Pages

Tuesday, June 9, 2009

కిస్ పేర్లు


ఆగండాగండి..టైటిల్ చూసి ఇదేదో స్వాతి పుస్తకం లో ఒక పేజి గురుండి రాస్తున్నా అనుకుంటే మీరుపప్పులో ఆలేసినట్టే (అల్+వేసినట్టే =గుణసంధి)

పుట్టి పెరిగిన వాతావరణం కుటుంబ ఆర్ధిక పరిస్థితుల పైన ముద్దు పేర్లు ఆధారపడి వుంటాయి అని నా ఆభిప్రాయం..పల్లెల్లో అయితే తాత,అమ్మమ్మ పేర్ల తో పిలుస్తారు మరీ ఖతర్నాక్ డైరెక్టర్ నాన్నరాజశేఖర్ లాగా ఊర మాస్ లాంటి ఊర్లలో పెరిగితే నా లాగా ఏం చెయ్యలేం..

పెట్ నేమ్స్ అంటే కోడి పెట్టలు గుర్తొచ్చాయి అందుకే ఆ ఫోటో..



నాని,చిన్ని,బుజ్జి,కన్నా.. అనే పేర్లు సర్వసాధారణం గా వింటాము నా స్కూలింగ్ అంతా ప్రభుత్వ పాఠశాలలోనే..మాస్ కే మోహన్ బాబులా వుండేవారు జనాలంతా నాకు తెలిసి ఒక్కడికే మా స్కూల్ లో ముద్దుపేరు తో పిలిచేవాళ్ళు వాడి పేరు బుజ్జి అసలు పేరు ఈశ్వర్..వాడి ని అంతా ముద్దుపేరు తోనే పిలిచేవారు మాస్టార్ల తో సహా ..మా గుండెలు రగిలిపోయేవి ..ముద్దు పేరు కావాలని ఇంట్లో అడిగితే బెత్తం విరిగేది..సరే దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలని మాలో మేమే పెట్టేసుకున్నాం ముద్దుపేర్లు స్కూల్ ఫ్రెండ్స్ అంతా కలిసి.. కాని బాలకృష్ణ సినిమా లా క్లిక్ అవ్వలేదు ..


అవి 6 తరగతి .వి-1,.వి-2 లు చదువుతున్న రోజుల్లో రాజేష్ అని ఒకడు జాయిన్ అయ్యాడు వాడు చాలా చేసేవాడు..వాడు చేసే అతి ని భరించలేక మేమే పెట్టాల్సి వచ్చింది ఒక ముద్దు పేరు, ఒక ముహూర్తాన మా ఫ్రెండ్ రాజేష్ కి ఆకుబాబు అని నామకరణం చేసాడు అంతే అదే మొదలు అమ్మాయలు కూడా ఆరవ తరగతి అయ్యేసరికి కమ్యూనికేషన్ బావుండేది..అమ్మాయలు కూడా వాడిని ఆకుబాబు అకుబాబు అని అరిచేసరికి వాడు అవమానాన్ని భరించలేక హెడ్ మాస్టర్ దగ్గర కంప్లైంట్ చేసాడు..మా హెచ్.ఎం కూడా పంచ్ కోసం ప్రాణం ఇచే మనిషి అయ్యేసరికి ఆకుబాబా..సూపర్ కదా గా వుంది కదా అని తిరిగి వాడినే అడిగేసరికి అగమ్య గోచిరమ్ గా తయారయ్యింది వాడి పరిస్థితి,హెచ్.ఎం కి తెగనచ్చేసింది కాని బయటపడలేదు .అతను కూడా ఏమి అనకపోయేసరికి అలామా ఆకుబాబు కి ఆకుపచ్చ కన్నీరు చూపించాక వాడు వెళ్ళిపోవడం జరిగింది ఇది జరిగినాక

మా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా క్లాసుమేట్ అమ్మాయి వెనక ఒక అబ్బాయి వెంటపడే వాడు మా కాలేజ్ కూడా ఊరవతల ఉండడం తో మేము సైకిల్ మీదనే మా ప్రయాణం మేము క్లాస్ ని మిస్ అయ్యినా వాడు మాత్రం కాలేజ్ కి వచ్చేవాడు చాలా దూరం నుండి వాడి పట్టుదలని చూసి వాడికో పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాం చివరకు రక్తకోలా అని ఫిక్స్ అయ్యాం
రక్తకోలా.. ఒక మంచి ప్రేమికుడు.. అనే ఇమేజ్ కోసం ఎంతో ప్రయత్నించినా కాప్షన్ కి జస్టిఫై చేయలేక టైటిల్ కి తగ్గ ఇమేజ్ ని సంపాదించుకొన్నాడు ఆఖరకు


ఇక నా ముద్దు పేర్ల విషయానికి వస్తే

అదేంటో చిట్టి అనే పదం అంటేనే నాకు పడదు చిన్నప్పటి నుండి ..మా టీచర్ నన్ను తెగ కొట్టేది చిట్టి చిలకమ్మ పద్యం చెప్పేటప్పుడు ఎలాగంటే
చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా
తోటకి వెళ్ళావా
పండు తెచ్చావా
పద్యం చెప్పమంటే...

చిట్టి అని చెప్పులేదా
టీచరమ్మ చిదక్కోట్టిందా
క్లాసు కి వెళ్ళావా
దెబ్బలు తెచ్చావా ..
అని దెబ్బకు మందు రాసి నాకు ఏదైనా తినడానికి ఇచ్చేది మా అమ్మ స్కూల్ నుండి వచ్చాక..

చిట్టి అంటే అయిష్టానికి అలా నా పసి వయసులోనే బీజం నాటింది


29 comments:

vikky2vikram said...

kiss enti swamy..

హరే కృష్ణ said...

kiss ante muddu kada muddu perlu ni different gaa:)

Aditya Maddula said...

frankly speaking.. I'm afraid to say this one is not at your mark. :(

హరే కృష్ణ said...

@Aditya
:( oh..next post ki prayatnisthanu mark tevadaaniki..amoolyamaina soochanalaku thanks Aditya

మురళి said...

ఇంతకీ మీ ముద్దుపేరు చెప్పనే లేదు....

Ravi Gadepalli said...

Racha mastaaru....nee post chaduvutunte...nuvvu matladinatte undi...touch chesana...nijame cheptunna....
Rakta cola entra babu....aaku babu adirindi...daani antaraardham ento kooda ardham aindi....
mana kabees, annagaru taditara M.Tech aaku babula gurinchi kooda rayalsindi....
topics baaga select chestunnavu...keep going...

vikky2vikram said...

nee kiss-name chitti aithe kaadu kada?

మరువం ఉష said...

>> అదేంటో చిట్టి అనే పదం అంటేనే నాకు పడదు చిన్నప్పటి నుండి

ఇది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను, నాకిది ముందే తెలుసు...
Refer: http://maruvam.blogspot.com/2009/05/blog-post_24.html
ఉష...
మొత్తానికి మీరంతా కలిసి నా మనసు ఖాళీ లేకుండా నవ్వులు నింపేసారు. నెనర్లు. మీ నవ్వుని బట్టి మీకు సమాధానం తెలిసినట్లేవుంది. బుజ్జి, బుజ్జాయి, చిన్ని, మున్ని, చంటి ఇవన్నీ కాస్త పసితనం వదిలిన చిన్నారులకి పర్యాయపదాలని నా పరిజ్ఞానం ;)
హరే కృష్ణ ...
తెలుగు బాషలో నాకు నచ్చని పదం "చిట్టి".. అది మీరు యాదౄచ్చికంగా వాడలేదు ..ధన్యవాదాలు

హరే కృష్ణ said...

@Ravi
రచ్చ అనే పదం చూసాక నాకు ఎంతో సంతోషం కలిగింది..నిజం గానే టచ్ చేసావ్!..
M.Tech ఆకుబాబులు.. హ హ హ్హ..
అవును కబీస్ ఈ మధ్య ఆన్ లైన్ లోకి రావడం లేదు..మర్చిపోయా వాడిని
రవి నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ..

హరే కృష్ణ said...

@ఉష
ఉష గారు ధన్యవాదాలు..
దాన్నే బహుశా సిక్త్ సెన్స్ అంటారేమోలేండి. హమ్మయా బతికిపోయాను, :)

హరే కృష్ణ said...

మురళిగారు, బెత్తం విరిగిపోయాక ముద్దు పేరు పెట్టకూడదని డిసైడ్ అయ్యా..కామెంట్స్ లో ఇప్పుడే మెన్షన్ చేశా నా ముద్దు పేరు :)

కెక్యూబ్ వర్మ said...

muddu perla gurinchi mee visleshana baagumdi.aakubaabu, aakubaaba varietygaa vunnayi.

హరే కృష్ణ said...

@varma
వర్మ గారు ధన్య వాదాలు..

Shashank said...

హరే హరే వచ్చేసా. కొత్త లాప్పి తో మళ్ళా బ్లొగంగేట్రం సేస్తా .. కాస్కో

హరే కృష్ణ said...

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హమ్మయ్య..నీ కామెంట్ లు లేక బ్లాగ్ ఎలా తయారయ్యిందో చూడు
కంగ్రాట్స్ శశాంక్ ..కొత్త ల్యాప్పి వచ్చింది కదా:)

Shashank said...

టెన్షన్ పడకు చిట్టి. నేనోచ్చేసా కద. ఓ రెండు రోజులు ఇవ్వు.. ఇంకా బోలేడు install చేయాలి. అదే పనిలో ఉన్నా.

హరే కృష్ణ said...

@ శశాంక్
:) లెనోవా తీసుకున్నావా..సరే తొందరగా తయారుచెయ్యు

నేస్తం said...

:)))

మురళి said...

Anushka email id

anushka.sherai@gmail.com

All the best :-)

హరే కృష్ణ said...

మురళి గారు మీ మేలు మర్చిపోలేను ఇప్పట్లో
నాగచైతన్య ని నాగార్జున ని ఇద్దరి తో గొడవపడడానికి రెడీ !
Thank you :)

హరే కృష్ణ said...

@నేస్తం
ధన్య వాదాలు..

Shashank said...

అను email id నా? చిట్టి నువ్వు మేల్ చేసి జవాబు వస్తే చెప్పు.

హరే కృష్ణ said...

హ హ్హ..మెయిల్ అయితే ఎప్పుడో చేశా! రిప్లై వస్తే బ్లాగ్ లో పెడతాను ఒక పోస్ట్ గా :)

పరిమళం said...

హరే కృష్ణ గారు , ఇంతకీ మీకు బుజ్జంటే ఎలర్జీ లేదుకదా ?:)
మధ్యలో అనుష్క ఎందుకొచ్చింది ?

ప్రభాకర్ said...

@ మురళి ......
హరే కృష్ణ గారి ముద్దు పేరు 'కాట్రాజ్' ...

హరే కృష్ణ said...

@పరిమళం
తెలుగు బాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం "చిట్టి"..
బుజ్జి అంటే ఎలర్జీ ఎందుకు బహు చక్కగా వుంది కదా బుజ్జి :)

Anonymous said...

baagu baagu ee blaagu.

kiran said...

చిట్టి...చిట్టి...మీరు హరేక్ర్సిష్ణ బదులు చిట్టి అని మార్చేయండి...
అందరు పిలవగా పిలవగా అదే నచ్చ్చేస్తుంది. :D

vinayakaALLARI said...

sarlegani meku istamina muddu peru cheppandi