణ . said...

Thankyou vikky :)

కౌండిన్య said...

సూత్రాలు బాగున్నాయి :)

హరే కృష్ణ . said...

కౌండిన్య గారు

థాంక్స్ :)

Naresh said...

నాలాంటి కొత్త బ్లాగర్లకి చాలా విషయాలు చెప్పారండీ ఇందులో. కానీ, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇందులో చాలామట్టుకు నేను ఆచరించాలేనేమో అని అనుమానం.