Pages

Monday, April 12, 2010

బ్లోకిరి..

ధాబా లో డిస్కషన్ జరుగుతోంది
ఒకడి బ్లాగు ని తిట్టాలి
పేమెంటు కామెంట్లు చెప్పావా, మీలో ఎవరు తిడతారు
తిట్టేది మేము కాదు, తండు
రేపు పొదున్న వాడి బ్లాగులోనే వాడి గుండెను పరిగెత్తించి పరిగెత్తించి మరీ తిడతాడు

ఆ మర్నాడు పొద్దున్న హీరో ఇంట్రో అయ్యాక
మల్లేష్ వాళ్ళ బ్యాచ్ తో గొడవ

ఒక సైబర్ కేఫ్ లో దూరారు అంతా
హీరో:టెంప్లేట్ బావుంది తిట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి

మ:ఎవడ్రా నువ్వు
హీరో: పేరు చెప్తే గాని తిట్లు  తినవా
మ:నన్నే తిట్టడానికి సుపారీ తీసుకుంటావురా నువ్వు
హీరో:ఆల్రేడి తీసేసుకున్నా ఒక్క సారి  కీ-బోర్డు దొరికితే నా చేతులు నా మాటే వినవు
మ:ఒరేయ్ అజ్ఞాత కామెంట్లు డిసేబుల్ చేయ్యురా
హీరో:కొంచెం moderation పెట్టుకో అమ్మా పారిపోవడానికి ఉంటది
మ:ముయ్ ముయ్ ముయ్ రా
తెరిచుంచాలా  రా నీ %$$%^ ఏం చేస్తావురా..
హీరో:నా బ్లాగు మీదొట్టు నీ బ్లాగు ముయ్యకపోతే నన్నడగరా 
మ:మధ్యలో నా బ్లాగేం చేసింది రా
హీరో:నిన్ను తిట్టడానికి మరి మా వదినెందుకురా 

చిన్న ఫైటు
కధానాయకుని విశ్వరూపం పాట రూపం లో

బ్లగడమే..
నా బ్లాగుని బూతుగ చూస్తే
నా రచనకు రివ్యూ రాస్తే
ఈ ప్రనా కధలను కెలికేస్తే
గగనమే....
బ్లగడమే ఏఏ... ఎయ్య్

ఎక్కడైనా నా తీరింతే ఈ వదినరాత నా స్టైలంతే   
ఈ రాత గాని చూసారంటే చలం గారు చచ్చారంటే
కధలనే ..

నా చేతికి సాగర వాటం నా ఎమోషన్ సూర్య ప్రతాపం
నా టైపింగ్ వాయువు వేగం నే బ్లాగితే తప్పదు రణరంగమ్   ఊ ఊ ఉమ్మ్
బ్లగడమే 

సాంగ్ అయ్యాక హీరో ఫ్రెండ్ సైబర్ కేఫ్ లో వాళ్ళ నాన్నకు  క్యారేజి ఇవ్వడానికి వెళ్తున్నాడు
మీరు ఇక్కడే వుండండిరా నేనొక కామెంట్ రాసేసి  వస్తా
తండ్రి :ఏరా ఎక్కడికి వెళ్ళావ్ నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావ్ మొన్న ఎక్కడికి వెళ్ళావ్ ఈరోజు కామెంట్ రాసేస్తే మర్చిపోతాను అనుకున్నావా
ఇంకో ఫ్రెండ్:ఇప్పుడే వస్తాను వుండండి రా ఒక అమ్మాయి బ్లాగు వుంది నేనూ ఒక కామెంట్ రాసేసి వస్తాను
బాగా రాస్తుంది రా ఆ అమ్మాయి  బాగా రాస్తే కామెంట్ రాసేస్తావా మనకెందుకురా  కామెంట్లు  రోజూ వంద మంది అమ్మాయిలు బ్లాగుతారు ఏ మరీ అంత బాగా రాసేస్తే ఏమి చెయ్యలేమనుకో
ఇదేంటి ఇలా ఉంది  అని అప్పుడే హీరోయిన్ బ్లాగు చూసి హీరో కామెంట్ పారేసుకుంటాడు

తర్వాత రోజు మెట్రో స్టేషన్ లో
హీరోయిన్ నడుస్తూ ఉంది
ఐ మే నాట్ బి పెర్ఫెక్ట్  బట్ మై బ్లాగ్స్ ఆర్ ఏదో సమ్ అని ఉందే
నీరసమ్
అక్కడ బ్లాగ్ ఎట్ ఫస్ట్ సైట్  అయ్యాక

ఇక్కడ తండు అంటే ఎవడ్రా నువ్వా తండు? చెప్పు బె తండు  కౌన్ హై ఇదర్  చెప్పు బె
అన్నయ్యా తండు  గాడు కావాలా ఎవడి కధ చదివితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయిపోద్దో వాడే తండు గాడు అంటే నేనే అని చెప్పాడు హీరో

విలన్ నాయక్ డెన్ లోకి మన కధానాయక్ ఎంటర్ అయ్యాడు
అందరూ కలిసి వాడి బ్లాగులో  ^^&*(^&%^ అని మల్లేష్ గట్టిగా అరుస్తున్నాడు తండుని చూసి
నాయక్: మా బ్లాగులో పోస్ట్ రాస్తావా
తాండు: నేను ఎవడి బ్లాగులో పోస్ట్ రాయను,వదినెవరిదో చెప్పు కధకెంత  కామెంటుకెంత
నాయక్ :ఇన్నాళ్ళు నువ్వు వేస్తున్న  చిల్లర పోస్ట్ లు కావు, మేటర్ చాలా సీరియస్ గా వుంటుంది ఎగ్రిగేటర్లు అంటే భయపడకూడదు
తాండు: నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తావ్,నాకేదైతే భయమో వాడి పేరుని నా కధ లోకి హీరోని చేసెయ్యడం అలవాటు 
హీరో:ఈడెవడు
నాయక్: మనోడే సురేష్  ఏం
ఒక పెద్ద %^&*&**(పోలింగ్,పోలింగ్,పోలింగ్)
హీరో:మీ అడ్డాలో మీ వాడినే తిట్టాను  నన్ను తిట్టడం మీకు పెద్ద పనేం కాదు, నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదొక ఎక్సాంపుల్
ఈడినేందుకు తిట్టానంటే ఇందాక వీడు నన్ను రాంగ్ హాండ్లింగ్ చేసాడు బ్రాంది తాగి వచ్చి  నా ప్రింటర్ అదీ పట్టుకొని ఇంకెప్పుడూ అలా తేకేం
సో కధేంటి నీకెన్ని నాకెన్ని (కామెంట్లు) 
ఎల్లనా
అమ్మాయి: ఏ జీరో.. నీ బ్లాగు నాకు నచ్చింది రా
హీరో:అన్నయ్యా ఎవరీ వదిన...  ఎయ్య్ కొంచెం తగ్గు
అమ్మాయి:మోనా..... ఏ రఖ్ దో
నాయక్:కీ బోర్డు బాగా అలవాటు ఉందా బాగా తెలిసినట్టు టైపు చేసావ్
హీరో:డి టి పి సెంటర్లో చూడట్లేదేంటి
నాయక్:వీడికి చత్వారం బాగా ఎక్కువ
మోనా:మనకు కావాల్సిందీ అదేగా

మరో వితండవాదం తో నిండిపోయిన విలన్  జీప్ లో వెళ్తున్నాడు హీరోయిన్ రోడ్ మీద నడుస్తోంది
విలన్:ఏ బండాపు.. బండాపు
ఏ ఎయ్య్ నీ  పేరేంటి 
ఎక్కడికి వెళ్తున్నావ్
నీ బ్లాగు అడ్రెస్స్ రాసి ఇవ్వు
హీరోయిన్: ఎందుకు సర్
విలన్:సీనియర్స్
ఒరేయ్ ఆనంద్ టర్కీ హ్యాకర్లు మన దగ్గర నుండి ఏదో హ్యాక్ చేసేసారని ఏడుస్తూ ఉంటార్రా మన వాళ్ళంతా ఏంటిరా అదీ
పైత్యావలోకనం బ్లాగు సార్
ఎవడు చెప్పాడురా  టర్కీ వాళ్ళు హ్యాక్  చేసారని అదిగో ఈ ప్లానెట్ లో ఉంది పైత్యావలోకనం బ్లాగు
మస్తిష్కం వ్యాఖ్యలను వక్రీకరించాలని కోరుతోందిరా అరేయ్ అమలాపురం ఇది హైదరాబాద్ రా చల్ చల్ చల్ ఇంటర్నెట్ సెంటర్ కి చల్ చల్

ఇంతలో ఒకరి బ్లాగు అర్ధాంతరంగా మూసుకుపోయింది
నాగరాజు గ్రూప్  లో discussion
మూయించింది వాళ్ళే  కాని
ఖచ్చితంగా బ్లాగు మూయించింది ఆ బ్లాగు ప్రెసిడెంట్ నరేందర్ గాడే,వాడికి ఆవులు భాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది
ఏంట్రా ఆవులు భాయ్ గాడి సప్పోర్ట్, బ్లాగుల్లో ఈ నారాయణ బ్లాగులే చదవాలి  ముందు ఈ నరేందర్ గాడి  బ్లాగు మూయిన్చేయండి

రిపోర్టర్: మేము ఊ టీవి నుండి వస్తున్నాం, అడగనా సార్ (కెమెరా ఆన్ చెయ్ ఆన్ చెయ్)
బండ గణేష్: నరేందర్ బ్లాగుని మూయించింది నేనే
రి:ఎందుకు మూయించారు
బండ:పాత కక్షలు, వాడికి నాకు పడదు అందుకనే మూయిన్చేసా
రి:మరి ఎప్పుడు మీరు ఈ మూయించడం ఆపేస్తారు సార్
బండ:ఇంకా మరో నలుగురు బ్లాగర్లు వున్నారు వాళ్ళందరి బ్లాగులు మూయించి అప్పుడు ఆపేస్తాను

హీరో హీరోయిను  కలిసాక
హీరోయిన్ రాసిన ఫుల్ లెంగ్త్  పోస్ట్ చూస్తాడు హీరో
అప్పుడు వెంటనే

తిప్పి తిప్పి కడుపంత తిప్పి  వాంతి మళ్ళీ వచ్చేస్తది
పట్టి పట్టి నరాలు మెలేసి వైరాగ్యం లోకి లాగేస్తది
అసలేమయింది తెలియకుంది బాబోయ్
రాతిరంతా కునుకులేదు కధోకటి చదివానురోయ్

టర్కీ హ్యాకర్లు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరోయ్..
చెత్తరాసి చంపుతోంది ఈ ఈ...

హీరోయిన్  దగ్గర అవుతున్న హీరో ఒక రోజు లాప్టాప్ లో బ్లాస్టర్ బాల్ 3 ఆడుతుండగా
విలన్ కి ఇన్ఫర్మ్  చేసాడు వాచమన్
ఇంతకు ముందు రోడ్ మీద హార్డ్ డిస్క్ దొరికిందని అని ఇచ్చింది నువ్వే కదా,ఇప్పుడు నీకు కృతి అనే పిల్ల కూడా దొరికిందంట కదా మరి నాకు తెచ్చివ్వలేదేం?
హార్డ్ డిస్క్ దొరికిందని చెప్పానే ఆది నాదే,లినక్సు bootable డిస్క్ లు కూడా నాదగ్గరే వున్నాయి

ఎయ్ ఎయ్ ఎయ్య్ అని హీరో  మీదకు వచ్చాడు విలన్  
హీరో:నువ్వు వాడే పెన్ డ్రైవ్ లు మీ అయ్యకు లెక్కచెప్పాలి నేనేవ్వడికి  లేక్కచేప్పకర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు 

విలన్:తొందర్లోనే నువ్వు ఏగ్గ్రిగేటర్ల బ్లాగుల్లో నుండి నువ్వు పోతావ్ రా  చూస్తూ ఉండు
హీరో:నీ బ్లాగులో కొత్త follower అనుకుంటున్నావా
ఎలా మూసేసాడో చెప్పనా
ఏగ్గ్రిగేటర్ హ్యాండ్ ఓవర్ చేసేసాడా.. పోల్స్ ఏత్తన్నారంటగా

తర్వాత సీన్ లో
బ్లాగర్ల సమావేశం గోల్కొండ ఫోర్ట్
గొడవలు తిట్లతో జరుగుతోంది సమావేశం
కొబ్బరిచిప్ప దొరికింది మన హీరో కి వెంటనే ఆ తిట్లను జతచేసి ఒక కధ రాసేసి మెయిల్ చేసాడు హీరోయిన్ కి
దెబ్బకి దిమ్మతిరిగి హీరోయిన్ కి మూర్చరోగం వచ్చి కోమా లోకి వెళ్ళాక హీరో కధలు రాయడం మొదలెట్టాడు 


హీరో ని అందరూ వెంటతరుముతున్నారు ఈ కధలను భరించలేక
ఒక సందులో దాక్కున్నాడు మన హీరో
హీరోయిన్ సడన్ గా కనిపించింది అదే దారిలో
హీరోయిన్ :ఇప్పుడు మళ్ళీ  ఏం కధ రాశావ్, ఎన్ని కధలు చదివాను నీవి
ఎన్ని సార్లు కడుపులో తిరిగింది నీ కధలు చదివి, ఇప్పుడు ఏం చెయ్యాలి నీ బ్లాగు చూడాలా మర్చిపోవాలా
హీరో: మర్చిపో 

హీరోయిన్: ఎలా మరచిపోగలను నీ బ్లాగుని
ఏ చెత్త కధ  చదివినా నువ్వే  గుర్తొస్తావ్ యాహూ  చూద్దామంటే అక్కడ కూడా నీ వీడియో లే


ఎగిరే పావురమా సినిమా చూస్తే నువ్వే గుర్తొస్తావ్
స్టువర్టపురం చూసినా నువ్వే మళ్ళీ 

ఎవరైనా తలా తోక లేకుండా మాట్లాడితే నువ్వే గుర్తొస్తావ్
ఇప్పుడేం చెయ్యమంటావ్, ఇలా ఎన్ని తప్పులు చేస్తావ్
హీరో:కృతి నీకో విషయం అర్ధం కావడం లేదు నేనెప్పుడూ కధలు రాస్తూనే వున్నాను ఇప్పుడు రాసిన కధ కూడా కొత్తదేం కాదు ఇదివరకట్లా రాసిన చేత్తకధే
ఇప్పుడు కొత్తగా తప్పు చేస్తోంది నువ్వు నా బ్లాగుని ఫాల్లో అయ్యి తప్పు చేసావ్
కాని నేను మాత్రం తప్పు చేయలేదు మంచి బ్లాగునే కెలికాను


ఒక డ్యూయెట్
గల గల బ్లాగుతున్న మార్తాండలా
విల విల లాడుతున్న బైరాగిలా..
నా బ్లాగుకై నువ్వలా అజ్ఞాత గా మారగా నాకెందుకో వున్నది రోతగా...

వైరాగ్య వానలా వాననీటిలా తారలా వర్షించి నేరుగా వాలిరాలవా నా పైన
కన్నీటి తారలా వేచి నేనిలా  చాటుగా పొమ్మన్న పోనుగా ఎంత చెప్పినా నీ ఖర్మా

ఉ ఓ ఓ ఓ  ఈ బ్లాగరి  ఊ ఓ ఓ ఓ
ఉ ఓ ఓ ఓ బాగున్నది ఊ ఓ ఓ ఓ ఓ... ఓ నో ..



ఆవుల భాయ్ వచ్చాక  తండు గాడితో మీటింగ్
ఆభా :ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించే చెప్తున్నారు నీ బ్లాగు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది రా
హీరో:నాకు కూడా
ఆభా:సరే ఏం కధ రాస్తావ్
హీరో :నేను రాయను
ఆభా:భయపడొద్దు చెప్పు ఏం రాస్తావో
హీరో:ఒకడు రాయమంటే రాయను నాకు రాయాలనిపించినప్పుడు రాస్తాను


ఆభా:ఎరా నువ్వు ఎప్పుడూ ఇంతగా తెలియకుండానే మాట్లాడుతుంటావా 
హీరో:నా మాటే అంత


ఆభా:గురువు గాడి ఇచ్చిన పబ్లిసిటీ ని  నమ్మి నీకో పని ఒప్పచెబుతున్నాను  ఒక బ్లాగులో నువ్వు తిట్టాలి తిడతావా 
హీరో:ఆ తిడతా
ఆభా:పబ్లిక్ గా అందరిముందు తిట్టాలి
హీరో:మరి వదినలు
ఆభా:తిడితే పడతారు అదే కదా మా కాన్సెప్ట్
హీరో :బ్లాగుల్లో కామెంట్లు  రాయమంటే రాస్తాను
వదినలకు వృద్ధులకు ఏం జరగకూడదు అది నా కాన్సెప్ట్
ఆభా:సరే నువ్వు తిట్టకపోతే వీడు తిడతాడు
హీరో: వాడిని కూడా తిట్టనివ్వను
నువ్వు ఓపెన్ ఐ డి తో ఎక్కువసేపు ఉండడంమంచిది కాదు ,త్వరగా బయల్దేరు

ఇప్పటికింకా బ్లావయసు నిండా  రెండేళ్ళే
చీటికి మాటికి కేలికేస్తూ చుట్టూ బ్లాగర్లే
జైసే జా  బ్లాగు చూస్తె నాకు దడపుడతా  ఉందే
జైసే జా ఆగు వదినే అసలేవడూ నీ బ్లాగే  చూడడులే
పాట అయ్యాక  
హ్యాకర్లు వచ్చి ఆవులు భాయి ఐ డి ని హ్యాక్ చేసేసారు

హీరోయిన్ కంప్యూటర్ ఓపెన్ చేసింది
హీరోయిన్:తండు ఎక్కడున్నావ్,ఎక్కడున్నావో చెప్పు నువ్వు ,నాకు తెలుసు నువ్వు ఇక్కడే వున్నావ్ అని
హీరో:ఇక్కడా ?
హీరో:తండు నేను చెప్పేది విను నువ్వు ఇక్కడే ఎక్కడో జీటాక్ లో  ఉన్నావని నాకనిపిస్తుంది
హీరోయిన్: నీ అజ్ఞాత కామెంట్లు  నా బ్లాగుకి తెలుస్తున్నాయ్
i strongly believe you are here right now
నువ్వు ఇక్కడే ఆన్ లైన్ లో ఉంటే అది నిజమే అయితే ఐ కామెంట్ యు సో మచ్ ఒకవేళ నువ్వు లేకపోతే నీ బ్లాగుని మర్చిపోవడానికి ట్రై చేస్తాను
హీరో:లేదు, నేను RGV బ్లాగులో వున్నాను
no you are a liar, you are here మై బ్లాగ్ ఇజ్  ట్రూ

హీరో:టీ చెప్పండ్రా
హీరోయిన్:ఏంటి నువ్వు rgv బ్లాగులో ఉన్నావా, rgv బ్లాగు కెళ్ళే మొహమేనా అది
హీరో:అది సరే నా అజ్ఞాత కామెంట్లు నీ బ్లాగుకి తేలుస్తున్నాయా
యిన్: మరి తేలీదా
హీరో:నాకు తెలియట్లేదే 
యిన్:ఎవరి బ్లాగులో నైనా కామెంటు పెడితే  కదా నీకు తెలియడానికి
హీరో:అయితే ఇప్పుడు కామెంట్ పెట్టాలా
యిన్:ఇప్పటిదాకి నువ్వు కామెంట్ పెడతావనుకున్నాను కాని ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను
thats why i hate you truly and completely
హీరో:కోపంగా ఉన్నట్టు వున్నావ్ తర్వాత కామెంటుకుందాం  నెట్ సెంటర్ కి వెళ్ళు పో
ఎరా నీ గౌరీ ఎక్కడ ఉందిరా అది కూడా ఇలాంటిదేనా ఇలా కామెంట్లు రాయడం లేదని వేపుకు తింటుందా
ఈ బ్లాగర్లు మనకు వేస్ట్ రా
యిన్:నువ్వు కూడా నాకు వేస్ట్
హీరో:ఎల్లమని చెప్పండ్రా ఇన్ని సార్లు లాగ్ ఇన్ అవ్వద్దు అని చెప్పండి బే

తర్వాత హీరోయిన్ ని హ్యాకర్లు నుండి కాపాడతాడు హీరో
నువ్వు నా దగ్గేరుంటే నాకే భయము లేదు
నీ బ్లాగుల్లో ఇంత కాన్ఫిడెన్సు వుంటుంది అని తెలీదు
ఐ లవ్  యు అని కలిసిపోయారు ఇద్దరూ

చూద్దంటున్నా చూస్తూనే ఉంటా నా బ్లాగు కోసం నువ్వు పుట్టావనుకుంటా
వద్దోద్దంటున్నా  వస్తూనే ఉంటా  కలకాలం నీ బ్లాగే నా ఇల్లనుకుంటా
వచ్చేయ్  రా వచ్చేయ్  రా  మార్తాండ కధలు మనకేల
రాసేయ్ రా  రాసేయ్ రా నీ చెత్త కధలు ఇకనేల
తిట్టేయ్ వా తిట్టేయ్ వా  బొట్టెట్టి నిన్ను పిలవాలా
తిట్టేయ్ వా తిట్టేయ్ వా  తిట్టేయ్ వా ..

సడియో సడియో సడియో  నేనే వస్తానుగా సడియో సడియో సడియో  నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో  నువ్వే కావాలి గా సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా

ఆవులు భాయ్ మెయిల్ ఐ డి హ్యాక్ చేసాక ఎవరు చేసారో అని  ట్రేసింగ్  చేస్తున్నాడు విలన్
అప్పుడే నాజర్ దగ్గరికి వెళ్లి అడుగుతారు మీ శిష్యుడే నా మెయిల్ ఐ డి హ్యాక్ చేసారని
ఆవులు భాయ్ హీరో ఫ్రెండ్ మెయిల్ ఐ డి హ్యాక్ చేస్తారు హీరో అనుకోని

నువ్వేనేరా మార్తాండ వి కాదు అజయ్
వీడు అజయ్ అయితే మరి మార్తాండ ఎవరు
రాజ మార్తాండా ISP
2007 బ్యాచ్
badge నెంబర్ 08942
ట్రైన్డ్ at ఒరిస్సా
రాజ మార్తాండ్ కేరాఫ్ డి.టి.పి
చూసావా ఎంత గర్వపడుతున్నానో
గురువు గా ఇంతకన్నా ఏం కావాలి రా

తర్వాత తన ఇంటర్నెట్ సెంటర్ ని మార్తాండా హ్యాక్  చేసి సిస్టం  క్రాష్ చేసేశాక  ఇరవై ఏళ్ళ  ఇంటర్నెట్  సామ్రాజ్యాని కూల్చావు కదరా అని చెప్తాడు అవులుభాయ్
హీరో: సర్ మీ బ్లాగు సేఫ్ అవులుభాయ్ ఎకౌంటు  ని డిలీట్ చేసి తన సిస్టం ని క్రాష్ చేసేసాం
బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఏగ్ర్రిగేటర్ కూడా  తన ఎకౌంటు మూసేసాడు



సార్ ఏమి మాట్లాడుతున్నారు సర్
హీరో:ఒక్క సారి కధ రాయడం మొదలెడితే  నా మాట నేనే వినను


thank you

ఈ మధ్య సిస్టం లో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా చూసి బోరు కొట్టేసింది
దానికి తోడు   బ్లాగుల్లో గొడవలూ తిట్లాటలూ వెరసి ఈ టపా కి ప్రేరణ  

42 comments:

ఆ.సౌమ్య said...

బాబోయ్ మొత్తం సినిమా దింపేసారుగా...మార్తాండ అలా దిగిపోయాడు. పాటలు కేక...చస్తున్నా నవ్వలేక

ఇలగ రాస్తే సచ్చిపోతాను బాబూ నవ్వలేక, ఇదవరకిలా నేను నవ్వలేదు.....హి హి హి

స్వర్ణమల్లిక said...

అన్నయ్యా ఎవరీ వదిన... ఎయ్య్ కొంచెం తగ్గు

టర్కీ హ్యాకర్లు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరోయ్..
చెత్తరాసి చంపుతోంది ఈ ఈ...

నీ బ్లాగులో కొత్త ఫొల్లౌఎర్ అనుకుంటున్నావా
ఎలా మూసేసాడో చెప్పనా
ఏగ్గ్రిగేటర్ హ్యాండ్ ఓవర్ చేసేసాడా.. పోల్ల్స్ ఏత్తన్నారంటగా

గల గల బ్లాగుతున్న మార్తాండలా
విల విల లాడుతున్న బైరాగిలా..
నా బ్లాగుకై నువ్వలా అజ్ఞాత గా మారగా నాకెందుకో వున్నది రోతగా...
(అబ్బొ ఇది మాత్రం సూపరు బాబొయ్)

చాలా బాగుంది మీ బ్లాకిరీ. మీలొ ఇంత టాలెంటు ఉందని ఎప్పుడూ గమనించనెలేదండీ.

నాగప్రసాద్ said...

సూపర్. సినిమా కేక సారీ కథ కేకో కేక. బంపరు హిట్టు. :)

శ్రీనివాస్ said...

మీకే కెబ్లాస అధ్యక్షా పదవి ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం .... ప్రకేబ్లాస బాధ్యతలు కూడా మీకే ఇప్పించేలా చూస్తాం వచ్చేయండి

మంచు said...

ఈ పొస్ట్లొ నచ్చిన పంచ్ డైలాగ్లు మళ్ళి చెబుదామంటే స్పేస్ సరిపొవట్లేదు ..అన్ని వున్నాయ్.. ముఖ్యంగా హీరొయిన్ - హీరొ - RGV బ్లాగ్ సీన్ సూపర్ గా పండింది .
ఆ బ్లొగిరి పొస్టర్ లొ పూరి జగన్నాద్ పేరు మార్చి , మీ పేరు పెట్టండి

శ్రీనివాస్ పప్పు said...

నేనొక్సారి కమెంటలని కామిటయితే న బుధే న మట వినద్.హబ్బా నవ్వలే సచ్చిపోయాన్ యా ఇట్స్ నిజం.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

ఈ బ్లాగు గొడవలు అవీ నాకు తెలియవు కానీ మీ పేరడి మాత్రం సింప్లీ సూపర్బ్

బంతి said...

సూపరో సూపరు
అదరగొట్టేసారు కదా :)

శరత్ కాలమ్ said...

:))

Bhãskar Rãmarãju said...

తమ్ముడూ
నన్ను *ఛింప్*ఏస్తున్నావ్
>>గల గల బ్లాగుతున్న మార్తాండలా
విల విల లాడుతున్న బైరాగిలా..
నా బ్లాగుకై నువ్వలా అజ్ఞాత గా మారగా నాకెందుకో వున్నది రోతగా...
పడిపడినవ్వుతుంటే మా మేనేజర్ వచ్చింది. అదోలా చూసి వెళ్లింది.

కత పవన్ said...

సుపర్ కేక..అసలు సిసలు పెరడి...100% కేక

హరే కృష్ణ said...

సౌమ్య గారు చాలా థాంక్స్
హహహ :D

స్వర్ణమల్లిక గారు బోలెడు థాంకులు :)

హరే కృష్ణ said...

నాగప్రసాద్ ధన్యవాదాలు
శ్రీనివాస్ గారు చాలా థాంక్స్ అన్నట్టు మీ బ్లాగుకు మీ రాజేష్ కి నేను కూడా విసనకర్రనే :)

హరే కృష్ణ said...

మంచుపల్లకి గారు అన్ని ఉన్నాయంటారా పంచ్ లు థాంకులు :)
ఇప్పుడు మళ్ళీ ఫోటో షాప్ చేసి పెట్టేవాళ్ళు ఎవరు :(
పూరీ&ప్రనాదే ఆ క్రెడిట్ అంతా :)


శ్రీనివాస్ గారు థాంక్ యూ
>>యా ఇట్స్ నిజం
కేకో కేక .

హరే కృష్ణ said...

శ్రీకాంత్ గారూ బ్లాగుకి స్వాగతం
చాలా థాంక్సండీ

బంతి గారూ హహహ
థాంక్ యూ :)

హరే కృష్ణ said...

శరత్ గారు ధన్యవాదాలండీ

భాస్కర్ గారు
సరే ఇక మీకోసం వారాంతాలల్లోనే టపాలు రాస్తాను :)
thank you again :)

హరే కృష్ణ said...

పవన్ గారూ
బ్లాగుకి స్వాగతం
చాలా థాంక్స్ :)

karthik said...

kevvu basu..
will comment in detail a little later..

Naresh said...

వామ్మో వాయ్యో.. చింపేస్తున్నావు కదా..

>> ఒక్క సారి కీ-బోర్డు దొరికితే నా చేతులు నా మాటే వినవు
:)
సూపర్.. కేక .. అద్భుతం

హరే కృష్ణ said...

థాంక్స్ కార్తీక్ :)

నరేష్ అంతా మీ అభిమానం
Thanks a lot :D

Karthika said...

too gud.nuv ee movie enni sarlu chusi untavoo ee post chusthe ardam avtundi hehe:).

Malakpet Rowdy said...

LOOOOOOOOOOOOOOOOOL

హరే కృష్ణ said...

karthika
చాలా థాంక్స్ :)

రౌడీ గారు
థాంక్ యూ :D

ప్రభాకర్ said...

బాబు హరేకృష్ణ, నువ్వు మనిషివా? బ్లాగర్ వా?..

కేకో కేక మామ, సుపరో సూపర్ !!!

vikky2vikram said...

keka puttinchaavu........ :)

హరే కృష్ణ said...

ప్రభాకర్ :D థాంక్స్

విక్కీ thanks a lot :)

..nagarjuna.. said...

ఇంతకుముందే చదివానండి మీ కథని
స్క్రిప్టు రచ్చ రచ్చగావున్నా మార్తాండబాబు ఈ మధ్యకథలు రాయకపోవడం (అంటే తన కథలని తనె కాపికొట్టకపోవడంవల్ల ;)) ఫీల్ అవలేకపోయా
>>ఎక్కడైనా నా తీరింతే ఈ వదినరాత నా స్టైలంతే

>>హీరోయిన్: ఎలా మరచిపోగలను నీ బ్లాగుని
ఏ చెత్త కధ చదివినా నువ్వే గుర్తొస్తావ్ యాహూ చూద్దామంటే అక్కడ కూడా నీ వీడియో లే


కె.......వ్ , చిటికెలు చిటికెలు

హరే కృష్ణ said...

తన కథలని తనె కాపికొట్టకపోవడంవల్ల
రచ్చ బాసూ :D
చూడలేదేమో అనుకున్నా :(
థాంకులు థాంకులు :)

Ravi Gadepalli said...

"ఒక్క సారి కీ-బోర్డు దొరికితే నా చేతులు నా మాటే వినవు""మనకెందుకురా కామెంట్లు రోజూ వంద మంది అమ్మాయిలు బ్లాగుతారు""హీరో కామెంట్ పారేసుకుంటాడు " "డి టి పి సెంటర్లో చూడట్లేదేంటి.....వీడికి చత్వారం బాగా ఎక్కువ" "రోడ్ మీద హార్డ్ డిస్క్ దొరికిందని అని ఇచ్చింది నువ్వే కదా".....
కుమ్మేసావు...నీలో క్రియేటివిటీ అన్దరికీ తెలియడానికి ఈ బ్లాగ్ బాగా ఉపయోగపడుతోంది
ఇప్పటివరకు రాసిన వాటిలో ఇదే బెస్ట్ బ్లాగ్ అనుకుంటా ....keep going ...అస్సలు తగ్గొద్దు ....

హరే కృష్ణ said...

చాలా థాంక్స్ రవి :)
అవును ఈ టపా కొంత research చేసాను మన కాలేజ్ లో ప్రాజెక్ట్ లా
అందుకే బాగా వచ్చింది అనుకుంటున్నా
thank you

రాజ్ కుమార్ said...

oho...super.... innallu mee blog ela miss ayyanandi..??
Pichekkincharu...

Rajkumar

మధురవాణి said...

Oh my god! నవ్వలేక చచ్చాను బాబోయ్! మీరు పోకిరి ఎన్ని సార్లు చూశారు అని హెంత పిచ్చి ప్రశ్న అడిగానో ఇప్పుడు అర్థమయ్యింది. ;)

నీహారిక said...
This comment has been removed by the author.
హరే కృష్ణ said...

మధురవాణి..థాంక్ యూ!
మరిన్ని రాయడానికి ప్రయత్నిస్తాను :)

హరే కృష్ణ said...

రాజ్ రిప్లై ఆలస్యంగా ఇస్తున్నా
నీ అభిమానానికి అంతే... :))

Anonymous said...

చచ్చిపోతున్న నవ్వలేకా .. కేకో కేక .. నేన్ మీ ఫ్యాన్ అంతే
-కావ్య

హరే కృష్ణ said...

:D :D
కావ్య గారు థాంక్ యూ ;-)

ఇందు said...

హ్హహ్హహ్హా!!!! ఓమైగాడ్....అసలు దించేసారుగా! బాబోయ్! ఈ పోస్ట్ లేటుగా చూసినందుకు ఇప్పుడు నన్ను నేను తిట్టుకుంటున్నా :))

ఎంతైనా నువ్వు సుపరు ఆండీ :))))))))))))

ఫోటాన్ said...

Andy Nuvvu keka anthe......... :)))

Anonymous said...

హరే కృష్ణ,
ROFL...అరుపులంతే....సూపరో సూపర్ :)))
నేను మీకు అభిమాని అయిపోయనండి.... :D
వరసగా అన్ని టపాలు చదివేసా... కానీ, ఎక్కడా కామెంటలేదంతే.
ఇది చదివాక మాత్రం ఆగలేక పోయానండి. :)

-bittu

హరే కృష్ణ said...

ఇందు,హర్ష :)))))))))))))))))
థాంక్యూ ఫ్రెండ్స్ :)

హరే కృష్ణ said...

bittu గారు థాంక్యూ వెరీ మచ్ :))
మీరు ముంబై లో ఉంటున్నారా ?
harekrishna011@gmail.com కి ఓ సారి మైల్ చేయండి